లక్నో: సుపారీ సొమ్ము అందలేదని.. హత్య చేసిన వ్యక్తే పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఏడాది క్రితం హత్య చేసిన కేసులో.. సుపారీ ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించలేదని వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఖంగుతున్నారు. దీంతో పాత హత్య కేసును తాజాగా రీఓపెన్ చేశారు.
వివరాలు.. 2023 జూన్ 7న మీరఠ్‌లోని చెందిన అంజలి అనే న్యాయవాది ఇంటికి వస్తుండగా ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. ఆస్తి వివాదంలో భాగంగా అత్తింటివారే ఆమెను హత్య చేయించారనే కోణంలో పోలీసులు ఆమె మాజీ భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వారి ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని వదిలేశారు. తరువాత కొన్ని రోజులకు పోలీసులు ఇద్దరు షూటర్లు నీరజ్ శర్మ, యశ్‌పాల్‌ను అరెస్టు చేశారు.
బాధితురాలు తన మాజీ భర్త నితిన్ గుప్తా పేరుతో ఉన్న ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటిని ఆమె అత్తమామలు యశ్‌పాల్, సురేష్ భాటియాకు విక్రయించారు. కాని మహిళ ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఆస్తి కొనుగోలుదారులు అంజలిని చంపడానికి రూ. రెండు లక్షల సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. దీంతో యశ్‌పాల్, భాటియా, నీరజ్ శర్మ, ఇద్దరు హంతకులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే ఇది జరిగిన ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలైన నీరజ్ శర్మ..పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు. మృతురాలి భర్త, అత్తింటివారే ఈ హత్య చేయించినట్లు చెప్పాడు.
ఇందు కోసం తమ మధ్య రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరిందని వెల్లడించాడు. అడ్వాన్స్‌గా ఒక లక్ష ఇచ్చారని, మిగతా సొమ్ము అందలేదని తెలిపాడు. అయిత, ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన మొత్తం కోసం బాధితురాలి అత్తమామలను సంప్రదించగా వారు నిరాకరించారని శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అంజలి హత్యలో ప్రధాన కుట్రదారులైన ఆమె భర్త, అత్తమామలు, మరో బంధువుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంట్రాక్ట్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందించాడు. దీంతో నీరజ్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment