KPHB Police Arrested a Woman Who Stolen Mobile and Gold Jewelry - Sakshi
Sakshi News home page

భర్త వర్క్‌ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో.

Published Sun, Mar 27 2022 8:06 AM | Last Updated on Sun, Mar 27 2022 12:24 PM

KPHB Police Arrested A Woman Who Stolen Mobile And Gold Jewelry - Sakshi

మక్కల లక్ష్మి

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఇంట్లో చొరబడిన ఓ మహిళ బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించగా సీసీ కెమెరాల ఆధారంగా కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్‌ ఎస్‌ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి ఎల్‌ఐజీ గృహాల్లో నివాసమండే రాజేశ్వర్‌ రెడ్డి ఇంట్లో ఈ నెల 22న వర్క్‌ ఫ్రంహోంలో భాగంగా బెడ్రూమ్‌లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతని భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది.
చదవండి: అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్‌ వాడకం.. ఇదే అత్యధికం

అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మక్కల లక్ష్మి అలియాస్‌ హలీమా బేగం (36) రాజేశ్వర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ సి కెమెరాల ఆధారంగా శనివారం లక్ష్మిని అదుపులో తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా అరెస్టయిన లక్ష్మి శేరిలింగంపల్లిలో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌: మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement