హతురాలు కర్నూల్ జిల్లా వాసి రమణమ్మగా గుర్తింపు
పెద్ద కుమార్తె వద్దకు వస్తుండగా ఘాతుకం
‘రైల్వే కిల్లర్’ రాహుల్‌ను నగరానికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆదివారం హత్యకు గురైన మహిళ కేసుపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆరీ్ప) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ‘రైల్వే సీరియల్ కిల్లర్’ రాహుల్‌ను గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ అధికారుల విచారణలోనే ఈ మర్డర్ వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు నిందితుడిని పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రైళ్లల్లో సంచరిస్తూ 35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసినట్లు వెలుగులోకి వచి్చంది. కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కొన్నేళ్ల కోసం బతుకుతెరువు కోసం భర్త, పిల్లలతో కలిసి కర్ణాటకకు వలసవెళ్లింది.
చివరకు రమణమ్మ, గోవిందప్ప దంపతులు బళ్లారి జిల్లాలోని సింపోటు తాలుకా, తోర్నగల్ గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె తన భర్త, కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఆమెను చూసేందుకే రమణమ్మను శనివారం రాత్రి 7 గంటలకు కుమారుడితో కలిసి అక్కడి తోర్నగల్ రైల్వే స్టేషష్ న్‌కు వచి్చంది. తల్లిని మణుగూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మహిళల బోగీలో ఎక్కించిన కుమారుడు ఈ విషయాన్ని తన బావ వెంకటేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అదే రైలులోని దివ్యాంగుల బోగీలో ప్రయాణించిన రాహుల్ కన్ను ఈమెపై పడింది. మార్గమధ్యలో బోగీలో ఆమె ఒక్కరే మిగలడంతో అదును చూసుకుని పక్కనే ఉన్న సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్‌ఎల్‌ఆర్) కోచ్‌లోకి లాక్కెళ్లిన అతను బాత్‌రూమ్‌లో టవల్‌తో మెడకు ఉరి బిగించి చంపేశాడు.
అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించాడు. ఆదివారం ఉదయం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషష్ న్‌కు చేరుకోవడంతో అత్త కోసం ప్లాట్‌ఫామ్ నెం.9 వద్దకు వచి్చన వెంకటేశ్ మహిళల బోగీలో వెతికినా రమణమ్మ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె రైలు దిగి వెళ్లి ఉంటుందని భావించి అతడూ వెళ్లిపోయాడు. రైలు శుభ్రం చేయడానికి వచి్చన సిబ్బంది హరికుమార్ బాత్‌రూమ్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్టేషన్ మేనేజర్ ఎన్.నాగరాణి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు హతురాలి కుటుంబీకులను రప్పించారు.
గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని వల్సాద్ పోలీసుల అదుపులో ఉన్న రాహుల్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి ఈ వారెంట్ తీసుకోవడానికి వల్సాద్ పోలీసులకు రాహుల్ ఇచి్చన వాంగ్మూలం కీలకంగా మారింది. దీంతో ఆ అధికారులను సంప్రదించిన జీఆర్పీ పోలీసులు రికార్డులు తీసుకున్నారు.
రమణమ్మ హత్య బళ్లారి–సికింద్రాబాద్ మధ్యలో జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కచి్చతంగా ఎక్కడ అనేది తేలియాలంటే నిందితుడిని తీసుకువచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని, ఆపై క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్‌లోనే ఇది తేలుతుందని చెబుతున్నారు. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment