టోక్యో: తొమ్మిదిమంది అమాయకులను హతమార్చిన ‘ట్విటర్ కిల్లర్’ తకాహిరొ షిరాయిషికి టోక్యో కోర్టు మంగళవారం మరణ దండన విధించింది. నిందితుడి తరపు లాయర్ వాదనలు తోసిపుచ్చింది. ఒక మనిషిని ‘వారి సమ్మతితోనే ప్రాణాలు తీశాడు అనడం’అర్థ రహితమని కొట్టి పడేసింది. వివరాలు. తకాహిరొ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విటర్‌లో పరిచయం చేసుకున్నాడు.
వారి జీవిత విశేషాలను తెలుసుకుని, సమస్యలేవైనా ఉంటే సాయం చేస్తానని చెప్పాడు. అలా జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్న తొమ్మిది మందితో స్నేహం చేశాడు. తాను కూడా జీవితాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను అని నమ్మబలికాడు. కలిసి చనిపోదామని చెప్పి.. ముందుగా వారి ప్రాణాలు తీశాడు. అలా ఒక్కొక్కరుగా 9 మందిని చంపేశాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు పోలీసుల విచారణలో తేలింది. తకాహిరొపై ఓ అత్యాచారం కేసు నమోదైంది.
మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో తకాహిరొ హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. తకాహిరొ తో ఆమె తరుచూ ట్విటర్‌లో సంప్రదించినట్టు గుర్తించడంతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం.
(చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్)
చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్ వాదించాడు. అయితే, బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉండటం అంటే.. దాని అర్థం వారి సమ్మతి లేదని, బాధితులు ప్రతిఘటించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాగా, విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గది బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. కూల్ బాక్సుల్లో దాచి ఉంచిన మృత దేహాల శరీర భాగాలు, 240 ఎముకలు బయటపడ్డాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్ టాప్‌లో ఉంది. అయితే, ఇక్కడే అత్యధికంగా ప్రతయేడు 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలవరపరిచే అంశం.
(చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు)
Comments
Please login to add a commentAdd a comment