విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్ | 14-year-old girl gang raped in UP | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్

Published Sun, Aug 31 2014 11:19 AM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM

విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్ - Sakshi

విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్

లక్నో: స్కూల్కు వెళ్లి వస్తున్న 14 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆ ఘటన ఉత్తరప్రదేశ్ బారాబంకీలోని రామ్నగర్ ప్రాంతంలో నిన్న చోటు చేసుకుంది. దాంతో బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి  దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

దాంతో నలుగురిలో ముగ్గురు నిందితులు అక్బర్, జబ్బీర్, ఈబ్బాల్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఏఎస్పీ కులదీప్ నారాయణ్ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఆ నిందితుడ్ని కూడా అరెస్ట్ చేస్తామన్ని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బారాబంకీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement