
ఫ్యాన్‌కు ఉరేసుకున్న బీటెక్ విద్యార్థి
సరూర్‌నగర్ (హైదరాబాద్): కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని జిల్లెలగూడ, లలితానగర్ ప్రాంతంలో జరిగింది. ఇబ్రహీంపట్నంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్‌రెడ్డి (23) లలితానగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు.
ఆదివారం తెల్లవారుజామున సాయివర్ధన్‌రెడ్డి తన పడకగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యం ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో నమోదు కావడంతో పోలీసులు దాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్టు తెలిపారు.