
బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయాలపాలయ్యారు. ఢిల్లీ నుంచి బహ్రెయిచ్ వైపు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బబురి గ్రామ సమీపంలో ఇసుక ట్రక్కును ఢీకొట్టింది.
రోడ్డుపై ఉన్న పశువులను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ అదుపు కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సాయం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment