
స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ.. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ నటించిన భోళా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇవాళ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేరళ కుట్టి రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముద్దుగుమ్మ.
(ఇది చదవండి: Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!)
ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమలాపాల్, జగత్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. తన లవర్ అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది.
కాగా.. అమలాపాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరా మూవీలో తొలిసారిగా నటించింది. 2010లో తమిళ చిత్రం మైనాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. బాలీవుడ్, తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. .
(ఇది చదవండి: మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున)