
తనిష్టా చటర్జీ
ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘సైనైడ్’. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన తనిష్టా చటర్జీ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘లయన్, బియాండ్ క్లౌడ్స్, షాడోస్ ఆఫ్ ది నైట్స్’ వంటి విదేశీ చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనిష్టా. ‘రోమ్ రోమ్ మెమ్, అన్‌పోస్టెడ్’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారామె.
‘సైనైడ్’లో తనిష్టా భాగమవ్వడం గురించి చిత్రనిర్మాతలు ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తనిష్టా చటర్జీ రాకతో మా ‘సైనైడ్’ టీమ్ మరింత బలపడింది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసుని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు రాజేష్ టచ్‌రివర్. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment