ground report
-
ఆ ఆరుగురు ఇక్కడే చనిపోయారు.. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్..
-
కన్నీరు మున్నేరు
-
హాస్టల్ కష్టాలు.. @ఒంగోలు
-
నిరుపేదలకు తీరిన సొంతింటి కల
-
నెల్లూరు బ్యారేజ్ తో లక్ష ఎకరాలు సస్య శ్యామలం
-
అయోధ్య రామమందిర నిర్మాణంలో అబ్బురపరిచే విశేషాలు
-
చిన్నపల్లెపై చిన్నచూపు!
ఊరిలో 108 మంది జనాభా... 69 మంది ఓటర్లు.. ప్రాథమిక పాఠశాల.. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురే విద్యార్థులు.. ఒక్కరే మాస్టారు.. ఊరికి ఒకవైపు కిన్నెరసాని, మరో వైపు వాగులు.. వర్షాకాలమైతే ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల మేర గతుకులు, బురద రోడ్డు దాటాలి. ఇది దాటేందుకు కనీసంగా గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటే లోపు మృత్యువాత పడటమే.. అసలు ఇంతవరకు అంబులెన్స్ ఆ గ్రామానికి ఒక్క సారి కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ ‘దొంగతోగు’ దుస్థితి ఇది. గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఏకతాటిపై ఉన్న ఆ ఏజెన్సీ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.. (సాక్షిప్రతినిధి, ఖమ్మం) : పాలనా సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగు 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా నేటికీ సమస్యలు సమసిపోలేదు. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచినా ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసానికి వరదతో వాగులు.. వంకలు పొంగిపొర్లడం, కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు కాగా, ఆళ్లపల్లికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగిపొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపినా దూరాభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్లడం లేదు. పాలనా కేంద్రంగా బడి.. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ భవనంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.16 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సాహ సం చేయాల్సిందే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఆ పల్లె అభివృద్ధికి నోచుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా వరదలతో పైపులైన్లు ధ్వంసమై ఏడాదిగా గ్రామానికి తాగునీరు రావడం లేదు. ఆరు కిలోమీటర్లు.. అవస్థలు.. దొంగతోగు సమీపంలోని ముత్తాపురం నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగే వాగులు, వంకలు, గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆస్పత్రికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. రెండు నెలల క్రితం గుండె పోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్‌పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే సరికే మృతి చెందాడు. రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబులెన్స్ రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అనుమతి లభించలేదు. ఇటీవల రెండు కిలోమీటర్లకు అనుమతి రాగా, పనులు ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకుండా.. గ్రామంలో 27 కుటుంబాలున్నాయి. అంతా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు సేద్యమవుతున్నాయి. పోడు పట్టాలు రావడంతో వారి ఖాతాల్లో వానాకాలం రైతుబంధు డబ్బు పడింది. ఆదివాసీ కుటుంబాలన్నీ ఏకగ్రీవంగా సర్పంచ్‌ని ఎన్నుకున్నట్లే.. గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో సందడి నెలకొనాల్సిన ఈ గ్రామంలో పాత కష్టాలే కళ్లముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవనం వస్తాయనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. గ్రామ ప్రొఫైల్ ♦ గ్రామ పంచాయతీ: దొంగతోగు (రాష్ట్రంలో అతి చిన్నది) ♦ 2018లో గుండాల పంచాయతీ నుంచి వీడి నూతన పంచాయతీగా ఏర్పాటు. ♦ తొలుత 35 మంది ఓటర్లు ♦ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం 69 మంది ఓటర్లు. ♦ మొత్తం ఓటర్లలో పురుషులు 36, స్త్రీలు 33 మంది ♦ మొత్తం జనాభా : 108 మంది ♦ పురుషులు : 44, స్త్రీలు : 64 మంది రోడ్డే ప్రధాన ఇబ్బంది.. ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామ సమస్యలు తీరుతాయి. పైపులైన్లు ధ్వంసం కావడంతో ట్యాంకు నుంచి మంచినీళ్లు రావడం లేదు. పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేరు వచ్చినా చేయించలేకపోతున్నాం. నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. – కొమరం బాయమ్మ, సర్పంచ్, దొంగతోగు రోడ్డు ఉంటే ప్రాణం దక్కేది.. నా భర్త అక్టోబర్ 20న గుండెపోటుతో చనిపోయాడు. గుండె నొప్పి వస్తే బండి మీద గుండాల తీసుకెళ్లాం. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అక్కడ వైద్యం పొందుతూ చనిపోయిండు. ఆరు కిలోమీటర్ల రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాల వేళ్లే సరికి నొప్పి ఎక్కువైంది. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆస్పత్రికెళ్తే ప్రాణాలు దక్కేవి. గర్భిణులను మొన్నటివరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రాక్టర్లలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. –పూణె అనంతలక్ష్మి, దొంగతోగు -
విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
బోగీల కింద మరికొన్ని మృతదేహాలు..పెరుగుతున్న మృతుల సంఖ్య
-
గోరుముద్ద పథకంపై సర్వత్రా ప్రశంశలు
-
సీఎం జగన్ కు లబ్దిదారుల కృతజ్ఞతలు
-
సాగునీటి రంగంలో రాష్ట్రంలో మరో ముందడుగు
-
పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చిరుతలు
-
అడవిలో 15 కిమీ నడిస్తే గాని మా ఊరు రాదు..జగన్ వచ్చాకే మా జీవనం మెరుగ్గా..
-
నెల్లూరులో నాడు-నేడుతో ఆదర్శంగా మారిన సంతపేట ప్రభుత్వ స్కూల్
-
కాళేశ్వరం నీళ్లు వచ్చేదెప్పుడు ?
-
వడివడిగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: దళితుల పేరిట కుట్ర రాజకీయాలు
-
పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్
-
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
సీఎం వైఎస్ జగన్ చొరవతో నెరవేరబోతున్న దశాబ్దాల కల
-
ఇంటి ముంగిటకే వైద్యసేవలు
-
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ విన్యాసాలు
-
జగనన్న కాలనీల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు
-
కేటీపీఎస్ బూడిదతో నరకం అనుభవిస్తున్న ప్రజలు
-
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వస్తున్న డాక్టర్లు
-
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
-
గుంకలాం ప్రోగ్రెస్ రిపోర్ట్.. చక చకా నిర్మాణాలు..
-
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక
-
అందాలకు నెలవైన అల్లూరి జిల్లా ఏజెన్సీ
-
ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు పెన్నా బ్యారేజ్
-
నాగార్జునసాగర్‌కు ప్రమాదం పొంచి ఉందా?
-
వరద బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం
-
ప్రళయ గోదావరి
-
ముంపు ప్రాంతాల సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం
లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన పాజిటివ్ మూడ్‌ను యూపీ విజయం సెట్ చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2024 రోడ్‌మ్యాప్’ పేరిట బీజేపీ కేంద్ర కమిటీకి రెండు నెలల క్రితం ఆర్ఎస్ఎస్ సమర్పించిన విధాన పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని ఆ పత్రంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. నాలుగు విడతలపై జోరుగా అంచనాలు 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో నాలుగు మూడు విడతల్లో ఇప్పటిదాకా 231 చోట్ల పోలింగ్ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ–ఆర్ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు తేలుతోంది. పోలింగ్ జరిగిన 172 స్థానాలను అవి సగానికి కాస్త అటు ఇటుగా పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. మొత్తమ్మీద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సమీకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని అమర్ ఉజాలా దినపత్రిక లక్నో అసోసియేట్ ఎడిటర్ సుమంత్ పాండే అన్నారు. ‘‘బీజేపీ, ఎస్పీ–ఆర్ఎల్డీ మధ్య హోరాహోరీ సాగుతోంది. మా అంచనా ప్రకారం బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముంది’’ అని పాండే వివరించారు. మూడో పార్టీ గానీ, ఇతరులు గానీ సాధించే 10, 15 సీట్లు మెజారిటీకి కీలకమైనా ఆశ్చర్యం లేదన్నారాయన! చదవండి: (ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!) పశ్చిమ యూపీలో ఎస్పీ ఆధిక్యం అంతంతే! మొదటి రెండు దశల పోలింగ్‌పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్ఎల్డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్ సామాజిక వర్గం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. అది 20–25 స్థానాలకు దాటకుండా చూడటంలో బీజేపీ సఫలమైందని విశ్లేషకుల అభిప్రాయం. మూడో విడత పోలింగ్ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్ నడిచిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా. కాయ్ రాజా కాయ్! యూపీ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారం ఎవరిదన్న అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, ముంబయి, నోయిడా, అహ్మదాబాద్ కేంద్రాలుగా రూ.3 వేల కోట్ల మేరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులు సాగినట్లు యూపీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు సహకరించాలంటూ మహారాష్ట్ర పోలీసుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రతి దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 50 శాతంలోపు సీట్లు వస్తాయని బెట్టింగులు పెడితే రూపాయికి రెండు రూపాయలు, అంతకు మించి వస్తాయన్న వారికి రూపాయికి రూపాయిన్నర లెక్కన బెట్టింగులు సాగుతున్నాయి. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కాస్తున్న వారికి రూపాయికి రూపాయి, ఎస్పీ గెలుస్తుందన్న వారికి రూపాయిన్నర బెట్టింగు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. -
Sakshi Ground Report: యూపీలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోగలదా..?
-
అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం
కంచర్ల యాదగిరిరెడ్డి: దాద్రి (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి అన్నయ్యతో అవ్వట్లేదు... అయినా అధికార కేంద్రంగా తానే ఉండాలంటాడు అమ్మ సోనియాకు అనారోగ్యం... ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ.. కొడిగట్టిన దీపంలా మారింది.. ఉత్రరప్రదేశ్లో ఉనికి చాటగలిగితే... రేప్పొద్దున జాతీయ రాజకీయాల్లో ముఖం చెల్లుతుంది... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఏడాదిగా యూపీలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు... కాలానికి తగ్గట్టు తన పద్ధతిని మార్చుకోలేకపోవడమే కాంగ్రెసు పార్టీ బలహీనతగా కనిపిస్తోంది. మరింత అప్రతిష్టను మూగగట్టుకునే దిశగా యూపీలో కాంగ్రెస్ సాగుతోందనే భావన కలుగుతోంది. ప్రజలకు... మరీ ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు మేలు చేసే విధానాలతో ప్రియాంకా గాంధీ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇచ్చేట్టు కనిపించడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేదు. కుటుంబ పార్టీగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ప్రియాంక తప్ప మరో జనాకర్షక నేత లేడు. పార్టీలో ఎదుగుతున్న నేతలను కాంగ్రెస్ చేజేతులా పోగొట్టుకోవడమే ఈ దుస్థితికి కారణమని మీరట్‌కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బదరీనాథ్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పటికీ ప్రజలకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ, ఆ పార్టీని నడిపించే సమర్థులు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూడాల్సి వచ్చిందంటున్నారు బదరీనాథ్. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు సోనియాగాంధీ వారసత్వం, ప్రియాంకా గాంధీ భవిష్యత్ మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. గడచిన (2017) ఎన్నికల కంటే కాస్తన్ని ఎక్కువ సీట్లు వచ్చి నా, ఓట్లు కనీసం ఒక్క శాతం పెరిగినా ప్రియాంక గాంధీ నాయకత్వంపై ఎంతో కొంత నమ్మకం పెరుగుతుంది. కానీ, విచిత్రంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎవరికీ ప్రత్యామ్నాయం కారు. ఈ ఎన్నికల కంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ ఓ పది మంది ఎమ్మెల్యేలనైన గెలిపించుకున్నప్పుడు కదా ఆ పాటి విశ్వాసం వచ్చేదంటున్నారు ముజఫర్ నగర్ కాంగ్రెస్ నేత రాజేశ్వర్ తివారీ. ఏడు పదుల వయసు దాటిన తివారీ జీవితమంతా కాంగ్రెస్‌తోనే సాగింది. కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారాయన. కానీ, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇతర పార్టీల వైపునకు వెడుతుండటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. (చదవండి: టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!) ఉదారవాద హిందుత్వపై నమ్మకం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్! సుమారు 30 ఏళ్లకు పైచిలుకు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. దీంతో పార్టీ కేడర్ కకావికలు అవుతోంది. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తీసుకుంటే 2017 వరకు... మధ్యలో ఒకేఒకసారి కాంగ్రెస్ ఓటు శాతం డబుల్ డిజిట్ (2012లో 11.63 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి. 1996లో వచ్చిన 33 సీట్లే కాంగ్రెస్‌కు ఇప్పటిదాకా యూపీలో వచ్చిన అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక, ఆమె అన్నయ్య రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పట్టాలెక్కించాలని శ్రమిస్తున్నారు. ఉదారవాద హిందుత్వకు వారసులుగా తమను తాము చూపుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వను ఎదుర్కోవాలన్నది ప్రియాంక ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు రైతు చట్టాలపై నిరసనలు వ్యక్తమైన యూపీలో రైతులను ఒక ప్రత్యేక తరగతిగా భావించి, వారిని మచ్చిక చేసుకోవాలని ప్రియాంక పావులు కదుపుతున్నారు. ఈ కుల, మత, వర్గ సూత్రాలు కాంగ్రెస్‌ను కాపాడతాయా?... అంటే ఉనికి కోసం పోరాడుతున్న పార్టీకి పునర్వైభవం చాలా పెద్ద మాట అవుతుందనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ ప్రియాంకకు కూడా లేదు. ఇటీవల ఆగ్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు ఆమెలో నిరాశకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ పార్టీ పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తల మీటింగుల్లో ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెసు పార్టీలో గాంధీ కుటుంబ వారసత్వానికి భవిష్యత్ లేదు. ఇకనైనా నాయకత్వం కళ్లు తెరిచి చూడాలి. లేదంటే తుడిచిపెట్టుకుపోతుంది’ అని గుర్మిత్ సింగ్ పూరి అన్నారు. ఖతులీ శాసనసభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న గుర్మిత్ గతంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి పార్లమెంట్ నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. రుద్రాక్ష మాల– సంగమ స్నానం గతేడాది ప్రియాంక డెహ్రాడూన్ వచ్చినప్పుడు చేతిలో రుద్రాక్ష మాలతో కనిపించారు. అనంతరం మాతా శాకంబరీ దేవీ ఆలయంలో పూజలు చేయడం, ప్రయాగ్ రాజ్ వెళ్లి సంగమంలో పుణ్యస్నానం చేయడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఉదారవాద హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు చేసే యత్నాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అనుసరించే హార్డ్‌కోర్ హిందుత్వను హిందువుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటివారిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో భాగంగా అటు ప్రియాంక, ఇటు రాహుల్ తమనుతాము ఉదారవాద హిందూవాదులుగా చూపించుకుంటున్నారు. ఉదారవాద హిందుత్వ ప్రియాంక మొదటి సూత్రం. (చదవండి: పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు) -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: దండకారణ్యంలో రక్తపాతం
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: అయోమయంలో మావోయిస్ట్ క్యాడర్
-
రోడ్లపై నరకం
-
హెరిటేజ్ లాభం కోసం విజయ డైరీని మూయించిన చంద్రబాబు
-
వ్యవసాయ రూపురేఖల్ని మారుస్తున్న ఆర్బీకేలు
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: ఈడీ విచారణతో కదిలిన డొంక
-
రాకాసి పట్టణం... ఊరంతా సమాధులే.
-
కంట్రోల్లో కోవిడ్
-
పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్ గ్రౌండ్ రిపోర్ట్
-
విశాఖలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు
-
కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్ పేషెంట్స్‌కు మెరుగైన వైద్య సేవలు
-
హైదరాబాద్‌లో 36 శాతం తగ్గిన రెసిడెన్షియల్ నిర్మాణాలు
-
కరోనా దెబ్బతో మూతపడుతున్న పరిశ్రమలు
-
నిర్మాణ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు
-
ప్రాజెక్ట్ ఫండింగ్ మరింత పెంచాలి: రియల్ ఎస్టేట్
-
ఆక్సిజన్ లెవల్స్ 90 ఉన్నవారు ఇంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వాడొచ్చు
-
పరిశ్రమలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
పైసా ఖర్చులేకుండానే కోవిడ్ రోగులకు వైద్యం
-
ప్రిన్సిపాల్ టు టిఫిన్ సెంటర్
పైన ఫొటోలో దోశ వేస్తూ కనిపిస్తున్నది చిట్టిమళ్ల చిరంజీవి. ఈయనది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామం. భార్య, ఇద్దరు కుమార్తెలు, అమ్మా, నాన్నలు ఉన్నారు. ఆలుమగల సంపాదన మీదే కుటుంబం నడిచేది. భార్యాభర్తలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేసేవారు. చిరంజీవి ఎంఎస్సీ, బీఈడీ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఉన్నత తరగతులకు గణితం బోధించేవారు. ఆయనకు, భార్యకు కలిపి యాజ మాన్యం రూ.25 వేల వేతనం ఇచ్చేది. కుటుంబం హాయిగా గడిచేది. కరోనాతో పాఠశాలలు మూతపడి ఆర్థిక పరి స్థితులు తలకిందులయ్యాయి.కొందరు మిత్రుల సలహాతో టిఫిన్ సెంటర్ పెట్టాడు. చిరంజీవిని ‘సాక్షి’ పలకరించగా.. ‘నాతో పాటు కుటుంబసభ్యులు టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండటంతో రోజుకు ఖర్చులుపోను రూ.1,000 నుంచి 1,500 వరకు మిగులుతున్నాయి’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి, నెట్వర్క్ : పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే గురువులు వారు. సమాజంలో హోదా, గౌరవం. పది మంది చేతులెత్తి దండం పెట్టేవారు. ‘సారూ.. బాగున్నారా’ అంటూ అత్మీయ పలకరింపులు. పిల్లల చదువులపై ఆరాలు. పొద్దున లేస్తూనే బడి ధ్యాస. పాఠాలు, హోంవర్కులు... రోజంతా పిల్లలతో హడావుడి. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడింది. 10 నెలలుగా బడులు మూతపడ్డాయి. ప్రైవేటు మాస్టార్ల బతుకులు ఆగమయ్యాయి. జీతాలు ల్లేవు. జీవితాలు గడవాలి. కుటుంబాన్ని పోషించాలి. అక్షరాలు దిద్దించిన చేతులే అట్లు వేస్తున్నాయి. కరెంటు పని, మగ్గం నేత... ఏ పని వస్తే అది చేస్తున్నాయి. పట్ట ణాల్లో అద్దె భారమైంది. సొంతూళ్లకు వెళ్లిపోయారు. పొలంలోకి దిగారు. కూలి పనులకు వెళుతున్నారు. గురువులకు కరోనా నేర్పిన జీవిత‘పాఠం’ ఇది. భారంగా బతుకుబండిని లాగుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల ‘గోస’ ఇది.. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటేశ్వర్లుతోపాటు అతని భార్య ఇద్దరూ స్థానికంగా ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవారు. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. వీరికి పనులు లేకుండా పోయాయి. వెంకటేశ్వర్లు గతంలో నేర్చుకున్న ఎలక్ట్రీషియన్ పనిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నారు. ‘గతంలో మా ఇద్దరికి కలిపి రూ.20 వేలు వస్తుండేవి.. ఇప్పుడు అందులో సగం వచ్చినా.. సంసారం సాఫీగానే నడుస్తోంది’ అని వెంకటేశ్వర్లు ఒకింత ధైర్యంగా చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శ్రీనివాస్... లెక్కల మాస్టారు. 6 నెలల క్రితం ఎంతో గౌరవంగా బతికారు. పిల్లలకు లెక్కలు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారన్న పేరుంది. కానీ కరోనా తలకిందులు చేసింది. ఇప్పుడు మండల కేంద్రంలో దొరికే కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకువచ్చి చిన్నగదిలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ‘అటు పాఠశాల యాజమాన్యం.. ఇటు ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల టీచర్లను పట్టించుకోవడం లేదు. అయినా బతకాలంటే ఏదో పనిచేయాలి.. అందుకే కూరగాయలు అమ్ముతున్నా’అని శ్రీనివాస్ తెలిపారు. ఇన్నాళ్లు ‘నమస్తే సార్’అనే పిలుపుకు అలవాటుపడ్డ చెవులవి. ఇప్పుడా సంబోధన లేదు. మరో పిలుపు. పర్వాలేదు... కుటుంబ నావను నడిపించడంలో అవేమీ అడ్డుకావు అని సర్దుకుపోతున్నారు. సొంతకాళ్లపై నిలబడ్డామనే సంతృప్తి ఒకవైపు... గుండెను మెలిపెడుతున్న గత తాలూకు జ్ఞాపకాలు మరోవైపు. కోవిడ్–19తో లాక్డౌన్ కారణంగా గత ఏడాది మార్చిలో అన్ని విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఇక..ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. అందరినీ పక్కన పెట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని సాకాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. కొందరు గతంలో నేర్చుకున్న వృత్తులపై దృష్టి పెట్టగా, మరికొందరు సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొందరు కిరాణ, టిఫిన్ సెంటర్లు, పాలకేంద్రాలు తదితర వ్యాపారాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కరోనా గురువుల జీవితాల్లో ఎలాంటి కల్లోలం రేపింది.. ప్రత్యామ్నాయ ఉపాధిలో ఎలా ముందుకెళ్తున్నారు.. కుటుంబ నావను ఎలా నడిపిస్తున్నారనే అంశాలపై ‘సాక్షి’దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లను పలకరించి అందిస్తున్న ‘గ్రౌండ్ రిపోర్ట్’ఇది... – సాక్షి నెట్వర్క్ మగ్గం పనిచేస్తూ.. ఉపాధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నానచర్ల రమేష్ ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో పాఠశాలను మూసివేశారు. ఇంతవరకు తెరుచుకోలేదు. ఆన్లైన్ తరగతులు కూడా నడవని పరిస్థితి. పాఠశాల యాజమాన్యం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కుటుంబం గడవడం కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పు చేశారు. పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అతను ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన ఇంటి పక్కన ఉన్న పద్మశాలి ఇంట్లో మగ్గం పని నేర్చుకున్నాడు. అప్పట్లో నేర్చుకున్న మగ్గం పని ఇప్పుడు అక్కరకు వచ్చింది. స్థానికంగా ఉన్న నేతన్న దగ్గర పనికి కుదిరాడు. నెలకు రూ.17 వేల దాకా ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘సుమారు 10 నెలల నుంచి పాఠశాలలు తెరవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలా అని కుంగిపోలేదు. అప్పడు నేర్చుకున్న పని ఇప్పుడు అక్కరకు వచ్చింది’అని రమేష్ చెప్పారు. వాయిద్యాలతోనే పూట గడుస్తోంది ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ టీచర్లు. ఒకరు గంగారపు రాజయ్య, మరొకరు కాసగోని వెంకటేశ్వర్లు. రాజయ్య వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని సిలోయమ్ స్కూల్లో పీఈటీగా పని చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించేవారు. కాసగోని వెంకటేశ్వర్లు సైతం హన్మకొండ సమీపంలోని చింతగట్టు క్యాంపులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి వేయడంతో వీరికి జీవనోపాధి ఇబ్బందిగా మారింది. దీంతో వీరు కూలి పనులతో పాటు గ్రామాల్లో జరిగే శుభకార్యాలలో వాయిద్యాలు వాయిస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చేపలు అమ్ముతున్నా.. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. బీఎడ్ చేశాను. పదేళ్లు స్థానిక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాను. మా ఇంట్లో నలుగురు సభ్యులం. కుటుంబపోషణ భారం నాదే. కరోనా వల్ల కళాశాలలు తెరిచే పరిస్థితి లేనందున కుటుంబ పోషణ కోసం చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నా. ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా... అందుకే ధైర్యంగా చేపలు విక్రయిస్తూ ముందుకు సాగుతున్నాను. కళాశాలలు పునఃప్రారంభమైతే మళ్లీ లెక్చరర్‌గా పని చేస్తా. – సాయికుమార్, నిజామాబాద్ పొలం లీజుకు తీసుకున్న.. వ్యాయామ వృత్తి విద్య పూర్తి చేశాను. కరీంనగర్‌లోని సిద్ధార్థ పాఠశాలలో పీఈటీగా పనిచేశాను. కరోనా ప్రభావంతో స్కూల్ జీవితం ముగిసినట్లయ్యింది. మా సొంతూరు చిమ్మనపల్లి గ్రామం.. సిరికొండ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరీంనగర్లో రూం కిరాయి కట్టలేక ఖాళీ చేసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ మాకున్న రెండెకరాల పొలంలో పనిచేసుకుంటున్నాను. ఇంకా పక్క వారి మూడు ఎకరాలు లీజుకు తీసుకుని అందులో కూడా పొలం చేస్తున్నాను. స్కూల్ లైఫ్‌లో పొలం పని చేసేవాడిని కాను. చివరకు పెద్దల నుంచి వచ్చిన భూమి నాకు జీవనోపాధి అయింది. స్కూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను తప్ప అందరినీ ఆదుకుంది. ఇప్పటికైనా మాకు నిరుద్యోగ భృతి చెల్లించాలి.– బి.రఘుపతి, ప్రైవేటు పీఈటీ, రాజన్న సిరిసిల్ల జిల్లా. మాస్కులు, టాయ్స్, సానిటైజర్స్ అమ్ముతున్నా నేను కరీంనగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్ ఫీల్డ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. కరోనా వైరస్ వచ్చి అందరినీ అతలాకుతలం చేస్తుందని ఊహించలేదు. స్కూళ్లు మూతపడి... జీవనోపాధి కరువై ప్రైవేటు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఆర్థిక స్థోమత లేక... ఏం చేయాలో అర్థం కాకా చివరికి మాస్క్‌లు, టాయ్స్, సానిటైజర్స్, కర్చీఫ్స్ అమ్ముతూ బతుకుబండిని లాగిస్తున్నా. జగిత్యాల రోడ్ రేకుర్తి శివారులో చిన్న గుడిసెలో పెట్టి అమ్ముతున్నాను. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోండి లేదంటే పాఠశాలలు తెరవండి అని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నా. – ఎస్.సతీష్, కరీంనగర్ కిరాణం కొట్టులో పనికి కుదిరి.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శిరీష స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నెలకు రూ.6 వేల వేతనంతో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. జీతాలు ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో ఓ కిరాణ కొట్టులో పనికి కుదిరింది. ‘ఇప్పటికైతే బాగానే ఉంది. పాఠాలు చెప్పడంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. పాఠశాలలు తెరుచుకుంటే తిరిగి టీచర్‌గా వెళ్తాను. లేదంటే ఇక్కడే పనిచేస్తాను’ అని శిరీష తెలిపింది. -
చెట్టెక్కిన చదువులు
‘‘చెట్టు లెక్కగలవా.. ఓ విద్యార్థి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన సిగ్నల్ చూడగలవా’’.. ఇదీ.. ఆన్లైన్ పాఠాలు వింటున్న విద్యార్థుల పరిస్థితి. ఆన్లైన్ తరగతులు పిల్లలను చెట్లు, పుట్టలు, గడ్డివాములు, మంచెలు, ఎత్తయిన ప్రదేశాలను ఎక్కిస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ వివరాలు.. పై ఫొటోను చూశారా.. అందులో ఉన్న చెట్టుమీద పిల్లలను గమనించారా.. వారెక్కింది చిగురు కోసమో, కోతికొమ్మచ్చి ఆట కోసమో కాదు. క్లాస్ కోసం!అదేలా అనుకుంటున్నారా? అవును.. అది అక్షరాలా.. చెట్టుబడి, అది కొమ్మ క్లాస్! ప్రయాణంలో అలసిపోయి సేద తీరుదామని ఓ చెట్టు కిందికి చేరిన ‘సాక్షి’ కంటబడిన దృశ్యమిది. అది ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని మల్కపల్లి శివారు. అక్కడ ఫోన్ సిగ్నల్ లేక రోజూ ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చింతచెట్టు ఎక్కి ఇలా పాఠాలు వింటున్నారు. ఇదివరకైతే క్లాస్‌రూంలో పాఠాలు వినేవారు.. ఇప్పుడు చెట్టుకొకరు, పుట్టకొకరైతే తప్ప క్లాస్ వినే పరిస్థితిలేదు. చెట్టుకొమ్మలే పాఠాలకు ‘పట్టు’ గొమ్మలయ్యాయి. చిటారుకొమ్మనకెళ్తే చిగురన్నా దక్కుతుందేమోకానీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ దొరుకుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఫోన్‌కు సిగ్నల్స్ అందితేనే తరగతి. లేదంటే.. అది గతి తప్పుతుంది. ఇదీ ఊళ్లల్లో ఆన్లైన్ క్లాసుల పరిస్థితి. ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో మరీ దారుణం. ఆన్లైన్ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధులు వరంగల్ అర్బన్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాంతాలను విజిట్ చేశారు. ఆ విజిట్‌లో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఆయా ప్రాంతాల నుంచి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఈ పిల్లాడి పేరు రవీందర్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు తరువాతైనా వినొచ్చంటూ తండ్రికి బదులు గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్తూ కనిపించాడు. టెన్షన్.. టెన్షన్! పాల్వంచ మండలం సారెకల్లులో కణితి కీర్తన అనే విద్యార్థిని చేతిలో సెల్‌ఫోన్ పట్టుకొని టెన్షన్‌గా అటూ, ఇటూ తిరుగుతోంది. ఏమైంది అని ‘సాక్షి’ప్రతినిధి అడగగా.. ‘నేను 9వ తరగతి చదువుతున్నా. ఆన్లైన్ తరగతులు విందామని సిగ్నల్స్ కోసం ట్రై చేస్తున్నా. ఊరులో ఏ దిక్కుకుపోయి చూసినా సిగ్నల్ అందుతలేదు. ఒక్కోసారి బాగానే ఉంటది. సిగ్నల్ సతాయించడంతో పాఠాలు సరిగా వినలేకపోతున్నా’అంటూ వాపోయింది. ఈ సమస్య ఇక్కడే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, టేకులపల్లి, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అంతటా ఉంది. చాలా గ్రామాల్లో టీశాట్, దూరదర్శన్ యదగిరి ఛానల్స్ ప్రసారాలు కూడా సరిగా రావట్లేదు. పత్తి తీస్తూ.. గోలీలు ఆడుతూ.. అది ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం బెజ్జూర్. ‘సాక్షి’ప్రతినిధులు అలా నడుచుకుంటూ ఊరిలోకి వెళ్లగా ఒకచోట బడీడు పిల్లలు సీసం గోలీలు ఆడుకుంటూ కనిపించారు. మరికొందరు పిల్లల చేతుల్లో సద్దిమూటలు కనిపించాయి. వారంతా తల్లిదండ్రులతో కలసి నడుచుకుంటూ పోతున్నారు. వారిని ఆపి, ఎటుపోతున్నారు, ఆన్లైన్ క్లాసులు లేవా.. అని అడిగాం. ‘ఆన్లైన్క్లాసుల్లో పాఠాలు స్పీడ్‌గా చెబుతుండ్రు. అవి మాకు అర్థమైతలె. ఇంటికాడ ఉండి ఏం జేయాలని పత్తిచేనుకు పోతున్నాం. ఇప్పుడు పత్తి సీజన్. పత్తి ఏరుదామని వెళ్తున్నాం ’అని చెప్పారు. తిర్యాణి మండలంలో మంగీ గ్రామానికి వెళ్లిన ‘సాక్షి’ప్రతినిధులకు ఓ సమస్య వచ్చి పడింది. తమ చేతుల్లోని సెల్ఫోన్లను పరిశీలించగా దేంట్లోనూ సిగ్నల్స్ లేవు. ఈ సమస్య ఒక్క మంగీ గ్రామంలోనే కాదు, మాణిక్యాపూర్, రోంపెల్లి, మెస్రంగూడ, మందగూడ, పంగిడిమాదర, భీంజిగూడ, గోపెర, కౌటగం, మర్కగూడ, ముల్కలమంద, మొర్రిగూడల్లోనూ ఉంది. అయితే, అప్పుడప్పుడూ, మిణుకుమిణుకుమంటూ సిగ్నల్స్ వచ్చిపోతుంటాయని ముల్కలమంద గ్రామస్తులు చెప్పారు. అందుకే చాలామందికి స్మార్ట్ఫోన్లు, డిష్ టీవీ కనెక్షన్ లేవు. కెరమెరిలోనూ సిగ్నల్ కష్టాలు ఉన్నాయి. అయితే, రెబ్బెనలో కాస్తా పరిస్థితి భిన్నంగా ఉంది. రెబ్బెనలో విద్యావంతులైన తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో మాత్రమే టీవీలు, మొబైల్ ఫోన్లు ఉన్నా యి. వీరంతా రెగ్యులర్‌గా పాఠాలు వింటున్నారు. చేపలు పడుతూ..క్రికెట్ ఆడుతూ.. మహబూబ్‌గర్ మండలం బొక్కలోనిపల్లిలో కొందరు పిల్లలు రోడ్లపై ఆడుతూ, ఇంకొందరు క్రికెట్ అడుకుంటూ గోలగోల చేస్తున్న దృశ్యం మా కంట పడింది. భూత్పూర్ మండలంలోని తాటికొండ, గాజులపేటలో విద్యార్థులు చెరువుగట్ల వద్ద చేపలు పడతూ కనిపించారు. అల్లీపూర్ ఊరి బయట ఓ మిరప తోటలో పని చేస్తున్న విద్యార్థి దగ్గరకు వెళ్లి పలకరించగా.. ‘ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న. ఇంట్లో టీవీ పాడైపోవడంతో తరగతులు వినలేకపోతున్నా’అని చెప్పాడు. దేవరకద్ర మండలంలోని చాలా తండాల్లో టీవీలు కూడా అందుబాటులో లేని విద్యార్థులు ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్న ఈ ఊరి పేరు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గురిమిళ్ల. గ్రామంలో సరిగ్గా సెల్ సిగ్నల్ అందదు. దీనికి తోడు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు.. ఇంట్లో ఉన్నది ఒక్కటే ఫోన్.. దీంతో ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం లేని విద్యార్థులిలా ఆడుకుంటూ కనిపించారు. – బయ్యారం పిల్లలతోపాటు పెద్దలకూ క్లాసులే మా ఇద్దరు పిల్లల్ని చెరో గదిలో ఉంచాలి. క్లాసులు వింటూ.. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని పిలుస్తున్నారు. మేం బయటకు కదలడానికి వీల్లేకుండాపోయింది. ఆన్లైన్ క్లాసులనేవి పిల్లతోపాటు పెద్దలకు కూడా క్లాస్ల్లా మారాయి. – జి.రమాదేవి, హన్మకొండ డిష్ కొనిచ్చాను.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కిష్టారంపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని. ఇక్కడ 22 మంది విద్యార్థులున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నవారు గ్రామంలో మరో 15 మంది ఉన్నారు. ఇక్కడ కేబుల్ కనెక్షన్ లేదు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేవు. విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని గ్రహించి సొంత ఖర్చులతో ఒక టీవీ, డీటీహెచ్ డిష్ కొని గ్రామంలోని ఒక ఇంట్లో ఏర్పాటు చేశాను. విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించాను. – అజ్మీరా రాము, హెచ్ఎం, ఎంపీపీఎస్, కిష్టారంపాడు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం ఈ విద్యార్థి పేరు శివగంగకృష్ణ. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాస్‌లు కావడంతో ఎక్కడైనా వినొచ్చని ఇలా పుస్తకాలు పట్టుకుని ఆవును పొలానికి తోలుకెళ్తున్నాడు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ఆన్లైన్ పాఠాలు– సమస్యలు ►ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు గ్రామీణ, వ్యవసాయాధారిత, పేద, మధ్య తరగతి కుటుంబాలు అధికం. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు చాలా తక్కువ. సగం మంది విద్యార్థులు టీవీల మీదే ఆధారపడ్డారు. ►గ్రామాల్లో వీశాట్ ప్రసారాలు సక్రమంగా ఉండడం లేదు. ►మూడు నెలల నుంచి వ్యవసాయ పనులు జోరుగా సాగడంతో చాలామంది విద్యార్థులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల తల్లిదండ్రులు పనులకు వెళ్తుండటంతో పిల్లలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ►ఆన్లైన్ తరగతుల వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ► టీవీల్లేని విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ►ఆర్థిక భారమైనా.. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చారు. పాల్వంచ మండలం కారెగట్టు గ్రామంలో సిగ్నల్ కోసం చెట్టెక్కిన విద్యార్థులు -
శవ రాజకీయం
-
నరకయాతన
-
గీతం గుట్టు
-
హైదరాబాద్‌లో వరద తగ్గింది..బాధితుల కష్టాలు తగ్గలేదు
-
భాగ్యనగరంలో భయం..భయం
-
హేమంత్ హత్యపై గ్రౌండ్ రిపోర్ట్
-
మీ భద్రత..మా బాధ్యత
-
వలస కూలీలకు భరోసా
-
కరోనా: సాక్షి గ్రౌండ్ రిపోర్ట్, కర్నూలు
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ వెల్లంకి యాదాద్రి జిల్లా
-
ఆటో నగర్ పై సాక్షి గ్రౌండ్ రిపోర్టు
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ మేడారం జన జాతర
-
భూకాష్టం..
-
సైనైడ్ సీరియల్ కిల్లర్‌పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
పాపం ఎవరిది?
-
ఇదీ ఆత్మకూరు అసలు కథ..
-
ఆత్మకూరులో అసలేం జరిగింది?
(పల్నాడు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)/సాక్షి, గుంటూరు/మాచర్ల: మూడేళ్ల క్రితం అంగన్వాడీ ఉద్యోగం తెచ్చిన తంటా ఆ పచ్చని పల్లె పేరును ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఆ గ్రామంలో ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా విడిపోయి ఊరొదిలి వెళుతుంటే దానికి టీడీపీ రాజకీయరంగు పులిమింది. పల్నాడు ప్రాంతంలో గెలిచిన రాజకీయ పార్టీకి చెందిన వారిది పైచేయి అవుతుందని ఓడిన పార్టీ వారు కొంతకాలం ఊరొదిలి వెళ్లడం రివాజు. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలను పార్టీ తగాదాలుగా చిత్రీకరిస్తూ, ఊరొదిలి వెళ్లిన వారు వైఎస్సార్ సీపీ బాధితులంటూ ప్రతిపక్ష టీడీపీ యాగీ చేస్తుండటం ఆ ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రత్యర్థి వర్గాలుగా ఉంటున్నాయి. ఆ వర్గాలకు గ్రామ మాజీ సర్పంచ్ పి.యోసేబు, మండి చార్లెస్ నేతృత్వం వహిస్తున్నారు. యోసేబు స్వయానా చార్లెస్‌కు పిల్లనిచ్చిన మామ కావడం గమనార్హం. వీరివురూ తొలినాళ్లలో టీడీపీలోనే ఉన్నారు. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితం గ్రామంలో అంగన్వాడీ పోస్టు తన భార్యకు ఇవ్వాలని చార్లెస్ తన మామపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటి టీడీపీ నేతల రాజకీయ కారణాలతో యోసేబు నిరాకరించాడు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా వీరు చీలడంతో ఆధిపత్యం కోసం గొడవలు ఆరంభమయ్యాయి. కొంతకాలానికి తారస్థాయికి చేరాయి. రెండేళ్ల క్రితం సర్పంచ్ యోసేబు కాలనీలో భయోత్పాతం సృష్టించి చార్లెస్ వర్గాన్ని టార్గెట్ చేశాడు. టీడీపీ నేతల ప్రోద్బలంతో చార్లెస్‌ను ఊరొదిలి వెళ్లేలా చేశాడు. చార్లెస్ కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలులేని పరిస్థితులను టీడీపీ నేతలు కల్పించారు. ఆత్మకూరులో మొహరించిన పోలీసులు గ్రామంలో పెద్దలు చార్లెస్‌కు మద్దతుగా వచ్చినా.. పోలీస్ అధికారులతో వారిని దుర్భాషలాడించారు. చేసేదేమీ లేని పరిస్థితుల్లో చార్లెస్, అతని అనుచరులకు గ్రామ శివారులో స్థానిక పెద్దలు ఆశ్రయం కల్పించారు. ఎన్నికల రోజు కూడా గ్రామంలో యోసేబు వర్గం చార్లెస్ వర్గంపై దాడులకు యత్నించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ప్రతి దాడులేమీ లేకపోయినా.. యోసేబు వర్గం మొత్తం ఊరొదిలి వెళ్లింది. ఆ తర్వాతే గ్రామ శివారులో తలదాచుకున్న చార్లెస్ తన అనుచరులతో కలిసి కాలనీకి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు గ్రామంలో అంగన్వాడీ పోస్టు మామా, అల్లుళ్ల మధ్య చిచ్చు రేపిందని చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో రాజీలు జరిగి రెండు వర్గాలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారన్నారు. దాడులు జరగలేదు ఆత్మకూరు గ్రామానికి తిరిగి వచ్చిన యోసేబు వర్గంలోని కొందరు అసలు ఏం జరిగిందో ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం మారగానే చార్లెస్ వర్గం దాడులు చేస్తారనే భయంతోనే ఊరు వదిలి వెళ్లామని యోసేబు వర్గానికి చెందిన కిన్నెర రాబర్ట్ స్పష్టం చేశాడు. కిన్నెర రాబర్ట్ స్వయానా చార్లెస్‌కు మేనమామ కూడా. ఇలా ఊరొదిలి వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోందని రాబర్ట్ చెప్పాడు. తమపై దాడులు జరగలేదని స్వయంగా యోసేబు కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తన బంధువును చార్లెస్ భయపెట్టాడని, ఆ తర్వాత తమపై దాడులు జరుగుతాయని భావించి ఊరొదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను చూసి.. కాపీ బాబు కుట్ర 1989లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామంలో పూరి పాకలను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. అప్పట్లో గ్రామానికి ఎన్టీఆర్ పరామర్శకు వచ్చారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. దాడులు ఏవీ జరగకున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ నేతలు యరపతినేని, కోడెల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు రచించారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కుట్రలకు పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడంపై మండిపడుతున్నారు. పోలీసుల హామీ మేరకు వచ్చాం మా బంధువుల్లోనే వివాదం వల్ల ఆందోళన చెంది బయటకు వెళ్లాం. పోలీసుల హామీ వల్ల తిరిగి గ్రామానికి వచ్చాం. మా మధ్య ఎటువంటి రాజకీయ గొడవలూ లేవు. పోలీసుల చొరవతో మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. – పేరువాల యోసేబు, టీడీపీ నేత, ఆత్మకూరు మా మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి మా సామాజికవర్గానికి చెందిన వారిలోనే విభేదాలు ఉండి గతంలో గొడవ పడ్డాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. గత ఐదేళ్లలో అధికారం అండతో మా ప్రత్యర్థి వర్గం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల టీడీపీ ఓటమిపాలు కావడంతో మేం వారిపై దాడి చేస్తామోననే భయంతో వారు ఊరు విడిచి వెళ్లారు. మా గొడవలకు రాజకీయాలతో సంబంధం లేదు. – మందా చార్లెస్, ఆత్మకూరు గ్రామంలో రాజకీయ గొడవలు లేవు.. మా గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ గొడవలు లేవు. మేము అందరం కలిసి ఉంటున్నాం. టీడీపీలో ఉన్న ఎస్సీల బంధువర్గంలో విభేదాల వలన చిన్న వివాదాలను పెద్దవిగా చేసి రాజకీయరంగు పులిమారు. మా గ్రామంపై విష ప్రచారం చేయటం దారుణం. – రాయపరెడ్డి, గ్రామపెద్ద, ఆత్మకూరు దాడులు నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలపై మా పార్టీ నాయకులు దాడి చేశారని, వారి నుంచి ఎస్సీలకు ప్రాణహాని ఉందని, గ్రామంలో వారికి రక్షణ లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చౌకబారు విమర్శలు చేసి చంద్రబాబు తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. మా పార్టీ వర్గీయులు దాడి చేయడం వల్ల గ్రామంలో ఎస్సీ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేయడం వల్లే వాళ్లు గ్రామం విడిచి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. వాస్తవం కానట్లయితే పల్నాడు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే