కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసం దగ్గర ఉన్న మార్కెట్‌లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్యెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమ ఎమ్మెల్యే హత్యకు గరయ్యాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియా స్పందిస్తూ.. బెంగాల్‌లో బీజేపీ నాయకుల హత్యలు ఆగటం లేదు. టీఎంసీ నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హత్యకు గురయ్యాడు. ఆయన బీజేపీలో చేరినందుకే ఇలా జరిగిందా? ’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 2016లో కాంగ్రెస్ మద్దతు ఉన్న సీపీఎం టికెట్‌పై దేబేంద్ర నాథ్ హేమతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత గత ఏడాది బీజేపీలో చేరాడు.ఇక ఎమ్మెల్యేను హత్య చెసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment