
రంగాయన రఘు, సిద్ధిఖ్
జాతీయ పురస్కారగ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సైనైడ్’. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు సిద్ధిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు నటించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు వేరే అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే అవార్డులు అందుకున్న రంగాయన రఘు కూడా నటించనున్నారు. అదే విధంగా మణికంఠన్ ఆచారి, శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ కూడా మా చిత్రంలో నటించనున్నారు’’ అన్నారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం: జార్జ్ జోసెఫ్, సంగీతం: డాక్టర్ గోపాల శంకర్.
Comments
Please login to add a commentAdd a comment