![UP Woman Calls Police Saying Her Mother In Law Serves Stale Food - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/19/daughter-in-law.jpg.webp?itok=qF5SwrK4)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్త తనకు వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఇక ఈ విషయం తెలిసిన వారంత ఒకప్పుడు అత్తలకు కోడళ్లు సపర్యలు చేయడం చుశాము కానీ ఇలా అత్త తనకు సేవలు చేయడం లేదని కోడలు ఫిర్యాదు చేయడమెంటని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.
వివరాలు.. గజహా పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్‌గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అత్త సమయానికి ఆహారం వడ్డించలేదంటూ కోడలు ఇటీవల పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందట. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని దర్యాప్తు చేయగా... ఆమె అత్త రోజంతా టీవీ సీరియల్స్‌లో లీనమైపోతోందని, తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదంటూ సదరు కోడలు పోలీసులకు చెప్పింది.
అంతేగాక తనకు పాడైన ఆహారం పెట్టడం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని కోడలు పోలీసులతో వాపోయింది. ఇక ఆమె మాటలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. కోడలు తనపై ఫిర్యాదు చేయడం చూసి అత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోడలు పనులు చేయకుండా రోజంతా ఫోన్ పట్టుకునే ఉంటుందని, ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లేదంటు పోలీసులకు చెప్పింది. అలాగే వంటింటి పనుల్లో కూడా తోడుగా ఉండటంలేదని వివరించింది. ఇక వారిద్దరి వాదనలు విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించారు. ఇలాంటి చిన్న విషయాలకే ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి:
మెగాస్టార్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులేసిన అనసూయ
లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?!
Comments
Please login to add a commentAdd a comment