వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. తోట వెం కటరమణపై 3 హత్యలతో పాటు మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. రాజంపేట నుంచి రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న సాయిబాబా గుడి వద్ద అతడిని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతో పాటు 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సీరియల్ కిల్లర్ అరెస్ట్
Published Sun, Dec 15 2013 12:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement