stealing jewelery
-
రూ.30 లక్షలు, 1.67 కోట్ల నగలు చోరీ
మైసూరు: మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు, నగదును దుండగులు లూటీ చేశారు. శ్రీనిధి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఆహార, ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఓజీ శ్రీనివాస్ ఇంటిలో సోమవారం దొంగలు పడి సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. 1.67 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. లాకర్‌ను బద్ధలుకొట్టి శ్రీనివాస్ తల్లిదండ్రుల వైద్య చికిత్స కోసం మైసూరు నగరానికి వెళ్లి, రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం చూశాడు. నగలు, నగదు కనిపించలేదు, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వెనుక వాకిలిని బద్ధలు కొట్టి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. దుర్భేధ్యమైన డిజిటల్ లాకర్‌ను పగలగొట్టి అందులోని నగదు, 1 కిలో బంగారం, 10 కిలోల వెండి , 70 గ్రాముల నెక్లెస్‌లను తీసుకున్నారు. మహావీర్ జైన్ అనే కుదువ వ్యాపారి తన నగలను శ్రీనివాస్ ఇంట్లో లాకర్లో పెట్టగా అవి కూడా పోయాయి. (చదవండి: భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం) -
భర్త వర్క్ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో.
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఇంట్లో చొరబడిన ఓ మహిళ బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించగా సీసీ కెమెరాల ఆధారంగా కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి ఎల్ఐజీ గృహాల్లో నివాసమండే రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఈ నెల 22న వర్క్ ఫ్రంహోంలో భాగంగా బెడ్రూమ్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతని భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. చదవండి: అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మక్కల లక్ష్మి అలియాస్ హలీమా బేగం (36) రాజేశ్వర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ సి కెమెరాల ఆధారంగా శనివారం లక్ష్మిని అదుపులో తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా అరెస్టయిన లక్ష్మి శేరిలింగంపల్లిలో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
జన్నేపల్లిలో దారుణ హత్య
- హతుడి ఒంటిపైనుంచి ఆభరణాల అపహరణ - వివాహేతరసంబంధమే హత్యకు కారణం! నవీపేట : జన్నేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కట్టెల వ్యాపారి సల్లగరిగె చిన్న రాజన్న అలియాస్ వడ్ల చిన్న రాజేశ్వర్ (55) దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలంలోని కంఠం గ్రామానికి చెందిన చిన్న రాజేశ్వర్ వృత్తిరీత్యా ఎనిమిదేళ్ల క్రితం నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామం లో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇద్దరు కుమారులు కంఠంలో ఉండగా మరో కుమారుడు దుబాయిలో ఉంటున్నాడు. ఆయనకు మరో ఇద్దరు కూతుళ్లున్నారు. ఐదుగురికీ వివాహం చేశాడు. భార్య రాజబాయి ఆరేళ్ల క్రితం మరణించింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. చిన్న రాజేశ్వర్ చెట్లను కొని కలపగా మార్చి విక్రయిస్తుంటాడు. గురువారం ఉదయం ఆయన ఫోన్‌కు నవీపేటకు చెందిన మరో వ్యాపారి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో నేరుగా జన్నేపల్లిలోని చిన్న రాజేశ్వర్ ఇంటికి వచ్చాడు. వాహనం, చెప్పులు ఇంటి బయట ఉండగా ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానించి తన అన్న కుమారుడు దాస్‌కు సమాచారమిచ్చాడు. అనంతరం ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లగా.. మంచం పక్కన రక్తపు మడుగులో చిన్న రాజేశ్వర్ మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంపత్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. గొంతుపై పదునైన ఆయుధంతో పొడవడంతో తీవ్ర రక్త స్రావమై మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. రంగంలోకి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. క్లూస్ టీం ఇంటిలోని వస్తువులపై వేలి ముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఇంటి వెనకగల ఖాళీ స్థలంలోకి పరుగులు తీయడంతో సంఘటన స్థలంలో గుమిగూడిన జనం ఆత్రుతగా దాని వెంట పరుగులు తీశారు. హత్యకు కారణమేంటి? చిన్న రాజేశ్వర్ దారుణ హత్యకు గురవ్వడం జన్నేపల్లి, కంఠం గ్రామాలలో సంచలనం సృష్టించింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు మహిళలు జన్నేపల్లిలో చిన్న రాజేశ్వర్ కోసం వాకబు చేసినట్లు తెలిసింది. మృతునికి వివాహేతర సంబంధాలు ఉండడంతో ఇంటికి వచ్చిన వారు డబ్బుల కోసం ఘర్షణ పడి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఒంటిపై ఉండాల్సిన రెండు తులాల బంగారు గొలుసు, చేతి ఉంగరాలు కనిపించలేదు. దీంతో దొంగలు చోరీకి పాల్పడి హత్య చేశారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.