హైదరాబాద్: దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్ పీ) పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన మేళ్ల శ్రీనయ్య అనే బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడి వద్ద నుచి 59 ల్యాప్ టాప్ లు, 472 గ్రాములు బంగారం, 440 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 29 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ వస్తువులను సంబంధిత వ్యక్తులకు అందజేస్తామని చెప్పారు.
దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థి
Published Fri, Nov 21 2014 4:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement