ఢాకా: హెర్క్యులస్.. ఈ పేరు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మారుమ్రోగుతోంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ సినిమా గుర్తుందా?. ఆ సినిమాలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని పెట్రోల్ పోసి తగలపెడతాడు హీరో. అలాంటివాడే ఈ హెర్క్యులస్. గత రెండు వారాల వ్యవధిలో.. ముగ్గరు ‘గ్యాంగ్ రేప్’ నిందితులు హత్యకు గురయ్యారు. వారిని హత్య చేసిన విధానం ఒకేలా ఉంది. మృతదేహాల మెడలో, వారు చేసిన నేర వివరాలున్న కాగితం ఉంది. ఫిబ్రవరి 1న పోలీసులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మదరసాలో చదివే ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేసినవారిలో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తి మృతదేహమది. ‘నా పేరు రాకిబ్. నేనో రేపిస్ట్‌ను. మదరసాలో చదివే ఓ యువతిని రేప్ చేశా’ అని మృతదేహం మెడలోని కాగితంలో రాసిఉంది. ‘రేప్‌లకు ఫలితం ఇదే. రేపిస్ట్‌లూ జాగ్రత్త – హెర్క్యులస్’ అనే మరో వాక్యం ఉంది. అదే గ్యాంగ్ రేప్‌లో పాల్గొన్న మరో నిందితుడు సాజల్ మృతదేహాన్ని జనవరి 24న పోలీసులు గుర్తించారు. అంతకుముందు, ఓ పరిశ్రమ కార్మికురాలిని గ్యాంగ్‌రేప్ చేసిన నిందితుడి మృతదేహం ఇదే స్థితిలో లభ్యమైంది. దీంతో పోలీసులు హెర్క్యులస్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment