Serial Killer
-
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్‌ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్‌కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్‌లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్‌ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
‘చీర కడితే.. బొట్టు పెడితే హేళన చేస్తారా?’
విలన్స్ ఆర్ నాట్ బార్న్.. దే ఆర్ మేడ్ బై సొసైటీ.. వ్యవస్థే విలన్లను తయారు చేస్తుందని అర్థం. అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి.. అవతలివాళ్లను అవహేళన చేయడం అంతే పరిపాటిగా మార్చేసుకున్నాడు. అయితే మానసిక రుగ్మతలో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే.. అది ప్రాణాల మీదకే రావొచ్చు. అలాంటి వాస్తవ ఘటనే ఇది. ‘‘తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి నేరగాళ్లు మన మధ్యే ఉంటారు’’ అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం.33 ఏళ్ల రామ్ స్వరూప్. చూడడానికే కాదు.. మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి. కానీ, ఓ హత్య కేసు ఇంటరాగేషన్‌లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు ఖాకీలనే విస్తుపోయేలా చేశాయి. ఏడాదిన్నర కాలంలో 11 మందిని అతికిరాకతంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు!.పంజాబ్(Punjab)లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి.. ఆపై వాళ్లను దారుణంగా హతమార్చాడతను. ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు.. అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘‘వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు. నా వేషధారణను అవహేళన చేశారు. పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకుని ఇస్తానన్న డబ్బూ ఇవ్వలేదు. ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే చేతికి ఏది దొరికితే దాంతో.. అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది’’ ఇది నేరాంగీకారంలో రామ్ స్వరూప్ అలియాస్ సోధీ చెప్పిన అసలు విషయం.👉రామ్ స్వరూప్ స్వస్థలం.. హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. అతని తల్లిదండ్రులు విద్యావంతులు. ఆర్థికంగా ఉన్న కుటుంబమే. కానీ, రామ్ స్వరూప్లోపల ఇంకొకరు ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్లలా అలంకరించుకోవడం ఇష్టం. చెబితే.. ఇంట్లోవాళ్లు కోప్పడతారనే భయం. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకుని మురిసిపోయేవాడు. ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది. 👉అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడతను. ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు. కోడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు.. రామ్ స్వరూప్‌కు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే అతనిలోని ఆ కోణం.. భార్యకు ఆలస్యంగా తెలిసింది. రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటి వెళ్లిపోయింది. ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు.ఒంటరి అయిన రామ్ స్వరూప్‌కు ‘తేడాగాడు’ అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు. దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను. అందుకోసం చీర కట్టి.. బొట్టు పెట్టి.. ముస్తాబయ్యేవాడు. చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా ఫర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు. అయితే.. ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో.. అతనిలో మృగం బయటికి వచ్చింది.👉 మోద్రా టోల్‌ప్లాజా వద్ద టీ, వాటర్ బాటిళ్లు అమ్ముకునే మహిందర్ సింగ్ అనే వ్యక్తి ఆగష్టు 18వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీంకు ఓ చిన్న గుడ్డముక్క దొరికింది. అయితే అప్పటిదాకా దొరక్కుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్.. ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్‌తో అడ్డంగా దొరికిపోయాడు. నాలుగు నెలలపాటు జరిగిన దర్యాప్తు.. గాలింపు అనంతరం డిసెంబర్ 25వ తేదీన రామ్ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 👉తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహిందర్ తన కట్టూబొట్టును అవమానించాడని.. అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రామ్ స్వరూప్ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. దీనికంటే ముందు 10 హత్యలు చేసినట్లు ఈ సీరియల్ కిల్లర్(Serial Killer) పోలీసుల దిమ్మతిరిగిపోయేలా విషయం ఒకటి చెప్పాడు.👉రామ్ స్వరూప్ చేసిన తొలి హత్య.. హర్‌ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిది. 18 నెలల కిందట జరిగిందా ఘోరం. ఆయనతో లైంగికంగా కలిశాక.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హర్‌ప్రీత్‌ను హతమార్చి.. ఆయన వీపులో ధోకేబాజ్(మోసగాడు) అని రెడ్ ఇంక్‌తో రాత రాశాడు. ఈ కేసు పంజాబ్‌లో ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది కూడా. అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.👉ఈ ఘటన తర్వాత.. రామ్ స్వరూప్ అప్రమత్తం అయ్యాడు. రోజూవారీ పని చేసుకునే కూలీలు, మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డును రామ్ స్వరూప్ టార్గెట్ చేసుకునేవాడు. మరికొందరికి లిఫ్ట్ ఆఫర్ చేసేవాడు. వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయటపెట్టేవాడు. అందుకు ఒప్పుకున్నవాళ్లతో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే ఏకాంతంగా ఉన్న టైంలో.. వాళ్లు తనతో ప్రవర్తించిన తీరే.. తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడను. వాళ్ల మాటలు, చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి.. తన సిగ్నేచర్ వీపులో మోసగాడు అని రాసి.. వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట. అలా రూపానగర్, సర్హింద్, ఫతేఘడ్ సాహిబ్.. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని హతమార్చాడు. వీటిలో ఆరు కేసుల్లో ఈ సైకో గే కిల్లర్ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు. మరో ఐదు కేసుల్లో.. రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. రాబోయే.. రోజుల్లో రామ్ స్వరూప్ నేరచరితను ఏ సినిమాగానో, వెబ్ సిరీస్(Web Series)గానో తెర మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా!. -
బళ్లారి–సికింద్రాబాద్ మధ్యలో హత్య!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం హత్యకు గురైన మహిళ కేసుపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ‘రైల్వే సీరియల్ కిల్లర్’ రాహుల్‌ను గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ అధికారుల విచారణలోనే ఈ మర్డర్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు నిందితుడిని పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రైళ్లల్లో సంచరిస్తూ 35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కొన్నేళ్ల కోసం బతుకుతెరువు కోసం భర్త, పిల్లలతో కలిసి కర్ణాటకకు వలసవెళ్లింది. చివరకు రమణమ్మ, గోవిందప్ప దంపతులు బళ్లారి జిల్లాలోని సింపోటు తాలుకా, తోర్నగల్ గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె తన భర్త, కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఆమెను చూసేందుకే రమణమ్మను శనివారం రాత్రి 7 గంటలకు కుమారుడితో కలిసి అక్కడి తోర్నగల్ రైల్వే స్టేషష్ న్కు వచ్చింది. తల్లిని మణుగూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మహిళల బోగీలో ఎక్కించిన కుమారుడు ఈ విషయాన్ని తన బావ వెంకటేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అదే రైలులోని దివ్యాంగుల బోగీలో ప్రయాణించిన రాహుల్ కన్ను ఈమెపై పడింది. మార్గమధ్యలో బోగీలో ఆమె ఒక్కరే మిగలడంతో అదును చూసుకుని పక్కనే ఉన్న సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్‌లోకి లాక్కెళ్లిన అతను బాత్రూమ్లో టవల్‌తో మెడకు ఉరి బిగించి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించాడు. ఆదివారం ఉదయం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషష్ న్కు చేరుకోవడంతో అత్త కోసం ప్లాట్‌ఫామ్ నెం.9 వద్దకు వచ్చిన వెంకటేశ్ మహిళల బోగీలో వెతికినా రమణమ్మ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె రైలు దిగి వెళ్లి ఉంటుందని భావించి అతడూ వెళ్లిపోయాడు. రైలు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది హరికుమార్ బాత్రూమ్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్టేషన్ మేనేజర్ ఎన్.నాగరాణి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు హతురాలి కుటుంబీకులను రప్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని వల్సాద్ పోలీసుల అదుపులో ఉన్న రాహుల్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి ఈ వారెంట్ తీసుకోవడానికి వల్సాద్ పోలీసులకు రాహుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. దీంతో ఆ అధికారులను సంప్రదించిన జీఆర్పీ పోలీసులు రికార్డులు తీసుకున్నారు. రమణమ్మ హత్య బళ్లారి–సికింద్రాబాద్ మధ్యలో జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎక్కడ అనేది తేలియాలంటే నిందితుడిని తీసుకువచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని, ఆపై క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్లోనే ఇది తేలుతుందని చెబుతున్నారు. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్‌గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్‌పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్‌కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్‌లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్‌లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్‌పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్‌కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్‌కు స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై మంగుళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్‌ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం గుజరాత్‌లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్‌లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్ కిల్లర్ హస్తం?
ఉత్తరప్రదేశ్‌లో మహిళల వరుస హత్యలు ఆందోళన రేపుతున్నాయి. బరేలీజిల్లాల్లోని గ్రామీణప్రాంతాల్లో గత 14 నెలలుగా 9 మంది మహిళలు ఒకేలా హత్యకు గురుయ్యారు. మరణించిన మహిళల వయసు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉండటం గమనార్హం. అయితే వీరందరి మరణాల వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.షాహీ, షీష్‌గఢ్, షెర్‌గఢ్.. ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళలే టార్గెట్‌గా ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారి చీరలతోనే గొంతు నులిమి చంపినట్లు బయటపడింది. . అయితే మృతులను దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. కానీ.. ఎవరిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. వరుస హత్యలతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గత ఏడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి. అయితే హత్యల వెనక అనేక అంశాలు ఒకేలా ఉండటంతో ఈ కేసుల్లో సీరియల్ కిల్లర్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి ఒక్క హత్య కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది. మరో హత్యతో..7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జూలై 9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో తేలింది.దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి తెలిపారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్లను తాజాగా విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు. -
నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ సత్యం
-
సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ..
అది 1985 డిసెంబర్ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్ లోని మినరల్ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్ స్టోర్ కస్టమర్స్‌తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్‌కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది. తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్ పేపర్, కొన్ని రియల్ ఫొటోలు పట్టుకుని.. లూయిస్ కాన్రాడ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ‘మార్ట్ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది. పాప దొరికిన రోజు (డిసెంబర్ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్సన్(21), అల్లుడు మైక్ రీమర్(36), క్రిస్టల్‌తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్ డే వెకేషన్ కోసం వెళ్లారని చెప్పింది లూయిస్. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్‌ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది. రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్‌లోని మినరల్‌కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్‌కలర్ ప్లిమత్ పికప్ ట్రక్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్‌తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. క్రిస్టల్ చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది. అంటే తన తల్లి చావుని క్రిస్టల్ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్ జాడ కనిపించలేదు. ఆ పికప్ ట్రక్ మైక్దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్ పక్క సీట్లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్ ల్యాబ్‌కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్‌లో దొరికిన ఒక ఎన్వలప్ కవర్ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్ హ్యాండ్ రైటింగ్ అని లూయిస్ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు. ఎక్కడా మైక్ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్ తన చలికోటును ట్రక్‌లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్ కీలక ఆధారమైంది. మైక్, డయానా మిస్సింగ్‌కి ముందు.. అంటే 1985 ఆగస్ట్ 10న స్టీఫెన్ హార్కిన్, రూత్ కూపర్ అనే జంట మర్డర్ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్ తన కారు డ్రైవింగ్ సీట్లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉంది. రూత్ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్‌కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్ దొరికిన మైలున్నర దూరంలో రూత్ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్‌తో బిగించి ఉంది. ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్ కారణంగా కాదని తేలింది. రూత్ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనేనని వారి నమ్మారు. అయితే మైక్ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్ మీదకు తిరిగాయి. నిజానికి మైక్.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్ గ్రాంట్ కౌంటీలో ఎడ్వర్డ్ స్మిత్, కింబర్లీ లావైన్ అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్ కిల్లర్ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు. 1986 ఆగస్ట్ 22న మిస్ అయిన రాబర్ట్, డాగ్మార్ మిస్సింగ్ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగించిన ఓ సీరియల్ కిల్లర్ చార్లెస్ సింక్లైర్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్ పరిసరప్రాంతాల్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్దని తేలింది. దాంతో మైక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్ మినరల్ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్ కిల్లర్ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్(పాప) దొరికిన రోజు.. మైక్ రెడ్ కలర్ ట్రక్‌ని కె–మార్ట్ స్టోర్ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?) -
వృద్ధ మహిళలే టార్గెట్.. హత్యలతో హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీలో ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలతో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాడు. వృద్ధ మహిళలనే టార్కెట్ చేస్తున్న ఈ కిరాతకుడు రోజుల వ్యవధిలోనే ముగ్గురిని దారుణంగా హతమార్చాడు. వారిని హత్య చేయడమే గాక మృతదేహాలను నగ్నంగా వదిలేస్తున్నాడు. మూడు హత్యలు ఓకే రీతిలో జరగడంతో ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు ఒకే విధంగా ఉన్నాయి. నిందితుడ్ని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అతడి ఫొటోను విడుదల చేశాయి. ఇప్పటివరకు హత్యకు గురైన ముగ్గురు మహిళల వయసు 50-60 ఏళ్ల మధ్యే ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రతిఘటించలేరని తెలిసి సున్నితమైన మహిళలనే నిందితుడు టార్గెట్ చేస్తున్నాడని వివరించారు. డిసెంబర్ 6న మొదటి హత్య, డిసెంబర్ 17న రెండో హత్య, 29న మూడో హత్య వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం ఆరు బృందాలతో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతవరకు అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియలేదు. చదవండి: మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి! -
పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్ చేసి హతమార్చిన కిరాతకుడు. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్ ఎయిర్వేస్ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్లో విమాన టికెట్ బుక్ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు. భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
19 ఏళ్లకు.. చార్లెస్ శోభరాజ్ రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్
ఖాట్మాండు: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌కు.. 19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఊరట లభించింది. వయసు రీత్యా అతన్ని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 78 ఏళ్లు. 1975లో శోభరాజ్ నేపాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌తో ప్రవేశించడం.. అమెరికా పౌరుడు 29 ఏళ్ల కొన్నీ జో బోరోన్జిచ్, అతని స్నేహితురాలు 26 ఏళ్ల కెనడియన్ లారెంట్ క్యారియర్ ఇద్దర్నీ హత్య చేసిన నేరంపై నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభరాజ్ తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం వాసి. శోభరాజ్‌కు ఫ్రెంచ్ పౌరసత్వం ఉంది. పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. అతని ఫోటో నేపాల్‌లోని ఒక వార్త పత్రికలో ప్రచురితమవ్వడంతో ఆచూకీ ప్రపంచానికి తెలిసింది. జంట హత్యలు చేసినందుకుగానూ ఖాట్మండులోని సెంట్రల్ జైలులో 20 ఏళ్లు శిక్ష, నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించినందుకు గానూ ఒక ఏడాది జైలు శిక్ష కలిపి మొత్తం 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాదు రూ. 2 వేలు జరిమానా కూడా చెల్లించాడు. ఈ కరడుగట్టిన నేరస్తుడి గురించి సినిమాల్లో రిఫరెన్సులు ఉండడం, అతనిపై పలు సినిమాలు కూడా రావడం తెలిసిందే. (చదవండి: రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..) -
‘మా నాన్న 70 మంది మహిళలను చంపేశాడు.. నేనే సాక్ష్యం’
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులకు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30 ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఓ మహిళ వెల్లడించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయ పడేవారమని లూసీ స్టడీ అనే మహిళ న్యూస్‌వీక్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టారో తనకు తెలుసునని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసు శునకాలు మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది. నిందితుడు డొనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలపై అతడి కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళలను హత్య చేసి వాటిని సమీపంలోని బావి, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లేందుకు తన పిల్లల సాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్లను ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది బాధితులను సమీపంలోని 100 అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోపీలవలే భావించి వాటిని తన తండ్రి దాచుకునేవారని చెప్పింది మహిళ. లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిఫ్పర్ డాగ్స్‌తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ, శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద శ్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు డొనాల్డ్ స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన 5 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే.. లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్‌గా డొనాల్డ్ స్టడీ నిలవనున్నాడని అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు. అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పింది లూసీ స్టడీ. ఇదీ చదవండి: చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..! -
కేజీఎఫ్ రాకీభాయ్ స్ఫూర్తితో.. శివప్రసాద్ వరుస హత్యలు
కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. కన్నడ సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్. కేజీఎఫ్ చిత్రంలో లీడ్ రోల్ రాకీ భాయ్ తరహాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్ పోలీసుల ముందు వెల్లడించాడు. ఎలా దొరికాడంటే.. నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్. ఈ తరుణంలో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. రాకీభాయ్‌లా ఎదగాలనే.. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తరుణ్ నాయక్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట. ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఏరియాలో శివ ప్రసాద్ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్మెన్ అయిన మంగల్ అహిర్వర్ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్ వాడడంతో సిగ్నల్ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk — Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022 గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్ మ్యాన్’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్ వివరాల ప్రకారం..శివ ప్రసాద్ స్వస్థలం సాగర్ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు -
72 గంటల్లో మూడు హత్యలు.. భయాందోళనలో ప్రజలు.. సీరియల్ కిల్లర్ పనేనా?
భోపాల్: గడిచిన 72 గంటల్లో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. ఈ దారుణాలు మధ్య ప్రదేశ్ రాష్ట్రం సాగర్ ప్రాంతంలో వెలుగు చూశాయి. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మూడింటిలో రెండు ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపిన విధానం చూస్తుంటే హంతకుడు సీరియల్ కిల్లర్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తి అవ్వకముందే ఎలాంటి స్పష్టతకు రాలేమన్నారు. అంతేగాక పోలీసులు అనుమానిత హంతకుడికి సంబంధించిన స్కెచ్‌ను విడుదల చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తిని ఆగస్టు 28 అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యాడు. తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేశారు. చదవండి: కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి... నిందితుడి స్కెచ్ ఆగస్టు 29 అర్థరాత్రి రాత్రి.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నరో సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60)ను కూడా రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. ఇక మూడో ఘటనలో, ఆగస్టు 30 రాత్రి సాగర్‌లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్మెన్ మంగళ్ అహిర్వార్ను కర్రతో దాడి చేసి చంపినట్లు అధికారులు గుర్తించారు. కాగా ముందు రెండు హత్యలు ఒకే తరహాలో ఉన్నాయని, క్రైమ్ జరిగిన క్రమాన్ని చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కానీ నిందితులు ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కుష్వాహా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హంతకుడు సైకో లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉండొచ్చిన పేర్కొన్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి... -
Delhi Assembly: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు. పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్‌తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అభద్రతాభావంలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు. -
పిల్లల దుస్తులు కూడా వెతికారు.. అక్కడేముంది, ఏమీ లేదు!: మనీశ్ సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కమలం పార్టీ నేతలు సీరియల్ కిల్లర్లలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. సీబీఐ తన నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేసినప్పుడు అధికారులు తన దుస్తులు, పిల్లల దుస్తులు కూడా వెతికారని సిసోడియా తెలిపారు. తనిఖీల్లో వాళ్లకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐర్ మొత్తం ఫేక్ అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సభాముఖంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేసేందుకు బీజేపీ నేతలు చాలా శ్రమిస్తున్నారని, ఆ శ్రద్ధ ఏదో స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణంపై పెట్టాల్సిందని సిసోడియా హితవుపలికారు. ఇతరులు మంచి పనులు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ అభద్రతాభావానికి లోనవుతున్నారని సిసోడియా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయి ఉంటే మోదీలా చేసేవారు కాదని సిసోడియా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకున్న ఎక్సైజ్ పాలసీని సిసోడియా సమర్థించారు. దాని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని సిసోడియా పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. వీడియో రికార్డు అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో ఫోన్‌తో వీడియో రికార్డు చేశారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ మహావర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా.. సభ నియమాలను ఉల్లంఘించి వీడియో తీసినందుకు మీ ఫోన్ ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పండి అని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
థ్రిల్ కోసం అతి కిరాతకంగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్! నేటికీ మిస్టరీనే..
సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్‌లో ఒకడు జోడియాక్. ఏళ్లు గడిచినా ఆ పేరు తప్ప.. ప్రపంచానికి అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అది కూడా అతడి అసలు పేరు కాదు. ‘నేను చంపినవారంతా స్వర్గంలో నా బానిసలే.. దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేదంటే నా బానిసల్ని నన్ను పోగుచేసుకోనివ్వండి (చంపుకోనివ్వండి)’ అంటూ పోలీసులకే లేఖ రాసిన ఈ క్రూరుడు.. ఎలా ఉంటాడో? ఎందుకు అన్ని హత్యలకు తెగబడ్డాడో? నేటికీ మిస్టరీనే. 1968–69 సంవత్సరాల్లో అమెరికా, కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు జోడియాక్. చంపే ముందు హతులకు తన మారు పేరు ‘జోడియాక్’ అని చెప్పి మరీ చంపేవాడు. అలా చెప్పుకోవడంలో అమితమైన ఆనందం పొందేవాడట. జోడియాక్ అంటే అంతా అని అర్థం. వరుస హత్యలతో పోలీసులకే చుక్కలు చూపించిన జోడియాక్.. హత్యలు చేసిన చోట కోడ్ లాంగ్వేజీలో క్లూలు కూడా ఇచ్చేవాడు. చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లలో అతడి కోడ్ లెటర్స్ ప్రింట్ చేయించేవాడు. అయితే పోలీసులు, డిటెక్టివ్లు కలసి తలలు పట్టుకున్నా.. ఆ లెటర్లను డీ–కోడ్ చెయ్యలేకపోయేవారు. నిజానికి జోడియాక్ ఐదుగుర్ని హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ ‘నేను 37 మందిని చంపాను’ అని స్వయంగా ప్రకటించుకున్నాడతను. ఓసారి రక్తపు మరకలున్న షర్టును పంపించి మరీ విర్రవీగాడు. జోడియాక్ ఊహాచిత్రం – కోడ్ లెటర్ హత్య చేసిన ఏడాదికి వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల శబ్దాలు, రెండు ఆర్తనాదాలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన స్థానికులకు.. అక్కడ ఓ కారు ముందు ఒక యువజంట రక్తపు మడుగులో పడి కనిపించింది. వాళ్ల పేర్లు బెట్టీ లావ్ జెన్సెన్(16), డేవిడ్ అర్థర్ ఫారడే(17). వారిలో బెట్టీ అప్పటికే ప్రాణాలతో లేదు. కొన ఊపిరితో ఉన్న ఫారడేను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. అతడి తలలో, ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తేలింది. అదే రోజు అర్థరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. ‘నా పేరు జోడియాక్.. నాకు డబుల్ మర్డర్ వివరాలు తెలుసు’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఈ రోజు ఆ రెండు హత్యలు నేనే చేశాను. మరో సమాచారం ఇవ్వడానికే కాల్ చేశాను. కొలంబస్ పార్క్వేకి తూర్పున 1.6 కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వపార్క్లో ఉన్న బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల శవాలున్నాయి. ఈ రోజు ఈ ఇద్దరినీ చంపినట్లే గత ఏడాది 9 మిల్లీమీటర్ల లర్జెర్ గన్ తో వాళ్లని కాల్చి చంపాను’ అంటూ షాకిచ్చాడు. నిజంగానే పార్క్‌లోని బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల అస్థిపంజరాలు లభించాయి. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? దాంతో మీడియా దృష్టి జోడియాక్ పైన, జోడియాక్ దృష్టి మీడియాపైన పడ్డాయి. పోలీసులూ ఆవేశంగా జోడియాక్ వేటలో పడ్డారు. నెలలు గడుస్తున్నాయి. ఆధారాలు లేక కేసు నీరుగారింది. ఉన్నట్టుండి నగరంలో మళ్లీ కాల్పుల శబ్దం. మరో ఘోరం జరిగింది. కారులో వెళ్తున్న ఓ జంటపై జోడియాక్ ఎటాక్ చేశాడు. ఆ ఘటనలో మహిళ అక్కడికి అక్కడే చనిపోగా.. మైకేల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బతికి బయటపడ్డాడు. హంతకుడి పేరు ‘జోడియాక్’ అనడంతో పోలీసులకు ఆశలు చిగురించాయి. మొదటిసారి జోడియాక్ని చూసిన ప్రత్యక్షసాక్షిగా మైకేల్ ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ‘జోడియాక్ తెల్లజాతీయుడని, సుమారు 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటాడని’ ప్రపంచానికి తెలిసింది. మైకేల్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఊహచిత్రాన్ని గీయించారు. ఆ చుట్టుపక్కల అనుమానిత తెల్లజాతీయులను అదుపులోకి తీసుకుని విచారించారు. నెల రోజులు గడిచాయి. జోడియాక్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌కు హెచ్చరికలతో కూడిన ఓ కోడ్ లాంగ్వేజ్ లేఖను పంపించాడు. ‘దీన్ని మొదటి పేజీలో ప్రచురించకుంటే శాల్తీలు లేచిపోతాయి’ అని. దాంతో భయపడిన సదరు పేపర్ యాజమాన్యం.. మొదటి పేజీలో దాన్ని ప్రచురించింది. అయితే అందులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. డీ–కోడ్ చెయడానికి చాలా మంది మేధావులే ప్రయత్నించారు. వీలుకాలేదు. చివరికి ఓ హైస్కూల్ టీచర్.. ఆ లెటర్ని డీ–కోడ్ చేసి అందులో ఉన్నది తెలియజేయడంతో పోలీసులు బిత్తరపోయారు. ‘నాకు మనుషులని చంపడం భలే ఇష్టం. అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషుల్ని చంపడం వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ అనిపిస్తోంది. ఇందులో ఫన్ ఉంది. ఎందుకంటే మనిషే అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు. కళ్లముందు ఎవరైనా నా కారణంగా చస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను. ఇప్పుడు నేను చంపిన వాళ్లంతా అక్కడ నా బానిసలుగా మారతారు. నా అసలు పేరు చెప్పను. చెబితే మీరు కనిపెట్టేస్తారు. వీలైతే నన్ను పట్టుకోండి. లేదంటే నా పని నన్ను చేసుకోనివ్వండి. స్వర్గంలో కాబోయే నా బానిసల్ని కలెక్ట్ చేసుకోనివ్వండి’ అని రాశాడు జోడియాక్. అతడు రాసిన కోడ్ వీడింది కానీ అతడు ఎవరన్నది నేటికి తెలియలేదు. తెలియబోదు కూడా. ఎందుకంటే ఇప్పటికే సుమారు 53 ఏళ్లు దాటింది. జోడియాక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. - సంహిత నిమ్మన చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు...
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి సమయానికి అది దొరక్కపోతే ఉన్మాదిగా మారుతున్నాడు. దానికి అవసరమైన డబ్బు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని చోరీలకు యత్నిస్తాడు. వారి నుంచి ప్రతిస్పందన ఎదురైతే దారుణంగా చంపేస్తాడు. మద్యం మత్తులోనూ మర్డర్లు చేస్తుంటాడు. ఇలా ఇప్పటి వరకు నాలుగు హత్యలు చేసిన ఉన్మాది మహ్మద్ ఖదీర్‌ను హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం తెలిపారు. సంయుక్త సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ ఆర్జీ శివమారుతీలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. తండ్రి ప్రవర్తనతో ఉన్మాదిగా... కర్ణాటకలోని బీదర్ జిల్లా బాగ్దల్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్ నిరక్షరాస్యుడు. ఇతడికి చిన్నతనం నుంచే తండ్రి వేధింపులు ఎదురయ్యాయి. అకారణంగా దూషించడం, కొట్టడం వంటివి చేస్తుండటంతో మానసికంగా దెబ్బతిన్నాడు. తన 15వ ఏట ఇంటి నుంచి వచ్చేసి హైదరాబాద్ చేరాడు. బోరబండలోని సఫ్దర్‌నగర్‌లో నివసిస్తున్న ఇతడికి భార్య, ఐదుగురు సంతానం ఉన్నారు. మద్యానికి బానిసగా మారడంతో పాటు ఉన్మాదిగా ప్రవర్తిస్తుండటంతో భార్య కూడా ఇతడికి దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రం కుటుంబం వద్దకు వెళ్తున్న ఖదీర్ వారికి డబ్బు ఇస్తుంటాడు. ఫుట్‌పాత్‌లపై బతికే ఇతడు కూలీపనులు చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు ఆటోడ్రైవర్‌గానూ మారతాడు. చదవండి: (ట్రయల్ రూమ్‌లో యువతిని వీడియో తీసిన యువకులు) టైమ్‌కు ‘మందు’ పడాల్సిందే... ప్రతి రోజూ చీప్ లిక్కర్ నిషాలో జోగుతూ ఉండే ఇతగాడు దానికి బానిసగా మారాడు. నిర్ణీత సమయానికి మద్యం తాగకపోతే ఉన్మాదిగా మారిపోతుంటాడు. చీప్ లిక్కర్ ఖరీదు చేసుకోవడానికి అవసరమైన డబ్బు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రించే యాచకులను అడుగుతాడు. ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే వారు నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై మోది చంపేస్తాడు. నిద్రిస్తున్న వారి నుంచి దోచుకోవడానికి ప్రయత్నించే ఇతగాడు వాళ్లు అడ్డుకున్నా ఇదే పని చేస్తాడు. 2017లో రెండు ఆటోలు చోరీ చేసిన కేసుల్లో హబీబ్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి ఆరు నెలల శిక్ష అనుభవించాడు. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ఇతగాడు 2019 డిసెంబర్ 30న నాంపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ముబారక్ అలీ అనే వ్యక్తిని చంపాడు. ఈ కేసులో 2020 జనవరి 2న అరెస్టు అయ్యాడు. 2021 ఏప్రిల్ 4 వరకు జైల్లోనే ఉన్నాడు. ఇతడికి బెయిల్ ఇవ్వడానికి ఎవరూ రాకపోవడం, ఏడాదిన్నర పాటు జైల్లోనే ఉండటంతో న్యాయస్థానమే మాండేటరీ బెయిల్ ఇచ్చింది. గత నెల 15న హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని చంపాడు. గత నెల 31న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని అగ్గిపెట్టె కావాలంటూ లేపాడు. ఆపై డబ్బు డిమాండ్ చేయడంతో అతడు తిరస్కరించాడు. దీంతో బండరాయితో మోది అతడిని చంపిన ఖదీర్ జేబులో ఉన్న రూ.150, మద్యం సీసా తస్కరించాడు. ఆ మద్యం తాగి నాంపల్లి గూడ్స్ షెడ్ వద్దకు వచ్చాడు. అక్కడ ఆటోట్రాలీలో నిద్రిస్తున్న ఖాజాను లేపి కాస్త చోటు ఇమ్మన్నాడు. అతడు కాదనడటంతో సమీపంలో ఉన్న బండరాయితో కొట్టి చంపేశాడు. పీడీ యాక్ట్ ప్రయోగానికి నిర్ణయం... ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర సమాచారం ఆధారంగా ఖదీర్‌ను పట్టుకున్నారు. ఈసారి ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలా ఇలా జైల్లో ఉండగానే కేసుల విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ ఉన్మాది బాహ్యప్రపంచంలో ఉంటే మరికొన్ని ఇలాంటి హత్యలు చేసే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. -
Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..!
ఉన్మాదం వెర్రితలలేయడం చరిత్రకేం కొత్త కాదు. వికృత చేష్టలతో కొందరు.. సీరియల్ కిల్లర్స్ ఇంకొందరు.. తరతరాలను వణికిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు మౌపా సెడ్రిక్ మాకే. తప్పు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఘనుడు. హత్యలు, హత్యాచారాలు, దొమ్మీలు, దోపిడీలు.. ఒక్కటేమిటి తవ్వేకొలదీ అతడి జీవితం ఓ నేరాల పుట్ట. దక్షిణాఫ్రికాకు చెందిన మౌపా.. 1965లో జన్మించాడు. అతడి నేర చరిత్ర 1996 నుంచి మొదలైంది. ఏడాదిలోనే తనున్న నగరాన్ని అతలాకుతలం చేసేశాడు. ‘మౌపా సెడ్రిక్ మాకే’గా కాకుండా ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా పేరు మోశాడు. ఎందుకలా మారాడు? 1996 నుంచి 1997 వరకూ జోహాన్నెస్‌బర్గ్‌లోని వెమ్మెర్ పాన్ అనే ప్రాంతంలో వరుసగా 3 రకాల హత్యలు జరిగాయి. ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. హత్యలు జరిగిన తీరుని బట్టి రెండు రౌడీగ్యాంగ్స్ నగరానికి వచ్చి ఉంటాయని.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. హత్యకు గురైన తీరుని బట్టి వాటిని మూడు వేరువేరు కేటగరీలుగా విభజించి ప్రొఫైల్స్ కూడా రెడీ చేశారు. మొదటి రకం.. ఒంటరిగా నడిచివెళ్లే ఆడ, మగలను బండరాయితో కొట్టి చంపి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. రెండవ రకం.. కారుల్లో వెళ్లే జంటలను టార్గెట్ చేసి మొదట మగవారిని గన్‌తో కాల్చి చంపి.. తర్వాత స్త్రీలను రేప్ చేసి చంపడం. మూడవ రకం.. స్థానిక టైలర్ల షాపులపై దాడి చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం. ఇలా జరిగిన హత్యల్లో మూడు తేడాలు ఉండేవి. దాంతో ఈ ఉదంతం ఓ మిస్టరీగా మారిపోయింది. టైలర్స్ మీద దాడి చేసేది ఒక గ్రూప్ అని, మిగిలిన రెండు రకాల హత్యలను మరో గ్రూప్ చేస్తోందని ముందొక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెమ్మెర్ పాన్ ప్రాంతంలో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ‘వెమ్మెర్ పాన్ కిల్లర్’గా, కొందరిని సుత్తితో చంపుతున్నారు కాబట్టి ‘హామర్ కిల్లర్’గా పేర్లు పెట్టి స్థానిక మీడియా ఆ నగరవాసులను హెచ్చరించేది. మౌపా చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! ఓ రోజు ఓ టైలర్ షాప్‌లో పోలీసులకు ఒక స్లిప్ దొరికింది. దాంట్లో ఓ సంతకం ఉంది. దాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అప్పటికే అలాంటి సంతకం రెండో గ్రూప్ చేసిన హత్యలో కీలక ఆధారంగా దొరికింది. దాంతో రెండు గ్రూపులు లేవనీ ఒకటే గ్రూపు ఇదంతా చేస్తోందని పోలీసులు భావించారు. కనీసం ఒక్కడిని పట్టుకున్నా గ్యాంగ్ మొత్తాన్ని బయటికి లాగొచ్చు అనే ఆలోచనతో దాన్నో సవాలుగా తీసుకున్నారు. వెమ్మెర్ పాన్ చుట్టుపక్కల మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు. కొన్నిరోజులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ పై అధికారులకు అప్పగించారు ఆ మఫ్టీ పోలీసులు. అయితే ఆ అధికారులు అతన్ని చూడగానే షాక్ అయ్యారు. ‘నువ్వా?’ అంటూ ఆశ్చర్యపోతున్న అధికారులతో ‘నేనే సార్.. గుర్తున్నానా? నా పేరు మౌపా సెడ్రిక్ మాకే. ఆ ఏరియా మాదే సార్. ఇంతకు ముందు కొన్ని హత్యలకు సంబంధించిన సమాచారాన్ని నేనే కదా మీకిచ్చింది’ అని అతను అనడంతో పోలీసులకు మతి పోయింది. ఆ వెంటనే తేరుకొని వాళ్లు ‘అసలు ఆ నేరాల గురించి నీకు మాత్రమే ఎలా తెలుస్తోంది?’ అంటూ ఆరా లాగారు. దాంతో అతని డ్రామాకి తెరపడింది. అనుమానం రావాలే కానీ నిజాలను కక్కించడం ఎంతసేపు? చివరికి అదే జరిగింది. గ్యాంగులు, గ్రూపులు ఏమీ లేవని.. ఆ నేరాలన్నిటినీ తానే చేశానని ఒప్పుకున్నాడు మౌపా. పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తప్పించుకుని తిరిగిన మౌపా వ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మౌపా అరెస్టు 1,340 ఏళ్ల జైలుశిక్ష.. 1997 డిసెంబర్లో అరెస్ట్ అయిన మౌపాకి.. 6 సెప్టెంబర్, 2000 సంవత్సరంలో అన్ని ఆధారాలతో శిక్ష ఖరారైంది. అతడు మొత్తంగా 110కి పైగా నేరాలు చేసినట్లు తేలింది. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 రేప్‌లు, 41 దోపిడీలు చేసినట్లు రుజువైంది. వాటన్నింటికీ కోర్టు అతడికి 27 జీవిత ఖైదులను విధించింది. అంటే 1,340 సంవత్సరాలు అతను జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. అయితే ఈ నేరాల్లో ఎక్కువ శాతం రెండిళ్ల చుట్టుపక్కలే జరగడం గమనార్హం. వాటిలో ఒకటి మౌపా పని చేసే ఇల్లు, మరొకటి అతడి సోదరుడు నివసిస్తున్న ఇల్లు. ఆ రెండిళ్ల మధ్య తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడ్డాడు మౌపా. అయితే ఈ శిక్షలపై బాధిత బంధువు ఒకరు స్పందిస్తూ.. ‘మరణ శిక్ష అమల్లో ఉంటే నేను చాలా సంతోషించేవాడిని’ అన్నాడు.. 1995 నుంచి దక్షిణాఫ్రికాలో మరణ శిక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ. -సంహిత నిమ్మన చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !
Stone Man: విచక్షణ కోల్పోయిన మనుషులకు ఇతరుల జీవితాలు ఎప్పటికీ ఓ ఆటే. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారీ.. ఉన్మాదపు కోరలతో బుసకొట్టడం, తాము చేసిన వికృతానికి జడిసిపోయే సమాజాన్ని అజ్ఞాతంగా గమనిస్తూ గర్వపడటం సైకోలకు అలవాటే. చరిత్ర మోసిన ఈ తరహా రక్తపు మరకల్లో మనదేశానికి చెందిన స్టోన్‌మేన్ కథ ఒకటి. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాలను గజగజలాడించిన ఈ రాక్షసుడి జీవితం నేటికీ ఓ మిస్టరీనే. 1985లో మొదలైన అతని హత్యాకాండ.. 2009 వరకూ కొనసాగింది. అతని టార్గెట్.. నిరాశ్రయులు, అనాథలే. కటిక దారిద్య్రంతో అల్లాడిపోతూ.. బంధాలు, బంధువులు లేక.. ఒంటరిగా ఆరుబయట, ఒళ్లు మరచి పడుకునే అభాగ్యులను నిర్దాక్షిణ్యంగా బండరాయితో మోది చంపేసేవాడు. గుర్తుపట్టలేని విధంగా ముఖాలను ఛిద్రం చేసి.. పోలీసులకే సవాలుగా మారాడు. 1989లో కోల్‌కతా పోలీసులకు.. అక్కడి మొదటి కేసుతోనే.. వెన్నులో వణుకు పుట్టించిన ఈ సీరియల్ కిల్లర్.. 6 నెలల వ్యవధిలో ఒకే విధంగా 13 హత్యలు చేశాడు. హత్యకు గురైనది ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. చీకటిపడితే చాలు బయట అంతా భయం.. భయం చీకటిపడితే ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. ఒంటరిగా తిరగొద్దని నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసే వారు పోలీసులు. రాత్రయితే చాలు అన్ని ఇళ్లకు తాళాలు పడేవి. ఆ జనసముద్రం కాస్త అలజడి లేని నిర్మానుష్య ఎడారి అయిపోయేది. అలా అతగాడ్ని పట్టుకోవడానికి పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. కానీ ఆచూకీ దొరకలేదు. రాయితో చంపుతున్నాడు కాబట్టి మీడియా అతడికి స్టోన్‌మేన్ అని పేరుపెట్టింది. హత్యకు సుమారు 30 కిలోల బండరాయిని ఉపయోగించేవాడని తేలింది. చంపిన తీరును బట్టి.. అతడు బలిష్టమైన కండలు కలిగిన వాడని, పొడగరని అంచనా వేశారు. ఎందరో అనుమానితుల్ని విచారించారు.పైగా హత్యకు గురైన బాధితులంతా అనాథలు, నిరాశ్రయులే కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. మృతదేహానికి దరిదాపుల్లో ఎలాంటి బండరాయి కానీ, బలమైన రాడ్డు కానీ ఎప్పుడూ దొరకలేదు.కోల్‌కతా కంటే ముందే 1985–88 మధ్యకాలంలో ముంబైని వణికించాడు ఈ స్టోన్‌మేన్. అక్కడా ఇదే తరహాలో నిరాశ్రయులైన 26 మంది అనాథలను హత్య చేసి కోల్‌కతాకు చేరాడు. సినిమా కూడా తెరకెక్కింది 2009లో అస్సాంలోని గువాహటిలో కూడా ఇలాంటి హత్యలే జరగడంతో వాటిని కూడా స్టోన్‌మేన్ ఖాతాలోనే వేశారు పోలీసులు. ఈ వాస్తవ ఘటనల ఆధారంగా 2009లో ‘ది స్టోన్‌మేన్ మర్డర్స్’ అనే సినిమా తెరకెక్కింది హిందీలో. ఎన్ని విచారణలు జరిపినా.. ఎన్ని రాష్ట్రాలు మారినా.. నేటికీ స్టోన్‌మేన్ జాడ కాదుకదా కనీసం అతని అసలు పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియలేదు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. -
నటి దారుణ హత్య.. 47 కత్తిపోట్లు: నిందితుడికి ఉరిశిక్ష
వాషింగ్టన్/కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్‌తో పాటు మరో మహిళను హత్య చేసినందుకు గాను ‘హాలీవుడ్ రిప్పర్’గా ప్రసిద్ధి చెందిన మైఖెల్ గార్గిలోకు లాస్ ఏంజిల్స్ కోర్టు మరణశిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ నేరాలతో పాటు మరో హత్యాయత్నం కేసులో 2019లోనే మైఖెల్ దోషిగా తేలాడు. ఈ క్రమంలో కోర్టు 2021, జూలైలో అతడికి మరణ శిక్ష విధించింది. నిందితుడు మైఖెల్.. హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 'హాలీవుడ్ రిప్పర్'గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22) నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన నాటి రాత్రి ఆష్లే, తన సహానటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి వెళ్లిపోయాడు కుచర్. ఆ మరసుటి రోజు ఎల్లరిన్ శవాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలో నటుడు కుచర్ ఈ కేసులో ముఖ్య సాక్షిగా మారాడు. ఆ తర్వాత మైఖెల్ 2005లో మారియా బ్రూనో(32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు. బ్రూనో హత్య జరిగిన మూడేళ్ల తర్వాత అనగా 2008, జూన్‌లో మైఖేల్ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు. ఆమె ఇంట్లో ప్రవేశించి.. కత్తితో దాడి చేసి హత్య చేయాలని భావించాడు. కానీ అదృష్టవశాత్తు మర్ఫీ తప్పించుకున్నారు. అనంతరం మర్ఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైఖెల్ నేరాలు వెలుగు చూశాయి. ఇక మర్ఫీపై దాడి తరువాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ సంఘటనా స్థలంలో మైఖేల్ రక్తం ఉండటంతో దాని ఆధారంగా శాంటమోనికా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మర్ఫీ ఈ కేసులో ప్రధాన సాక్ష్యిగా ఉన్నారు. రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైఖేల్ విచారణ సందర్భంగా తాను అమాయకుడినకని కోర్టుకు తెలిపేవాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి మైఖెల్‌కు మరణశిక్ష విధించింది. కాకపోతే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలుపై నిషేధం ఉంది. 2006 తరువాత కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైఖేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఇల్లినాయిస్లో ఈ కేసు విచారణ జరిగింది. -
కన్న బిడ్డలని చంపేసింది: ఆమెని విడుదల చేయండి
మెల్బోర్న్: బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి విలవిల్లాడుతుంది.. నొప్పి నుంచి కోలుకునే వరకు తల్లి మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఓ తల్లి తన కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను చంపేసింది.. సీరియల్ కిల్లర్ అనే ఆరోపణలతో జైలు పాలయ్యింది. తాజాగా ఆమెను విడుదల చేయాలని కోరుతూ.. శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతకు ఎవరా మహిళా.. ఆమెని విడుదల చేయమని కోరడం ఏంటి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన కాథ్లీన్ ఫోల్బిగ్ తన నలుగురు పిల్లలు కాలేబ్, పాట్రిక్, సారా, లారాలను చంపినందుకు గాను ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. మరణించిన చిన్నారులంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయస్సు వారే. కాథ్లీన్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఈ క్రమంలోనే ఆమె తన నలుగురు పిల్లల్ని హత్య చేసిందనే ఆరోపణలపై అరెస్టయ్యింది. పోలీసు విచారణలో కాథ్లీన్ ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంది. ఈ క్రమంలో 2003లో కోర్టు ఆమెకు హత్య, నరహత్య నేరాల కింద శిక్ష విధించింది. అయితే కాథ్లీన్ తన బిడ్డలను చంపేసింది అనే దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. కేవలం ఆమె డైరీ ఆధారంగానే కోర్టు ఆమెకి శిక్ష విధించింది. కాథ్లీన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. ‘‘కన్నతల్లా.. కసాయా’’ అనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు నిపుణులు ఈ కేసును ప్రత్యేకంగా స్టడీ చేశారు. సంచలన విషయాలు వెల్లడించారు. దీనిలో కాథ్లీన్ నలుగురు పిల్లలు సహజ కారణాలతో మరణించినట్లు నిపుణులు ఆధారాలతో సహా వెల్లడించారు. 'బేబీ కిల్లర్' గా పిలువబడే మహిళను విడుదల చేయాలని వాదించినట్లు గార్డియన్ తెలిపింది. ఈ క్రమంలో 90 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు సంతకం చేసిన పిటిషన్‌ను ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ విడుదల చేసింది. నివేదకిలో ఏం ఉందంటే.. కాథ్లీన్,ఆమె నలుగురు పిల్లల పూర్తి జన్యు శ్రేణి ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. కాథ్లీన్ కుమార్తెలలో ఇద్దరైనా సారా, లారాకు జన్యు పరివర్తన ఉందని జెనోమిక్ సీక్వెన్సింగ్ వెల్లడించింది. అలానే కాథ్లీన్‌కు కూడా జన్యు సమస్యలు ఉన్నాయని దీని గురించి ఆమెకు ఏ మాత్రం తెలియదని.. ఆ సమస్యల వల్ల ఆమెకు ఆకస్మిక గుండె పోటు రావచ్చని నివేదిక పేర్కొంది. "కాలేబ్, పాట్రిక్ జన్యువులు బీఎస్న్ జన్యువుల్లో ఒక ప్రత్యేకమైన అరుదైన జన్యు వైవిధ్యాన్ని చూపించాయి. అధ్యయనం తెలిపిన ప్రకారం ఈ అరుదైన జన్యు వైవిధ్యం వల్ల ఎలుకల్లో ప్రాణాంతక మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు అధికం. ఇదే సమస్య పాట్రిక్‌లో బయటపడింది. తన పుట్టుకకు నాలుగు నెలల ముందు నుంచే మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలానే కాలేబ్‌కు స్వరపేటిక సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది” అని నివేదిక పేర్కొంది. మరణించిన చిన్నారులందరూ వివధ జన్యుకారణాల వల్లనే చనిపోయారని.. ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ నివేదికను న్యూ సౌత్ వేల్స్ గవర్నర్‌కు సమర్పించారు. 1991లో ఎనిమిది నెలల వయస్సులో మరణించిన పాట్రిక్, మూర్ఛతో చనిపోగా.. 1993లో 10 నెలల వయసులో ఎస్ఐడీఎస్ వల్ల సారా మరణించింది. లారా 1999లో 19 నెలల వయస్సులో మరణించగా.. కాలేబ్ కేవలం 19 రోజుల వయసులో నరహత్యకు గురయ్యాడని ఆరోపించారు. కానీ వాస్తవంగా ఈ చిన్నారి కూడా ఎస్ఐడీఎస్ వల్లనే మరణించాడు. నలుగురు చిన్నారుల హత్యకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష్య సాక్షులు కానీ, భౌతిక ఆధారాలు కానీ లేనప్పటికీ, ప్రాసిక్యూటర్లు కాథ్లీన్ డైరీలోని విషయాల ఆధారంగా ఆమెని నిందితురాలిగా పేర్కొన్నారు. విచారణ సమయంలో కూడా కాథ్లీన్ ఎటువంటి భావోద్వేగాలను చూపించలేదు. దాంతో ఆమె తన పిల్లలను అత్యంత క్రురంగా హత్య చేసి ఉంటుందని భావించారు. డైరీ రాతల గురించి కాథ్లీన్ని ప్రశ్నించినప్పుడు ఆమె మానవాతీత శక్తి తన పిల్లల్ని తీసుకెళ్లిందని తెలిపింది. చదవండి: కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల -
నాలుగు మాటలు.. ఆరు హత్యలు..
వికారాబాద్: ఒంటరి మహిళలతో స్నేహం చేయడం.. మద్యం తాగించి, మాయమాటలు చెప్పడం.. పథకం ప్రకారం హత్య చేయడం.. ఆపై బంగారం, డబ్బు దోచుకోవడం.. ఇదీ ఓ కిరాతకుడి బాగోతం.. ఇలా ఇప్పటికి ఆరు హత్యలు చేశాడు. గతంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదిస్తున్న పోలీసులకు కిల్లర్ పట్టుబడ్డాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్పపై పలు కేసులు నమోదయ్యాయి. ధారూర్ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ (38) కూలీ పనులు చేసేందుకు వికారాబాద్‌లోని అడ్డాకు వచ్చింది. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో భర్త చంద్రయ్య వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సిరిగేట్‌పల్లి రైల్వే గేటు సమీపంలో పొలం పక్కన మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరున్నారు. ఆ మృతదేహం అమృతమ్మదేనని గుర్తించారు. మృతురాలి శరీరంపై నగలు లేకపోవడాన్ని గమనించిన పోలీసులు ఎవరో బంగారం, నగదు కోసమే హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో ఆరా.. దర్యాప్తులో భాగంగా వికారాబాద్‌లోని కూలీల అడ్డా వద్దకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో కేసును ఛేదించే యత్నం చేశారు. ఆ రోజు ఉదయం అడ్డా నుంచి ఆటోలో అమృతమ్మ ఆలంపల్లి వైపు వెళ్లినట్లు గమనించారు. దీంతో పాటు ఓ బంగారం తాకట్టు దుకాణంలో బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయగా ఆధార్ కార్డు లేకపోవడంతో పెట్టుకోలేదు. హత్య ఇలా చేశాడు.. అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్ప అమృతమ్మకు ఉదయం కల్లు తాగించాడు. అనంతరం ఆటోలో కొత్తగడి వైపు వెళ్లి సిరిగేట్‌పల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఆటో దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. ఈమె మద్యం మత్తులో ఉండగా, హత్య చేసి పారిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని పారిపోయాడు. 1985 నుంచి నేర చరితుడే.. 50 ఏళ్ల కిష్టప్ప ధారూరు పరిధిలో 1985లో మొదటి హత్య చేయగా, 2008లో వికారాబాద్ పీఎస్ పరిధిలో ఓ హత్య చేశాడు. 2008లో తాండూరులో హత్య చేసి బంగారం దోచుకున్నాడు. 2010లో యాలాల పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్, డబ్బుల కోసం హత్య చేశాడు. 2016లో వికారాబాద్‌లో హత్య చేసి డబ్బు, సెల్‌ఫోన్ తీసుకున్నాడు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు పాల్గొనగా, మిగతావన్నీ తాను ఒక్కడు చేసినవే. మహిళలను హత్య చేయడంతో పాటు రెండు కేసుల్లో మహిళలను గుర్తు పట్టకుండా కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు. -
93 మందిని చంపేసిన సీరియల్ కిల్లర్ మృతి!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్ లిటిల్ మృతి చెందాడు. 19 రాష్ట్రాల్లో సుమారు 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న అతడు బుధవారం మరణించాడు. ఈ మేరకు కాలిఫోర్నియా కరెక్షన్స్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్టుమెంట్ ప్రకటన విడుదల చేసింది. కాగా 80 ఏళ్ల వయస్సు గల సామ్యూల్ వయోభారంతో చనిపోయినట్లు సమాచారం. కాగా దక్షిణ అట్లాంటాకు సమీపంలో గల రెనాల్డ్స్(జార్జియా)లో 1940, జూన్ 7న సామ్యూల్ లిటిల్ జన్మించాడు. టీనేజర్ అయిన అతడి తల్లి పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లడంతో సామ్యూల్ బాల్యం భారంగా గడిచింది. ఒంటరితనం వెంటాడింది. ఈ క్రమంలో ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్ తన మెడను రుద్దుకున్నపుడు గమనించిన అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలనే కోరిక పుట్టింది. ఆ సమయంలో తన పక్కనే ఉన్న సహ విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఇటీవల సామ్యూల్ వెల్లడించాడు. అలా చిన్ననాటి నుంచే నేర ప్రవృత్తికి అలవాటు పడిన సామ్యూల్... పదమూడేళ్ల వయస్సులో దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కాడు.(చదవండి: ఒళ్లు గగుర్పొడిచే విషయాలు చెప్పిన సీరియల్ కిల్లర్) ఆ తర్వాత సీరియల్ కిల్లర్‌గా మారి పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. అలా సుమారు 93 మంది మహిళలను పొట్టనబెట్టుకున్నాడు. మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు లాక్కోవడం, శవాలను పొదల్లో పడేసి అక్కడి నుంచి జారుకునేవాడు. పోలీసులకు ఎలాంటి ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడేవాడు. కాగా హత్యలతో పాటు చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేసే సామ్యూల్ అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. అలా ఒకానొక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష(లు) విధించింది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్ శిక్ష అనుభవిస్తున్న సామ్యూల్ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు పోలీసులు ఒప్పించారనే విమర్శలు వినిపించాయి. అయితే సామ్యూల్ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి పూసగుచ్చినట్లు వివరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. (చదవండి: రహస్య గది.. 9 హత్యలు) -
రహస్య గది.., 9 హత్యలు
టోక్యో: తొమ్మిదిమంది అమాయకులను హతమార్చిన ‘ట్విటర్ కిల్లర్’ తకాహిరొ షిరాయిషికి టోక్యో కోర్టు మంగళవారం మరణ దండన విధించింది. నిందితుడి తరపు లాయర్ వాదనలు తోసిపుచ్చింది. ఒక మనిషిని ‘వారి సమ్మతితోనే ప్రాణాలు తీశాడు అనడం’అర్థ రహితమని కొట్టి పడేసింది. వివరాలు. తకాహిరొ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విటర్లో పరిచయం చేసుకున్నాడు. వారి జీవిత విశేషాలను తెలుసుకుని, సమస్యలేవైనా ఉంటే సాయం చేస్తానని చెప్పాడు. అలా జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్న తొమ్మిది మందితో స్నేహం చేశాడు. తాను కూడా జీవితాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను అని నమ్మబలికాడు. కలిసి చనిపోదామని చెప్పి.. ముందుగా వారి ప్రాణాలు తీశాడు. అలా ఒక్కొక్కరుగా 9 మందిని చంపేశాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు పోలీసుల విచారణలో తేలింది. తకాహిరొపై ఓ అత్యాచారం కేసు నమోదైంది. మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో తకాహిరొ హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. తకాహిరొ తో ఆమె తరుచూ ట్విటర్లో సంప్రదించినట్టు గుర్తించడంతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం. (చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్) చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్ వాదించాడు. అయితే, బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉండటం అంటే.. దాని అర్థం వారి సమ్మతి లేదని, బాధితులు ప్రతిఘటించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాగా, విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గది బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. కూల్ బాక్సుల్లో దాచి ఉంచిన మృత దేహాల శరీర భాగాలు, 240 ఎముకలు బయటపడ్డాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్ టాప్‌లో ఉంది. అయితే, ఇక్కడే అత్యధికంగా ప్రతయేడు 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలవరపరిచే అంశం. (చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు) -
సీరియల్ కిల్లర్ వాడిన 50 ఏళ్ల నాటి కోడ్‌ను శోధించారు
న్యూయార్క్: దాదాపు 50 ఏళ్ల క్రితం ‘జోడియాక్ కిల్లర్’గా ప్రసిద్ధి చెందిన ఓ నిందితుడు పంపిన కోడ్ మెసేజ్‌ను డీకోడ్ చేశామని క్రిప్టోగ్రాఫిక్ (సంకేతాలను విశ్లేషించి మామూలు భాషలో రాయడం)ఔత్సాహికులు వెల్లడించారు. ఈ వ్యక్తి 1960 ప్రాంతంలో ఉత్తర కాలిఫోర్నియాలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాడు. సదరు కిల్లర్ ఈ సందేశాన్ని నవంబర్ 1969 లో శాన్ఫ్రాన్సిస్కో క్రానికల్ వార్తాపత్రికకు పంపించాడు. ఈ సందేశం క్రిప్టిక్ లెటర్స్, సింబల్స్ కలిగి ఉన్నది. ఇక ఈ మెసేజ్‌లో సీరియల్ కిల్లర్‌కు సంబంధించి ఏదైనా ఐడెంటీ ఉంటుందని అధికారలు భావించారు. 1968-69 మధ్య ఈ సీరియల్ కిల్లర్ ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అయితే ఇతడిని ఆదర్శంగా తీసుకుని మరి కొందరు సీరియల్ కిల్లర్స్ మరో 37 మందిని హత్య చేశారు. ఈ కేసులు అధికారులకు పెద్ద సవాలుగా మారాయి. దాదాపు 50 ఏళ్ల ప్రయత్నం తర్వాత సదరు కిల్లర్ పంపిన మెసేజ్‌ను తాము చేధించినట్లు ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు. అయతే ఈ కోడ్‌లో హంతకుడికి సంబంధించి ఎలాంటి గుర్తింపు గానీ, ఆధారాలు గానీ లేవని ఈ బృందం వెల్లడించింది. ఈ మెసేజ్‌లో "మీరు నన్ను పట్టుకోవటానికి చాలా సరదాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను... గ్యాస్ చాంబర్ గురించి నేను భయపడను, ఎందుకంటే అది నన్ను త్వరగా స్వర్గానికి పంపుతుంది. ప్రసుతం నేను లేకపోయినా నా పని పూర్తి చేయడానికి తగినంత మంది బానిసలు ఉన్నారు" అనేది ఈ మెసేజ్లోని సారాంశం. ఈ కోడ్‌ని చేధించడానికి క్రిప్టోగ్రాఫర్లు సంవత్సరాల తరబడి పని చేశారు. అమెరికన్ వెబ్ డిజైనర్ ఓరన్చాక్ 2006 నుంచి ఈ కోడ్‌ను డీకోడ్ చేయడానికి అనేక కంప్యూటర్ ప్రొగ్రామ్‌లను ఉపయోగించాడు. కానీ లాభం లేకపోయింది. ఈ ప్రయత్నంలో అతడికి ఆస్ట్రేలియా గణిత శాస్త్రజ్ఞుడు సామ్ బ్లేక్, బెల్జియన్ లాజిస్టిషియన్ జార్ల్ వాన్ ఐక్కే సహాయం చేశారు. ఈ సందర్భంగా ఓరన్ చాక్ శాన్ఫ్రాన్సిస్కో క్రానికల్‌తో మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న ఫెడరల్ ఏజెన్సీ ఎఫ్బీఐతో కలిసి ఈ కోడ్‌ని పరిష్కరించామన్నారు. (చదవండి: ‘వీక్ అని గేలి చేశారు.. అందుకే’) ఇక సదరు జోడియాక్ కిల్లర్ కాలిఫోర్నియా వార్తాపత్రికలకు పంపిన మొదటి సందేశాన్ని 1969 లో పాఠశాల ఉపాధ్యాయుడు,అతని భార్య డీకోడ్ చేశారు. దానిలో ‘‘చంపడం అంటే నాకు ఎంతో ఇష్టం.. దానిలో ఎంతో ఫన్ ఉంది’’ అని సారాంశం కలిగి ఉంది. ఇక ఈ మెసేజ్‌లో కూడా అతడు బానిసలు అనే పదం వాడాడు. మొదటి సందేశంలో ఉపయోగించిన కోడ్ "340 సాంకేతిక లిపి" చాలా సరళంగా ఉంది. ఎందుకంటే ఈ కోడ్ 17 నిలువు వరుసలలో 340 అక్షరాలను కలిగి ఉన్నాయి. "జోడాయిక్ క్రిప్టో సొసైటీలో సంకేతాలకు ఏ అక్షరాలు ఉన్నాయో గుర్తించడానికి మించి సాంకేతికలిపికి మరో అడుగు ఉంది. అదే విషయాన్ని మేము ఇక్కడ కనుగొన్నాము" అని ఓరన్చక్ అన్నారు.(చదవండి: చిన్ననాటి కోరిక.. 93 మందిని..!) ‘‘340 సాంకేతికలిపిని డయాగ్నల్‌గా చదవాలి. అంటే ఎగువ-ఎడమ మూలలో నుంచి ప్రారంభించి, ఒక బాక్స్ క్రిందికి, రెండు బాక్స్‌లను కుడి వైపుకు మారుస్తుంది. కిందకు చేరుకున్న తర్వాత రీడర్ తప్పనిసరిగా వ్యతిరేక మూలకు వెళ్ళాలి’’ అని నిపుణుడు తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు. అతని ప్రకారం, జోడియాక్ కిల్లర్ వాడిన కోడింగ్ విధానం ముఖ్యంగా 1950 కాలంలో అమెరికా సైన్యం వాడిన క్రిప్టోగ్రఫీ మాన్యువల్‌లో కనిపిస్తుంది. -
‘వీక్ అని గేలి చేశారు.. అందుకే’
చండీగఢ్: ‘‘చిన్నప్పటి నుంచి అందరూ.. నువ్వు చేతకాని వాడివి. బలహీనుడివి అనే వారు. వాళ్లెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడే ఈ ప్రపంచానికి నేనేంటో చూపించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ హత్యలు చేశా’’ అంటూ 22 ఏళ్ల యువకుడు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. అకారణంగా ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు బలిగొన్నందుకు అతడిని అరెస్టు చేశారు. వివరాలు.. నవంబరు 23, 24, 25 తేదీల్లో హరియాణాలోని గురుగ్రాంలో వరుస హత్యలు జరిగాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన మహ్మద్ రాజీ(22) ఈ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ వద్ద గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా తాను ముగ్గురిని హత్య చేసినట్లు రాజీ పోలీసులకు తెలిపాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తులతో మాటలు కలిపి, వారికి మద్యం తాగించి మచ్చిక చేసుకునేవాడినని, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసి వారిని హతమార్చినట్లు వెల్లడించాడు. నవంబరు 23న గురగ్రాం లీజర్‌వ్యాలీ పార్క్, ఆ మరుసటి రోజు సెక్టార్ 40లో ఓ సెక్యూరిటీ గార్డును, ఆ తర్వాతి రోజు రాకేశ్ కుమార్ అనే వ్యక్తిని చంపేసినట్లు పేర్కొన్నాడు. రాకేశ్ కుమార్‌ను చంపిన తర్వాత అతడి మొండెం నుంచి తలను వేరుచేశానన్న రాజీ, పోలీసులకు ఘటనాస్థలికి తీసుకువెళ్లగా తలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: టీవీ చూడనివ్వడం లేదని..) ఈ విషయం గురించి రాజీ మాట్లాడుతూ.. రాకేశ్ గొంతు కోసిన తర్వాత తనను అలా వదిలేయడం ఇష్టంలేక కన్హాయ్ గ్రామంలో తలను పడేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా సుమారు 250-300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మూడు హత్యలతో పాటు ఢిల్లీలో ఇటీవల జరిగిన 10 హత్యలతో కూడా రాజీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిన్ననాటి చేదు అనుభవాల వల్ల ఆత్మన్యూనతకు లోనై ఈ నేరాలకు పాల్పడినట్లు హంతకుడు తెలిపాడని పేర్కొన్నారు. ( చదవండి: ‘సైకో కిల్లర్’ ఎన్కౌంటర్!) -
ఎన్కౌంటర్లో ‘సైకో కిల్లర్’ హతం!
భోపాల్: కరుడుగట్టిన హంతకుడు దిలీప్ దేవాల్ హతమయ్యాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. వివరాలు.. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనానికి పాల్పడేవాడు. సాక్ష్యాలు మాయం చేసే క్రమంలో ఇప్పటికే ఆరుగురిని చంపేశాడు. ఈ క్రమంలో గుజరాత్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో అతడిపై హత్యానేరం కింద కేసులు నమోదయ్యాయి. కాగా గత నెల 25న దిలీప్ మధ్యప్రదేశ్‌లోని రాట్లాంలో చోరీకి పాల్పడ్డాడు. సెలూన్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ఇటీవలే భూమి విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ చోటీ దీవాళి రోజున తన గ్యాంగ్‌తో కలిసి వారింటికి వెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యులు వీరిని అడ్డగించడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. వారి ఆర్తనాదాలు వినబడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఇరుపొరుగు వారి దృష్టి మరల్చాడు. ఈ ఘటనలో కుటుంబ యజమాని, అతడి భార్య, కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. (చదవండి: భర్తను హత్య చేసిన భార్య) గాలింపు చర్యలు చేపట్టి దిలీప్ గ్యాంగ్‌లోని అనురాగ్ మెహర్(25), గౌరల్ బిల్వాల్(22), లాలా భాబోర్(20)లను అరెస్టు చేశారు. దిలీప్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దిలీప్ హతంకాగా, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ విషయం గురించి పోలీసులు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. దిలీప్ ‘సైకో కిల్లర్’ అని, దొంగతనాలు చేసిన తర్వాత బాధితులను హత్య చేసి రాక్షసానందం పొందేవాడని పేర్కొన్నారు. అతడి గ్యాంగ్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
చిన్ననాటి కోరిక.. 93 మందిని..!
వాషింగ్టన్: బాగా చీకటి పడిపోయింది. మియామీలో రూట్ 27 సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపేశాడు సామ్యూల్ లిటిల్. అప్పటికే తన మాటలతో మాయ చేసిన మేరీ బ్రోస్లేను దగ్గరికి తీసుకున్నాడు. తన నెక్లెస్‌తో ఆటాడటం మొదలుపెట్టాడు. మేరీకి మద్యం సేవించడం అంటే మహా ఇష్టం. ఆ అలవాటును వదల్లేక కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో మందు తాగుతూ బార్లో ఎంజాయ్ చేయడమంటే తనకు ఉన్న సరదానే మేరీని, సామ్యూల్‌తో మాటలు కలిపేలా చేసింది. మేరీ కాస్త పొట్టిగానే ఉన్నా.. చూడగానే ఆకట్టుకునే రూపం తనది. సుమారు 80 పౌండ్ల బరువున్న తన శరీరం ఆమె భోజనప్రియురాలు అన్న సంగతిని చెప్పకనే చెబుతుంది. మేరీకి దగ్గరగా జరుగగానే సామ్యూల్ ఒక విషయాన్ని గమనించాడు. ఆమె ఎడమ చేతికి చిటికిన వేలు లేదు. వంట చేస్తున్న చేస్తున్న సమయంలో వేలు తెగి పడిపోయిందన్న విషయం అప్పుడు మేరీ అతడికి చెప్పింది. జారి పడటం మూలాన తన నడుము భాగంలో సర్జరీ అయిన విషయాన్ని కూడా అతడితో పంచుకుంది. ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో తన గతం గురించి సామ్యూల్‌కు చెప్పింది. తనకు ఎవరూ లేరని, ఒంటరి మహిళనే విషయాన్ని తెలియజేసింది. మేరీని తదేకంగా చూస్తున్న సామ్యూల్‌కు ఈ మాట ఎంతో ఆనందాన్నిచ్చింది. పున్నమినాటి చంద్రకాంతి, అప్పటికే మెరిసిపోతున్న మేరీ మెడ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. పచ్చని పసిమి ఛాయ, మెడకు సరిపడా నెక్లెస్ సామ్యూల్‌ను ఆకర్షించాయి. అతడిలో దాగున్న రాక్షసుడు నిద్రలేచాడు. ఇంక ఆలస్యం చేస్తే లాభం లేదనుకున్నాడు. తనను తాను తమాయించుకోలేకపోయాడు. వెంటనే మేరీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా గొంతు నులిమి చంపేశాడు. ఊహించని పరిణామానికి కంగుతిన్న మేరీ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. 1970 నాటి ఘటన ఇది. అప్పటికి సామ్యూల్‌కు ఇంచుమించు 30 ఏళ్లు ఉంటాయి. మేరీకి 33. సైకో కిల్లర్ సామ్యూల్ బారిన పడ్డ మొదటి బాధితురాలు ఆమె. మేరీ తర్వాత సుమారు 93 మంది మహిళలను అలాగే చంపేశాడు సామ్యూల్. అందులో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉంది. ముప్పై ఏళ్లలో 19 రాష్ట్రాల్లో అతడు అనేక ఘాతుకాలకు పాల్పడ్డాడు. అయితే ఒక్కచోట కూడా తన వేలిముద్రలు గానీ, ఇతర సాక్ష్యాధారాలేవీ చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. డ్రగ్ బానిసలు, సెక్స్ వర్కర్లు, ఒంటరి మహిళలే అతడి లక్ష్యం. ఎవరూ లేని అనాథలు, అందునా నల్లజాతి మహిళలైతే మరీ మంచిది. ఎందుకంటే వారిని ఏం చేసినా అడిగే వారు ఎవరూ ఉండరనే ధైర్యం అతడిది. ఇక హత్యలతో పాటు చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేసే సామ్యూల్ అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. అలా ఒకానొక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష(లు) విధించింది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్ శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్ కేసుకు సంబంధించిన వివరాలు, అతడి గతం గురించి తెలుసుకునేందుకు వార్తా మాధ్యమాలు ఇంటర్వ్యూ అడుగగా అతడు నిరాకరించాడు. అయితే ఇటీవల బయటకు వచ్చిన సుమారు 700 గంటల వీడియోటేప్ ఇంటర్వ్యూ(పోలీసులతో)ల్లో సామ్యూల్ నేరం చేసిన విధానం గురించి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు పంచుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. చిన్న తనంలోనే తల్లి వదిలేసింది.. దక్షిణ అట్లాంటాకు సుమారు 100 మైళ్ల దూరంలో గల రెనాల్డ్స్(జార్జియా)లో 1940, జూన్ 7న సామ్యూల్ లిటిల్ జన్మించాడు. టీనేజర్ అయిన అతడి తల్లి పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లింది. అప్పటి నుంచి ఒహియోలో పెరిగిన సామ్యూల్‌కు ఒంటరితనం అలవాటైంది. ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్ తన మెడను రుద్దుకున్నపుడు గమనించిన అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలనే కోరిక పుట్టిందట. అప్పటి నుంచి తన పక్కనే ఉన్న సహ విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలం అయినట్లు సామ్యూల్ వెల్లడించాడు. ఇక పదమూడేళ్ల వయస్సులో తొలిసారిగా ఓ సైకిల్‌ను దొంగతనం చేయడం సహా పలుమార్లు దొమ్మీలకు పాల్పడటంతో అతడు జువైనల్ జైలులో జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత సీరియల్ కిల్లర్‌గా మారి పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు లాక్కోవడం, మృతదేహాలను పొదల్లో పడేసి అక్కడి నుంచి జారుకునేవాడు. ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘గతంలో నాకు మజా దొరికిన ప్రదేశాలకు వెళ్లి మళ్లీ మళ్లీ అదే తరహాలో హత్య చేయాలని ఉండేది. ఎన్నిపళ్లు కోసుకుని తింటే అంత మజా కదా. దానిని వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. శ్వేతజాతి టీనేజర్‌ను నేనెప్పుడూ వేధించలేదు. ఎవరూ లేని వాళ్లే నా టార్గెట్’’ అని పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సున్న సామ్యూల్, 2005లో చివరిసారిగా టుపెలోలో హత్య చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిపింది. మేరీ బ్రెస్లీ(శ్వేతజాతి మహిళ), మార్తా కన్నింగ్‌హాం(బ్లాక్ మదర్), మేరీ ఆన్ జెంకిన్స్, జొలాండా జోన్స్ సహా ఎంతో మంది సామ్యూల్ బాధితుల్లో ఉన్నారు. వీరిలో చాలా మంది మృతదేహాల్లో కొకైన్ వంటి మత్తుపదార్థాల నమూనాలు లభించడం గమనార్హం. అంతేగాక వారందరినీ అయితే కొంతమంది మాత్రం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక ఇప్పుడు సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు ఒప్పిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ సామ్యూల్ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి ఈ వయస్సులో కూడా పూసగుచ్చినట్లు వివరించడం శోచనీయం. -
‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు
టోక్యో: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తొమ్మిది మందిని హత్యచేసి ట్విట్టర్ కిల్లర్‌గా ప్రసిద్ధి చెందిన జపాన్ దేశస్తుడు తకాహిరొ షిరాయిషిను బుధవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్టు స్థానిక మీడియా తెలిపింది. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం. చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్ వాదించాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు తేలింది. అతడిపై హత్య కేసుతోపాటు అత్యాచారం కేసు నమోదయ్యింది. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే విషయంలో సాయం చేస్తానని, తాను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వారిని నమ్మబలికి హత్యలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలితే షిరాయిషికి ఉరిశిక్ష విధిస్తారు.(చదవండి: ‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) నిందితుడి తరఫు లాయర్ మాత్రం.. బాధితుల సమ్మతితోనే వారి చావుకు సహకరించాడని, అతడికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించాలని కోరాడు. అయితే అధికారులు మాత్రం ఈ వాదనలు సరైనవి కాదని, ఎటువంటి అనుమతి తీసుకోకుండానే హత్యలు చేశాడని వెల్లడించారు. బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి... అంటే దీని అర్థం సమ్మతి లేదని, వారు ప్రతిఘటించారని అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో షిరాయిషి హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను తెరవగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. షిరాయిషీతో ఆమె తరుచూ ట్విట్టర్లో సంప్రదించినట్టు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ట్విట్టర్‌కు గట్టి మనిషి) విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిని బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. అందులో ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను బాక్సుల్లో దాచి ఉంచాడు. ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్‌లోనే అధికంగా ఏడాదికి 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
‘అతడు వస్తాడు.. నీ గుండె, లివర్ తింటాడు’
చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటేనో.. చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్న సమయాల్లో సాధారణంగా తల్లులు ఏదో ఒక బూచిని చూపి వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా తల్లిదండ్రులు ఇలాంటి ధోరణే అవలంబిస్తారట. అయితే అక్కడి బూచోడికి ఓ పేరుంది. సీ ఓయే. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం మరణించిన అతడి శవాన్ని ఓ ఆస్పత్రి మ్యూజియంలో గాజు గ్లాసులో భద్రపరిచారు. అతడి గురించిన కథలు వింటే పెద్దవాళ్లకు సైతం వెన్నులో వణుకు రావాల్సిందే. అందుకే..‘‘సీ వస్తాడు. నీ లివర్ తినేస్తాడు’’అనగానే అల్లరి పిడుగులు కూడా కిమ్మనకుండా చెప్పిన మాట వింటారట. అయితే ‘సీ’ నిజంగానే అంతటి నరరూప రాక్షసుడా లేదా అకారణంగా శత్రుత్వ రాజకీయాలకు బలైపోయాడా అంటే మాత్రం స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మనిషి మాంసం తినేందుకు అలవాటు పడ్డ సీకి తగిన శిక్షే పడిందని కొంతమంది చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం అతడు అమాయకుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సీ ఎవరు? అరవై ఏళ్ల తర్వాత అతడి మృతదేహాన్ని దహనం చేసేందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? చైనా నుంచి వలస వచ్చి.. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. చైనాకు చెందిన సీ ఓయే తన దేశం తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జపనీస్ సేనలు తమ సైన్యాన్ని చుట్టముట్టిన వేళ ఎలాగోలా తప్పించుకున్న అతడు ఆకలికి తట్టుకోలేక తోటి సైనికుల మృతదేహాలను తిన్నాడు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం పందొమిదేళ్ల వయసులో 1946లో థాయ్‌లాండ్‌కు వలస వచ్చి ఓ ఇంట్లో తోటమాలిగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 1958లో రేయాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో ఎనిమిదేళ్ల బాలుడి శవాన్ని దహనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కిడ్నాపైన ఆ బాలుడి శరరీంలో కొన్ని అవయవాలు మిస్పయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఘటన జరగడానికి నాలుగేళ్ల ముందు అంటే 1954లో వివిధ ప్రాంతాల్లో కిడ్నాపైన ఐదుగురు పిల్లల హత్యకు సంబంధించి.. పెండింగ్‌లో ఉండిపోయిన కేసులకు కూడా సీనే కారణమని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. (5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష) చిన్న పిల్లల గుండె, కాలేయం తినేవాడు ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా.. చిన్న పిల్లలను హతమార్చి వారి గుండె, కాలేయం, పేగులు తినడం తనకు అలవాటు అని సీ వెల్లడించినట్లు మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 1959లో ముప్పై రెండేళ్ల వయసులో సీనిని కాల్చి చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం సిరిరాజ్ ఆస్పత్రికి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడి ఫోరెన్సిక్ మ్యూజియంలో గాజు గ్లాసులో ‘‘కానిబెల్(స్వజాతి మాంసాన్ని భక్షించేవాడు)’’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు. ఇక అప్పటి నుంచి సీ జీవితం ఆధారంగా ఎన్నో హారర్ సినిమాలు తెరకెక్కాయి. పుస్తకాల్లో అతడి కథ గురించి కొంతమంది రచయితలు ప్రస్తావించారు. అయితే ఈ కేసుల్లో నిజంగానే సీ నిజంగానే దోషి అనడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదు. కఠిన చర్యలు.. అరవై ఏళ్ల తర్వాత అంత్యక్రియలు ఈ నేపథ్యంలో అందరు పిల్లల్లాగానే తాను కూడా సీ ఓయే గురించి బాల్యంలో కథలు విన్న ఫరా చక్రపత్రనన్ అనే వ్యక్తికి మాత్రం ఎందుకో ఈ విషయాలు నమ్మబుద్ధికాలేదు. చైనా- థాయ్‌లాండ్ మధ్య శత్రుత్వం కారణంగా థాయ్ మిలిటరీ ప్రభుత్వం అప్పట్లో చైనీస్ వలసదారులను అకారణంగా శిక్షలకు గురిచేసేదని, జైలులో బంధించేదనే కథనాలు.. ఫరాను సీ గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేశాయి. అంతేగాకుండా మిస్సయిన పిల్లలంతా ఒకే విధంగా చనిపోలేదనే విషయం కూడా అతడి మెదడును తొలచివేసింది. ఏదేమైనా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాడు కాబట్టి సీని ‘కానిబెల్’ అని పేర్కొంటూ ఇంకా అతడి మృతదేహాన్ని మ్యూజియంలో ఉంచడం సరైన చర్య కాదని భావించాడు. అందుకే.. చనిపోయిన వ్యక్తికి కనీసం శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకోవాలంటూ 2018లో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందుకు మరికొంత మంది కూడా తోడు కావడంతో సిరిరాజ్ ఆస్పత్రి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని గతేడాది జూన్‌లో కానిబెల్ ట్యాగ్‌ను తొలగించి.. ఆగస్టులో సీ మృతదేహాన్ని మ్యూజియం నుంచి వేరే చోటుకు మార్చింది. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం గురువారం ఎట్టకేలకు సీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. తొమ్మిది మంది బౌద్ధ సన్యాసుల సమక్షంలో సీ శవపేటిక ముందు మంత్రాలు పఠిస్తూ, కాగితపు పూలు జల్లి శ్మశానానికి తరలించారు. కరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ అతడి శవానికి నిప్పు అంటించారు. సీ ఓయే అమాయకుడు ఈ విషయం గురించి ఫరా మాట్లాడుతూ.. ‘‘నేను మ్యూజియంకు వెళ్లినపుడు అతడిని చూశాను. అప్పటి వరకు ఓ మాన్ ఈటర్గానే తను నాకు తెలుసు. కానీ ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అతడు ఓ బాధితుడు అనిపించింది. నేరం చేశాడో లేదో తెలియదు గానీ గాజు గ్లాసులో దశాబ్దాల తరబడి బొమ్మగా మిగిలిపోయాడు. అతడి హక్కులు హరించివేయబడ్డాయి అనిపించింది. అందుకే ఈ పిటిషన్ దాఖలు చేశా’’ అని చెప్పుకొచ్చారు. ఇక సీ ఓయేకు తోటమాలిగా పని ఇచ్చిన దంపతుల కూతురు వనప్ప తాంగ్చిన్.. తన కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం సీ ఓయే ఓ అమాయకుడని పేర్కొన్నారు. అతడిని తమ కుటుంబంలో ఒకడిగా భావించేవారని.. అంతటి హేయమైన నేరానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయామని చెప్పుకొచ్చారు. తమ గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, ఎట్టకేలకు అతడి అంత్యక్రియలు నిర్వహించడం ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. -
సీరియల్ కిల్లర్ జూలీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, కోజికోడ్ : కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జూలీని కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ హతమార్చింది. అంతేకాకుండా కట్టుకున్న భర్త రాయ్ థామస్‌ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. అయితే కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. (14 ఏళ్లు.. 6 హత్యలు) కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సైనైడ్ పదార్థమిచ్చి అమ్మాయిలను దారుణంగా..
మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్ చేసి ఆపై హత్య చేసిన సీరియల్ కిల్లర్' సైనైడ్' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్ మోహన్.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్ చేసి హతమార్చాడు. కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్లో పోలీసులకు పట్టుబడిన మోహన్ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. -
అంతా అబద్ధం.. అసలు నాకు మగతనం లేదు
నల్లగొండ: ‘అంతా అబద్ధం సార్.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరి కించా రు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం’అంటూ హాజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి విని పించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. ‘సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు’అని న్యాయమూర్తి అడగగా ‘నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు’అంటూ సమాధానం చెప్పాడు. నీ తరఫున సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ‘మా అమ్మానాన్నలను పిలిపించండి’అంటూ సమాధానం చెప్పాడు. వారు ఎక్కడున్నారని అడగ్గా, వారి అడ్రెస్ కూడా తెలియదని తెలిపాడు. ‘నువ్వు ఇంతకుముందు పనిచేసిన వారి అడ్రస్ ఇవ్వు.. పిలిపిస్తాము’అని న్యాయమూర్తి అడగ్గా వారి అడ్రస్ కూడా లేదని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నువ్వు పని చేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్ తెలియకుండానే పనిచేశావా అని అడగ్గా, ‘తెలియదు, మా అమ్మానాన్ననే పిలిపించాలి ’అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు . వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అసలు నాకు మగతనం లేదు.. ‘నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు’కదా అని న్యాయమూర్తి అడగ్గా ‘అంతా అబద్ధం.. నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు’అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. ‘మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు’అన్నప్పుడు ‘నాకు మగతనం లేదు’అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని ‘నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు కదా’అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు. మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. ‘నీకు నాలుగైదు ఫోన్ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్ సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి’అని అడగ్గా నిందితుడు ‘నాకు చిన్న ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లేదు.’అని చెప్పాడు. భూమి అమ్మలేదని కేసు పెట్టారు.. పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలోనూ నిందితుడు.. అంతా అబద్ధం, పోలీసులు కావాలని చేశారని సమాధానం చెప్పాడు. , నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు’.. అని అడగ్గా ‘మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు’అని చెప్పడం గమనార్హం. -
నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు
ప్రతిచిన్న అంశాన్నీ బూతద్దంలో చూడటం.. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించడం.. అతనిపై నిఘా పెట్టడం.. అవసరమైతే నయానో భయానో నిజం రాబట్టడం.. పోలీసుల నిత్యకృత్యం. అయితే సైనైడ్ కిల్లర్ సింహాద్రి విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా పది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాధితులే కిల్లర్ ఇల్లు చూపించినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను కూడా కిల్లర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైనైడ్ కిల్లర్‌ను ప్రస్తుత పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా.. గతంలో ఉన్న పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఏలూరు టౌన్: ప్రసాదంలో సైనైడ్ పెట్టి వరుస హత్యలతో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సింహాద్రి అలియాస్ శివ కేసులో విస్మయం కలిగించే వాస్తవాలు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. హత్యల విచారణలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం హత్యల పరంపరకు తోడ్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో ఫైనాన్స్ కంపెనీ గుమస్తా చోడవరపు సూర్యనారాయణ హఠాత్తుగా మృతిచెందాడు. ఇది కిల్లర్ సింహాద్రి చేసిన ఐదో హత్య. ఇది హత్యేనని సూర్యనారాయణ కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇదే అదనుగా కిల్లర్ సింహాద్రి మరో ఐదు ప్రాణాలు బలితీసుకున్నాడు. చదవండి : సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు బంధువునని నమ్మించి.. ఏలూరు వన్‌టౌన్ వంగాయగూడెం నీరజ్కాలనీలో నివాసం ఉండే చోడవరపు సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు ఫైనాన్స్ కంపెనీలో గుమస్తా. దగ్గర బంధువుని అంటూ కిల్లర్ సింహాద్రి పరిచయం చేసుకుని బావా అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. సూరిబాబు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములు ఉండటాన్ని సింహాద్రి గమనించి డబ్బులు రెట్టింపు చేస్తానంటూ ఆశజూపించాడు. 2018 ఏప్రిల్ 14న వంగాయగూడెంలోని బాలాజీ స్కూల్ వద్దకు రప్పించి, సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి హత్య చేశాడు. రూ.5 లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలను దోచేశాడు. రెండో హత్యతోనే ఆగేది! కృష్ణా జిల్లా నూజివీడు మండలం మర్రిబంద గ్రామానికి చెందిన పులపు తవిటయ్యను 2018 మార్చి 2న సింహాద్రి హతమార్చాడు. సింహాద్రి హత్యల పరంపరలో ఇది రెండోది. డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి ప్రసాదంలో సైనైడ్ పెట్టి తినిపించి హత్య చేసి, రూ.8 లక్షలతో ఉడాయించాడు. మృతుడి బంధువులు తొలుత గుండెపోటుగా భావించినా తవిటయ్య వద్ద డబ్బు లేకపోవటంతో అనుమానం వచ్చింది. సింహాద్రిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రూ.8 లక్షల నగదు వెనక్కి ఇప్పించి సెటిల్మెంట్ చేశారనే అపవాదు ఉంది. ఫిర్యాదు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు, సింహాద్రిని అరెస్ట్ చూపలేదు. అప్పుడే పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే మరో ఎనిమిది ప్రాణాలను కాపాడి ఉండేవారు. 8వ హత్యలోనూ వైఫల్యమే.. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన వరుసకు వదిన సామంతకుర్తి నాగమణి హత్యలోనూ పోలీసులు ఇదే తరహాలో సింహాద్రిని విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నాగమణిని డబ్బులు రెట్టింపు చేస్తానంటూ నమ్మించటంతో ఆమె కొందరు వ్యక్తుల వద్ద అప్పు చేసిన తెచ్చిన రూ.5 లక్షలు, ఒంటిమీద బంగారు నగలు తీసుకుని సింహాద్రి పరారయ్యాడు. నాగమణి హత్య అనంతరం పోలీసులకు సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారించమని చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా నాగమణికి అప్పులు ఇచ్చిన వ్యక్తిపై హత్య నేరం మోపేందుకు సైతం సింహాద్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రాములమ్మ కుమారుడి ఫిర్యాదు సీరియల్ కిల్లర్ సింహాద్రిపై ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఏలూరు హనుమాన్‌నగర్‌లో సింహాద్రి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని రాములమ్మను ప్రసాదంలో సైనైడ్ కలిపి హత్య చేసి, ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. రాములమ్మ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటూ సింహాద్రి హత్యకు పాల్పడ్డాడు.తండ్రి విజయవాడ కుమారుడి వద్దకు వెళ్లిన రోజు ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా సైనైడ్ పెట్టి హత్య చేసినట్లు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐదు ప్రాణాలు దక్కేవి? ఏలూరు వంగాయగూడెం నీరజ్కాలనీకి చెందిన చోడవరపు సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు అనే వ్యక్తి సీరియల్ కిల్లర్ సింహాద్రి హత్యల చిట్టాలో ఐదో వ్యక్తి. సూరిబాబు 2018 ఏప్రిల్ 14న రాత్రి 9 గంటల సమయంలో బాలాజీ స్కూల్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. తొలుత గుండెపోటుగా భావించిన కుటుంబ సభ్యులకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. సూరిబాబు వద్ద రూ.5 లక్షల నగదు, బంగారు ఉంగరాలు లేకపోవటంతో అనుమానం మరింత పెరిగింది. ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం కూడా ఆరు నెలలు పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోతున్నారు. సుమారుగా 15 నెల లు పోలీసుల చుట్టూ తిరిగినా, అనుమానితుడు సింహాద్రి ఇంటిని చూపించినా పో లీసులు పట్టించుకోలేదని అంటున్నారు. ఒక్కసారీ విచారించలేదు నా భర్త సూరిబాబు చనిపోతే గుండెపోటు అనుకున్నాం. డబ్బులు, బంగారు ఉంగరాలు లేకపోతే అను మానం వచ్చింది. వెల్లంకి సింహాద్రిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. సింహాద్రి ఎన్టీఆర్ కాలనీలో చర్చికి వెళతాడనీ, అక్కడే ఒక ఇంట్లో ఉంటాడని పోలీసులకు చెప్పడంతో పాటు మా బంధువులు వెళ్లి చూపించారు. అయినా సింహాద్రిని ఒక్కసారి కూడా పోలీసులు విచారించలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సింహాద్రి అప్పట్లో తప్పించుకున్నాడు. మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నా. –సత్యవతి, మృతుడు సూరిబాబు భార్య, ఏలూరు పోలీసులు నిర్లక్ష్యం వహించారు మా బాబాయ్ సూరిబాబు చనిపోయిన తర్వాత సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేశాం. అతడిని విచారించాలని పలుమార్లు మొత్తుకున్నాం. 15 నెలల పాటు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఆ రోజు రాత్రి 8.40 నిమిషాల వరకూ మాతో మాట్లాడిన సూరిబాబు హఠాత్తుగా చనిపోవటం, డబ్బులు, బంగారం లేకపోవటంతో మాకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. అతని ఇల్లు కూడా చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. సూరి బాబు పనిచేసే ఫైనాన్స్ కంపెనీకి సింహాద్రి పలుమార్లు వచ్చేవాడని ఫైనాన్స్ వాళ్లు కూడా చెప్పారు. –ప్రసాదు, మృతుడు సూరిబాబు బంధువు, ఏలూరు పోలీస్ కస్టడీకి కోరాం పది హత్యల నిందితుడు వెల్లంకి సింహాద్రిని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు వినతి చేశాం. సింహాద్రి ఈ జిల్లాలోనే కాకుండా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడు. హత్యల వెనుక కారణాలు ఏమిటనేది విచారణ చేసి తెలుసుకుంటాం. ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయని మృతుల బంధువుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడతాం. కొందరు గుండెపోటుతో మృతిచెందారని భావించిన మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయలేదు. –డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ఏలూరు డీఎస్పీ -
సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు
సాక్షి, తూర్పు గోదావరి: సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..? నూజివీడు తవిటయ్య కుటుంబం ‘సాక్షి ఫేస్ టు ఫేస్’లో చెప్పిన సంచలన వాస్తవాలను ఇక్కడ చూడండి ప్రసాదంలో సైనైడ్ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.. సైనైడ్ సీరియల్ కిల్లర్ శివ అలియాస్ సింహాద్రి.. ఈ హత్యల్లో తన రియల్ ఎస్టేట్ పరిచయాలను వాడుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి వద్ద డబ్బు ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టి.. తనను తాను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్-గా పరిచయం చేసుకొని వారిని నమ్మించాడు. ఆ తర్వాత పూజలు, రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో వారు డబ్బు బయటికి తెచ్చేలా చేసి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించాడు... శివ చేసిన నాలుగో హత్యే ఇందుకు ఉదాహరణ.. తూర్పుగోదావరి జిల్లా ముస్తానాబాద్ పొలాల్లో బాలవెంకటేశ్వర్రావును హతమార్చాడు.. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి -
సైనైడ్ సీరియల్ కిల్లర్‌పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
రైస్ పుల్లింగ్ యంత్రాలతో సైనైడ్ సీరియల్ కిల్లర్ మోసం
-
సైనైడ్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు
-
ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు
ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు. గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీఈటీ హత్యతో వెలుగులోకి.. ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్‌లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హతుల వివరాలివీ.. వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ). -
‘దేవుడి ప్రసాదం’ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు
సాక్షి, పశ్చిమగోదావరి : సులువుగా డబ్బులు సంపాందించాలనే దురుద్దేశంతో ఓ వ్యక్తి దేవుడి ప్రసాదం పేరుతో ఘోరాలకు పాల్పడ్డాడు. విషం కలిపిన ‘దేవుని ప్రసాదం’ ఇచ్చి అమాయక భక్తుల ప్రాణాలు తీసేవాడు. వారు చనిపోయిన తర్వాత నగదు, బంగారం దోచుకుపోయేవాడు. ఇలా 8 హత్యలకు పాల్పడిన కిరాతక సీరియల్ కిల్లర్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు చంపిన వ్యక్తుల్లో ఎక్కువమంది అతని బంధువులే ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అక్టోబరు 16న ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) అనుమానస్పద మృతితో.. ఈ సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం బయటపడింది. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దోచుకున్న డబ్బుతో నిందితుడు ఇల్లు కట్టుకున్నాడని సమాచారం. -
ప్రసాదమిచ్చి.. ప్రాణాలు తోడేశాడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రైం థ్రిల్లర్‌ను తలపించే రియల్ స్టోరీ ఇది. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ ఓ వ్యక్తి ఐదేళ్లలో 8 మందికి విషం కలిపిన ప్రసాదం తినిపించి హతమార్చిన వైనం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం అదిరిపడ్డారు. అతడు సాగించిన సీ‘రియల్’ హత్యలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. పూజల పేరిట మాయ చేసేవాడు. ఫలానా పూజ చేయిస్తే అపర కోటీశ్వరులు కావచ్చని, ఓ రకమైన నాణేన్ని దగ్గర ఉంచుకుంటే రాజకీయ పదవులు సైతం వరిస్తాయని నమ్మించేవాడు. పూజలు ఫలించక.. అతడిచ్చే నాణేలు పని చేయట్లేదని గుర్తించి నిలదీసిన వ్యక్తులకు ఈసారి పెద్ద గుడిలో పూజ చేయించానని చెప్పి ప్రసాదమిచ్చేవాడు. అందులో విషం కలపటంతో దాన్ని తిన్న వ్యక్తులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. సదరు కిల్లర్ కొందరు ధనవంతులకు మహిళలను ఎరవేసి డబ్బులు సైతం వసూలు చేసేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. మొదట బుకాయించినా.. నాగరాజు మరణంతో తనకెలాంటి సంబంధం లేదని సదరు కిల్లర్ బుకాయించగా.. చివరకు విషం కలిపిన ప్రసాదం తినిపించి నాగరాజు ప్రాణాలు తీసినట్లు అంగీకరించాడు. అతడి ఒంటిపై గల బంగారు ఆభరణాలు, డబ్బును తానే తీసుకున్నట్టు చెప్పాడు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా.. విస్మయకరమైన విషయాలను బయటపెట్టాడు. తాను చేసిన మోసం బయటపడిన సందర్భాల్లో సంబంధిత వ్యక్తులను పెద్ద ఆలయాలు, పెద్ద స్వాముల వద్ద పూజలు చేయించినట్లు నమ్మించి ప్రసాదంలో కలిపిన విషాన్ని తినిపించి హతమార్చిన విషయాలను బయటపెట్టాడు. తానిచ్చిన విషం తిన్న బాధితులు కొంతసేపటికే మరణించే వారని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు హార్ట్‌అటాక్‌తో చనిపోయినట్లు భావించేవారని కిల్లర్ చెప్పాడు. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చి నగదు, బంగారం దోచుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. మృతుల్లో ఐదుగురు సీరియల్ కిల్లర్ బంధువులేనని సమాచారం. కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ విచారణను ముమ్మరం చేశారు. నిందితుడు గతంలో చేసినట్లుగా చెబుతున్న హత్యల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులను కూడా ఛేదించిన తర్వాత నిందితుణ్ణి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పీఈటీ హత్యతో వెలుగులోకి.. సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) హత్యతో వెలుగు చూసింది. ఏలూరు అశోక్ నగర్‌లోని కేపీడీటీ పాఠశాల పీఈటీ కాటి నాగరాజు (49) ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతడు మరణించగా, గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. ఐతే, నాగరాజు వేరే వారికి ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, అతని ఒంటిపై గల నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో త్రీటౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపించగా.. విషం కలిసిన ఆహారం తినడం వల్ల మరణించినట్లు నివేదిక వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతునితో చివరగా ఫోన్ మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటికొచ్చింది. -
పోలీసులకు సీరియల్ కిల్లర్ సవాల్..!
తిరువనంతపురం : ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని హతమార్చిన కిరాతక మహిళ జూలీ అమ్మా జోసెఫ్ కేసుపై కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ సవాల్‌తో కూడుకున్నదని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల క్రితం మొదటి హత్య, మూడేళ్ల క్రితం ఆరో హత్య జరిగిన నేపథ్యంలో ఆధారాల సేకరణ క్లిష్టంగా మారిందని అన్నారు. అయినప్పటికీ కేసు సమగ్ర విచారణకు ఆరు బందాల్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలు జూలీ, ఆమెకు సెనైడ్ సప్లై చేసిన ఎం.ఎస్ మాథ్యూ, జ్యూయెలరీ స్టోర్ మేనేజర్ ప్రజూ కుమార్‌లు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తన మొదటి భర్త రాయ్ థామస్ హత్య కేసులో కింది కోర్టు గురువారం ఈ ముగ్గురికీ రిమాండ్ విధించింది. ఆరు రోజుల పోలీసులు కస్టడీలో ఉన్న నిందితుల్ని పోలీసులు పలుమార్లు విచారించారు. జూలీ రెండో భర్త షాజు కూడా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి :14 ఏళ్లు.. 6 హత్యలు) ఆరు కేసులు వేటికవే ప్రత్యేకం.. ‘ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి’అని డీజీపీ బెహ్రా వెల్లడించారు. ఈ హత్యలపై శుక్రవారం 5 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అనుమానం కలిగిందిలా.. తన భర్త రాయ్ థామస్ 2008 ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు జూలీ అల్లిన కథను అందరూ నమ్మారు. అయితే, ఇక్కడే ఆమె పథకం పారలేదు. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే తన అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడంపై అమెరికాలో ఉండే అతని సోదరుడు మోజోకు అనుమానం వచ్చింది. దాంతోపాటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటంతో మోజో అనుమానం మరింత బలపడింది. అతని ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడుతున్నాయి. పూర్తి ఆధారాల సేకరణ అనంతరం కేసు కొలిక్కి రానుంది. -
93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!
సాక్షి, న్యూఢిల్లీ : సామ్యూల్ లిటిల్‌కు ఇప్పుడు 79 ఏళ్లు. తీవ్రంగా కనిపించే అయన ముఖంలో అప్పుడప్పుడు మాత్రమే నవ్వు ఛాయలు కనిపిస్తాయి. ఆయన గడిపిన శృంగార జీవితాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ ఛాయల్ని చూడవచ్చు. ఒకప్పుడు ఆయన బాక్సర్. అందుకు తగినట్లుగానే ఆయనది దృఢమైన కాయం. ఆయన ఒక్క చేతితో గుద్దాడంటే చాలు, ఆ క్షణంలో అవతలి వారి ప్రాణం పోవాల్సిందే. అలాగే ఆయన 93 మందిని హత్య చేశాడు. వారంతా ఆడవాళ్లే. వారిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారే, వారిలో కొంత మంది జీవితంలో బాగా దెబ్బతిన్న వాళ్లు కూడా ఉన్నారు. వారందరితో శృంగారంలో గడిపిన తర్వాతే సామ్యూల్ వారిని హత్య చేసేవాడు. ఇల్లు, వాకిలి కూడా లేకుండా చిల్లర దొంగతనాలు చేసే ఆయన తాను శృంగార జీవితాన్ని నెరపుతున్న ఆడవారి మీదనే ఆధారపడి బతికే వాడట. ఆయన ఎక్కువగా హత్యలు చేసిందీ అమెరికాలోని లాస్ ఏంజెలిస్, మియామీలలో. దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్ సహా 19 రాష్ట్రాలకు ఆయన హత్యలు విస్తరించాయి. ఆయన ఆడవాళ్లను నగ్నంగా చేసి శృంగారం అనంతరం వారిని హత్య చేసి రోడ్డు పక్కన చెత్త కుండీల్లో, కాల్వల్లో అలాగే నగ్నంగా పడేసే అలవాటు ఆయనది. కొంత మంది పేర్లు తెలుసుకోకుండానే ఆయన వారితో సెక్స్‌లో పాల్గొని హత్య చేశాడట. అయితే ఎక్కువ మంది బాధితుల ముఖ కవలికలు, వారి వొంపు సొంపులు ఇప్పటికీ ఆయన బాగా గుర్తున్నాయి. కొత్త వారితో సెక్స్ నెరపడానికి పాత ప్రేయసిలు అడ్డు అవుతారనే ఉద్దేశంతోనే ఆయన వారిని వరుసగా హత్యలు చేస్తూ వచ్చాడట. అమెరికా చరిత్రలోనే ఎక్కువ మందిని చంపిన సీరియల్ కిల్లర్‌గా ఇప్పుడు అక్కడి పోలీసులు ఆయన్ని గుర్తిస్తున్నారు. ఇంతవరకు ఈ కిరాతక రికార్డు లారీ డ్రైవర్ గేరి రిడ్జ్‌వే పేరిట ఉండింది. ‘గ్రీన్ రివర్ కిల్లర్’గా పేరు పొందిన అతను 1980 నుంచి 1990 దశకంలో 49 హత్యలు చేశాడు. ఆ తర్వాత మరో 20 హత్యలు చేసినట్లు తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును కిరాతక కిల్లర్ సామ్యూల్ లిటిల్ అధిగమించాడు. ఇప్పుడు సామ్యూల్ లిటిల్ కూడా తాను చేసిన 93 మంది మహిళల హత్యల్లో 50 హత్యలను ఒప్పుకున్నాడు. పైగా వారందరి బొమ్మలను గీసి చూపించాడు. దాంతో ఇప్పటి వరకు అంతుచిక్కని హత్యలు, మహిళల అదశ్య సంఘటనల చిక్కు ముడులు విడి పోతున్నాయి. ఇంకో 43 హత్యల కేసులను ఆయన అంగీకరించాల్సి ఉంది. వారి పేర్లు లేదా కనీసం వారి ముఖాలు కూడా ఆయనకు గుర్తు లేకపోవడమే ఆయన నేరం అంగీకరించక పోవడానికి కారణం. 1980 దశకంలో జరిగిన ముగ్గురు మహిళల హత్య కేసుల్లో సామ్యూల్ లిటిల్‌కు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో పెరోల్ కూడా లేకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా అంతు చిక్కని హత్యల గురించి ఆయన నుంచి కూపీ లాగేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. 1994లో టెక్సాస్‌లో డెనైస్ బ్రదర్స్ అనే 38 ఏళ్ల వేశ్య హత్య జరిగింది. అది సామ్యూల్ లిటిల్ చేశాడని అనుమానం ఉన్నా పోలీసులు రుజువు చేయలేక పోయారు. పాత నేరస్థులతోని నేరాన్ని ఒప్పించడంలో విశేష అనుభవం ఉన్న అమెరికా పోలీసు అధికారి జేమ్స్ హాలండ్ దష్టికి ఈ కేసు పరిశోధన నిమిత్తం గతేడాది వచ్చింది. గత మే నెలలో ఆయన సామ్యూల్‌ను మొదటి సారి కలుసుకొని విచారించారు. కానీ ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేక పోయారు. పదే పదే ఆయన్ని విచారించడం ద్వారా ఒక్కొక్క కేసు వివరాలను రాబట్టగలిగారు. తనను ‘సెక్స్ ప్రిడేటర్’ అని తనను అనవసరంగా ముద్ర వేస్తున్నారని, తాను హంతకుడిని మాత్రమేనని ఆయన చెప్పుకునానడు. తాను ఇంతవరకు ఏ అమ్మాయిని రేప్ చేయలేదని, ఇష్ట పూర్వకంగానే అమ్మాయిలు తనతో గడిపారని సామ్యూల్ వివరించాడు. ఇప్పుడు సామ్యూల్‌ను ఎప్బీఐ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఆ ఇంటరాగేషన్ వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు. -
అమెరికా సీరియల్ కిల్లర్ స్కోరు 50 పైనే!!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌గా పేరుపడ్డ శామ్యూల్ లిటిల్(79)... హతమార్చిన వారి స్కోరు 50 పైనేనట. దర్యాప్తు అధికారుల ఎదుట చెప్పినదాని ప్రకారం శామ్యూల్ ఏకంగా 93 హత్యలకు పాల్పడ్డాడు. అయితే, అతడు చెప్పిన ఆధారాల ప్రకారం 50 హత్యల్లోనే అతడి ప్రమేయం ఉంది. హతుల్లో అత్యధికులు మహిళలే. ఇవన్నీ 1970–2005 మధ్య చేసినవే. కొందరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. మూడు హత్యలకు శిక్ష పడటంతో 2014లో శామ్యూల్ జైలు పాలయ్యాడు. ‘ఎప్పటికీ దొరకనని శామ్యూల్ అనుకునేవాడు. అన్ని హత్యల గురించీ దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎఫ్‌బీఐ అధికారి క్రిస్టీ పలాజొలో చెప్పారు. శామ్యూల్ ఒకప్పుడు బాక్సర్. 2012లో కెంటకీ పోలీసులకు అతడు దొరికిపోయాడు. -
అన్నం పెట్టలేదని ఓ సీరియల్ కిల్లర్..
సాక్షి, చెన్నై : ఊరి చివరన ఉన్న తోటలను టార్గెట్‌గా చేసుకుని ఓ సీరియల్ కిల్లర్ హత్యలకు పాల్పడ్డాడు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి నిరాకరించిన ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరుకు.. మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పలువురు హత్యకు గురయ్యారు. గత ఏప్రిల్ 20వ తేదీ ఏళుమలైకు చెందిన వెల్లస్వామి తన తోటలో హత్యకు గురయ్యాడు. గత మే 30వ తేదీ లింగనాయకన్‌పట్టికి చెందిన అయ్యర్ దేవర్ తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యల గురించి ఉసిలంపట్టి, ఏళుమలై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. ఇలా ఉండగా గత నాలుగవ తేదీన విక్రమంగళం సమీపాన బాల్‌స్వామి అనే వ్యక్తి తన తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలన్ని ఒకే రకంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక విచారణ చేపట్టారు. విక్రమంగళం ప్రాంతములో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తేని జిల్లా కంభం సమీపాన గల గోవిందన్‌పట్టికి చెందిన వేల్మురుగన్ (48)గా తెలిసింది. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్టు విచారణలో బయటపడింది. రాత్రి వేళ ఆకలి వేస్తే ఊరు చివరగా ఉండే తోటలకు వెళ్లి అక్కడ తోటమాలిలను అడిగేవాడు. ఆహారం లేదని చెప్పిన వారిని హతమారుస్తూ వచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వేల్మురుగన్ను అరెస్టు చేశారు. విచారణలో 2002 సంవత్సరం ఉసిలంపట్టిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో అతను జైలు శిక్ష అనుభవించి 2015లో విడుదలైనట్టు తెలిసింది. -
బెంగాల్ పోలీస్ కస్టడీలో సీరియల్ కిల్లర్
-
వీడు ఉత్తరాది ‘శ్రీనివాస్‌రెడ్డి’
కోల్‌కతా : తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకో, సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన దారుణాలు తల్చుకుంటే.. ఇప్పటికి ఒళ్లు జలదరిస్తుంది. చిన్నారులను, యువతులను దారుణంగా చంపి వారి శవాలతో పశువాంఛ తీర్చుకున్న వైనం సామాన్యులతో సహా పోలీసులను కూడా కలవరపెట్టింది. ఇలాంటి సైకోనే ఒకడు పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సైకిల్ చైన్, ఇనుప రాడ్‌తో మహిళలను చంపి.. రక్తంలో తడిసిన వారి శరీరాలతో తన పశువాంఛ తీర్చుకునేవాడు. ఇలా ఇప్పటికి ఐదుగురు మహిళల్ని దారుణంగా హతమార్చాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. పశ్చిమ బెంగాల్ బర్డ్వాన్ జిల్లాకు చెందిన కమ్ముర్జమాన్ సర్కార్(42) చిరు వ్యాపారి. మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకుని దారుణాలకు పాల్పడేవాడు. కరెంట్ బిల్లులు పేరుతో ఇంట్లో ప్రవేశించేవాడు. అదును చూసి మహిళ తల మీద ఇనుప రాడ్‌తో బాదేవాడు. అప్పటికి వారు చనిపోకపోతే.. మెడకు సైకిల్ చైన్ బిగించి హత్య చేసేవాడు. అనంతరం ఆ మృతదేహాలతో తన వికృత కోరిక తీర్చుకునే వాడు. 2013 నుంచి ఇలాంటి దారుణాలు జరుపుతుండగా.. గత నెలలో ఇతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. గత నెల 21న గోరా గ్రామంలో ఓ మహిళను ఇలాగే అంతమొందించి పోలీసులకు చిక్కాడు. విచారణలో అతని దారుణాలు ఒక్కోటి వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి ఇప్పటి వరకూ ఇదే విధంగా నలుగురు మహిళలు హత్యకు గురయ్యారు. వాటిలో సర్కార్ పాత్ర గురించి పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. ఆ హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం హత్య చేసిన ఇంటి నుంచి కొన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లేవాడినని.. దాంతో అందరి దృష్టి దొంగల మీదకు వెళ్లేదని సర్కార్ విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకూ సర్కార్ చేతిలో బలైన వారంతా మధ్యవయసు మహిళలే కావడం గమనార్హం. సర్కార్‌కు వివాహం అయ్యిందని.. ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యతో గొడవల నేపథ్యంలోనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతన్ని 12 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. -
మా పిల్లల ఉసురు తీశాడు..
సాక్షి, యాదాద్రి: ‘కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం.. రెక్కాడితేగాని కడుపు నిండని మా జీవితాల్లో ఆరని చిచ్చుపెట్టాడు. ముక్కు పచ్చలారని పిల్లల ఉసురు తీశాడు. కాయకష్టం చేసుకుని జీవించే ప్రశాంతమైన మా ఊరి పరువు బజారులో పెట్డాడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ మానవ మృగాన్ని అప్పగిస్తే నిలువునా కాల్చి బూడిద చేస్తాం. హైదరాబాద్‌కు చేరువలో ఉన్నా బస్ సౌకర్యం లేని మా ఊరి దుస్థితిని పాలకులు పట్టించుకోరా..’అని హాజీపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో హత్యల ఉదంతంపై మంగళవారం పలువురిని ‘సాక్షి’పలకరించింది. గ్రామస్తుల్లో ఎక్కడ లేని ఆవేదన, ఆక్రోశం, భయం వ్యక్తమైంది. తమ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలను చంపి బావిలో బొందపెట్టిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. మాలోనే ఉన్నాడని తెల్వలే.. ‘శ్రీనివాస్‌రెడ్డి తనకున్న భూమిలో అద్దెకరం అమ్మి ఊరి చివరన 6 నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పసిపిల్లల ప్రాణాలు దారుణంగా తీసిన వాడి ఇల్లు ఊరంతా కలసి తగులబెట్టాం. అ ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఏం పని చేస్తాడో ఎవరికి తెల్వదు. శ్రావణి బావిలో శవమై కనిపించిన రోజు మాతోపాటే ఉన్నాడు. బావిలోకి ఇలా దిగాలి, అలా దిగాలి అని చెప్తుంటే ఆ మానవ మృగం మాలోనే ఉన్నాడని గుర్తించలేకపోయాం..’అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది ఊరివాడేనని తెలియడంతో వారంతా భయంతో వణికిపోతున్నారు. వ్యవసాయ పనులు, ఉపాధి పనులు చేసుకుని జీవించే తాము బయటకు వెళ్లాలంటే భయంతో హడలిపోతున్నామని చెప్పారు. గ్రామానికి బస్సులు రాకనే.. ‘మా గ్రామానికి బస్సులు సరిగా రావు. బొమ్మలరామారం నుంచి గ్రామానికి ఆటోలోనే రావాలి. ఒక్కరు ఆటోలో వస్తే 100 రూపాయలు తీసుకుంటారు. లేదంటే కాలినడకన రావాల్సిందే. ఈసీఐఎల్ నుంచి గ్రామానికి వచ్చే బస్‌లు పరిమితంగా వచ్చి ఇక్కడి నుంచే వెళ్లిపోతాయి. మధ్యాహ్నం బస్సులుండవు. హాజీపూర్–మైసిరెడ్డిపల్లి మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే భువనగిరి–ఈసీఐఎల్ మధ్యన బస్‌లు ఎక్కువ ట్రిప్పులు తిప్పవచ్చు కానీ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం చేయడం లేదు. బస్‌లు సకాలంలో వస్తే మా పిల్లలు మేము సురక్షితంగా ఇల్లు చేరుతాం.’అని గ్రామస్తులు తమ సమస్యలు వివరించారు. గ్రామంలోని బెల్టు షాపుల మూసివేత, మత్తుమందుల అమ్మకం అరికట్టేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బహిరంగంగా ఉరితీయాలి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలి. గ్రామంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. పోలీసులు సకాలంలో పట్టించుకుంటే ఇంతదాకా రాకపోయేది. మా కూతురు కనపడకుండా పోయినప్పుడే మేం ఫిర్యాదు చేశాం. అయినా అప్పుడు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాడికి శిక్షను బహిరంగంగానే అమలు చేయాలి. నేరాలు చేయాలంటే బయపడే విధంగా శిక్షలుండాలి. –భాగ్యమ్మ (కల్పన తల్లి), మైసిరెడ్డిపల్లి తలుచుకుంటేనే భయం వేస్తోంది కూలీనాలీ కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తుంటాం. ఇలాంటి సంఘటనలు బయట పడుతుంటే భయం వేస్తోంది. ఇంట్లో ఉండి బతుకు సాగించలేం. హత్యలకు కారణమైన శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. –పరిద సత్తెమ్మ, హాజీపూర్ గంజాయి అమ్మకం ఆగాలి గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతోనే యువకులు చెడిపోతున్నారు. ఈ హత్యలు కూడా గంజాయి తాగి చేసినవే. వెంటనే గ్రామంలో గంజాయి నిర్మూలన చేయాలి. ఊరిని కాపాడాలి. –ఊట్ల మనీల, హాజీపూర్ -
మనిషికాదు మానవ మృగం
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో వెలుగుచూసిన సీరియల్ హత్యలకు నాలుగేళ్ల కిందే బీజం పడింది. సాధారణ మెకానిక్‌లా బయటికి కనిపించే శ్రీనివాసరెడ్డిలో ఇంతటి క్రూరమైన నరరూప రాక్షసుడు దాగున్నాడన్న విషయం తెలిసి గ్రామస్తులే ఆశ్చర్యపోతున్నారు. శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వం మొదట్లో అంత అనుమానాస్పదంగా ఉండేది కాదు. కానీ.. కొన్నేళ్లుగా అతని వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయి. డ్రగ్స్‌కు బానిసైన శ్రీనివాసరెడ్డి సెక్స్ అడిక్ట్గానూ మారాడు. నాలుగేళ్ల క్రితం కల్పన అనే అమ్మాయిని చంపేశాడు. ఆ తర్వాత వరుసగా హత్యలకు పాల్పడుతున్నాడని సమాచారం. మేనత్త ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న కల్పన అనే చిన్నారిపై అత్యాచారం జరిపి ఇదే బావిలో పూడ్చిపెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా బావిలో లభించిన ఎముకలకు డీఎన్ఏ టెస్టు ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. సరిగా దర్యాప్తు చేయని పోలీసులు 2015 ఏప్రిల్‌లో కల్పన(11) మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. మూడేళ్లపాటు దర్యాప్తు చేసిన తరువాత ఈ కేసును ఇటీవలే మూసేశారు. ఇది శ్రీనివాస్ రెడ్డిలో మృగాన్ని రాక్షసుడిగా మార్చింది. ఆ కేసులో సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు విఫలమవడంతో శ్రీనివాస్‌రెడ్డి తన నేరాలను కర్నూలుకు విస్తరించాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తూ.. మత్తుపానీయాలకు బానిసయ్యాడు. కర్నూలులో అద్దె ఇంట్లో ఉంటూ ఓ మహిళను తన గదికి తీసుకువచ్చి ఆమెపై అత్యాచారం చేసి చంపి కాలువలో పడేశాడు. ఆ తర్వాత హాజీపూర్‌కు పారిపోయి వచ్చాడు. దీనిపై విచారణ చేపట్టిన కర్నూలు పోలీసులు శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసినా.. కల్పన విషయం పసిగట్ట లేకపోయారు. బెయిల్‌పై వచ్చాక కూడా హైదరాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేశాడు. ఈ పనులు చేస్తున్న క్రమంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తోటి మెకానిక్‌లు అతన్ని పనిలోంచి తొలగించారు. దీంతో అప్పుడప్పుడు పనికి వెళ్తూ.. ఎక్కువ సమయం ఇంటివద్దే ఉంటున్నాడు. శ్రీనివాస్‌రెడ్డికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు ఉన్నాడు. గ్రామంలోనూ మహిళలను లైంగికంగా వేధించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అదే బావి వద్ద పలుమార్లు శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాళం చెవి మరిచానని చెప్పి! మహిళలను వేధించినందుకు.. గ్రామస్తులు దేహశుద్ధి చేస్తుండటంతో శ్రీనివాస్‌రెడ్డి తిరిగి తన పాత విధానానికే మొగ్గు చూపాడు. బొమ్మల రామారం–హాజీపూర్ రోడ్డు పక్కనే గుబురు చెట్ల నడుమ రెండు పాడుబడిన వ్యవసాయ బావులున్నాయి. అప్పుడప్పుడు తిరిగే ఆటోలు, ద్విచక్రవాహనాలు, కాలిబాటన వెళ్లే కొద్దిపాటి జనం, ఎప్పుడోగాని రాని ఆర్టీసీ బస్‌లు ఇలాంటి రోడ్డు పక్కన నిర్మానుష్యంగా గుబురు చెట్లపొదల్లో గల వ్యవసాయ బావులను ఆ కిరాతకుడు తన అఘాయిత్యాలకు అడ్డాగా ఎంచుకున్నాడు. బొమ్మలరామారం నుంచి హాజీపూర్, మైసిరెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లడానికి బస్సులకోసం ఎదురు చూసే బాలికలను టార్గెట్ చేసి తన బైక్‌పై ఎక్కించుకుంటాడు. మార్గమధ్యంలో వ్యవసాయ బావి వద్దకు రాగానే.. ఇంటి తాళంచెవి బావి దగ్గర ఉందని బైక్‌ను ప్రధాన రోడ్డునుంచి దారి మళ్లిస్తాడు. గుబురు చెట్ల మధ్యన గల బావుల వద్దకు రాగానే.. నువ్వంటే నాకిష్టమని తనకు సహకరించాలని మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యతిరేకించినవారిని బావిలోకి తోస్తాడు. బావిలో పడి తీవ్రగాయాలైన వారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేస్తాడు. మృతదేహాన్ని అక్కడే బావి లో పూడ్చి పెడతాడు. ఎవరికి అనుమానం రాకుండా వారి బ్యాగులను బావిలో విసిరేసి ఊర్లోకి వెళ్తాడు. మరింత లోతుగా దర్యాప్తు ఈ కేసు నేపథ్యంలో ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. కేవలం హాజీపూర్ గ్రామస్తులేనా? లేక ఇతరులనూ కూడా ఈ బావి వద్దకు తీసుకువచ్చి చంపాడా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏమైనా బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికల అత్యాచారం హత్యలో స్కూల్ బ్యాగులే నిందితుడిని పట్టించాయి. శ్రావణి స్కూల్ బ్యాగ్ బావిలో గుర్తించడంతో అనుమానం కలిగి గ్రామస్తులు బావిలోకి దిగి వెతకడంతో శ్రావణి మృతదేహం బయటపడింది. దీంతో పోలీస్‌లు చేపట్టిన విచారణలో శ్రీనివాస్‌రెడ్డి నిజాలు ఒక్కొక్కటి చెప్పడంతో మనీషా, కల్పన మృతదేహాలు బయటపడ్డాయి. మత్తు, జాప్యం వల్లే దొరికాడు? పక్కా పథకం ప్రకారం.. మార్చి 9న మనీషాను తన బైకుపై (లిఫ్ట్ ఇస్తానని) కీసర నుంచి హాజీపూర్‌కు తీసుకొచ్చే క్రమంలో బండి ఎక్కిం చుకున్నాడు. అక్కడ బైకు నిలిపి, మనీషాను బావిలో తోశాడు. తరువాత బావిలోకి దిగి అపస్మారక స్థితిలో ఉన్న మనీషాపై అత్యాచారం చేసి చంపి పాతిపెట్టాడు. అయితే, మనీషా (17) విషయంలో శ్రీనివాసరెడ్డి చాలా జాగ్రత్తగా మృతదేహాన్ని ఆ బావిలోనే అక్కడే పూడ్చడం, ఆమె తల్లిదండ్రులు మనీషా అదృశ్యంపై ఫిర్యాదు చేయకపోవడం నిందితుడికి కలిసొచ్చింది. ఏప్రిల్ 25న శ్రావణి(14)ని కూడా అదేవిధంగా పొట్టనబెట్టుకున్నాడు. కానీ, ఆరోజు అతిగా మద్యం సేవించడం.. హత్య ముగిసేసరికి తెల్లవారడంతో ఆమెను పాతిపెట్టలేకపోయాడు. తీరిగ్గా వచ్చిపాతిపెడదామనుకున్నాడు. కానీ, ఉదయం గ్రామంలోకి చేరుకునేసరికి, అంతా శ్రావణి కోసం వెతకడం, అనూహ్యంగా బావిలో శవాన్ని గుర్తించడం చకచకా జరిగిపోయాయి. శ్రావణి మృతదేహాన్ని తీస్తుంటే శ్రీనివాస్‌రెడ్డి తనకేం తెలియనట్లుగా చూశాడు. శ్రీనివాస్ రెడ్డి చేసిన అత్యాచారం, హత్య దారుణాలివే! 1. 2015లో 6వ తరగతి విద్యార్థిని కల్పనపై... 2. అదే ఏడాది మైసిరెడ్డిపల్లి గ్రామంలో వివాహితపై అత్యాచార యత్నం 3. 2016లో కర్నూలులో మహిళపై... 4. 2019 మార్చిలో డిగ్రీ విద్యార్థిని మనీషాపై... 5. 2019 ఏప్రిల్‌లో 9వ తరగతి విద్యార్థిని శ్రావణిపై... -
సీరియల్ కిల్లర్ ఇంటికి నిప్పు!
’సాక్షి, యాదాద్రి/బొమ్మలరామారం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు, సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై ఆయన సొంతూరు హాజీపూర్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి ఇంటిని గ్రామస్తులు, బాధిత కుటుంబాలు మంగళవారం ధ్వంసం చేశారు. ఇంట్లోని సామాన్లను ఒకదగ్గరికి చేర్చి నిప్పుపెట్టారు. ఈ నరరూప రాక్షసుడిని బహిరంగంగా ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ఉన్న ఆస్తిని బాధితులకు పంచాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేస్తుండగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గ్రామస్తులు తిరగబడ్డారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండడంతో మరింత మంది పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితిని ఓ కొలిక్కివచ్చింది. బావివద్ద మిన్నంటిన రోదనలు చుట్టుపక్కల ఊళ్లలోని ముగ్గురు బాలికల మృతదేహాలు బయటపడడంతో మర్రిబావి వద్ద బాధితుల రోదనలు మిన్నంటాయి. ఈ అత్యాచారం, హత్య వివరాలు వెల్లడవడంతో.. బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్, మైసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో బావివద్దకు చేరుకున్నారు. బాధితుడు అత్యంత పాశవికంగా వ్యవహరించిన తీరును ఊహించుకుంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి మర్రిబావిలోనుంచి కల్పన అస్తికలు, ఆమె బ్యాగ్, టిఫిన్‌బాక్స్ తదితర వస్తువులను బయటకు తీశారు. ‘సాక్షి’కథనంపై విచారణలో.. మైసిరెడ్డి పల్లికి చెందిన తుంగం కల్పన బొమ్మల రామారం యూపీఎస్‌లో 6 వతరగతి చదువుతోంది. రోజు వారీ మాదిరిగానే పాఠశాల నుంచి ఇంటికి రావడానికి బస్‌కోసం ఎదురచూస్తున్న కల్పనను శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకు వచ్చి అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. శ్రావణి హత్య కేసు విచారణ జరుగుతుండగానే.. 2015లో కనిపించకుండా పోయిన కల్పన ఆచూకీ ఏమైందంటూ ‘సాక్షి’లో కథనం వచ్చింది. ఆ దిశగా పోలీస్‌లు విచారణ చేపట్టగా కల్పనపై అత్యాచారం, హత్య విషయాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావుతోపాటు పోలీస్, రెవెన్యూ, మెడికల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 4 గంటలపాటు శ్రమించి మర్రిబావిలోంచి కల్పనకు చెందిన ఎముకలు, దుస్తులు, టిఫిన్ బాక్స్‌ను బయటకు తీశారు. కల్పన తల్లిదండ్రులు బావిలో లభించిన దుస్తులు, టిఫిన్ బాక్స్ తమ కూతురువేనని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల కోసం ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సీరియల్ కిల్లర్ అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 17న నవాబ్‌పేట పీఎస్ పరిధిలో రాజాపూర్ మండలం చొక్కంపేట్ గ్రామానికి చెందిన కటిక బాలరాజు (50)ను హత్య చేసిన ఘటనపై నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి మహ్మద్ యూసుఫ్ అలియాస్ ఇసాక్‌ను బుధవారం కుల్కచర్ల మండలం చౌడపూర్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరాల ప్రకారం.. రాజాపూర్ మండలం చొక్కంపేట్‌కి చెందిన మృతుడు కటిక బాలరాజుకు తక్కువ ధరకు గొర్రెలను ఇప్పిస్తానని నిందితుడు మహ్మద్ యూసుఫ్ ఫిబ్రవరి 17న నవాబ్‌పేట శివారుకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత బాలరాజు కంట్లో కారంపొడి చల్లి హత్య చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.14 వేలు తీసుకొని పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. యూసుఫ్‌పై 12 హత్య కేసులు, ఐదు దొంగతనం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో వికారాబాద్ హత్య కేసులో, హైదరాబాద్‌లోని 2 దొంగతనాల కేసులో మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. యూసుప్ నుంచి 4 బైక్‌లు, 3 సెల్ఫోన్లు, రూ.2,500 నగదు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ రివార్డులతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, జడ్చర్ల సీఐ బాలరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నరబలి చేస్తాడని ప్రచారం.. అమాయక ప్రజలను, కూలీలను ఎంపిక చేసుకొని వారిని మహ్మద్ యూసుఫ్ అపహరించి ధనం కోసం నరబలి చేస్తుంటాడని ప్రచారం సాగుతోంది. నరబలి చేస్తే ధనం దొరకుతుందనే మూఢనమ్మకంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన హత్యలు అన్నింటినీ వాటికోసమే చేసినట్లు సమాచారం. -
నన్ను వదిలేస్తే మరికొందరిని చంపుతా..!
ముంబై : మొక్క మహావృక్షంగా ఎదగాలంటే మూలాలు బాగుండాలి. అలానే మనిషి ఉన్నతంగా ఎదగాలంటే పెంపకం బాగుండాలి. మరీ ముఖ్యంగా బాల్యం. అమ్మనాన్నల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కరువైతే.. ఎదిగాక మనిషి ఎలా మారతాడనే దానికి ఉదాహరణగా నిలిచాడు విఠల్ భజంత్రి(26). కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన భజంత్రి 12 ఏళ్ల వయసులో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో కూలీగా చేరాడు. ఆ సమయంలో వయసులో ఇతనికంటే పెద్దవారైన లేబర్స్ భజంత్రికి డ్రగ్స్ ఇచ్చి అతని మీద లైంగిక దాడి చేశారు. ఈ భయంకరమైన అనుభవాలు అతని మనసులో అలానే గూడుకట్టుకుపోయాయి. వీటి నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాడు.. కుదరలేదు. గట్టిగా మాట్లాడ్డానికి కూడా ఇష్టపడని భజంత్రి.. ఎవరైనా తనను తిడిడే మాత్రం తట్టుకోలేకపోయేవాడు. అంత సేపు ప్రశాంతంగా ఉన్న అతనిలో మృగం మేల్కోనేది. ఆ కోపంతో తనను హేళన చేసిన వారిని చంపేసేవాడు. ఇలా ఇప్పటికి 5గుర్ని అంతమొందించాడు. అయితే చంపడానికి ఆయుధాలు కాకుండా.. బండరాయిని వాడేవాడు. మొదటి హత్య 2017, అక్టోబర్‌లో చేశాడు. తనను, తన స్నేహితున్ని తిట్టిన ఓ లేబర్ని బండరాయితో కొట్టి చంపాడు. ఓ నెల తిరక్కముందే మరో హత్య చేశాడు. బలహీనంగా ఉన్నావంటూ హేళన చేసిన మరో లేబర్ని నవంబర్ 7, 2017న హత్య చేశాడు. ఇతన్ని కూడా బండరాయితోనే కొట్టి చంపాడు భజంత్రి. మూడోసారి ఏకంగా తన సోదరి భర్తనే చంపేశాడు. ఒక రోజు తన సోదరి, ఆమె భర్త గొడవపడుతుండటం చూశాడు భజంత్రి. ఆ కోపంలో తన బావను నవంబర్ 12, 2017న అతన్ని చంపేశాడు. కానీ ఈ సారి పోలీసులకు చిక్కాడు భజంత్రి. డిసెంబర్ 6, 2017న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఒక సంవత్సరం పాటు జైలులో గడిపిన తరువాత 2018, డిసెంబరులో బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే పోలీసులకు కేవలం మూడో హత్య గురించే తెలుసు. మొదటి రెండింటి గురించి తెలియదు. దాంతో త్వరగానే బెయిల్ దొరికింది. కానీ మొదటి రెండు హత్యల గురించి భజంత్రి స్నేహితుడు సూరజ్‌కు తెలుసు. దాంతో అతన్ని చంపాలని పథకం పన్నాడు భజంత్రి. అందులో భాగంగా పని ఉందని చెప్పి స్నేహితున్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో కలిసి సూరజ్‌ని చంపేశాడు. ఈ హత్య జనవరి 4, 2019న జరిగింది. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సూరజ్‌ను చంపిన వ్యక్తి కర్ణాటకలో ఉంటున్నట్లు తెలిసింది. దాంతో అతన్ని అరెస్ట్ చేయడానికి గుల్బర్గా వెళ్లారు పోలీసులు. అతన్ని విచారించగా భజంత్రి గురించి తెలిసింది. ఇతను ఇంతకు ముందే ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వాచ్చడని నిర్ధారించుకున్న పోలీసులు భజంత్రి గురించి వెతకడం ప్రాంరభించారు. ఈ క్రమంలో గత నెల 19న ఓ హైవే మీద నడుచుకుంటూ వెళ్లున్న భజంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా భజంత్రి తాను చేసిన ఐదు హత్యల గురించి పోలీసులకు తెలియజేశాడు. అంతేకాక కామ్‌గా ఉండే తనని ఎవరైనా హేళన చేస్తే మృగంగా మారతానని.. వారిని చంపేవరకూ ఊరుకోనని తెలిపాడు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనను ఇలా మార్చాయని వెల్లడించాడు. మద్యం తాగితే తాను కంట్రోల్లో ఉండనన్నాడు. మంచిగా మారడానికి ప్రయత్నించానని.. సాధ్యం కాలేదని తెలిపాడు. తనను జైలు నుంచి బయటకు పంపిస్తే మరింత మందిని చంపుతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం భజంత్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతను చేసిన ఐదు హత్యల్లో నలుగురి మృతదేహాలు పోలీసులకు లభించాయి. మరోక హత్య గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు. -
రేప్‌లకు ఫలితం ఇదే. రేపిస్ట్‌లూ జాగ్రత్త..!
ఢాకా: హెర్క్యులస్.. ఈ పేరు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మారుమ్రోగుతోంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ సినిమా గుర్తుందా?. ఆ సినిమాలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని పెట్రోల్ పోసి తగలపెడతాడు హీరో. అలాంటివాడే ఈ హెర్క్యులస్. గత రెండు వారాల వ్యవధిలో.. ముగ్గరు ‘గ్యాంగ్ రేప్’ నిందితులు హత్యకు గురయ్యారు. వారిని హత్య చేసిన విధానం ఒకేలా ఉంది. మృతదేహాల మెడలో, వారు చేసిన నేర వివరాలున్న కాగితం ఉంది. ఫిబ్రవరి 1న పోలీసులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మదరసాలో చదివే ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేసినవారిలో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తి మృతదేహమది. ‘నా పేరు రాకిబ్. నేనో రేపిస్ట్‌ను. మదరసాలో చదివే ఓ యువతిని రేప్ చేశా’ అని మృతదేహం మెడలోని కాగితంలో రాసిఉంది. ‘రేప్‌లకు ఫలితం ఇదే. రేపిస్ట్‌లూ జాగ్రత్త – హెర్క్యులస్’ అనే మరో వాక్యం ఉంది. అదే గ్యాంగ్ రేప్లో పాల్గొన్న మరో నిందితుడు సాజల్ మృతదేహాన్ని జనవరి 24న పోలీసులు గుర్తించారు. అంతకుముందు, ఓ పరిశ్రమ కార్మికురాలిని గ్యాంగ్‌రేప్ చేసిన నిందితుడి మృతదేహం ఇదే స్థితిలో లభ్యమైంది. దీంతో పోలీసులు హెర్క్యులస్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
సీరియల్ కిల్లర్‌కు ఉరిశిక్ష అమలు
బీజింగ్ : చైనా ‘జాక్ ద రిప్పర్’గా పేరొందిన సీరియల్ కిల్లర్ గావో చింగ్‌యాంగ్(54)ను ఉరి తీసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో 11 మంది మహిళలను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఆ నేరస్తుడికి గురువారం మరణశిక్ష అమలైందని పేర్కొంది. దీంతో బాధితుల తరఫు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించింది. అలా పట్టుబడ్డాడు.. తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. గావో చింగ్‌యాంగ్ విషయంలోనూ అదే జరిగింది. నేరాలు చేసి మారువేషాల్లో తిరిగే గావోతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నేర ప్రవృత్తి కలవారే. ఒక హత్య కేసులో అరెస్టయిన గావో రక్తసంబంధీకుడి డీఎన్ఏ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టించింది. దీంతో 28 ఏళ్లుగా పోలీసులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. 11 మంది మహిళలను హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్‌కు బేయిన్ సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడిన గావోకు మరణశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టు పేర్కొంది. సమాజానికి హానికారకంగా తయారైన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అప్పీలుకు వెళ్లే అర్హత కూడా లేదంటూ వ్యాఖ్యానించింది. చైనా రిప్పర్.. గావో గావో చింగ్‌యాంగ్‌కు మహిళలంటే ద్వేషం. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలను వెంబడించి, వారి గొంతు కోసేవాడు. తర్వాత వారిపై అత్యాచారాలకు పాల్పడి.. శవాలను ముక్కలు ముక్కలు చేసి రాక్షసానందం పొందేవాడు. 1988- 2002 మధ్య కాలంలో 11 మంది ఆడవాళ్లను ఇదేరీతిలో హత్య చేశాడు. బాధితుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులకు చిక్కకుండా గావో సుమారు మూడు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగాడు. అతని కోసం గాలించి విసుగు చెందిన పోలీసులు.. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల యువాన్ల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఇక వైట్ చాపెల్ మర్డరర్‌గా ప్రసిద్ధి చెందిన లండన్‌కు చెందిన జాక్ రిప్పర్ సీరియల్ కిల్లర్. ఇతడిపై ఐదుగురు మహిళలను హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు. Gao Chengyong, a serial killer and rapist known as China’s “Jack the Ripper,” was executed on Thursday after the Supreme People's Court approved his death sentence. Gao raped and murdered 11 women in northwest China between 1988 and 2002 and was arrested in 2016. pic.twitter.com/EufudHpkDz — People's Daily, China (@PDChina) January 3, 2019 -
గొంతు కోసి.. శవాల్ని ముక్కలు చేసి..
బీజింగ్ : తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. చైనాకు చెందిన సీరియల్ కిల్లర్ గావో చింగ్‌యాంగ్ విషయంలోనూ అదే జరిగింది. నేరాలు చేసి మారువేషాల్లో తిరిగే గావోతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నేర ప్రవృత్తి కలవారే. ఒక హత్య కేసులో అరెస్టయిన గావో రక్తసంబంధీకుడి డీఎన్ఏ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టించింది. దీంతో 28 ఏళ్లుగా పోలీసులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. అత్యంత పాశవికంగా 11 మంది మహిళలను హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్‌కు బేయిన్ సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడిన గావోకు మరణశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టు పేర్కొంది. సమాజానికి హానికారకంగా తయారైన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అప్పీలుకు వెళ్లే అర్హత కూడా లేదంటూ వ్యాఖ్యానించింది. చైనా రిప్పర్.. గావో చైనా జాక్ ద రిప్పర్‌గా పేరొందిన గావో చింగ్‌యాంగ్‌కు మహిళలంటే ద్వేషం. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలను వెంబండించి, వారి గొంతు కోసేవాడు. తర్వాత శవాలను ముక్కలు ముక్కలు చేసి రాక్షసానందం పొందేవాడు. 1988- 2002 మధ్య కాలంలో 11 మంది మహిళలను ఇదేరీతిలో హత్య చేశాడు. బాధితుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులకు చిక్కకుండా గావో సుమారు మూడు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగాడు. అతని కోసం గాలించి విసుగు చెందిన పోలీసులు.. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల యువాన్ల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఇక వైట్ చాపెల్ మర్డరర్‌గా ప్రసిద్ధి చెందిన లండన్‌కు చెందిన జాక్ రిప్పర్ సీరియల్ కిల్లర్. ఇతడిపై ఐదుగురు మహిళలను హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు. -
ఆర్మీ మాజీ ఉద్యోగి ఘాతుకం.. 2 గంటల్లో ఆరు హత్యలు
ఛండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఏ కారణం లేకుండానే ఓ వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా హతమార్చాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పల్వాల్లో ఈ ఉదయం వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. రాడ్‌తో సంచరించిన ఆ వ్యక్తి పలువురిపై దాడి చేశాడు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఆదర్శ్ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవటంతోనే అతను ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. మృత దేహాలను పోస్ట్‌మార్టంకు పంపిన పోలీసులు.. ఓ మహిళతోపాటు, ముగ్గురు వాచ్మెన్లు మృతుల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో హై అలెర్ట్ విధించిన పోలీసులు.. నిందితుడిని ఫరిదాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హంతకుడు మాజీ ఆర్మీ ఉద్యోగి కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఆర్మీ మాజీ ఉద్యోగి నరేష్ ధన్కర్గా పోలీసులు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా విధులు నిర్వహించిన నరేష్ 2003లో వీఆర్ఎస్ తీసుకుని మూడేళ్ల తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేరాడు. కలహాలతో భార్య కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం భివానీలో ఆయన ఎస్డీవోగా పని చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆయన ఈ హత్యాకాండకు దిగగా.. ఉదయం 4గంటలలోపే ఆరుగురిని చంపేశారు. ఎట్టకేలకు ఉదయం 7 గంటలకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన పోలీసులపై కూడా రాడ్‌తో దాడికి పాల్పడ్డాడంట. అయితే పోలీసులు అతికష్టం మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నరేష్ భార్య, కొడుకును కూడా చంపేందుకు ఫ్లాన్ గీసుకున్నాడని పోలీసులు చెప్పారు. -
భయానకం: ఆ గది నిండా తలలు, మొండాలు
టోక్యో : సీరియల్ కిల్లర్ ఉదంతం వెలుగు చూడటంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పండింది. టోక్యోకు నైరుతి ప్రాంతంలో ఉన్న జమా పట్టణంలో ఓ అపార్ట్మెంట్లో తల, మొండాలే వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జమాలోని ఆ అపార్ట్మెంట్ లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగలకొట్టి సోదాలు చేశారు. ఓ కూలర్ బాక్స్ లో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. లోపలికి వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు దర్శనమిచ్చాయి. అక్కడ కొన్ని కూలర్ బాక్స్‌లలో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న కొన్ని మృతదేహాలు వారి కంటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీపరుచుకున్న పోలీసులు.. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డారు. మొత్తం 9 మృతదేహాలు లభ్యమైనట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మైనిచి షింబన్ అనే పత్రిక కథనం ప్రచురింది. అయితే మిస్సయిన యువతి సూసైడ్ నోట్ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్లో కనిపించిన ఫుటేజీలు దర్శనమివ్వటంతో... ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని సదరు కథనం తెలిపింది. -
ఆ దంపతులు.. నరమాంస భక్షకులు!
-
ఆ దంపతులు.. నరమాంస భక్షకులు!
మాస్కో : ఆ భార్యాభర్తలు నరమాంస భక్షకులు. మనుషులను ఎలాగైనా సరే హత్యచేసి వారి అవయవాలను హాయిగా భుజించడం గత కొన్నేళ్లుగా వీరి పని. కానీ మొబైల్లో తీసుకున్న సెల్ఫీలే వీరి నిర్వాకాన్ని బట్టబయలు చేశాయి. దీంతో భార్యాభర్తలు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దిమిత్రి భక్షీవ్ 35 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్య నటాలియాతో కలిసి రష్యాలోని క్రాస్నోడర్ నగరంలో నివసిస్తున్నాడు. అయితే ఈ దంపతులు గత కొన్నేళ్లుగా వ్యక్తులను చంపి వారిలో తమకు నచ్చిన అవయవాలను తింటున్నారు. పండ్ల మాదిరిగానే మృతదేహాల అవయవాలను వాటి మధ్యలోపెట్టి తినేవారు. ఈ క్రమంలో తమ ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం వీరికి అలవాటు. ఈ క్రమంలో దిమిత్రి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తనకు దొరికిన ఫోన్‌ను ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఫోన్లో డాటా చెక్ చేయగా మృతదేహాల అవయవాలు లేకపోవడం, ఇద్దరు భార్యాభర్తలు ఏదో తింటున్నట్లు కనిపించడంతో మాస్కో పోలీసులు వీరిని అనుమానించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తాము కేవలం ఇద్దరినే హత్యచేసినట్లు అంగీకరించారు. కానీ 1999 నుంచి భర్త, ఆపై ఇద్దరు కలిసి దాదాపు 30 మందిని హత్యచేసి వారి అవయవాలు తిన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఇంటి సెల్లార్లో మరిన్ని మృతదేహాలను పోలీసులు గుర్తించారు గత నెలలో క్రాస్నోడర్లో ఓ మహిళను దిమిత్రి భక్షీవ్, నటాలియాను హత్యచేసినట్లు రుజువైంది. హత్యకుగురైన వారిలో కేవలం ఏడుగురిని మాత్రమే పోలీసులు గుర్తించారు. తమ విచారణలో పూర్తి విషయాలు బయటకొస్తాయని వారు వివరించారు. గతంలో ఫిలిప్పీన్స్‌లో, దుబాయ్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. హత్యచేసి వారి మాంసాన్ని ఫ్రీజ్‌లో పెట్టుకుని తిన్న ఘటనలు గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. -
ఆమె కోసం వేట
♦ జల్లెడపడుతున్న పోలీసులు ♦ సీరియల్ కిల్లర్ హత్యలపై ఆరా ఇంతకీ ఆమె ఎవరు? ఒక హంతకుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పెద్ద ఎత్తును చేపట్టిన గాలింపు చర్యలతో కె.గంగవరం మండలంలో ఒక్క సారిగా అలజడి రేకెత్తించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున చేపట్టిన పోలీసుల గాలింపులతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. తూర్పు గోదావరి : భక్తి ముసుగులో మహిళలను లోబరుచుకుని వారిని హతమార్చిన సీరియల్ కిల్లర్ సంఘటన నాలుగు నెలల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఒక మహిళ హత్య కేసులో దొరికిన సీరియల్ కిల్లర్ సలాది లక్ష్మీనారాయణను రాజోలు పోలీసులు ఈ ఏడాది జనవరిలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అతను చేసిన హత్యలు ఒక్కోక్కటిగా బయటపడ్డాయి. కె.గంగవరం మండలం దంగేరుకు చెందిన దుర్గ అనే మహిళను కూడా లోబరుచుకుని హత్య చేసినట్లు లక్ష్మీనారాయణ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడపట్టారు. దంగేరుకు చెందిన దుర్గ అనే మహిళ నాలుగు నెలల క్రితం అదృశ్యమైనట్టు తెలుసుకోని పోలీసులు ఆరా తీశారు. అలాగే దంగేరు శివారు చిట్టూరివారిపాలెంకు చెందిన ఒక దుర్గ మూడేళ్లుగా విదేశాలు వెళ్లి తిరిగి రాలేదనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరించారు. అయితే ఆమె హంతకుడు చెబుతున్న మహిళ కాదని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే రామచంద్రపు రంలోని ముచ్చిమిల్లి రోడ్లు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో గాలిస్తున్నా రు. దంగేరు పరిసర గ్రామాలకు చెందిన దుర్గ అనే పేరు గల మహిళను లక్ష్మీనారాయణ హత్య చేయడం వాస్తవమని, అయితే ఆమె ఆచూకీ లభ్యంకావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళ కోసం ఇప్పటికే దంగేరు చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు విచారించారు. రామచంద్రాపురం సీఐ శ్రీధర్కుమార్తో పాటు మండపేట టౌన్ సీఐ, మండపేట, రామంచద్రపురం, ఆలమూరు, ఆనపర్తి, అంగర ఎస్సైలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఆచూకీ తెలపండి హంతకుడు లక్ష్మీనా రాయణ చేతిలో హ తమైన దుర్గ ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రామచంద్రపురం సీఐ శ్రీధర్‌కుమార్, కె.గంగవరం ఎస్సై నరేష్ తెలిపారు. దంగేరు చుట్టు ప్రక్కల గ్రామాల్లో దుర్గా అనే పేరు గల మహిళ 2014–15లో అదృమై ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందిస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. -
సీరియల్ కిల్లర్ అరెస్టు
భక్తి ముసుగులోమహిళలకు వల ఐదుగురిని హతమార్చిన కామాంధుడు మిస్సింగ్ కేసు విచారణలో పట్టుబడిన కేదారిలంక యువకుడు రాజోలు: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హతమారుస్తున్న సీరియల్ కిల్లర్‌ను తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామానికి చెందిన సలాది లక్ష్మీనారాయణ.. వేంకటేశ్వరుడు,, కనకదుర్గమ్మ కథలు చెబుతూంటాడు. మాయమాటలతో మహిళలను లోబర్చుకుని, జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన తర్వాత క్రూరంగా హత్య చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజోలు పోలీస్ సర్కిల్ నగరం స్టేషన్ పరిధిలోని మామిడికుదురు గ్రామానికి చెందిన చేవూరి భాగ్యవతి ఈ నెల 8వ తేదీ నుంచి అదృశ్యమయ్యింది. పోలీసుల విచారణతో లక్ష్మీనారాయణ నారాయణ చేసిన వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో మామిడికుదురు వచ్చిన అతను వేంకటేశ్వరుని కథ చెప్పాడు. అప్పట్నుంచీ భాగ్యవతితో పరిచయం పెంచుకున్నాడు. గతంలోలాగే మాయమాటలతో నమ్మించి ఈ నెల 8న ఆమెను ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, వెలాపులంక మధ్య జనసంచారం లేని ఇసుక దిబ్బల వద్దకు తీసుకువెళ్లి అతిక్రూరంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం జేబు రుమాలును గొంతుకు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నెక్లెస్‌తో పాటు చెవిదిద్దులు, కాళ్ల పట్టీలు, సెల్‌ఫోన్ అపహరించాడు. భాగ్యవతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతని ఘాతుకాలు వెలుగుచూశాయి. 2012లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరిలంకకు చెందిన ఆకుల నాగమణిని, 2014లో యానాంకు చెందిన సత్యవతిని, అదే ఏడాదిలో దంగేరుకు చెందిన ఒక వివాహితను, 2015లో మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతి అలియాస్ బుజ్జిని లక్ష్మీనారాయణ ఇదే తరహాలో హతమార్చాడు. వారి బంగారు ఆభరణాలను దొంగిలించి, మృతదేహాలను అక్కడే వదిలేసేవాడు. భాగ్యవతి మృతదేహాన్ని పిచ్చుకలంక ఇసుక దిబ్బల వద్ద గురువారం గుర్తించిన పోలీసులు లక్ష్మీనారాయణను అదేరోజు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
గూగుల్ మేనేజర్‌ను చంపిందీ సీరియల్ జాగర్ కిల్లరా?
న్యూయార్క్: గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా మర్కోటి (27) హత్య జరగడానికి ఐదు రోజుల ముందే న్యూయార్క్‌లో స్పీచ్ పాథలోజిస్ట్గా పనిచేస్తున్న 30 ఏళ్ల కరీనా వెట్రానో కూడా జాగింగ్‌కు వెళ్లినప్పుడే హత్యకు గురయ్యారు. ఇద్దరు ఆకర్షణీయమైన యువతులే. ఇద్దరు కూడా న్యూయార్క్‌లో నివసిస్తున్న వారే. ఇద్దరిపై కూడా లైంగిక దాడి జరిపి హత్య చేశారు. ఇద్దరిని హత్య చేసినదీ ఒకే హంతకుడై ఉండవచ్చని, అతను సీరియల్ జాగర్ కిల్లర్ అయివుండవచ్చని న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రాలేమని వారు చెప్పారు. న్యూయార్క్ గూగుల్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా ఆదివారం నాడు మసాచుసెట్స్‌లో నివసిస్తున్న తన తల్లిని చూడడానికి వెళ్లి అక్కడ జాగింగ్ చేస్తూ హత్యకు గురైన విషయం తెల్సిందే. (గూగుల్ మేనేజర్ ను రేప్ చేసి హత్య చేశారు) అంతకు ఐదు రోజుల ముందు ఆగస్టు రెండవ తేదీన కరీనా సైకిల్‌పై జాగింగ్‌కు వెళ్లి పొదల్లో అత్యచారం, హత్యకు గురయ్యారు. ఆమె తండ్రి ఫిల్ వెట్రానో మరణించిన కూతురు సహాయార్థం ‘గోఫండ్‌మీ’ ఫేస్బుక్ పేజీ ప్రారంభించగా ఇంతవరకు లక్షడాలర్ల విరాళం అందింది. తన కూతురు హంతకుడిని పట్టిచ్చిన వ్యక్తికి 20వేల డాలర్ల రివార్డును న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ఆ రివార్డుకుతోడు ఈ మొత్తం డబ్బులను హంతకుడికి పట్టిచ్చిన వ్యక్తికే అందజేస్తానని ఫిల్ వెట్రానో ప్రకటించారు. ఆకర్షణీయ శరీర సౌష్టవం కలిగిన కరీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు తన ఫొటోలను అందులో అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఆమె హత్యకు సరిగ్గా మూడు రోజుల ముందు అలెగ్జాండ్ర నికోలెట్టీ అనే 30 ఏళ్ల యువతిని కూడా జాగింగ్ వెళ్లినప్పుడు గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై అత్యాచారం జరపకుండానే నేరస్థుడు ఆమెను తుపాకీతో కాల్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మిగతా రెండు హత్యల్లాగా కాకుండా ఆమెకు తెలిసిన వ్యక్తే హత్య చేశాడనడానికి ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. -
పోలీసులకు షాక్ ఇచ్చిన సీరియల్ కిల్లర్
పట్నా: బ్యాంకు దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైశాలి జిల్లాలో బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'నన్ను ఇంటరాగేట్ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. గూగుల్ లో సైకో కిల్లర్ అమిత్ అని వెతికితే నా గురించి మొత్తం తెలుస్తోంద'ని పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాము వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అతడే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. పట్నా, వైశాలి ఇతర జిల్లాల్లో 22 హత్యలు చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి. 'సైకో సీరియల్ కిల్లర్'గా ముద్రబడిన అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్ ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివాడు. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో పనిచేశాడు. 2003లో అతడి తండ్రి హత్యకు గురైయ్యాడు. తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న పప్పుఖాన్ అనే వ్యక్తి చంపిన తర్వాత అమిత్ సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. పప్పు ఖాన్ శరీరంలోకి అమిత్ 32 బుల్లెట్లు దించాడని, తన తండ్రి హత్యకు కారకులైన మరో నలుగురిపై దాడి చేశాడని వైశాలి ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించారు. బాలీవుడ్ సినిమా 'గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్-2' సినిమా క్లైమాక్స్ ప్రేరణతో తన తండ్రిని హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసులతో అమిత్ చెప్పాడు. 60వ దశకంలో ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ పేరు కూడా అతడు ప్రస్తావించాడు. వైశాలిలో సెంట్రల్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఆదివారం అమిత్ పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమాని
-
ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమాని
ఫేస్‌బుక్‌తో వెలుగులోకి.. నెల్లూరు(టాస్క్ఫోర్సు): నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో హడలెత్తించిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వీరాభిమాని అని వెల్లడైంది. నెల్లూరు జిల్లాలోని యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన ఈ కరుడు గట్టిన నేరస్తుడు ఇళ్లలోకి చొరబడి మహిళల్ని, వృద్ధులను సుత్తితో మోది క్రూరంగా హత్యలకు పాల్పడడం తెలిసిందే. తాజాగా నెల్లూరు చిల్డ్రన్స్‌పార్కు సమీపంలో ప్రభావతి అనే మహిళ ఇంట్లో చొరబడి సుత్తితో ఆమెపైన, ఆమె బంధులిద్దరిపైన దాడిచేసి.. బంగారు నగలను అపహరించుకొని వెళుతూ పట్టుబడ్డాడు. దీంతో అతని వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీలో చురుగ్గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబునాయుడుతో కలసి పాదయాత్రలో సైతం వెంకటేశ్వర్లు పాల్గొన్నాడు. పాదయాత్రలో చంద్రబాబుతో కలసి నడుముకు పచ్చకండువా కట్టుకొని నడిచాడు. ఆ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వెంకటేశ్వర్లు అరెస్ట్ అనంతరం నెల్లూరు పోలీసులు అతని ఫేస్బుక్ ఖాతాను గుర్తించారు. దాన్ని చూడగా టీడీపీ పట్ల అతనికెంత అభిమానముందో అవగతమైంది. దీం తో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇది జరిగిన గంట వ్యవధిలోనే వెంకటేశ్వర్లు ఫేస్బుక్ అకౌంట్ అంతర్జాలంలో మాయమైంది. ఇప్పుడీ విషయం అందరికీ తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. -
సీరియల్ కిల్లర్ అరెస్ట్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తోట వెంకటరమణపై మూడు హత్యలు, మూడు హత్యాయత్నాలతోపాటు బొప్పాయి చెట్ల నరికివేత కేసు, తోట గంగయ్య అనే వ్యక్తిని లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించిన కేసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులాంటివి మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. వెంకటరమణ చేసిన నేరాల గురించి ఈ సందర్భంగా ఎస్సీ వివరించారు. 2009 జూన్ 30వ తేదీన జీవీపురంలో తోట వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి ముందర మంచంపై నిద్రిస్తుండగా వెంకటరమణ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ కేసులో నిందితుడు వెంకటరమణ(19) అదే సంవత్సరం జులై 10న కోర్టులో లొంగిపోయాడు. రిమాండ్‌లో ఉన్న సమయంలో తన తల్లి వెంకటసుబ్బమ్మను కొందరు వ్యక్తులు అవమానపరిచినందున వారిపై పగబట్టాడు. వారిని చంపాలని నాటు తుపాకీ సంపాదించాడు. 2012 జూన్ 21వ తేదీ రాత్రి జీవీ పురానికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న గబ్బి రామకృష్ణను కిటికి గుండా తుపాకీతో కాల్చి పారిపోయాడు. అదే సంవత్సరం జులై 19న తోట సుబ్రమణ్యం అనే వ్యక్తి తన పొలం వెళుతుండగా నాటు తుపాకీతో కాల్చాడు. అయితే తోట సుబ్రమణ్యం గాయాలతో తప్పించుకున్నాడు. ఈ ఏడాది మార్చి 27న తోట సుబ్రమణ్యంను ఎలాగైనా చంపాలని అతని ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అదేరోజు రాత్రి తోట నారాయణపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అంతేగాక పొలాల్లోకి వెళ్లి గబ్బి వెంకటసుబ్బయ్యకు సంబంధించిన బొప్పాయి చెట్లను నరికివేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న తోట వెంకటరమణ గతనెల 24వ తేదీ ఉదయాన్నే తోట సుబ్రమణ్యంను తుపాకీతో కాల్చి చంపాడు. తోట సుబ్రమణ్యం దగ్గర ఉన్న లెసైన్స్ రివాల్వర్‌ను, సెల్ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. ఈనెల 11వ తేదీన రివాల్వర్‌తో కృష్ణంగారిపల్లెకు వచ్చి తోట గంగయ్య అనే వ్యక్తిని రూ. లక్ష ఇవ్వాలని బెదిరించాడు. అనంతరం రాజంపేటలోని ఓ లాడ్జిలో బస చేస్తూ చుట్టూ పక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రాజంపేట నుంచి రాయచోటికి పోవు దారిలో ఉన్న సాయిబాబా గుడి వద్ద శనివారం ఉదయం తోట వెంకటరమణను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి గబ్బి రామకృష్ణయ్య, తోట సుబ్రమణ్యంను కాల్చి చంపిన నాటు తుపాకీని తోట సుబ్రమణ్యంకు సంబంధించిన రివాల్వర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు తోట వెంకటరమణ రాజంపేట పట్టణంలోని తిరుమల లాడ్జిలో వారం రోజులుగా బస చేసి ఉన్న గదిలో సోదా చేసి రివాల్వర్ లెసైన్స్ కాపీతోపాటు బ్యాగ్, బట్టలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు హత్యలు చేసిన తర్వాత విజయవాడకు వెళ్లి అక్కడ క్రేజి హోటల్లో పనిచేస్తూ అప్పుడప్పుడు జీవీపురానికి వచ్చి తాను చంపాలనుకున్న వారి గురించి వివరాలు సేకరిస్తూ అంతమొందించేవాడన్నారు. సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేయడంలో కృషిచేసిన రాజంపేట డీఎస్పీ అన్యోన్య, రైల్వేకోడూరు సీఐ రమాకాంత్, ఎస్బీ సీఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఓఎస్డీ అడ్మిన్ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సీరియల్ కిల్లర్ అరెస్ట్
వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. తోట వెం కటరమణపై 3 హత్యలతో పాటు మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. రాజంపేట నుంచి రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న సాయిబాబా గుడి వద్ద అతడిని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతో పాటు 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్..
రాజంపేట, న్యూస్‌లైన్: వరస హత్యలతో కలకలం సృష్టిస్తున్న సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజంపేట పట్టణంలో గురువారం తోట వెంకటరమణను పొలీసులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా పుల్లంపేట, రాజంపేట, ఓబులవారిపల్లె తదితర ప్రాంతాల్లో పోలీసు ప్రత్యేకబృందాలు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి పుల్లంపేట నుంచి వత్తలూరు మీదుగా అలాగే రాజంపేటలో బృందాలు గాలింపు చేశాయి. ఈ క్రమంలో రాయచోటి రోడ్డులోని రాజంపేట ఆర్వోబీ వద్ద తోట వెంకటరమణను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసుశాఖ గోప్యంగా ఉంచుతోంది. ఈవిషయంపై నోరు విప్పడంలేదు. అయితే తమకు సవాల్‌గా మారిన తోట వెంకటరమణను ఎట్టకేలకు పట్టుకోవడంతో ఆ శాఖ ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం తోట వెంకటరమణ అరెస్టును చూపే అవకాశం ఉంది. -
బెంగళూరు శివార్లలో సైకో శంకర్ అరెస్టు
సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్)ను పోలీసులు బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. అతడు పరప్పన జైలు నుంచి తప్పించుకున్న ఆరు రోజులకు పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగళూరు నగరానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలోని బొమ్మనహళ్లి వద్ద గల కుద్లుగేట్ వద్ద జయశంకర్ దొరికాడని, అతడిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. అత్యంత ఎత్తయిన గోడలున్న జైలు నుంచి అతడు ఎలా తప్పించుకోగలిగాడో ప్రశ్నిస్తామని, అతడికి ఎవరైనా నకిలీ తాళం చెవులతో సాయం చేశారేమో కనుక్కుంటామని ఆయన చెప్పారు. సైకో కిల్లర్, కర్ణాటకలో వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని తెలుస్తోంది. అతను 30 అడుగుల గోడ దూకి పారిపోలేదని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్జాగా జైలు ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. సైకో శంకర్ ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, పోలీసు దుస్తులు ధరించి 30 అడుగుల గోడదూకి పారిపోయాడనే కథనాలు వినిపించాయి. కానీ శంకర్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాడని తోటి ఖైదీలు ఉప్పందించినట్లు సమాచారం.