kphb police
-
భర్త వర్క్ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో.
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఇంట్లో చొరబడిన ఓ మహిళ బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించగా సీసీ కెమెరాల ఆధారంగా కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి ఎల్ఐజీ గృహాల్లో నివాసమండే రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఈ నెల 22న వర్క్ ఫ్రంహోంలో భాగంగా బెడ్రూమ్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతని భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. చదవండి: అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మక్కల లక్ష్మి అలియాస్ హలీమా బేగం (36) రాజేశ్వర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ సి కెమెరాల ఆధారంగా శనివారం లక్ష్మిని అదుపులో తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా అరెస్టయిన లక్ష్మి శేరిలింగంపల్లిలో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
KPHB Colony: డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్.. పెళ్లైన విషయం దాచి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించిన వైద్యుడిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్‌లో నివాసముండే ఓ యువతి గతేడాది బంబుల్ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ ఫొటో అప్లోడ్ చేసింది. ఏఐజీ హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బంజారాహిల్స్ సుజాత స్టెర్లింగ్ హోమ్స్‌లో నివాసముండే డాక్టర్ అభిరామ్ చంద్ర గబ్బిత (32), ఆమె ఫొటోను చూసి మాటలు కలిపాడు. ఇలా ఒకరికొకరు పరిచయమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిరామ్ చంద్రకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించగా బుధవారం అభిరామ్ చంద్రను రిమాండ్‌కు తరలించారు. -
దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థి
హైదరాబాద్: దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్ పీ) పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన మేళ్ల శ్రీనయ్య అనే బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుచి 59 ల్యాప్ టాప్ లు, 472 గ్రాములు బంగారం, 440 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 29 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ వస్తువులను సంబంధిత వ్యక్తులకు అందజేస్తామని చెప్పారు.