Barabanki
-
యూపీలో వరదలు.. 500 ఇళ్లలోకి సరయూ నీరు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు వరదల బారిన పడ్డారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. బారాబంకి డీఎం సత్యేంద్ర కుమార్, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా సరయూ నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే 20 సెంటీమీటర్ల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 గ్రామాల్లోని 500 ఇళ్లలోకి నీరు చేరిందని డీఎం పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు చెందిన వారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో అధికారులు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. -
Up: అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్ రావత్‌కు సంబంధించి నకిలీదీగా భావిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ రావత్‌కు బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్ దక్కింది. ఈ జాబితా ప్రకటించిన వెంటనే రావత్‌ను పోలి ఉన్న వ్యక్తి బెడ్‌పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఎంపీ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌ను తప్పించి ఉపేంద్రసింగ్ రావత్‌కు బీజేపీ హైకమాండ్ టికెటివ్వగా ఆయన గెలిచారు. తాజాగా రెండోసారి ఉపేంద్రకు పార్టీ టికెట్ ప్రకటించింది. ఇదీ చదవండి.. ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో‘సారి’ -
Barabanki: కుప్పకూలిన మూడంతస్థుల భవనం
లక్నో: ఉత్తర ప్రదేశ్ బారబంకిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. మూడంతస్థుల భవనం ఒకటి కుప్పకూలి.. ఇద్దరు మృతి చెందారు. చికిత్సలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడం, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉన్నట్లుండి.. భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పన్నెండు మందిని శిథిలా నుంచి బయటకు తీశారు. వీళ్లలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. #Barabanki फतेहपुर कस्बे में बीती रात 3 बजे के आसपास एक तीन मंजिला मकान अज्ञात कारणों से भर भराकर गिर गया जिसके नीचे कई लोगों के फंसे होने की सूचना पर पुलिस अधीक्षक सहित प्रशासनिक अधिकारी मौके पर पहुंचे, फायर ब्रिगेड और SDRF घायलों को निकाल रहा है, मिल रही जानकारी के अनुसार 10… pic.twitter.com/icqyhWJDyu — Barabanki News (@BBKNews) September 4, 2023 -
విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
వృద్ధ మహిళలే టార్గెట్.. హత్యలతో హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీలో ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలతో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాడు. వృద్ధ మహిళలనే టార్కెట్ చేస్తున్న ఈ కిరాతకుడు రోజుల వ్యవధిలోనే ముగ్గురిని దారుణంగా హతమార్చాడు. వారిని హత్య చేయడమే గాక మృతదేహాలను నగ్నంగా వదిలేస్తున్నాడు. మూడు హత్యలు ఓకే రీతిలో జరగడంతో ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు ఒకే విధంగా ఉన్నాయి. నిందితుడ్ని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అతడి ఫొటోను విడుదల చేశాయి. ఇప్పటివరకు హత్యకు గురైన ముగ్గురు మహిళల వయసు 50-60 ఏళ్ల మధ్యే ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రతిఘటించలేరని తెలిసి సున్నితమైన మహిళలనే నిందితుడు టార్గెట్ చేస్తున్నాడని వివరించారు. డిసెంబర్ 6న మొదటి హత్య, డిసెంబర్ 17న రెండో హత్య, 29న మూడో హత్య వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం ఆరు బృందాలతో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతవరకు అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియలేదు. చదవండి: మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి! -
మాట నిలబెట్టుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ‘హమ్ వచన్ నిభాయేంగే’ (మాట నిలబెట్టుకుంటాం) అనే నూతన నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఏడు వాగ్దానాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రియాంకాగాంధీ వాద్రా శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా యాత్రలను ఆమె బారాబంకీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీలో తాము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మొత్తం మాఫీ చేస్తామని వెల్ల డించారు. గోధుమలు, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. చెరుకు పంటను క్వింటాల్‌కు రూ.400 ధరతో కొంటామన్నారు. అన్ని రకాల విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. అధికారంలోకి వస్తే.. 12వ తరగతి బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థినులకు ఈ–సూ్కటర్లు ఇస్తామని ఇంతకు ముందే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ యాత్ర అవధ్లోని బారాబంకీ, బుందేల్‌ఖండ్ జిల్లాలను కలుపుతూ ఝాన్సీ వరకు సాగుతుంది. -
ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం
బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయాలపాలయ్యారు. ఢిల్లీ నుంచి బహ్రెయిచ్ వైపు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బబురి గ్రామ సమీపంలో ఇసుక ట్రక్కును ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ అదుపు కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సాయం ప్రకటించారు. -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ.. భర్త లబోదిబో
లక్నో: సొంత కుమారుడి భార్యను విక్రయించాడో మామ. అది కూడా రూ.80 వేలకు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే పరుగులు తీసి రైల్వే స్టేషన్లో ఆమెను ఆ ముఠా నుంచి రక్షించారు. కొంచెం ఆలస్యమై ఉంటే ఆమె అతడికి దక్కకుండాపోయేది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ మామకు ఇలా మహిళలను ముఠాకు విక్రయించడం ఓ వృత్తి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బారబంకి జిల్లాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రరామ్ వర్మ మహిళలతో వ్యాపారం చేస్తుంటాడు. వస్తువులను విక్రయించినట్టు మహిళలను ఓ ముఠాకు అమ్మేసుకోవడం ఈయన ప్రధాన వృత్తి. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 300 మంది మహిళలను విక్రయించాడు. తాజాగా అతడికి కుమారుడి భార్యపై కన్నుపడింది. కోడలిని విక్రయించాలని నిర్ణయించుకుని గుజరాత్‌కు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 5వ తేదీన కోడలిని ఆ ముఠాకు అప్పగించేశాడు. ఈ ఘటనతో షాకయిన కోడలు భర్తకు సమాచారం ఇచ్చింది. పోలీసుల సహాయంతో భర్త వెంటనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గుజరాత్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి ఆమెను రక్షించి భర్తకు అప్పగించారు. అయితే ప్రధాన నిందితులు మామ చంద్రరామ్, మరొకరు రామ్‌గౌతమ్ తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రరామ్పై ఓ హత్య కేసు కూడా నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి..
లక్నో: కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోడలిని 80వేలకు అమ్మేశాడు ఓ కసాయి మామా. ఈ దారుణ ఘటన యూపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో 40వేలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో 20000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని అడగగా, ఏదోలా నచ్చచెప్పి.. ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారబంకిలో ఉంటున్న తండ్రి దగ్గరకు పంపాడు. జూన్ 5 సాయంత్రం చందరామ్ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు. అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపాతాడని కోడలితో నమ్మబలకడంతో ఆమె బ్రోకర్‌తో వెళ్లింది. తన సమీప బంధువు ద్వారా తండ్రి నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలితో కలిసి గుజరాత్‌కు వెళ్లేందుకు బారబంకి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి -
అయ్యో దేవుడా: పాప ప్రాణం కోసం తండ్రి ఆరాటం..
లక్నో: ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. వైద్యులు చేయకున్నా తన బంగారాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా బతికించుకోవాలని కూతురికి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పాప ప్రాణం నిలిపేందుకు ఆ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్పూర్కు చెందిన ఓ తండ్రి తన కూతురు మంచం పైనుంచి కిందపడిందని ఐదేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బరాబంకిలోని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో కొన ప్రాణంతో ఉన్న తన కూతురిని బతికించేందుకు ఆ తండ్రి నోటితో శ్వాస అందించాడు. పలుమార్లు నోటితో పాప నోట్లో ఊది బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అనంతరం ఊపిరితిత్తులను పలుమార్లు మెల్లగా నొక్కాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పాప కన్నుమూసింది. వైద్యుల తీరుపై ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సన్నివేశాన్ని సెల్ఫోన్లలో వీడియోలు తీయడంపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వార్త చదవండి: నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా? -
వైరల్ వీడియో: పాప ప్రాణం కోసం నోటితో తండ్రి ఆరాటం..
-
Vaccination: తప్పించుకునేందుకు నదిలో దూకారు!
లక్నో: ఓవైపు వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంత మంది టీకాలు వేస్తామంటే చాలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. వైద్యాధికారులు వస్తున్నారని తెలిసి నదిలో దూకారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీలో శనివారం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి రామ్‌నగర్ సబ్ కలెక్టర్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. కరోనా నిరోధక టీకాపై ఉన్న అపోహలే వల్లే సదరు గ్రామస్తులు ఇలా చేశారని చెప్పారు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. ‘‘అదొక విషపు ఇంజక్షన్. వ్యాక్సిన్ కాదు. అందుకే మేం సరయూ నదిలో దూకాం’’ అని గ్రామస్తులు తనకు చెప్పినట్లు శుక్లా వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2, 22, 315 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. 4, 454 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తంగా 27,20,716 యాక్టివ్ కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15 తర్వాత ఇప్పుడిప్పుడే కేసుల్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. చదవండి: వ్యాక్సినేషన్.. ఊళ్ల మధ్య చిచ్చు! -
యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్ గ్రౌండ్లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్‌ను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి బారాబంకీ ప్రాంతంలో స్పెషల్ టాస్స్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా మరణించాడు. అయితే తొలుత తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానిక ఎస్పీ అరవింద్ చతుర్వేది వివరాలను వెల్లడించారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కాగా మూడు వారాల క్రితమే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఓ కమిటీని సైతం నియమించింది. -
భర్త శవంతో పాటు భార్యను...
లక్నో: భర్త శవంతో పాటు భార్యను బస్సులోంచి దారి మధ్యలో దించేసిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రాజు మిశ్రా(37), అతడి భార్య బహ్రాయిక్ నుంచి లక్నో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గ మధ్యలో బారబాంకి సమీపంలో రాజుకు గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం అందకపోవడంలో బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే భర్త శవంతో పాటు తన మరదలిని బలవంతంగా బస్సు నుంచి కండక్టర్ సల్మాన్, డ్రైవర్ జునైద్ అహ్మద్ దించేశారని రాజు అన్నయ్య మురళి మిశ్రా ఆరోపించారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె దగ్గర నుంచి టికెట్లు కూడా లాక్కునిపోయారని చెప్పారు. ఈ ఆరోపణలను కండక్టర్, డ్రైవర్ తోసిపుచ్చారు. రాజుకు గుండెపోటు రావడంతో బస్సులో ఉన్న డాక్టర్ ఒకరు పరీక్షించారని, తన వల్ల కాదని ఆయన చెప్పడంతో రామ్‌నగర్‌లోని ప్రైవేటు వైద్యుడు డీపీ సింగ్‌కు చూపించగా రాజు మరణించినట్టు నిర్ధారించారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించేందుకు 100 నంబరుకు ఫోన్ చేసినా స్పందన రాలేదన్నారు. రామ్‌నగర్ స్టేషన్ ఆఫీసర్ శ్యామ్ నారాయణ్ పాండేకు ఫోన్ చేయగా.. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని సూచించినట్టు చెప్పారు. రాజు భార్య తన బంధువులకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత భర్త మృతదేహంతో బస్సు దిగిపోయిందని తెలిపారు. అక్కడికి పోలీసులను పంపి మృతదేహాన్ని బారబాంకీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు స్టేషన్ ఆఫీసర్ నారాయణ్ పాండే వెల్లడించారు. రాజు మృతదేహానికి వైద్యులు గురువారం పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
తాంత్రికుడు చెప్పాడని.. సంపద కలిసివస్తుందని..
లక్నో: మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కలకలం రేపింది. 12 చేతులకు వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుడిని చంపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు. అంతేకాకుండా దీనిపై వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్ సింగ్ స్పందిస్తూ.. ఆ బాలుడు చదుకోవడానికి తాము సహాకారం అందిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అతను చదువుకు దూరం కాకుండా చూస్తామన్నారు. ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని.. నిష్పాక్షికమైన విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
భారత్‌లో ఓ కొరియా వాసి ఆవేదన
లక్నో : భారతదేశ సంస్కృతి , సంప్రదాయాలు నచ్చి, ఇక్కడే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న కొరియా వాసికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 15 లోపు దేశం విడిచి పోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆయన తన డాక్యుమెంట్లో భారతీయ పౌరుడిగా పేర్కొనడమే. కానీ తానేమీ తప్పు చేయలేదని, భాష సరిగ్గా తెలియక పోవడం వల్ల అధికారులే ఈ తప్పుకు ఒడిగట్టారని, తాను ఈ తప్పు సరిదిద్దుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నిస్తున్నానని కొరియా వాసి చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరియా వ్యక్తి బియ్యుంగ్ కిల్ కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు. కొంతకాలం పాటు చెన్నైలో పనిచేశాడు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. ఇక ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. లక్నోను తన వ్యాపార ప్రదేశంగా ఎంచుకున్నాడు. దీనికోసం 2012లో బిజినెస్ వీసా కూడా పొందాడు. బారాబంకి జిల్లా ఫతేపుర్ మండలంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొరియా వాసిని అధికారులు, భారతీయ పౌరుడిగా పేర్కొన్నారు. ఒక కొరియా వాసిని భారతీయ పౌరుడిగా ఎలా నమోదుచేస్తారంటూ.. ఈ భూమిని అతను అక్రమంగా పొందాడని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు బారాబంకి ఎస్పీ అనిల్ కుమార్ సింగ్ నోటీసులు జారీచేశారు. అయితే అది అక్కడ పనిచేసే సిబ్బంది వల్ల జరిగిన తప్పిదమని, భాష తెలియక వారు అలాచేశారని కొరియా వాసి చెబుతున్నాడు. దాన్ని సరిదిద్దడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. కొరియా వాసి తాను కొన్న ఆ ప్రాపర్టీలో పాఠశాలను నిర్మించాడు. తన సంపదంతా ధారపోసి దాన్ని ఏర్పాటుచేశాడు. కానీ ఆ భూమి ఇప్పుడు ఇరకాటంలో పడింది. స్కూల్ నిర్మించిన ఆ ప్రాపర్టీలోనే కొరియా వాసి, ప్రధాన మంత్రి కౌశల్య యోజనలో భాగమైన స్కిల్ ఇండియా తరగతులు నిర్వహించాలని బియ్యుంగ్ కిల్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి యువకులకు అనేక రంగాల్లో శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. దీని ద్వారా భారత్‌లో నైపుణ్యాలను పెంపొందించాలనే అతని ఆశయాన్ని సాకారం చేసుకుంటున్నాడు. యువతకు రిటైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో శిక్షణనిస్తున్నాడు. అయితే అధికారులు తప్పుగా చేసిన నమోదు వల్ల కొరియా వాసికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా అతన్ని దేశం విడిచి వెళ్లమని నోటీసులే అందాయి. ''నాకు ఇండియా అంటే ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి యువత స్వతంత్రంగా బతికేలా వారికి శిక్షణ ఇవ్వాలనేది నాకు ఇష్టం. ఇక్కడ కమ్యూనికేషన్ వల్ల నాకు చాలా కష్టాలు వచ్చాయి. నా తరపునుంచి ఆలోచించకుండా, నా వాదన వినకుండా నాకు ఎలా నోటీసులు ఇస్తారు? ఇక్కడి న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వాదన వినిపించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది'' అని బియ్యుంగ్ ఓ ఆంగ్ల ఛానెల్‌కు తెలిపారు. 2015 నుంచి బియ్యుంగ్తో కలిసి పనిచేస్తున్న మనోజ్‌వర్మ మాట్లాడుతూ... ''సిబ్బంది ఎవరో తప్పుగా టైప్ చేసి ఉంటారు. తరువాత మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దలేదు. మేము లాయర్‌ను కలిస్తే.. నోటీసులు వచ్చే వరకు చూడండి అన్నారు. లోకల్ ఛానల్ బియ్యుంగ్ని కొరియన్ గూఢచారి అని ప్రచారం చేస్తోంది. ఇది చాలా బాధాకరం. అతను భారత యువత కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మన కోసం ఇంత చేస్తే మనం ఆయనకు ఇచ్చేది ఇదేనా?'' అని ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేశ్ తివారి ఈ విషయంపై స్పందిస్తూ.. బియ్యుంగ్ అక్కడి యువతకు శిక్షణనిస్తూ, ఎంతో మంచి పేరు సంపాదించారు. అతని కేసు వివరాలు, సర్టిఫికేట్లను పరిశీలించమని ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. -
ఇల్లు కూలి చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలోని ఫగూర గ్రామంలో గురువారం అర్థరాత్రి ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సు గల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిథిలాల కింద నుంచి చిన్నారి మృతదేహం వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. -
విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్
లక్నో: స్కూల్‌కు వెళ్లి వస్తున్న 14 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ బారాబంకీలోని రామ్‌నగర్ ప్రాంతంలో నిన్న చోటు చేసుకుంది. దాంతో బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాంతో నలుగురిలో ముగ్గురు నిందితులు అక్బర్, జబ్బీర్, ఈబ్బాల్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఏఎస్పీ కులదీప్ నారాయణ్ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఆ నిందితుడ్ని కూడా అరెస్ట్ చేస్తామన్ని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బారాబంకీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలసి తన భర్తనే హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఈ సంఘటన జరిగింది. లాల్జీ యాదవ్ అనే వ్యక్తి భార్య కవితకు విశ్వనాథ్ అనే మరొకరితో అక్రమ సంబంధముంది. ఈ విషయం యాదవ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. భర్త తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో కవిత ప్రియుడితో కలసి హత్యకు పథకం వేసింది. వీరిద్దరూ మరొకరి సాయం తీసుకుని యాదవ్‌ను హత్య చేశారు. పొదలచాటున పడిఉన్నయాదవ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయాల్సివుంది.