సాక్షి, తూర్పు గోదావరి: సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..?
నూజివీడు తవిటయ్య కుటుంబం ‘సాక్షి ఫేస్ టు ఫేస్’లో చెప్పిన సంచలన వాస్తవాలను ఇక్కడ చూడండి
ప్రసాదంలో సైనైడ్ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ..
సైనైడ్ సీరియల్ కిల్లర్ శివ అలియాస్ సింహాద్రి.. ఈ హత్యల్లో తన రియల్ ఎస్టేట్ పరిచయాలను వాడుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి వద్ద డబ్బు ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టి.. తనను తాను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్-గా పరిచయం చేసుకొని వారిని నమ్మించాడు. ఆ తర్వాత పూజలు, రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో వారు డబ్బు బయటికి తెచ్చేలా చేసి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించాడు... శివ చేసిన నాలుగో హత్యే ఇందుకు ఉదాహరణ.. తూర్పుగోదావరి జిల్లా ముస్తానాబాద్ పొలాల్లో బాలవెంకటేశ్వర్రావును హతమార్చాడు..
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment