Rajesh Touch River
-
సైనైడ్‌లో...
జాతీయ పురస్కారగ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సైనైడ్’. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు సిద్ధిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు నటించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు వేరే అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే అవార్డులు అందుకున్న రంగాయన రఘు కూడా నటించనున్నారు. అదే విధంగా మణికంఠన్ ఆచారి, శ్రీజిత్ రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ కూడా మా చిత్రంలో నటించనున్నారు’’ అన్నారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం: జార్జ్ జోసెఫ్, సంగీతం: డాక్టర్ గోపాల శంకర్. -
సెన్సార్ ఇబ్బందుల్లో ‘రక్తం’
ప్రముఖ దర్శకుడు, జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ తను రూపొందించిన రక్తం చిత్రానికి సెన్సార్ సభ్యులు తెలిపిన అభ్యంతరాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు ఇంటర్నేషనల్ అవార్డులు, ఐదు నామినేషన్లకు ఎంపికైన ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు తెలిపిన అభ్యంతరాలు సంతృప్తికరంగా లేవని ఆయన అన్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా, మానవీయ కోణంలో చిత్రీరించిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు చెప్పిన అభ్యంతరాలు సరైనవి కావు. 2(12) గైడ్ లైన్స్ ప్రకారం కట్స్ ఇచ్చామని రిపోర్ట్ పంపించారు. వాళ్లు సూచించిన గైడ్ లైన్స్ చదవగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇద్దరు విప్లవకారుల మధ్య జరిగే సీరియస్ సంభాషణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం సెక్స్‌వల్ గా తప్పుదారి పట్టించేదేంటో నాకు అర్థం కాలేదు. సామాజిక పరివర్తన కోసం రక్తం చిందించడం అవసరమా? అనే సెన్సిబుల్ కథంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యలు చెప్పిన అభ్యంతరాలు చిత్ర కథను చిన్నాభిన్నం చేసేలా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామన్నారు. ఈ చిత్రంలో బెనర్జీ, సంజు శివరామ్, మధుశాలినీ, సన, జాన్ కోటోలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
సిగ్గుగా ఉంది!
‘‘ఇదొక కళాఖండం. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు సమాజానికి చాలా అవసరం’’ అని కథానాయిక సమంత అన్నారు. ఆమె చెబుతున్నది ‘నా బంగారు తల్లి’ చిత్రం గురించి. రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సమంత ‘ఇప్పటివరకు ఇలాంటి చిత్రంలో నటించనందుకు సిగ్గుగా ఉంది’ అని పేర్కొనడంతో పాటు, ఇది అందరూ చూడదగ్గ చిత్రం అని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెరరూపం ఇస్తే, ఆర్ట్ సినిమాలా ఉంటుందేమో అని ఎక్కువమంది చూడరు. అందరికీ ఈ సందేశం చేరాలనే నా వంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నా. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. అయితే ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిటైర్ అయ్యేలోపు ఇలాంటిది ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది’’ అన్నారు.