
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డిలో అదనపు కలెక్టర్ వద్ద పనిచేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు.
ఇక, విష్ణువర్ధన్‌కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: భార్య దారుణ హత్య, కోమాలో భర్త.. ప్రేమ వ్యవహారమే కారణం!
Comments
Please login to add a commentAdd a comment