కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ.. భర్త లబోదిబో | UP: Father In Law Sold His Daughter In Law For Rs 80 | Sakshi
Sakshi News home page

కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ.. భర్త లబోదిబో

Published Tue, Jun 8 2021 9:19 PM | Last Updated on Tue, Jun 8 2021 10:22 PM

UP: Father In Law Sold His Daughter In Law For Rs 80 - Sakshi

పోలీసుల అదుపులో ముఠా

లక్నో: సొంత కుమారుడి భార్యను విక్రయించాడో మామ. అది కూడా రూ.80 వేలకు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే పరుగులు తీసి రైల్వే స్టేషన్‌లో ఆమెను ఆ ముఠా నుంచి రక్షించారు. కొంచెం ఆలస్యమై ఉంటే ఆమె అతడికి దక్కకుండాపోయేది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ మామకు ఇలా మహిళలను ముఠాకు విక్రయించడం ఓ వృత్తి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బారబంకి జిల్లాలోని మల్లాపూర్‌ గ్రామానికి చెందిన చంద్రరామ్‌ వర్మ మహిళలతో వ్యాపారం చేస్తుంటాడు. వస్తువులను విక్రయించినట్టు మహిళలను ఓ ముఠాకు అమ్మేసుకోవడం ఈయన ప్రధాన వృత్తి. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 300 మంది మహిళలను విక్రయించాడు. తాజాగా అతడికి కుమారుడి భార్యపై కన్నుపడింది. కోడలిని విక్రయించాలని నిర్ణయించుకుని గుజరాత్‌కు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్‌ 5వ తేదీన కోడలిని ఆ ముఠాకు అప్పగించేశాడు. ఈ ఘటనతో షాకయిన కోడలు భర్తకు సమాచారం ఇచ్చింది. పోలీసుల సహాయంతో భర్త వెంటనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. 

గుజరాత్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి ఆమెను రక్షించి భర్తకు అప్పగించారు. అయితే ప్రధాన నిందితులు మామ చంద్రరామ్‌, మరొకరు రామ్‌గౌతమ్‌ తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రరామ్‌పై ఓ హత్య కేసు కూడా నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

చదవండి: ఇంజెక‌్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement