కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. | Uttar Pradesh: In Laws Post Video Womans Suicide Online | Sakshi
Sakshi News home page

కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ..

Published Wed, Apr 14 2021 11:38 AM | Last Updated on Wed, Apr 14 2021 2:26 PM

Uttar Pradesh: In Laws Post Video Womans Suicide Online - Sakshi

లక్నో: కోడలు తమ కళ్ల ముందే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుటుంటే రక్షించడం మానేసి కిటికీలోంచి వీడియో తీశారు ఓ రాక్షస అత్త మామలు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్‌లో జరిగింది. బాధితురాలు కోమల్‌.. డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. అయితే కోడలు మృతికి తమకు సంబంధం లేదని, చెప్పుకునేందుకే నిందితులు ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను తమ సెల్‌లో బంధించారు. ఈ వీడియో కాస్త బయటికి రావడం, వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కోమల్‌కు, ఆశిష్‌కు 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్‌ని కట్నం కింద ఇచ్చారు. గత ఆరు నెలలుగా ఆశిష్ అమ్మానాన్నలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్‌ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు. వారి పోరు తట్టుకోలేని కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆదివారం ఈ దారుణానికి పాల్పడింది.

( చదవండి: విజయవాడ: పురుగుల మందు తాగి తల్లీపిల్లలు మృతి )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement