కన్న బిడ్డలని చంపేసింది: ఆమెని విడుదల చేయండి | Scientists Call For The Release Of Australia Female Serial Killer: Know The Reasons | Sakshi
Sakshi News home page

సీరియల్‌ కిల్లర్‌ని విడుదల చేయండి: సైంటిస్టులు

Published Mon, Mar 8 2021 7:31 PM | Last Updated on Mon, Mar 8 2021 9:09 PM

Scientists Call For The Release Of Australia Female Serial Killer: Know The Reasons - Sakshi

సీరియల్‌ కిల్లర్‌గా ముద్రపడ్డ కాథ్లీన్‌ ఫోల్బిగ్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

మెల్‌బోర్న్‌: బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి విలవిల్లాడుతుంది.. నొప్పి నుంచి కోలుకునే వరకు తల్లి మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఓ తల్లి తన కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను చంపేసింది.. సీరియల్‌ కిల్లర్‌ అనే ఆరోపణలతో జైలు పాలయ్యింది. తాజాగా ఆమెను విడుదల చేయాలని కోరుతూ.. శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతకు ఎవరా మహిళా.. ఆమెని విడుదల చేయమని కోరడం ఏంటి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. 

ఆస్ట్రేలియాకు చెందిన కాథ్లీన్ ఫోల్బిగ్ తన నలుగురు పిల్లలు కాలేబ్, పాట్రిక్, సారా, లారాలను చంపినందుకు గాను ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. మరణించిన చిన్నారులంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయస్సు వారే. కాథ్లీన్‌‌ మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఈ క్రమంలోనే ఆమె తన నలుగురు పిల్లల్ని హత్య చేసిందనే ఆరోపణలపై అరెస్టయ్యింది. పోలీసు విచారణలో కాథ్లీన్‌‌ ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంది. ఈ క్రమంలో 2003లో కోర్టు ఆమెకు హత్య, నరహత్య నేరాల కింద శిక్ష విధించింది. అయితే కాథ్లీన్‌‌ తన బిడ్డలను చంపేసింది అనే దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. కేవలం ఆమె డైరీ ఆధారంగానే కోర్టు ఆమెకి శిక్ష విధించింది. 

కాథ్లీన్‌‌ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. ‘‘కన్నతల్లా.. కసాయా’’ అనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు నిపుణులు ఈ కేసును ప్రత్యేకంగా స్టడీ చేశారు. సంచలన విషయాలు వెల్లడించారు. దీనిలో కాథ్లీన్‌ నలుగురు పిల్లలు సహజ కారణాలతో మరణించినట్లు నిపుణులు ఆధారాలతో సహా వెల్లడించారు. 'బేబీ కిల్లర్' గా పిలువబడే మహిళను విడుదల చేయాలని వాదించినట్లు గార్డియన్‌ తెలిపింది. ఈ క్రమంలో 90 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు సంతకం చేసిన పిటిషన్‌ను ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ విడుదల చేసింది.

నివేదకిలో ఏం ఉందంటే..
కాథ్లీన్‌,ఆమె నలుగురు పిల్లల పూర్తి జన్యు శ్రేణి ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. కాథ్లీన్‌ కుమార్తెలలో ఇద్దరైనా సారా, లారాకు జన్యు పరివర్తన ఉందని జెనోమిక్ సీక్వెన్సింగ్ వెల్లడించింది. అలానే కాథ్లీన్‌కు కూడా జన్యు సమస్యలు ఉన్నాయని దీని గురించి ఆమెకు ఏ మాత్రం తెలియదని.. ఆ సమస్యల వల్ల ఆమెకు ఆకస్మిక గుండె పోటు రావచ్చని నివేదిక పేర్కొంది.

"కాలేబ్, పాట్రిక్ జన్యువులు బీఎస్‌న్‌ జన్యువుల్లో ఒక ప్రత్యేకమైన అరుదైన జన్యు వైవిధ్యాన్ని చూపించాయి. అధ్యయనం తెలిపిన ప్రకారం ఈ అరుదైన జన్యు వైవిధ్యం వల్ల ఎలుకల్లో ప్రాణాంతక మూర్ఛ‌ వ్యాధి వచ్చే అవకాశాలు అధికం. ఇదే సమస్య పాట్రిక్‌లో బయటపడింది. తన పుట్టుకకు నాలుగు నెలల ముందు నుంచే మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలానే కాలేబ్‌కు స్వరపేటిక సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది” అని నివేదిక పేర్కొంది.

మరణించిన చిన్నారులందరూ వివధ జన్యుకారణాల వల్లనే చనిపోయారని.. ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ నివేదికను న్యూ సౌత్‌ వేల్స్‌ గవర్నర్‌కు సమర్పించారు. 1991లో ఎనిమిది నెలల వయస్సులో మరణించిన పాట్రిక్, మూర్ఛతో చనిపోగా.. 1993లో 10 నెలల వయసులో ఎస్‌ఐడీఎస్‌ వల్ల సారా మరణించింది. లారా 1999లో 19 నెలల వయస్సులో మరణించగా.. కాలేబ్ కేవలం 19 రోజుల వయసులో నరహత్యకు గురయ్యాడని ఆరోపించారు. కానీ వాస్తవంగా ఈ చిన్నారి కూడా ఎస్‌ఐడీఎస్‌ వల్లనే మరణించాడు.

నలుగురు చిన్నారుల హత్యకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష్య సాక్షులు కానీ, భౌతిక ఆధారాలు కానీ లేనప్పటికీ, ప్రాసిక్యూటర్లు కాథ్లీన్‌ డైరీలోని విషయాల ఆధారంగా ఆమెని నిందితురాలిగా పేర్కొన్నారు. విచారణ సమయంలో కూడా కాథ్లీన్‌ ఎటువంటి భావోద్వేగాలను చూపించలేదు. దాంతో ఆమె తన పిల్లలను అత్యంత క్రురంగా హత్య చేసి ఉంటుందని భావించారు. డైరీ రాతల గురించి కాథ్లీన్‌ని ప్రశ్నించినప్పుడు ఆమె మానవాతీత శక్తి తన పిల్లల్ని తీసుకెళ్లిందని తెలిపింది. 

చదవండి: 
కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత
గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement