బాధితుడికి నగదు అందజేస్తున్న ఆర్పీఎఫ్ పోలీసులు
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు.
(చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..)
స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్‌దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు.
(చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment