
సాక్షి, పశ్చిమగోదావరి : సులువుగా డబ్బులు సంపాందించాలనే దురుద్దేశంతో ఓ వ్యక్తి దేవుడి ప్రసాదం పేరుతో ఘోరాలకు పాల్పడ్డాడు. విషం కలిపిన ‘దేవుని ప్రసాదం’ ఇచ్చి అమాయక భక్తుల ప్రాణాలు తీసేవాడు. వారు చనిపోయిన తర్వాత నగదు, బంగారం దోచుకుపోయేవాడు. ఇలా 8 హత్యలకు పాల్పడిన కిరాతక సీరియల్ కిల్లర్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు చంపిన వ్యక్తుల్లో ఎక్కువమంది అతని బంధువులే ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అక్టోబరు 16న ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) అనుమానస్పద మృతితో.. ఈ సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం బయటపడింది. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దోచుకున్న డబ్బుతో నిందితుడు ఇల్లు కట్టుకున్నాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment