పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్.. | Police arrest serial killer .. | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్..

Published Fri, Dec 13 2013 2:45 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Police arrest serial killer ..

రాజంపేట, న్యూస్‌లైన్: వరస హత్యలతో కలకలం సృష్టిస్తున్న  సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజంపేట పట్టణంలో గురువారం తోట వెంకటరమణను పొలీసులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా  పుల్లంపేట, రాజంపేట, ఓబులవారిపల్లె తదితర ప్రాంతాల్లో పోలీసు ప్రత్యేకబృందాలు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి పుల్లంపేట నుంచి వత్తలూరు మీదుగా అలాగే రాజంపేటలో బృందాలు గాలింపు చేశాయి. ఈ క్రమంలో  రాయచోటి రోడ్డులోని రాజంపేట ఆర్వోబీ  వద్ద తోట వెంకటరమణను పోలీసులు  పట్టుకున్నారు.
 
 పక్కా సమాచారం అందడంతో  పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం.  ఈ విషయాన్ని   పోలీసుశాఖ గోప్యంగా ఉంచుతోంది. ఈవిషయంపై  నోరు విప్పడంలేదు.  అయితే తమకు  సవాల్‌గా మారిన తోట వెంకటరమణను  ఎట్టకేలకు పట్టుకోవడంతో ఆ శాఖ  ఊపిరి  పీల్చుకుంది. శుక్రవారం తోట వెంకటరమణ అరెస్టును చూపే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement