కూతురి ప్రియుడి సాయంతో ప్రియుడిని చంపేసింది! | Woman Kills Lover With Help of Daughter Boyfriend | Sakshi
Sakshi News home page

కూతురి ప్రియుడి సాయంతో ప్రియుడిని చంపేసింది!

Published Sat, Apr 27 2019 3:53 PM | Last Updated on Sat, Apr 27 2019 4:04 PM

Woman Kills Lover With Help of Daughter Boyfriend - Sakshi

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్‌ కేసు చోటుచేసుకుంది. 35 ఏళ్ల మహిళ తన కూతురి బాయ్‌ఫ్రెండ్‌ సాయంతో తన ప్రియుడిని చంపేసింది. ఏప్రిల్‌ 22న మీరట్‌ ఔరాంగ్‌షాపూర్‌ డిగ్గి ప్రాంతంలోని రాజీవ్‌ అలియాస్‌ రాజు (32) మృతదేహం లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు.

నిందితురాలైన షమిమ్‌ స్థానికంగా వ్యవసాయ పొలంలో కూలిగా పనిచేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఆమెకు ట్రక్‌ డ్రైవర్‌ అయిన రాజీవ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో షమిమ్‌ కూతురు స్థానికంగా ఉండే ముసాహిద్‌తో సన్నిహితంగా ఉంటూ.. ప్రేమ కలాపాలు సాగిస్తుండటం రాజీవ్‌కు నచ్చలేదు. ఈ విషయమై తరచూ అతను ముసాహిద్‌తో గొడవపడేవాడు. రాజీవ్‌ తరచూ ముసాహిద్‌తో తలపడటం.. తన కూతురి జీవితంలో కల్పించుకోవడం షమిమ్‌కు నచ్చలేదు. ఈ క్రమంలో కూతురి ప్రేమికుడు ముసాహిద్‌తో కలిసి షమిమ్‌ రాజీవ్‌ను ఏప్రిల్‌ 22న గొంతు నులిమి చంపేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులైన షమిమ్‌, ముసాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement