93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు! | Samuel Little Is Most Prolific Serial Killer in US History | Sakshi
Sakshi News home page

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

Published Wed, Oct 9 2019 6:28 PM | Last Updated on Thu, Oct 10 2019 3:57 PM

Samuel Little Is Most Prolific Serial Killer in US History - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సామ్యూల్‌ లిటిల్‌కు ఇప్పుడు 79 ఏళ్లు. తీవ్రంగా కనిపించే అయన ముఖంలో అప్పుడప్పుడు మాత్రమే నవ్వు ఛాయలు కనిపిస్తాయి. ఆయన గడిపిన శృంగార జీవితాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ ఛాయల్ని చూడవచ్చు. ఒకప్పుడు ఆయన బాక్సర్‌. అందుకు తగినట్లుగానే ఆయనది దృఢమైన కాయం. ఆయన ఒక్క చేతితో గుద్దాడంటే చాలు, ఆ క్షణంలో అవతలి వారి ప్రాణం పోవాల్సిందే. అలాగే ఆయన 93 మందిని హత్య చేశాడు. వారంతా ఆడవాళ్లే. వారిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారే, వారిలో కొంత మంది జీవితంలో  బాగా దెబ్బతిన్న వాళ్లు కూడా ఉన్నారు. వారందరితో శృంగారంలో గడిపిన తర్వాతే సామ్యూల్‌ వారిని హత్య చేసేవాడు. ఇల్లు, వాకిలి కూడా లేకుండా చిల్లర దొంగతనాలు చేసే ఆయన తాను శృంగార జీవితాన్ని నెరపుతున్న ఆడవారి మీదనే ఆధారపడి బతికే వాడట.

ఆయన ఎక్కువగా హత్యలు చేసిందీ అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, మియామీలలో. దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్‌ సహా 19 రాష్ట్రాలకు ఆయన హత్యలు విస్తరించాయి. ఆయన ఆడవాళ్లను నగ్నంగా చేసి శృంగారం అనంతరం వారిని హత్య చేసి రోడ్డు పక్కన చెత్త కుండీల్లో, కాల్వల్లో అలాగే నగ్నంగా పడేసే అలవాటు ఆయనది. కొంత మంది పేర్లు తెలుసుకోకుండానే ఆయన వారితో సెక్స్‌లో పాల్గొని హత్య చేశాడట. అయితే ఎక్కువ మంది బాధితుల ముఖ కవలికలు, వారి వొంపు సొంపులు ఇప్పటికీ ఆయన బాగా గుర్తున్నాయి. కొత్త వారితో సెక్స్‌ నెరపడానికి పాత ప్రేయసిలు అడ్డు అవుతారనే ఉద్దేశంతోనే ఆయన వారిని వరుసగా హత్యలు చేస్తూ వచ్చాడట. అమెరికా చరిత్రలోనే ఎక్కువ మందిని చంపిన సీరియల్‌ కిల్లర్‌గా ఇప్పుడు అక్కడి పోలీసులు ఆయన్ని గుర్తిస్తున్నారు. 

ఇంతవరకు ఈ కిరాతక రికార్డు లారీ డ్రైవర్‌ గేరి రిడ్జ్‌వే పేరిట ఉండింది. ‘గ్రీన్‌ రివర్‌ కిల్లర్‌’గా పేరు పొందిన అతను 1980 నుంచి 1990 దశకంలో 49 హత్యలు చేశాడు. ఆ తర్వాత మరో 20 హత్యలు చేసినట్లు తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును కిరాతక కిల్లర్‌ సామ్యూల్‌ లిటిల్‌ అధిగమించాడు. ఇప్పుడు సామ్యూల్‌ లిటిల్‌ కూడా తాను చేసిన 93 మంది మహిళల హత్యల్లో 50 హత్యలను ఒప్పుకున్నాడు. పైగా వారందరి బొమ్మలను గీసి చూపించాడు. దాంతో ఇప్పటి వరకు అంతుచిక్కని హత్యలు, మహిళల అదశ్య సంఘటనల చిక్కు ముడులు విడి పోతున్నాయి. ఇంకో 43 హత్యల కేసులను ఆయన అంగీకరించాల్సి ఉంది. వారి పేర్లు లేదా కనీసం వారి ముఖాలు కూడా ఆయనకు గుర్తు లేకపోవడమే ఆయన నేరం అంగీకరించక పోవడానికి కారణం. 

1980 దశకంలో జరిగిన ముగ్గురు మహిళల హత్య కేసుల్లో  సామ్యూల్‌ లిటిల్‌కు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ప్రస్తుతం లాస్‌ ఏంజెలిస్‌ జైల్లో పెరోల్‌ కూడా లేకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా అంతు చిక్కని హత్యల గురించి ఆయన నుంచి కూపీ లాగేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. 1994లో టెక్సాస్‌లో డెనైస్‌ బ్రదర్స్‌ అనే 38 ఏళ్ల వేశ్య హత్య జరిగింది. అది సామ్యూల్‌ లిటిల్‌ చేశాడని అనుమానం ఉన్నా పోలీసులు రుజువు చేయలేక పోయారు. పాత నేరస్థులతోని నేరాన్ని ఒప్పించడంలో విశేష అనుభవం ఉన్న అమెరికా పోలీసు అధికారి జేమ్స్‌ హాలండ్‌ దష్టికి ఈ కేసు పరిశోధన నిమిత్తం గతేడాది వచ్చింది. 

గత మే నెలలో ఆయన సామ్యూల్‌ను మొదటి సారి కలుసుకొని విచారించారు. కానీ ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేక పోయారు. పదే పదే ఆయన్ని విచారించడం ద్వారా ఒక్కొక్క కేసు వివరాలను రాబట్టగలిగారు. తనను ‘సెక్స్‌ ప్రిడేటర్‌’ అని తనను అనవసరంగా ముద్ర వేస్తున్నారని, తాను హంతకుడిని మాత్రమేనని ఆయన చెప్పుకునానడు. తాను ఇంతవరకు ఏ అమ్మాయిని రేప్‌ చేయలేదని, ఇష్ట పూర్వకంగానే అమ్మాయిలు తనతో గడిపారని సామ్యూల్‌ వివరించాడు. ఇప్పుడు సామ్యూల్‌ను ఎప్‌బీఐ అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ఆ ఇంటరాగేషన్‌ వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement