లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీలో ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలతో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాడు. వృద్ధ మహిళలనే టార్కెట్ చేస్తున్న ఈ కిరాతకుడు రోజుల వ్యవధిలోనే ముగ్గురిని దారుణంగా హతమార్చాడు. వారిని హత్య చేయడమే గాక మృతదేహాలను నగ్నంగా వదిలేస్తున్నాడు.
మూడు హత్యలు ఓకే రీతిలో జరగడంతో ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు ఒకే విధంగా ఉన్నాయి. నిందితుడ్ని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అతడి ఫొటోను విడుదల చేశాయి.
ఇప్పటివరకు హత్యకు గురైన ముగ్గురు మహిళల వయసు 50-60 ఏళ్ల మధ్యే ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రతిఘటించలేరని తెలిసి సున్నితమైన మహిళలనే నిందితుడు టార్గెట్ చేస్తున్నాడని వివరించారు. డిసెంబర్ 6న మొదటి హత్య, డిసెంబర్ 17న రెండో హత్య, 29న మూడో హత్య వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం ఆరు బృందాలతో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతవరకు అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియలేదు.
చదవండి: మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
Comments
Please login to add a commentAdd a comment