డాక్టర్ అభిరామ్ చంద్ర
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించిన వైద్యుడిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్‌లో నివాసముండే ఓ యువతి గతేడాది బంబుల్ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ ఫొటో అప్‌లోడ్ చేసింది. ఏఐజీ హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బంజారాహిల్స్ సుజాత స్టెర్లింగ్ హోమ్స్‌లో నివాసముండే డాక్టర్ అభిరామ్ చంద్ర గబ్బిత (32), ఆమె ఫొటోను చూసి మాటలు కలిపాడు. ఇలా ఒకరికొకరు పరిచయమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిరామ్ చంద్రకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించగా బుధవారం అభిరామ్ చంద్రను రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment