Cyanide
-
తాగే నీళ్లలో, తినే అన్నంలో సైనైడ్.. సీరియల్ కిల్లర్ రియల్ స్టోరీ!
సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలను చూపిస్తుంటారు. అవి చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. బాబూ అనిపించకమానదు. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు. నమ్మిస్తూనే గొంతు కోస్తారు. ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్'. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి (డిసెంబర్ 22) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు ఆధారమైన నిజ సంఘటనలపై ఈ ప్రత్యేక కథనం.. ఇంటి పెద్దతో హత్యలు మొదలు జూలీ జోసెఫ్‌ది కేరళ కోజికోడ్‌లోని కూడతాయి గ్రామం. ఈమె పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. వాళ్లంతా తన సొంత ఇంటిసభ్యులే కావడం గమనార్హం! 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్ గ్లాసు నీళ్లు తాగి చనిపోయింది. దీన్ని వైద్యులు గుండెపోటు అని తేల్చారు. ఆరేళ్ల తర్వాత 2008లో జూలీ మామయ్య టామ్ థామస్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో జూలీ భర్త రాయ్ థామస్ కడుపు నిండా భోజనం చేశాక బాత్రూమ్లో విగతజీవిగా కనిపించాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. అనుమానించినందుకు అతడ్నీ చంపేసింది కానీ అన్నమ్మ సోదరుడు మాథ్యూ మాత్రం ఏదో జరుగుతోందని అనుమానించాడు. అది కనిపెట్టేలోపే అతడిని కూడా మట్టుపెట్టింది జూలీ. 2014లో విస్కీలో విషం కలిపి చంపింది. రెండేళ్ల తర్వాత.. 2016లో తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను సైతం చంపేసింది. ఆ తర్వాత షాజు జచారయ్యను రెండో పెళ్లి చేసుకుంది జూలీ. అయితే అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదో జరుగుతోందని అమెరికాలో ఉన్న రాయ్ థామస్ సోదరుడు రోజో అనుమానించాడు. అటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటం.. తర్వాత మరిన్ని మరణాలు సంభవించడంతో రోజో అనుమానం బలపడింది. నమ్మలేని నిజాలు వెలుగులోకి.. అతడి ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూలీ తన భర్త తినే అన్నంలో సైనైడ్ పెట్టి చంపిందని తేలింది. అంతేకాదు మిగతా ఐదుగురినీ సైనైడ్ సాయంతోనే హత్య చేసిందని తేలింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరి ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ఎట్టకేలకు ఆమెను దోషిగా తేల్చిన పోలీసులు 2019 అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన ఎమ్ఎస్. మాథ్యూ, ప్రాజీ కుమార్‌లపైనా చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ఆధారంగా సీరియల్.. అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఆధారంగా 'కూడతయి' అనే మలయాళ సీరియల్ వచ్చింది. అలాగే 'డెత్, లైస్ అండ్ సైనైడ్' పేరిట ఓ పాడ్‌క్యాస్ట్ కూడా రిలీజైంది. 'క్రైమ్ పెట్రోల్ సతర్క్' రెండో సీజన్లో 100-102 ఎపిసోడ్ల మధ్యలో ఈ కేసును కళ్లకు కట్టినట్లు చూపించారు. 'దహాద్' వెబ్ సిరీస్ కూడా ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసినట్లు కనిపిస్తుంది. జూలీని అమ్మ అని పిలవడానికి ఇష్టపడని కుమారుడు ఇకపోతే 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించాడు. షాలిని ఉషాదేవి రచయితగా పని చేసింది. ఈ సిరీస్‌లో హత్యలు జరిగిన ప్రదేశాన్ని సరిగా చూపించకపోవడంతో సహజత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాయ్ థామస్ సోదరుడు రోజో, సోదరి రెంజీ థామస్ డాక్యుమెంటరీలో భాగమై తమ అనుభవాలు చెప్పారు. అలాగే జూలీ పెద్ద కుమారుడు సైతం ఈ సినిమాలో ఉన్నాడు. అతడు జూలీని తన తల్లిగా సంభోదించడానికి ఇష్టపడలేదు. ఆమెను ఆ మహిళ లేదా జూలీ అనే ప్రస్తావిస్తూ మాట్లాడాడు. చదవండి: త్రిష, చిరంజీవిపై కేసు.. పబ్లిసిటీ స్టంట్ అంటూ కోర్టు ఫైర్! -
చిన్న క్లూ లేకుండా ప్లాన్ చేసి భార్యను అంతమొందించాడు..కానీ చివరికి
చాలా తెలివిగా ప్లాన్ చేసి భార్యను కడతేర్చాడు. చివరికి వైద్యులు కూడా బ్రెయిన్ డెడ్‌తో ఆమె చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఐతే ఒక నెలలో మూడుసార్లు ఆస్పత్రి పాలై ఒకేలాంటి లక్షణాలను చూపించడంతో ప్రారంభమైన అనుమానమే..అసలు కుట్రని బయటపెట్టించి హంతకుడిని పట్టించేలా చేసింది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని క్రెయిగ్ అనే డెంటిస్ట్ భార్య ఏంజెలా సడెన్‌గా చనిపోయింది. వైద్యులు కూడా ఆమె బ్రెయిన్‌డెడ్ అన్నారు. ఐతే ఒకే నెలలో మూడు సార్లు ఆస్పత్రికి వెళ్లడం ఒకేలాంటి లక్షణాలను చూపించడం తదితరాలను పరిశీలించిన పోలీసులు అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె మెడికల్ రిపోర్టు ఆధారంగా ఆమె శరరీంలో ఆర్సెనిక్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో పోలీసులు ఆమెను భర్తే హత్య చేశాడనే అనుమానంతో క్రెయిగ్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను విచారణలో ఆమెకు క్రమం తప్పకుండా తానే స్వయంగా ప్రోటీన షేక్‌లు ఇస్తున్నట్లు తెలిపాడు. వాటిని తాగిన కొద్దిసేపటిలోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రికి చేరడం జరిగందని, ఇలా మొత్తం మూడుసార్లు జరిగిందని పోలీసులు చెప్పారు. చివరిసారి ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయే పరిస్థితికి దారితీసిందన్నారు. అలాగే అతడు ఎలాంటి క్లూ లేకుండా ఎలాంటి విషంతో హతమార్చవచ్చో ఆన్లైన్లో పలుమార్లు శోధించినట్లు తెలిపారు. ఎన్నిగ్రాములు సైనేడ్ కలిపితే పోస్ట్‌మార్టంలో గుర్తించలేరో తెలసుకుని మరీ ఈ దారుణానికి ఒడగట్టాడని చెప్పారు. అంతేగాదు భార్య రెండురోజుల్లో ఆస్పత్రిలో చేరుతుందనగా కూడా పోటాషియం సైనేడ్‌ని ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఏంజెలా సోదరి టోనీ కోఫోడ్ కూడా నిందితుడు క్రెయిగ్ టీనేజ్ నుంచే అశ్లీలతలకు బానిసయ్యాడని, చాలామంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపింది. తన భార్య ఏంజెలాకు క్రెయిగ్ ఈ డ్రగ్‌ని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ఇస్తున్నట్లు చెపింది. అదీగాక అతడి భార్య ఏదో మత్తుమందు తాగినట్లు అనిపించిదంటూ తన భర్త మొబైల్‌కు మెసేజ్ చేసిందని కూడా పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆ వ్యక్తిపై పలు ఆరోపణలు మోపి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంతవరకు కూడా తన ఆరుగురు పిల్లలను సైతం కలిసేందుకు వీలులేదని కోర్టు అతనికి స్పష్టం చేసింది. (చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..) -
'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అమీర్‌పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్‌కుమార్ కుటుంబం మధురానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్ (26)ఓ యువతిని ప్రేమిచాడు. చదవండి: సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్ వెళ్లి విశాల్‌ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. సెనైడ్ ఎలా వచ్చింది? సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ సెనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే విశాల్‌కు సెనైడ్ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి -
నెల క్రితం భార్య హత్య.. చిక్కననుకున్నాడు.. కానీ..!
గాంధీనగర్: గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దాంపత్య జీవితంలో గొడవల కారణంగా సైనైడ్ ఇంజెక్ట్ చేసి భార్యను హత్య చేశాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులకు లభించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘జిగ్నేష్ పటేల్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ వాసవ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కాగా దాదాపు నెల క్రితం జూలై 8న అతడి భార్యకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు చికిత్స పొందుతున్నప్పుడు, నిందితుడు దొంగతనంగా సైనైడ్ టాబ్లెట్‌తో ఓ ద్రావణాన్ని తయారు చేశాడు. తర్వాత వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది లేనప్పుడు సిరంజిని ఉపయోగించి ఆమెకు జత చేసిన డ్రిప్ బాటిల్లోకి ఆ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేశాడు. అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే బాధితురాలు మరణించింది. ఆపై పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం వాసవ శరీరంలోకి సైనైడ్ ఇంజెక్ట్ చేయడంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆమె భర్త జిగ్నేశ్ పటేల్ ఆంక్లేశ్వరంలోని ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేశాడు.’’ అని పోలీసు అధికారి తెలిపారు. -
పప్ఫర్ ఫిష్.. ఈ చేప సైనెడ్ కంటే విషపూరితం
దక్షిణాఫ్రికాలోని మిజెన్బర్గ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన మృత చేపలివీ. వీటిని పప్ఫర్ ఫిష్ అంటారు. అత్యంత ప్రమాదకరమైనవి. సైనెడ్ కంటే విషపూరితం. తింటే కొన్ని గంటల్లో మరణిస్తారని స్థానికులు చెప్పారు. ఇవి ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. తద్వారా గుండెపోటు దారితీస్తుంది. చదవండి: (వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో!) -
సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా సినిమా
ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘సైనైడ్’. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన తనిష్టా చటర్జీ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘లయన్, బియాండ్ క్లౌడ్స్, షాడోస్ ఆఫ్ ది నైట్స్’ వంటి విదేశీ చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనిష్టా. ‘రోమ్ రోమ్ మెమ్, అన్పోస్టెడ్’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారామె. ‘సైనైడ్’లో తనిష్టా భాగమవ్వడం గురించి చిత్రనిర్మాతలు ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తనిష్టా చటర్జీ రాకతో మా ‘సైనైడ్’ టీమ్ మరింత బలపడింది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసుని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు రాజేష్ టచ్‌రివర్. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
సైనైడ్‌లో...
జాతీయ పురస్కారగ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సైనైడ్’. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు సిద్ధిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు నటించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు వేరే అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే అవార్డులు అందుకున్న రంగాయన రఘు కూడా నటించనున్నారు. అదే విధంగా మణికంఠన్ ఆచారి, శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ కూడా మా చిత్రంలో నటించనున్నారు’’ అన్నారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం: జార్జ్ జోసెఫ్, సంగీతం: డాక్టర్ గోపాల శంకర్. -
ప్రియమణి.. సంచలనాత్మక సైనైడ్
జాతీయ అవార్డుగ్రహీత ప్రియమణి నటించనున్న తాజా చిత్రం ‘సైనైడ్’. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మిడిల్ ఈస్ట్ సినిమా పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించనుండగా, హిందీలో యశ్ పాల్ శర్మ నటించనున్నారు. రాజేష్ టచ్‌రివర్ మాట్లాడుతూ.. ‘‘సైనైడ్ ఇచ్చి 20మంది యువతులను హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రియమణి ఇందులో పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారు’’ అన్నారు. ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సదాత్ సైనూద్దీన్, సంగీతం: జార్జ్ జోసెఫ్. -
సైనేడ్ కిల్లర్ మోహన్ దోషి
యశవంతపుర: కేరళలోని కాసరగోడులో ఓ యువతిపై ఆత్యాచారంతో పాటు అనేక కేసుల్లో దోషి అయిన సైనేడ్ మోహన్ మరో కేసులోనూ దోషిగా తేలాడు. ఈ మేరకు మంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. యువతిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి అత్యాచారం చేసి హత్య చేశాడు. మోహన్‌పై ఇలా 20 కేసులు నమోదు కాగా 19 కేసుల్లో కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. ఇందులో నాలుగు కేసుల్లో మరణశిక్షతో పాటు 15 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ నెల 24న మోహన్‌కు మిగిలిన ఒక్క కేసులోనూ కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది. యువతిని మభ్యపెట్టి హత్య కాసరగోడులో మహిళా హాస్టల్లో వంటమనిషిగా పని చేస్తున్న 25 ఏళ్లు యువతిని 2009లో మోహన్ పరిచయం చేసుకొన్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. 2009 జులై 8న మంగళూరు సుళ్యలోని దేవస్థానికి వెళ్దామని ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాం, త్వరలో ఇంటికి వస్తామని యువతి కుటుంబసభ్యులను నమ్మించాడు. బెంగళూరులో ఒక లాడ్జిలో రూం తీసుకొని యువతిపై ఆత్యాచారం చేశాడు. జులై 15న గర్భ నిరోధక మాత్ర అంటూ మెజెస్టిక్ బస్టాండ్‌లో సైనైడ్ మాత్రను మింగించాడు. ఆమె పబ్లిక్ టాయ్‌లెట్ వద్దకు వెళ్లి కుప్పకూలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఏమీ తెలియనట్లు మోహన్ జారుకున్నాడు. పోలీసులు అపరిచిత యువతి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి 2009 అక్టోబర్‌లో మోహన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా దిగ్భ్రాంతి గొలిపే దారుణాలను బయటపెట్టాడు. ఇదే మాదిరిగా ఎంతో మంది మహిళలను మభ్యపెట్టి సైనేడ్ ఇచ్చి హత్య చేసినట్లు వివరించాడు. ఇందులో ఎక్కువమంది కేరళ, మంగళూరు ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. బాధిత మహిళల కుమారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మోహన్‌కు అనేక కేసుల్లో కోర్టు శిక్షలను విధించింది. ప్రస్తుతం ఇతడు బెళగావి జైల్లో ఉన్నాడు. -
సైనైడ్ పదార్థమిచ్చి అమ్మాయిలను దారుణంగా..
మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్ చేసి ఆపై హత్య చేసిన సీరియల్ కిల్లర్' సైనైడ్' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్ మోహన్.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్ చేసి హతమార్చాడు. కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్లో పోలీసులకు పట్టుబడిన మోహన్ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. -
వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం
ఏలూరు టౌన్: సీరియల్ సైనైడ్ కిల్లర్ వెల్లంకి సింహాద్రి హత్యలు చేయటంలో ఆరితేరిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తినే పదార్థంలో సైనైడ్ పెట్టి తినిపిస్తే అది పోస్టుమార్టంలో సైతం తెలియదా? ఈ విషయం తెలిసే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు వంగాయగూడెంకు చెందిన ఫైనాన్స్ ఆఫీస్‌లో గుమస్తాగా పనిచేసే చోడవరపు సూర్యనారాయణ హత్య అనంతరం అతని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో సైతం అది సహజ మరణంగానే నిర్థారణ కావటం అంతుచిక్కని అంశంగా మారింది. విష ప్రయోగం ఏమీ జరగలేదని ఎఫ్ఎల్సీ రిపోర్టులో రావటం కూడా అనుమానాలకు దారితీస్తోంది. పరిచయాలతోనే బోల్తా.. సింహాద్రి చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. పైకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దురాగతాలకు పాల్పడడం ప్రారంభించాడు. ఐదేళ్ల క్రితమే ఏలూరు వచ్చిన సింహాద్రి మెల్లగా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. వ్యక్తులను మోసం చేసే సమయంలో డబ్బు, బంగారం దోచుకోవాలంటే పెనుగులాట జరిగితే, ఒంటిపై గాయాలు ఉంటే పోలీసులు అనుమానిస్తారనే విషయాన్ని గ్రహించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆఖరికి సాధారణ పోస్టుమార్టం రిపోర్టులోనూ ఏవిధమైన అనుమానం రాదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయిలో వినూత్నరీతిలో హత్యలకు ప్రణాళికలు రచించాడు. కేవలం పక్షం రోజుల వ్యవధి మాత్రమే తీసుకుంటూ అత్యంత చాకచక్యంగా హత్యలు చేయటం మొదలెట్టాడు. హత్యల్లో ఏ విధమైన అనుమానాలు రాకుండా పొటాషియం సైనైడ్‌ను ఎంచుకున్నాడు. మృతుని శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రత్యేక రీతిలో పరీక్షిస్తే తప్ప విషప్రయోగం జరిగిందనే విషయం నిర్థారణ కాదని అంటున్నారు. పీఈటీ కాటి నాగరాజు హత్య అనంతరం శవపరీక్షలో ఇదే విధమైన రిపోర్టు రాగా, ఎఫ్ఎల్సీ ద్వారానే అసలు విషయం బయటపడిందని పోలీస్‌వర్గాలు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎల్సీ రిపోర్టులో నిర్ధారణ.. ఒక వ్యక్తిపై విషప్రయోగం జరిగితే దాని మోతాదు, చనిపోయిన సమయం, పోస్టుమార్టం నిర్వహించిన సమయం ఆధారంగా రిపోర్టు ఉంటుంది. సైనైడు వినియోగిస్తే ఒక్కోసారి సాధారణ పోస్టుమార్టంలో విషప్రయోగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అప్పుడు మృతుడి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే విషప్రయోగం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుంది. వ్యక్తిపై ప్రయోగించిన విషప్రయోగం మోతాదు ఆధారంగానూ కొన్నిసార్లు నిర్థారణ చేయవచ్చు. గుండె, కాలేయం, కిడ్నీ, జీర్ణాశయం పైనా వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఒక్కోసారి మరుసటి రోజు శవ పరీక్ష నిర్వహిస్తే విషప్రయోగం నిర్థారణలో తేడాలు రావచ్చు. ఇలా విషపదార్థం, మోతాదు, శవపరీక్ష చేసే కాలం ఇలా అనేక కోణాల్లో నిర్థారణపై ప్రభావం ఉంటుంది. – డాక్టర్ హరికృష్ణ, ప్రభుత్వాసుపత్రి వైద్యుడు వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం? ఇక సీరియల్ కిల్లర్ సింహాద్రి 2018 ఫిబ్రవరిలో హత్యల పరంపర మొదలు పెట్టి వరుసగా 6 హత్యలు చేస్తూ వచ్చాడు. ఒక్కో హత్యకు సింహాద్రి కేవలం 9 నుంచి 15 రోజులు, మరో హత్యకు 20 రోజులు మాత్రమే సమయం తీసుకున్నాడు. రాజమండ్రి పురుషోత్తపట్నం ఆశ్రమంలో రామకృష్ణానంద స్వామీజిని 2018 ఏప్రిల్ 28న హత్య చేసిన అనంతరం సుమారుగా 8 నెలల వరకూ ఎక్కడా హత్యలు చేసినట్లు పోలీసు విచారణ వెల్లడి కాలేదు. అంటే ఈ 8 నెలల కాలం సింహాద్రి ఎక్కడ ఉన్నాడు.. ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా తన క్రిమినల్ కార్యకలాపాలు సాగించాడా? అనేది సందేహంగా మారింది. తరువాత 2018 డిసెంబర్ 23న 7వ హత్య, వెంటనే 20 రోజుల వ్యవధిలోనే 2019 జనవరి 12న 8వ హత్య చేశాడు. ఈ రెండు సంఘటనల అనంతరం సింహాద్రి మరోసారి 7 నెలల పాటు ఏ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడినట్లు తెలియటంలేదు. ఈ సమయంలో సింహాద్రి ఎక్కడ ఉన్నాడు ? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. నిందితుడు 2019 ఆగస్టు 30న 9వ హత్య, మళ్లీ నెలన్నరలోనే పదో హత్య అక్టోబర్ 16న చేసినట్లు పోలీసు విచారణ తేలింది. ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి. అసలు సీరియల్ కిల్లర్ సింహాద్రి కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాడా? అతను ఒక్కడే ఇన్ని హత్యలు చేశాడా? సింహాద్రి వెనుక ఏమైనా గ్యాంగ్ పనిచేస్తుందా అనేవి తెలియాల్సి ఉంది. -
నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు
ప్రతిచిన్న అంశాన్నీ బూతద్దంలో చూడటం.. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించడం.. అతనిపై నిఘా పెట్టడం.. అవసరమైతే నయానో భయానో నిజం రాబట్టడం.. పోలీసుల నిత్యకృత్యం. అయితే సైనైడ్ కిల్లర్ సింహాద్రి విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా పది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాధితులే కిల్లర్ ఇల్లు చూపించినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను కూడా కిల్లర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైనైడ్ కిల్లర్‌ను ప్రస్తుత పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా.. గతంలో ఉన్న పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఏలూరు టౌన్: ప్రసాదంలో సైనైడ్ పెట్టి వరుస హత్యలతో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సింహాద్రి అలియాస్ శివ కేసులో విస్మయం కలిగించే వాస్తవాలు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. హత్యల విచారణలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం హత్యల పరంపరకు తోడ్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో ఫైనాన్స్ కంపెనీ గుమస్తా చోడవరపు సూర్యనారాయణ హఠాత్తుగా మృతిచెందాడు. ఇది కిల్లర్ సింహాద్రి చేసిన ఐదో హత్య. ఇది హత్యేనని సూర్యనారాయణ కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇదే అదనుగా కిల్లర్ సింహాద్రి మరో ఐదు ప్రాణాలు బలితీసుకున్నాడు. చదవండి : సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు బంధువునని నమ్మించి.. ఏలూరు వన్‌టౌన్ వంగాయగూడెం నీరజ్కాలనీలో నివాసం ఉండే చోడవరపు సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు ఫైనాన్స్ కంపెనీలో గుమస్తా. దగ్గర బంధువుని అంటూ కిల్లర్ సింహాద్రి పరిచయం చేసుకుని బావా అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. సూరిబాబు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములు ఉండటాన్ని సింహాద్రి గమనించి డబ్బులు రెట్టింపు చేస్తానంటూ ఆశజూపించాడు. 2018 ఏప్రిల్ 14న వంగాయగూడెంలోని బాలాజీ స్కూల్ వద్దకు రప్పించి, సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి హత్య చేశాడు. రూ.5 లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలను దోచేశాడు. రెండో హత్యతోనే ఆగేది! కృష్ణా జిల్లా నూజివీడు మండలం మర్రిబంద గ్రామానికి చెందిన పులపు తవిటయ్యను 2018 మార్చి 2న సింహాద్రి హతమార్చాడు. సింహాద్రి హత్యల పరంపరలో ఇది రెండోది. డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి ప్రసాదంలో సైనైడ్ పెట్టి తినిపించి హత్య చేసి, రూ.8 లక్షలతో ఉడాయించాడు. మృతుడి బంధువులు తొలుత గుండెపోటుగా భావించినా తవిటయ్య వద్ద డబ్బు లేకపోవటంతో అనుమానం వచ్చింది. సింహాద్రిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రూ.8 లక్షల నగదు వెనక్కి ఇప్పించి సెటిల్మెంట్ చేశారనే అపవాదు ఉంది. ఫిర్యాదు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు, సింహాద్రిని అరెస్ట్ చూపలేదు. అప్పుడే పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే మరో ఎనిమిది ప్రాణాలను కాపాడి ఉండేవారు. 8వ హత్యలోనూ వైఫల్యమే.. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన వరుసకు వదిన సామంతకుర్తి నాగమణి హత్యలోనూ పోలీసులు ఇదే తరహాలో సింహాద్రిని విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నాగమణిని డబ్బులు రెట్టింపు చేస్తానంటూ నమ్మించటంతో ఆమె కొందరు వ్యక్తుల వద్ద అప్పు చేసిన తెచ్చిన రూ.5 లక్షలు, ఒంటిమీద బంగారు నగలు తీసుకుని సింహాద్రి పరారయ్యాడు. నాగమణి హత్య అనంతరం పోలీసులకు సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారించమని చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా నాగమణికి అప్పులు ఇచ్చిన వ్యక్తిపై హత్య నేరం మోపేందుకు సైతం సింహాద్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రాములమ్మ కుమారుడి ఫిర్యాదు సీరియల్ కిల్లర్ సింహాద్రిపై ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఏలూరు హనుమాన్‌నగర్‌లో సింహాద్రి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని రాములమ్మను ప్రసాదంలో సైనైడ్ కలిపి హత్య చేసి, ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. రాములమ్మ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటూ సింహాద్రి హత్యకు పాల్పడ్డాడు.తండ్రి విజయవాడ కుమారుడి వద్దకు వెళ్లిన రోజు ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా సైనైడ్ పెట్టి హత్య చేసినట్లు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐదు ప్రాణాలు దక్కేవి? ఏలూరు వంగాయగూడెం నీరజ్కాలనీకి చెందిన చోడవరపు సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు అనే వ్యక్తి సీరియల్ కిల్లర్ సింహాద్రి హత్యల చిట్టాలో ఐదో వ్యక్తి. సూరిబాబు 2018 ఏప్రిల్ 14న రాత్రి 9 గంటల సమయంలో బాలాజీ స్కూల్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. తొలుత గుండెపోటుగా భావించిన కుటుంబ సభ్యులకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. సూరిబాబు వద్ద రూ.5 లక్షల నగదు, బంగారు ఉంగరాలు లేకపోవటంతో అనుమానం మరింత పెరిగింది. ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం కూడా ఆరు నెలలు పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోతున్నారు. సుమారుగా 15 నెల లు పోలీసుల చుట్టూ తిరిగినా, అనుమానితుడు సింహాద్రి ఇంటిని చూపించినా పో లీసులు పట్టించుకోలేదని అంటున్నారు. ఒక్కసారీ విచారించలేదు నా భర్త సూరిబాబు చనిపోతే గుండెపోటు అనుకున్నాం. డబ్బులు, బంగారు ఉంగరాలు లేకపోతే అను మానం వచ్చింది. వెల్లంకి సింహాద్రిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. సింహాద్రి ఎన్టీఆర్ కాలనీలో చర్చికి వెళతాడనీ, అక్కడే ఒక ఇంట్లో ఉంటాడని పోలీసులకు చెప్పడంతో పాటు మా బంధువులు వెళ్లి చూపించారు. అయినా సింహాద్రిని ఒక్కసారి కూడా పోలీసులు విచారించలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సింహాద్రి అప్పట్లో తప్పించుకున్నాడు. మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నా. –సత్యవతి, మృతుడు సూరిబాబు భార్య, ఏలూరు పోలీసులు నిర్లక్ష్యం వహించారు మా బాబాయ్ సూరిబాబు చనిపోయిన తర్వాత సింహాద్రిపై అనుమానం వ్యక్తం చేశాం. అతడిని విచారించాలని పలుమార్లు మొత్తుకున్నాం. 15 నెలల పాటు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఆ రోజు రాత్రి 8.40 నిమిషాల వరకూ మాతో మాట్లాడిన సూరిబాబు హఠాత్తుగా చనిపోవటం, డబ్బులు, బంగారం లేకపోవటంతో మాకు సింహాద్రిపై అనుమానం వచ్చింది. అతని ఇల్లు కూడా చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. సూరి బాబు పనిచేసే ఫైనాన్స్ కంపెనీకి సింహాద్రి పలుమార్లు వచ్చేవాడని ఫైనాన్స్ వాళ్లు కూడా చెప్పారు. –ప్రసాదు, మృతుడు సూరిబాబు బంధువు, ఏలూరు పోలీస్ కస్టడీకి కోరాం పది హత్యల నిందితుడు వెల్లంకి సింహాద్రిని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు వినతి చేశాం. సింహాద్రి ఈ జిల్లాలోనే కాకుండా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడు. హత్యల వెనుక కారణాలు ఏమిటనేది విచారణ చేసి తెలుసుకుంటాం. ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయని మృతుల బంధువుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడతాం. కొందరు గుండెపోటుతో మృతిచెందారని భావించిన మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయలేదు. –డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ఏలూరు డీఎస్పీ -
సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు
సాక్షి, తూర్పు గోదావరి: సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..? నూజివీడు తవిటయ్య కుటుంబం ‘సాక్షి ఫేస్ టు ఫేస్’లో చెప్పిన సంచలన వాస్తవాలను ఇక్కడ చూడండి ప్రసాదంలో సైనైడ్ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.. సైనైడ్ సీరియల్ కిల్లర్ శివ అలియాస్ సింహాద్రి.. ఈ హత్యల్లో తన రియల్ ఎస్టేట్ పరిచయాలను వాడుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి వద్ద డబ్బు ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టి.. తనను తాను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్-గా పరిచయం చేసుకొని వారిని నమ్మించాడు. ఆ తర్వాత పూజలు, రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో వారు డబ్బు బయటికి తెచ్చేలా చేసి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించాడు... శివ చేసిన నాలుగో హత్యే ఇందుకు ఉదాహరణ.. తూర్పుగోదావరి జిల్లా ముస్తానాబాద్ పొలాల్లో బాలవెంకటేశ్వర్రావును హతమార్చాడు.. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి -
సైనైడ్ సీరియల్ కిల్లర్‌పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
రైస్ పుల్లింగ్ యంత్రాలతో సైనైడ్ సీరియల్ కిల్లర్ మోసం
-
సైనైడ్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు
-
ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!
ఇంతవరకు ఆ ముగ్గురు సాధారణంగానే మృతి చెందారని భావించారు. అయితే వారిలో ఒకరిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరూ ఊహించన విధంగా ఆ ముగ్గురు హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే రాజమహేంద్రవరంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ముగ్గురిని హత్య చేసింది ఒక్కడే. వారిలో బంధువులైన ఇద్దరు మహిళలను.. ఆశ్రమం స్వామీజీని నిందితుడు హత్య చేశాడు. దీంతో బంధువులు బోరున విలపిస్తుంటే.. ఆశ్రమం పరిసర గ్రామాల వారు అవాక్కయారు. సంచలనం సృష్టించిన ఈ హత్యల ఉదంతం ఇలా ఉంది. సాక్షి, రాజమహేంద్రవరం: ఎవరికీ అనుమానం రాకుండా బంగారు వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతూ నగరంలో మూడు హత్యలు చేసిన ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెల్లంకి సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఈ ముగ్గురిని హత్య చేసిన అతడు ఏమీ ఎరుగనట్టు వారి కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ ఆ తర్వాత తప్పించుకోపోయాడు. చివరకు ఒక హత్య కేసులో దొరకడంతో డొంక కదిలింది. తాను చేసిన పది హత్యల్లో జిల్లాలో ముగ్గురుగు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని రామకృష్ణానంద స్వామీజీ ఆశ్రమం నిర్వాహకుడు రామకృష్ణానంద స్వామి, రాజమహేంద్రవరం పేపరు మిల్లు ప్రాంతానికి చెందిన కొత్తపల్లి నాగమణి, బొమ్మూరు గ్రామానికి చెందిన శామంతకుర్తి నాగమణిలను నిందితుడు హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేటు లాభసాటిగా లేదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత లాభసాటిగా లేదని, సులభంగా డబ్బు సంపాదించాలని సింహాద్రి ఆలోచనలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు ఇంట్లో ఉంటే కోటీశ్వరులు కావచ్చని, గుప్త నిధులు చూపిస్తానని, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించడం మొదలెట్టాడు. సైనేడ్ కలిపిన ప్రసాదం, ఆయుర్వేదం మందు ఇచ్చి.. 20 నెలల్లో పది మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన పీఈటి కాటి నాగరాజు మృతితో భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో జిల్లాకు చెందిన మూడు హత్యలు బయటపడ్డాయి. 2018 ఏప్రిల్ 28న.. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో రామకృష్ణా పరమానంద స్వామీజీ ఆశ్రమంలోని రామకృష్ణానంద స్వామీజీ వద్దకు నిందితుడు భక్తుడిగా స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నిత్యాన్నదానం, పండగలకు హోమాలు స్వామీజీ చేస్తుంటే.. ఆయనతో ఉంటూ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితుడయ్యాడు. స్వామీజీ వద్ద భారీగా సొమ్ము ఉంటుందని భావించి 2018 ఏప్రిల్ 28న ఆయుర్వేద మందులో సైనేడ్ కలిపి ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీజీ బస్టాండ్ వద్ద ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్వామీజీ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారనుకుని అందరూ భావించారు. ఆశ్రమంలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. స్వామిజీ వద్ద నగదు లేకపోవడంతో అతడు వెనుదిరిగాడు. సింహాద్రి పోలీసులకు చిక్కడంతో స్వామీజీ గుండెపోటుతో మరణించలేదని, హత్యకు గురయ్యాడని తెలియడంతో పురుషోత్తపట్నం తదితర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు. స్వామిజీని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం వరకు ఉన్న సింహాద్రి ఆ తరువాత కనిపించ లేదని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీని హత్య చేశారన్న విషయాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నామని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 డిసెంబర్ 23న.. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు క్వార్టర్స్‌లో ఉండే కొత్తపల్లి నాగమణికి సింహాద్రి సమీప బంధువు. చుట్టపు చూపుగా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2018 డిసెంబర్ 23న డయోబెటిక్ మందు అంటూ ఆమెతో సైనేడ్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని బంగారు మంగళ సూత్రం తాడు తీసుకుని పరారయ్యాడు. ఆమెది అందరూ సహజ మరణంగా భావించారు. ఆమె దిన కార్యక్రమాల్లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే అతడు తిరిగాడు. ఈ ఏడాది జనవరి 12న.. కొత్తపల్లి నాగమణిని హత్య చేసిన కొద్దిరోజులకే ఆమె కోడలు, వరుసకు వదిన అయిన బొమ్మూరు గ్రామానికి చెందిన దెందులూరులో హెచ్వీగా పనిచేస్తున్న శామంతకుర్తి నాగమణి (50)ను డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ ఏడాది జనవరి 12న ఆమె ఆలమూరు వెళ్లి యేసురాజు అనే వ్యక్తిని చేబోదులుగా రూ.5 లక్షలు అడిగింది. మధ్యాహ్నం బ్యాంకులో బంగారం పెట్టి ఇస్తానని చెప్పి తీసుకువచ్చింది. మధ్యాహ్నం బొమ్మూరులోని ఇంటి వద్ద సింహాద్రి ప్రసాదం పేరుతో ఆమెకు సైనేడ్ తినిపించి, రూ.5 లక్షలు, బంగారు వస్తువులతో పరారయ్యాడు. బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను అప్పుట్లో బొమ్మూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మర్నాడు సింహాద్రి పోస్టుమార్టం వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇచ్చిన యేసురాజుపై కేసు పెట్టేంచేలా ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులు సైతం అతనికి మద్దతుగా నిలిచారు. తల్లి నాగమణిని, భార్యను అతడు హత్య చేశాడని తెలుసుకున్న భర్త మాణిక్యాలరావు అవాక్కయ్యాడు. కుటుంబ సభ్యుడే ఇలా హత్యలకు పాల్పడడాన్ని వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. బాధలో ఉన్న తమను ఇంక వదిలేయాలని ప్రాధేయపడ్డారు. -
పోలీసులకు సీరియల్ కిల్లర్ సవాల్..!
తిరువనంతపురం : ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని హతమార్చిన కిరాతక మహిళ జూలీ అమ్మా జోసెఫ్ కేసుపై కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ సవాల్‌తో కూడుకున్నదని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల క్రితం మొదటి హత్య, మూడేళ్ల క్రితం ఆరో హత్య జరిగిన నేపథ్యంలో ఆధారాల సేకరణ క్లిష్టంగా మారిందని అన్నారు. అయినప్పటికీ కేసు సమగ్ర విచారణకు ఆరు బందాల్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలు జూలీ, ఆమెకు సెనైడ్ సప్లై చేసిన ఎం.ఎస్ మాథ్యూ, జ్యూయెలరీ స్టోర్ మేనేజర్ ప్రజూ కుమార్‌లు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తన మొదటి భర్త రాయ్ థామస్ హత్య కేసులో కింది కోర్టు గురువారం ఈ ముగ్గురికీ రిమాండ్ విధించింది. ఆరు రోజుల పోలీసులు కస్టడీలో ఉన్న నిందితుల్ని పోలీసులు పలుమార్లు విచారించారు. జూలీ రెండో భర్త షాజు కూడా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి :14 ఏళ్లు.. 6 హత్యలు) ఆరు కేసులు వేటికవే ప్రత్యేకం.. ‘ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి’అని డీజీపీ బెహ్రా వెల్లడించారు. ఈ హత్యలపై శుక్రవారం 5 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అనుమానం కలిగిందిలా.. తన భర్త రాయ్ థామస్ 2008 ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు జూలీ అల్లిన కథను అందరూ నమ్మారు. అయితే, ఇక్కడే ఆమె పథకం పారలేదు. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే తన అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడంపై అమెరికాలో ఉండే అతని సోదరుడు మోజోకు అనుమానం వచ్చింది. దాంతోపాటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటంతో మోజో అనుమానం మరింత బలపడింది. అతని ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడుతున్నాయి. పూర్తి ఆధారాల సేకరణ అనంతరం కేసు కొలిక్కి రానుంది. -
14 ఏళ్లు.. 6 హత్యలు
కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్‌ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్‌ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు. -
లైంగికంగా హింసించి సైనేడ్‌తో మట్టుబెట్టి
బనశంకరి : మహిళలను లైంగికంగా హింసించి అనంతరం వారిని సైనేడ్‌తో మట్టుబెట్టిన కిరాతకుడు, సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్‌కు కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మారుస్తూ గురువారం తీర్పుచెప్పింది. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలో 2004 నుంచి 2009 వరకు 20 మంది మహిళలపై అతికిరాతకంగా అత్యాచారం అనంతరం వారిని సైనేడ్‌తో హత్య చేసిన మోహన్ కుమార్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో తీవ్ర సంచలనం రేగింది. ఈ ఆరోపణలపై దక్షిణ కన్నడ జిల్లా 4వ అదనపు సెషన్స్ కోర్టు మోహన్‌కు మరణశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సైనేడ్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తులు రవి మళిమఠ్, మైకన్‌కున్హా కేసు విచారణ చేసి మరణశిక్షను రద్దు చేసి జీవితఖైదుగా తీర్పు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందితుడిని బయటకు విడుదల చేయరాదని, అతడు సమాజంలో జీవించడానికి అర్హుడు కాదని, అతడిని క్షమించడానికి వీలు లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. -
బర్త్‌డే విషాదం..
సాక్షి, బెంగళూరు: జ్యూస్‌గా భావించి సైనేడ్ తాగిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన బుధవారం రాత్రి సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంకర్, సంజయ్‌సింగ్ కుటుంబాలు కొన్నేళ్లుగా నగరంలో నివాసం ఉంటున్నాయి. శంకర్ కిలారు రోడ్డులో నివాసం ఉంటుండగా, సంజయ్ సింగ్ కబ్బన్ పేటలో ఉంటున్నారు. శంకర్ బంగారు వ్యాపారి కాగా ఇతని కుమారుడు సాయిల్ శంకర్ (9). సంజయ్ దంపతుల కుమారుడు ఆర్యన్ సింగ్ (9). సాయిల్, ఆర్యన్ పుట్టిన రోజు బుధవారం కావడంతో బాలుర కుటుంబ సభ్యులు వీరి బర్త్‌డే పార్టీని శంకర్ నివాసంలో ఏర్పాట్లు చేశారు. రాత్రి కేక్ కట్ చేసిన అనంతరం కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సమయంలో బంగారు ఆభరణాలకు ఉపయోగించే సైనేడ్‌ను చూసిన ఇద్దరు చిన్నారులు దానిని పొరపాలుగా జ్యూస్‌గా భావించి తాగేశారు. క్షణాల్లో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో విక్టోరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైనేడ్ మల్లికకు జీవిత ఖైదు
బెంగళూరు : మహిళలను పరిచయం చేసుకుని.. ఆపై నమ్మకం ఏర్పడిన తర్వాత వారికి ఆహార పదార్థాలల్లో సైనేడ్ కలిపి ఇచ్చి... హత్య చేసి... సదరు మహిళల బంగారాన్ని దోచుకు వెళ్తున్న మల్లిక నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కనకపుర రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. మల్లికపై పదికి పైగా హత్యకేసుల్లో నిందితురాలిగా ఉంది. 2007లో కనకపుర తాలూకాలోని కబ్బాళమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఎలిజెబెత్ జోసెఫ్ అనే మహిళతో మల్లిక స్నేహం చేసింది. ఆ క్రమంలో ఆమెకు సైనేడ్ కలపిన ఆహారం ఇచ్చి హత్య చేసింది. అనంతరం ఆమె నగలతో ఉడాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సాతనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో మల్లికను అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత కనపుర రెండవ అదనపు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ నేరం రుజువు కావడంతోపాటు మల్లికపై మరో రెండు హత్య కేసులు, దోపిడి కేసులో భాగస్వామి అని న్యాయమూర్తి నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ కింద 302 కింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఏడాది కఠిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.