ప్రసాదంలో సైనైడ్ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్