
లక్నో: కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోడలిని 80వేలకు అమ్మేశాడు ఓ కసాయి మామా. ఈ దారుణ ఘటన యూపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో 40వేలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో 20000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని అడగగా, ఏదోలా నచ్చచెప్పి.. ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారబంకిలో ఉంటున్న తండ్రి దగ్గరకు పంపాడు. జూన్ 5 సాయంత్రం చందరామ్ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు.
అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపాతాడని కోడలితో నమ్మబలకడంతో ఆమె బ్రోకర్‌తో వెళ్లింది. తన సమీప బంధువు ద్వారా తండ్రి నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలితో కలిసి గుజరాత్‌కు వెళ్లేందుకు బారబంకి రైల్వే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి
Comments
Please login to add a commentAdd a comment