hanging himself
-
తల్లిదండ్రుల మరణంతో.. యువకుడి తీవ్రనిర్ణయం..!
కరీంనగర్: గోదావరిఖనిలోని పరుశరాంనగర్‌కు చెందిన టంగుటూరి గోపాలకృష్ణ (29) గురువారం ఉరేసుకుని మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం గోపాలకృష్ణ తల్లి, తండ్రి మృతిచెందారు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి నాయినమ్మ టంగుటూరి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. -
మరో నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు
Action Hero Biju Actor ND Prasad Found Dead At His Residence: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో ప్రముఖులు కన్నుమూస్తే.. ఎంతో భవిష్యత్తు ఉన్న సెలబ్రిటీలు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఒడియా చిత్ర పరిశ్రమకు సంబంధించిన 58 ఏళ్ల నటుడు రాయ్మోహన్ పరిదా, 23 సంవత్సరాల బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా బలవన్మరణంతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మలయాళ నటుడు ఎన్డి ప్రసాద్ కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రసాద్ బలవన్మరణానికి మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు చెప్తున్నారు. ఇదివరకు ప్రసాద్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో డ్రగ్స్‌తో పట్టుబడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఉన్నాయి. గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్ సర్కిల్ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5 గ్రాముల హాష్ ఆయిల్, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్, కొడవలితో పట్టుబడినట్లు సమాచారం. అలాగే నటుడు ప్రసాద్‌పై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. (చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్) కాగా 2016లో వచ్చిన నివిన్ పౌలీ చిత్రం 'యాక్షన్ హీరో బిజు'లో ఎన్డి ప్రసాద్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇబా, కిర్మాణి చిత్రాల్లో నటించాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?) (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
-
పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?
లక్నో: పోలీస్ కస్టడీలో ఉన్న ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. నిందితుడి మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా చెబుతుంటే.. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం(నవంబర్9) చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడిని సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్ కుమారుడు చాంద్ మియాన్‌గా గుర్తించారు. వివారల్లోకి వెళితే.. యువతిని తీసుకొని పారిపోయిన కేసులో విచారించేందుకు యువకుడు అల్తఫ్‌ను పోలీసులు సోమవారం ఉదయం కస్గంజ్కు చెందిన సదర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. చదవండి: పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి.. మూడు రోజుల పసికందుని.. పోలీసులు యువకుడిని విచారణ చేస్తున్న క్రమంలో బాత్రుంకు వెళ్లాలని అడిగాడు. బాత్రూమ్ లోపలికి వెళ్లిన అతను లోపల నుంచి లాక్ వేసుకున్నాడు. కాసేపటి తరువాత ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు బాత్రూమ్ తలుపు తెరిచి చూడంతో నిందితుడు తన జాకెట్ హుడ్ను పైప్‌కు కట్టి గొంతు చుట్టూ బిగించుకొని ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు అయిదుగురు పోలీసులను ఎస్పీ రోహన్ సస్పెండ్ చేశారు. వీరిలో కసన్‌గంజ్ స్టేషన్ అధికారి, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. చదవండి: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు కాగా లాకప్‌లో ఉన్న తన కొడుకును పోలీసులే ఉరి తీశారని నిందితుడు అల్తాఫ్ తండ్రి చాహత్ మియా ఆరోపించారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తన కొడుకును పోలీసులు తీసకెళ్లారని. తరువాత 24 గంటలకే అతను ఉరి వేసుకున్నాడని సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు కొడుకును జిల్లా ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అంతేగాక యువకుడి లాకప్ మరణంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. आज दिनाँक 9.11.21 को जनपद के थाना कोतवाली कासगंज में बंदी की मृत्यु होने के संबंध में #SP @kasganjpolice द्वारा लापरवाही बरतने पर 5 पुलिसकर्मियों को निलंबित करने की कार्यवाही की गई है, प्रकरण में की जा रही अन्य कार्यवाही के संबंध में पुलिस अधीक्षक द्वारा दी गयी बाइट । pic.twitter.com/EvMnLA9ozG — KASGANJ POLICE (@kasganjpolice) November 9, 2021 -
కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ..
లక్నో: కోడలు తమ కళ్ల ముందే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుటుంటే రక్షించడం మానేసి కిటికీలోంచి వీడియో తీశారు ఓ రాక్షస అత్త మామలు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో జరిగింది. బాధితురాలు కోమల్.. డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. అయితే కోడలు మృతికి తమకు సంబంధం లేదని, చెప్పుకునేందుకే నిందితులు ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను తమ సెల్లో బంధించారు. ఈ వీడియో కాస్త బయటికి రావడం, వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోమల్‌కు, ఆశిష్‌కు 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్‌ని కట్నం కింద ఇచ్చారు. గత ఆరు నెలలుగా ఆశిష్ అమ్మానాన్నలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు. వారి పోరు తట్టుకోలేని కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆదివారం ఈ దారుణానికి పాల్పడింది. ( చదవండి: విజయవాడ: పురుగుల మందు తాగి తల్లీపిల్లలు మృతి ) -
బీజేపీ ఎమ్మెల్యే మృతి: సూసైడ్ నోట్ లభ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మృతదేహం చొక్కా జేబులో సూసైడ్ నోట్ లభించినటట్లు పోలీసులు తెలిపారు. తన మృతికి ఇద్దరు వ్యక్తులు కారణమని, ఆ ఇద్దరు వ్యక్తులు తన మృతికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి) ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామం సమీపంలో ఉన్న మార్కెట్లో ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే మృతి హత్యా? ఆత్మహత్య? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. ఆయన మృతిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా డిమాండ్ చేశారు. దేబేంద్ర నాథ్ మృతి వెనక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. మృతికి సంబంధించిన నిజాలు బయటకు రావడానికి సీబీఐ దర్యాప్తుకు అనుమతించాని సీఎం మమతా బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు. -
బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసం దగ్గర ఉన్న మార్కెట్లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్యెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే హత్యకు గరయ్యాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియా స్పందిస్తూ.. బెంగాల్లో బీజేపీ నాయకుల హత్యలు ఆగటం లేదు. టీఎంసీ నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హత్యకు గురయ్యాడు. ఆయన బీజేపీలో చేరినందుకే ఇలా జరిగిందా? ’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 2016లో కాంగ్రెస్ మద్దతు ఉన్న సీపీఎం టికెట్‌పై దేబేంద్ర నాథ్ హేమతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత గత ఏడాది బీజేపీలో చేరాడు.ఇక ఎమ్మెల్యేను హత్య చెసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
బంగారం చోరీ ఘటనలో మరొకరు బలి
తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి గ్రామంలో వివాహం రోజు జరిగిన చోరీ ఘటనలో మరొకరు బలయ్యారు. ఈ నెల 19న శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు రాందేవ్‌రెడ్డి వివాహ వేడుక తర్వాత వారి బంధువులకు చెందిన సుమారు 24 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్‌రెడ్డిని వారి బంధువులను విచారించారు. దీంతో అవమానానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో ఈ నెల 20న రాత్రి ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున చోరీకి గురైన నగలు స్థానిక స్కూల్ సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఇదే ఘటనకు సంబంధించి అనూహ్యంగా హైదరాబాద్ లోని రాజేందర్‌నగర్‌లో నివాసముంటున్న మృతుడు శ్రీనివాస్‌రెడ్డి అన్న మన్యపురెడ్డి కుమారుడు సురేశ్‌రెడ్డి (26) ఈ నెల 21న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు సురేశ్‌రెడ్డి సోదరి కల్పనవి కావడం, అతడు ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతుడికి తల్లి యాదమ్మ, సోదరుడు ఉన్నారు. కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ -
ఫ్యాన్‌కు ఉరేసుకున్న బీటెక్ విద్యార్థి
సరూర్‌నగర్ (హైదరాబాద్): కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని జిల్లెలగూడ, లలితానగర్ ప్రాంతంలో జరిగింది. ఇబ్రహీంపట్నంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్‌రెడ్డి (23) లలితానగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున సాయివర్ధన్‌రెడ్డి తన పడకగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యం ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో నమోదు కావడంతో పోలీసులు దాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్టు తెలిపారు. -
ఆత్మహత్యకు డిప్రెషనే కారణమా?
-
'సినిమావాళ్ల మీద పడ్డాడు... దేవుడు'
-
ఆత్మహత్యకు కారణాలు తెలియవు:విషిత తండ్రి
-
'ఉదయ్ చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోంది'
-
చనిపోయేంత పిరికివాడు కాదు:ఉదయ్ తండ్రి
-
ఉదయ్ లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం
-
షాక్‌కు గురయ్యాను:దర్శకుడు తేజ
-
'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు'
-
ఐ లవ్ యూ అని చివరి మెసేస్ పంపిన ఉదయ్
-
ఉదయ్ ఆత్మహత్యపై అభిమానులు, ప్రముఖులు దిగ్బ్రాంతి
-
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య పై పోలీసుల విచారణ
-
సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
-
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య పై విచారణ జరపారి:శ్రీకాంత్