money bag
-
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పర్సు పోయిందని.. పోలీస్‌స్టేషన్ భవనం పైకెక్కి.. యువకుడి హల్చల్!
కరీంనగర్: కరీంనగర్ బస్టాండ్‌లో నా పర్సు పోయింది.. దొరకకుంటే చచ్చిపోతానంటూ ఓ యువకుడు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం పైకి ఎక్కి, హంగామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని జంగపల్లికి చెందిన చింటు అలియాస్ రాజు పర్సును శనివారం రాత్రి కరీంనగర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి దొగిలించాడు. రాత్రి నుంచి పోలీసులకు చెబుతుంటే పట్టించుకోవడం లేదంటూ ఆదివారం ఠాణా భవనం పైకి ఎక్కి కూర్చున్నాడు. పర్సు దొరకకుంటే దూకి చనిపోతానని బెదిరించాడు. పోలీసు సిబ్బంది అతన్ని కిందకు దింపే ప్రయత్నం చేసినా వినకుండా అరగంటపాటు హంగామా చేశాడు. చివరికి రాజును మాటల్లో పెట్టి, పైకి వెళ్లి తీసుకువచ్చారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొన్నారు. -
లక్షల రూపాయలున్న బ్యాగు రైల్వే స్టేషన్లో మర్చిపోయాడు.. తిరిగి వచ్చేసరికి
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు. (చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..) స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్‌దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు. (చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి) -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను..!
రాయ్‌పుర్: రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తమకు దొరికిన వాటిని ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలాంబర్ సిన్హా. మనా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్. ఆ తర్వాత సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్ రాథోడ్ తెలిపారు. రివార్డ్ ప్రకటన.. నోట్ల కట్టలతో బ్యాగు దొరికితే తిరిగి తీసుకొచ్చి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. రివార్డ్ ప్రకటించారు. బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు సివిల్ లైన్స్ పోలీసులు. ఇదీ చదవండి: గ్రీన్ సిగ్నల్ ఫర్ ‘టైగర్’.. నిలిచిపోయిన ట్రాఫిక్.. వీడియో వైరల్ -
రోడ్డు పక్కన డబ్బుల సంచి.. కుర్రాడు చేసిన పనికి ఫిదా!
మనది కాని సొమ్ముపై మందికి ఆశ ఎక్కువ!. అయితే పేదరికంలో ఉన్నా ఆ యువకుడు నిజాయితీగా వ్యవహరించాడు. రోడ్డు పక్కన దొరికిన డబ్బుల బ్యాగ్‌ను.. ఎవరిదో వాళ్లకు అప్పగించేదాకా ఊరుకోలేదు. ఇందుకుగానూ అతను అందుకున్న ప్రతిఫలం.. బహుశా ప్రపంచంలో ఎవరూ అందుకోనంత విలువైనదేమో! ఆఫ్రికా దేశం లైబీరియాలో ఇమ్మాన్యుయెల్ టులోయి అనే 19 ఏళ్ల కుర్రాడు జీవిస్తున్నాడు. పేదరికం, తండ్రి చావు కారణాలతో.. తొమ్మిదేళ్ల వయసులో చదువు ఆపేశాడటను. డొక్కు మోటర్ సైకిల్‌ను ట్యాక్సీ సర్వీస్‌గా ఉపయోగించుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. వచ్చేది కొద్ది మొత్తమే కావడంతో పూట గడవడం అతనికి కష్టంగానే ఉంటుంది మరి. ఇలాంటి టైంలో.. ఓరోజు రోడ్డు పక్కన ప్లాస్టిక్ బ్యాగులో లైబెరియన్, అమెరికా కరెన్సీ నిండిన ఓ సంచి ఇమ్మాన్యుయెల్ కంట పడింది. దానిని అలాగే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి.. ఆపై వాళ్లు ఓనర్‌కు అప్పగించేదాకా అక్కడే ఉండిపోయాడు. అతని నిజాయితీకి మెచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే.. తినడానికి సరుకులు ఇవ్వమంటూ కోరాడు ఆ కుర్రాడు. దీంతో 1500 డాలర్ల విలువైన సరుకులను అతని కుటుంబానికి అప్పగించాడు ఆ డబ్బు ఓనర్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్స్‌తో పాటు దేశ అధ్యక్షుడు జార్జ్ వీ గేవ్ కూడా ఫిదా అయిపోయాడు. ప్రభుత్వం తరపునే కాదు.. స్థానిక మీడియా ఒకటి అతనికి ఆర్థిక సాయం అందించింది. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా?.. లైబీరియాలో ప్రతిష్టాత్మకమైన రిక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కూల్లో చేరాడు. అది సెకండరీ ఎడ్యుకేషన్ కోసం. చదువు అతనికి ఇష్టం. అందుకే.. పిల్లల మధ్య మొహమాటం లేకుండా కూర్చుంటున్నాడు. మరో ఆరేళ్లు చదివితేనే అతని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేది. కిందటి ఏడాది ఈ ఘటన జరగ్గా.. అతను స్కూల్లో చేరి చదువుకుంటున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. -
పైకప్పుపై రూ. 40 లక్షల డబ్బు, నగల సంచులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. మీరుట్‌కు చెందిన ఓ కుటుంబానికి ఉదయం లేవగానే నమ్మలేని దృశ్యం ఎదురుపడింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులను వారి ఇంటి పైకప్పుపై గుర్తించిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మీరుట్లో నివాసముంటున్న వరణ్ శర్మ అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు. తెరిచి చూడగా వాటి నిండ డబ్బు, నగలు కనిపించాయి. ఇది దొంగలించిన డబ్బుగా భావించి వెంటనే సర్దార్ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడి చేరుకున్న పోలీసులు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, బంగారం సంచులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్ సింఘాల్‌కు సంబంధించి సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు అధికారి దీనేష్ బాగెల్ తెలిపారు. (చదవండి: ఆ ఇంట్లో.. అనుమానాస్పదస్థితిలో 6 మృతదేహాలు) ఈ డబ్బు, నగలను పవన్ సింఘాల్ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన రాజు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల నేపాల్‌కు వెళ్లిన రాజు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి సెక్యూరిటి గార్డుతో కలిసి బుధవారం ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారం సర్థేసి సీసీ టీవీలో కనిపించకుండా ఉండేందుకు వరుణ్ శర్మ ఇంటి పైకప్పుపై దాచినట్లు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దొంగతనం జరిగిన తన వస్తువులు, బంగారంపై స్పష్టత లేదని వాటిని లెక్కించిన అనంతరం ఫిర్యాదు చేస్తానని పోలీసులతో పవన్ సింఘాల్ పేర్కొన్నాడు. (చదవండి: చిన్నారుల హత్య: నర్సుపై ఛార్జ్‌షీట్) -
ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక
సాక్షి, సిద్దిపేట:దుబ్బాక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్దిపేటలో సోమవారం జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్ర్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉపఎన్నిక వేడి కాక పుట్టిస్తోంది. టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మొత్తా నికి సోమవారం హైడ్రామాతో ఎవరికెంత మైలేజీ వచ్చిందనే లెక్కలు ఇరుపార్టీలు వేసుకుంటున్నాయి. సోషల్ మీడియాను వాడుకొని అనూహ్యంగా బీజేపీ లబ్ది పొందిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి జవాబుగా అన్నట్లు టీఆర్ఎస్ మంగళవారం బలప్రదర్శనకు దిగింది. దుబ్బాక నియోజకవర్గంలో తొగుటలో యువజన సదస్సు నిర్వహించి భారీగా జనసమీకరణ చేసింది అధికార పార్టీ. అదే విధంగా పోలీసుల తప్పేమీలేదని చెప్పు కొనేందుకు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సోదాలకు సంబంధించిన ఫుటేజీలు బయటపెట్టారు. మరోవైపు బీజేపీ కూడా తమ నాయకుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సోదాల ఫుటేజీ విడుదల సిద్దిపేటలో సోమవారం అసలేం జరిగిం దనే విషయాన్ని తెలిపేందుకు మంగళవారం సిద్ది పేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంజన్ రావు ఇంటిని సోదా చేసిన తీరు, అక్కడ డబ్బులు దొరకడం, అంజన్‌రావు కుటంబసభ్యుల సమక్షంలో లెక్కించడం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీయడానికి సంబంధించిన వీడియో పుటేజీలను మీడియాకు అందజేశారు. గతంలో సోదాలు చేస్తే ప్రజలు సహకరించారని, సోమవారం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారు: హరీశ్ సిద్దిపేటలోని లెక్చలర్స్ కాలనీలోని అంజన్‌రావు ఇంటిలో దొరికిన రూ.18.67 లక్షల రూపాయలను... పోలీసులే తెచ్చి పెట్టి సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వందలాదిగా యువకులు అంజన్‌రావు ఇంటి వద్దకు వచ్చి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేసిన విషయం విది తమే. యువత బీజేపీ వైపు ఉందనే సంకేతాలు పోతాయని భావించిన టీఆర్ఎస్ దీనికి విరుగుడుగా.. తొగుట మండలంలో వేలాది మంది యువకులతో మంగళవారం భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. తొగుట గాంధీ సెంటర్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ కమలనాథులపై విరుచుకుపడ్డారు. బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, అడ్డంగా దొరికినా బుకాయిస్తోందని అన్నారు. ఎన్నడూ కానరాని కిషన్‌రెడ్డి దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి గతంలో విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు అక్రమంగా డబ్బులు పంచిపెట్టేందుకు సిద్ధమైన రఘునందన్‌రావుకు మద్దతు ఇచ్చేందుకు రావడం శోచనీయం అన్నారు. బీజేపీ ఆందోళనలు.. సిద్దిపేట ఘటనతో నెలకొన్న ఉద్రిక్తతలు రెండోరోజూ కొనసాగాయి. సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోహెడ, చేర్యాల, హుస్నాబాద్, సిద్దిపేట, మద్దూరు, కొమురవెల్లి ప్రధాన రహదారులపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ అధికారులు టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల బీజేపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. పలువురిని అరెస్టు చేశారు. -
వరంగల్‌లో రూ.1.07కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, వరంగల్: సరైన పత్రాలు లేకపోవడంతో వరంగల్ శివనగర్‌లో అరటి పండ్ల వ్యాపారి కొవ్వూరి మధు సూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.07 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు నందిరాంనాయక్, మధు వివరాలను సోమవారం వెల్లడించారు. మధుసూ దన్‌రెడ్డికి సంబంధించి అరటి పండ్ల డీసీఎం మదనపల్లి నుంచి వరంగల్‌కు ఆదివారం అర్ధరాత్రి బయలుదేరగా, అందులో పెద్ద మొత్తంలో సరైన పత్రాలు లేని నగదు తీసుకొస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం ఉదయం మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ వద్ద డీసీఎంను ఆపి తనిఖీ చేయగా డబ్బు లభించలేదు. ఆ తర్వాత శివనగర్‌లోని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా రూ.1.07 కోట్ల నగదు దొరకగా, సరైన పత్రాలు అడిగితే చూపించలేదు. దీంతో నగదును సీజ్ చేశామని వెల్లడించారు. కాగా, జిల్లా కేంద్రంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడడం సంచలనం కలిగించింది. -
నిజాయతీ ఉందనడానికి ఇదే నిదర్శనం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చిరుద్యోగులు, రోజు కూలీలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌తో అసలు జనాలు భయటకు వెళ్లలేదు. ప్రస్తుతం సడలింపులు ఇచ్చినప్పటికి.. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దాంతో రోజు గడవడం.. వాహనాల ఈఎమ్ఐలు, రోజు వారి అద్దెలు గడవడం గగనంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ ఆటోడ్రైవర్ తన నిజాయతీని కోల్పోలేదు. రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న తరణంలో తన ఆటోలో అతడికి సుమారు లక్షన్నర రూపాయల సొమ్ము దొరికింది. కానీ అతడు దానిలో ఒక్క రూపాయి ముట్టుకోకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు. (ఉపాధి ఊడుతోంది!) వివరాలు.. మహ్మద్ హబీబ్ నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరోనా ముందు వరకు ఆటో మీద బాగానే సంపాదించేవాడు. కానీ లాక్‌డౌన్‌తో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రోజుకు కేవలం మూడువందల రూపాయలు మాత్రమే సంపాదించగల్గుతున్నాడు. దానిలో 250 రూపాయలు ఆటో అద్దెకు పోతుంది. మిగిలిన 50 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మహ్మద్ హబీబ్ ఆటోలో ఇద్దరు మహిళలు ఎక్కారు. సిద్దంబర్ బజారు ప్రాంతంలో దిగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో మహ్మద్ తాడబన్ ప్రాంతానికి చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం ప్యాసింజర్ సీటులో వెతికాడు. అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఏ బాంబో ఉంటే ఎంటి పరిస్థితి అనుకున్నాడు. (నెల రోజుల తర్వాత కాస్త రిలీఫ్..) ఇంతలో మహ్మద్‌కి సిద్దంబర్ బజార్ ప్రాంతంలో దిగిన మహిళలు గుర్తుకు వచ్చారు. ఈ బ్యాగ్ వారిదే అయ్యుంటుందని భావించాడు. అక్కడి వెళ్లి వారి కోసం చూశాడు. కానీ కనిపించలేదు. దాంతో ధైర్యం చేసి బ్యాగ్ ఒపెన్ చేశాడు. దాన్నిండ డబ్బుల కట్టలు ఉన్నాయి. మొత్తం 1.40 లక్షల రూపాయలు ఉన్నాయి. వెంటనే దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. విషయం వారికి చెప్పాడు. ఇంతలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మహ్మద్ ఆమెను గుర్తు పట్టాడు. అనంతరం బ్యాగ్‌ను ఆమెకు అందించాడు. పోయింది అనుకున్న డబ్బు దొరకడంతో సదరు మహిళ సంతోషించింది. మహ్మద్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక అతడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. పోలీసులు మహ్మద్ నిజాయతీని ప్రశంసించడంతో పాటు అతడికి సన్మానం చేశారు. -
మనమైతే ఇలా చేయగలిగే వాళ్లమా..?!
గాంధీనగర్ : రోడ్డు మీద ఓ పది రూపాయలు కనిపిస్తేనే.. ఎవరి కంటా పడకుండా చటక్కున తీసుకుంటాము. అలాంటిది రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరూ గమనించకముందే ఆ నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయిస్తాము. కానీ గుజరాత్ సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. వివరాలు.. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నట్లు తెలిపారు. -
రైల్వే పోలీసుల నిజాయితీ
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం తెలవారుజామున విశాఖపట్నం చేరుకున్న ఫలక్నామా ఎక్స్‌ప్రెస్‌లో బి – 3 సీట్ నెం.12లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు తన విలువైన బ్యాగ్‌ను మరచిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఏఎస్ఐ పి.సి.యమ్.రావు, హెడ్ కానిస్టేబుల్ వై.బక్కయ్య తనిఖీలలో ఈ బ్యాగ్‌ను గుర్తించారు. బ్యాగ్‌లో 70వేల నగదు, 10తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి గుంటూరు నుంచి వస్తున్న నగరానికి చెందిన వై.సరస్వతిగా గుర్తించారు. రైలు దిగే కంగారులో ఆమె బ్యాగ్ మరిచిపోయిందని గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సీట్ నెంబర్ ఆధారంగా పిలిపించి ఆమెకు బ్యాగ్‌ను అందజేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నిజాయితీని డివిజినల్ స్థాయిలో గుర్తించి సత్కరిస్తారని, ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆర్కే రావు తెలిపారు. -
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
నెల్లూరు, నాయుడుపేటటౌన్: పట్టపగలు జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ మహిళ చేతి సంచిలోని ఆమెకు సైతం తెలియకుండా సినీ ఫక్కీలో చోరీ చేశారు. అందులో రూ.3.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘట న పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాజికండ్రిగకు చెందిన లొడారి అంకమ్మ పట్ట ణంలోని ఓ ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగా ఇచ్చేందుకు రూ.3.90 లక్షలు తీసుకుని ఆమె సమీప బంధువు పి.శారదమ్మతో కలిసి సర్వీస్ ఆటోలో నాయుడుపేటకు వచ్చింది. పాతబస్టాండ్ వద్ద దిగి పూలు, వస్తువులు కొనుగోలు చేసి పట్టణంలోని ఆ మె కుమార్తె ఇంటికి వెళ్లానుకుంది. అయితే అంకమ్మ పాతబస్టాండ్ వద్ద పూలమొక్కలు విక్రయించే దుకాణం వద్ద కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించి ఆమెకు చెప్పాడు. అప్పుడు అంకమ్మ ఆమె చేతిలో నగదు భద్రపరచి ఉన్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెట్టింది. ఆమెకు కూడా తెలియకుండా పదునైన బ్లేడుతో సంచిని కోసి నగదు సంచిని దోచుకెళ్లినట్లుగా గుర్తించింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ. 3.90 లక్షలు చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జీ వేణు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పాతబస్టాండ్ వద్ద బాధితురాలు వెళ్లిన పలు ప్రదేశాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆధారాలు దొరకలేదు. పట్టణంలోని దర్గావీధి ప్రాంతాల్లో ఆటోకు సంబంధించి సీసీ ఫుటేజీలను పోలీసులు రికార్డు చేసుకొని పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
చెత్తలో రూ. ఆరు లక్షలట!
రాజేంద్రనగర్: ఇంట్లో చెత్త నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ బదులు, నగదు బ్యాగ్‌ను ఇంటి యజమాని వాచ్‌మెన్‌కు అందించాడు. దాన్ని ఆ వాచ్మెన్ చెత్త సేకరణదారుడికి అందించాడు. అందులో రూ. 6 లక్షలు ఉన్నాయంటూ ఆ యజమాని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చెత్త లారీతో పాటు చెత్తనంతా వెతికినా డబ్బు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీసులు చెత్త సేకరిస్తున్న కార్మికుడితో పాటు వాచ్‌మెన్‌ను విచారిస్తున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని రాధాకృష్ణానగర్ ప్రాంతంలో డి.యాదగిరి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తుంటాడు. ఆటోలో సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలిస్తాడు. కాలనీకి చెందిన ఓ అపార్ట్మెంట్లో ఓ యజమాని ఆరు లక్షల నగదును ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. శుక్రవారం ఉదయం చెత్త కోసం వచ్చిన కార్మికుడికి ఇంట్లోని వారు ఆ బ్యాగును కాస్తా చెత్త బ్యాగ్ అనుకొని వాచ్‌మెన్‌కు అందజేశారు. వాచ్మెన్ బ్యాగ్‌ను చెత్త తరలించే వాహనంలో వేశాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నగదు ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించకపోవడంతో ఇంట్లో వెతకగా బ్యాగ్‌కు బదులు, చెత్త బ్యాగ్ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో వెంటనే ఆ ఇంటి యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. పోలీసులు చెత్త సేకరిస్తున్న యాదగిరి డంపింగ్ యార్డు వద్ద పట్టుకొని తనిఖీ చేశారు. ఆటోతో పాటు అప్పుడే చెత్తను తరలిస్తున్న లారీని పూర్తిగా వెతికారు. అయినా డబ్బు బ్యాగ్ కనిపించలేదు. దీంతో యాదగిరితో పాటు వాన్‌మెన్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్మికుడిని వేధించడం సరైంది కాదు: రుద్రకుమార్ చెత్త సేకరించే కార్మికుడు యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్టేషన్లో వేధించడం సరైంది కాదని బీఎల్ఎఫ్ నాయకుడు రుద్రకుమార్యాదవ్ అన్నారు. రూ. 6 లక్షల డబ్బును ఎవరైనా చెత్త వేసే ప్రాంతంలో భద్రపరుస్తారా అని ప్రశ్నించారు. కార్మికుడిని వెంటనే వదిలివేయాలన్నారు. -
దొరికిన డబ్బు ఇచ్చేశారు!
చిత్తూరు, కురబలకోట: దొరికిన సొమ్మును పోగొట్టుకు న్న వ్యక్తికి అందజేసి నిజాయితీ చాటుకున్నా రు ఇద్దరు వ్యక్తులు. మండలంలోని అంగళ్లు గ్రామం తుమ్మచెట్లపల్లెకు చెందిన పులగింటి రామమూర్తి, పులగింటి సుందర్రాజ్ సోమవారం మధ్యాహ్నం సొంత పని మీద మోటార్ సైకిల్‌పై కురబలకోటకు బయలుదేరారు. వారు మార్గం మధ్యలోని జంగావారిపల్లె వద్దకు చేరుకోగానే రోడ్డుపై ఒక కవర్ కనిపించింది. అందులో ఆధార్, ఏటీఎం, పాన్‌కార్డులతో పాటు 75 వేల రూపాయల (కువైట్ కరెన్సీ, ఇక్కడి కరెన్సీ 25 వేల రూపాయలు కలిపి) నోట్లు కనిపించాయి. ఆధార్ కార్డు ఆధారంగా వారు ఆ కవరును కువైట్ నుంచి కురబలకోటకు వచ్చిన బాషాదిగా గుర్తించారు. ఆ గ్రామానికి చెం దిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి బైసాని చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఆ డబ్బును కువైట్ బాషాకు అందజేశారు. వారి నిజాయితీని తెలుసుకున్న ఎస్ఐ నెట్టి కంఠయ్య అభినందించారు. -
చిరిగిన టాప్ ఆధారంగా..
నాగోలు: తన భార్యకు వైద్యం చేయించేందుకు నగదుతో నగరానికి వచ్చిన వ్యక్తి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.3.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన రాంచంద్రయ్య రైతు. గత నెల 25న అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించేందుకు రూ. 3.20 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని సూర్యాపేటలో ఎర్టిగా కారు ఎక్కారు. ఎల్బీనగర్ రింగురోడ్డులో ప్రయాణికులు దిగుతుండగా కారు డ్రైవర్ హడావుడిలో డబ్బులు ఉన్న రాంచంద్రయ్య బ్యాగును కిందకు దించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రాంచంద్రయ్య, అతని భార్య కారు దిగారు.నగదుతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో డ్రైవర్‌ను నిలదీయగా ఎల్బీనగర్ రింగురోడ్డులోనే దింపినట్లు చెప్పడంతో వెనక్కు వచ్చి చూడగా బ్యాగ్ కనిపించలేదు. అదే చౌరస్తాలో ఉన్న ఆటో డ్రైవర్ జంగయ్య ఎవరూ లేకపోవడంతో బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టించిన సీసీ కెమెరాలు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బ్యాగును తీసుకెళ్తున్నట్లు కనిపించినప్పటికీ ఆటో నెంబర్ కనిపించకపోవడంతో ఆటోపై ఉన్న గ్రీన్‌కలర్ స్టిక్కర్, చినిగిన రంద్రం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ పరిధిలోని 45 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందతుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 3.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి డీసీపీ నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో ఎల్బీనగర్ డీఐ పృథ్వీదర్‌రావు, ఎస్ఐలు అవినాష్‌బాబు, లక్ష్మీనారాయణ, సిబ్బంది శివరాజ్, ఏఎస్ఐ బోస్, ఎల్లయ్య, దేవానంద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.10లక్షలు దొరికితే ఏం చేశాడో తెలుసా?
ఒంగోలు క్రైం: ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. పొరపాటున తన బ్యాగు అనుకొని మరో బ్యాగు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ బ్యాగు తనది కాదని గుర్తించాడు. బ్యాగు తీసి చూస్తే కళ్లు బైర్లు కమ్మాయి. రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు కనిపించాయి. రెండో ఆలోచన లేకుండా నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. పోలీస్ ఔట్ పోస్ట్‌లో పోలీసులకు వివరించాడు. పోలీసులు ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన ఎస్పీ బి.సత్య ఏసుబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇది శనివారం ఒంగోలు నగరంలో జరిగిన సంఘటన. వివరాలు.. దర్శి మండలం రాజంపల్లికి చెందిన వై.అనూషకు ఆమె తండ్రి రూ.10 లక్షలు, విలువైన వస్తువులు బ్యాగులో పెట్టి ఒంగోలులోని బాబాయ్‌కు ఇవ్వాలని ఆమెను పంపించాడు. అనూష దర్శి నుంచి పొదిలి వచ్చి పొదిలిలో ఒంగోలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. బ్యాగును బస్సులోని లగేజీలు పెట్టే ప్రాంతంలో ఉంచి అనూష సీట్లో కూర్చుంది. అదే బస్సులో నగరంలోని రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్న మెడికల్ రిప్రజెంటేటివ్ మారుతి వినయ్‌కుమార్ కూడా పొదిలి నుంచి ఒంగోలు వస్తున్నాడు. దిగే సమయంలో అతని బ్యాగు అనుకొని పొరపాటున అనూష బ్యాగు తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి బ్యాగు చూసిన తర్వాత తనది కాదని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగు మాయమైందని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తమ సిబ్బందిని రంగంలోకి దించారు. ముగ్గురు ఎస్ఐలతో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అనూష చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఈ తంతు దాదాపు గంటపాటు కొనసాగింది. ఇంతలోనే డీస్పీకి ఫోన్ వచ్చింది. నగదుతో కూడిన బ్యాగుతో మెడికల్ రిప్రజెంటేటివ్ మారుతి వినయ్‌కుమార్ ఆర్టీసీ ఔట్ పోస్ట్‌కు వచ్చాడని. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అటు అనూషను, నగదు బ్యాగు తీసుకొచ్చిన మారుతి వినయ్‌కుమార్‌ను తీసుకొని ఎస్పీ బి.సత్య ఏసుబాబు వద్దకు తీసుకెళ్లారు. ఎస్పీ తన సమక్షంలోనే బ్యాగును అనూష, ఆమె బంధువులకు అప్పగించారు. మారుతి వినయ్‌కుమార్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి మరీ ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు డి.రాజారావు, మేడా శ్రీనివాసరావు, ఎన్సీ ప్రసాద్‌తో పాటు ఐడీ పార్టీ సిబ్బంది మౌలాలీ, శివను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ. 2 కోట్ల బ్యాగ్ దొరికిందా.. లేదా?
నగర శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ. 2 కోట్లు దొరికాయన్న వార్త.. కలకలం రేపింది. అంతలోనే.. డబ్బులు ఏమీ దొరకలేదంటూ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడంతో అంతా తుస్‌మన్నట్లే అంటున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలకు మాత్రం సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులకు మంగళవారం ఓ బ్యాగ్ దొరికిందని, అందులో రూ. 2 కోట్ల డబ్బు ఉందని కథనాలు వచ్చాయి. అంత డబ్బు కళ్ల చూడటంతో ఒక్కసారిగా వాళ్లలో ఆశ పుట్టిందని, అయితే పంచుకోవడంలో లెక్కలు తేలకపోవడంతో గొడవపడిన గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్‌లో దొరికిన పెద్దమొత్తంలో ఉన్న డబ్బుల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరూ పెట్టారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలిసింది. కానీ అక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. అసలు యార్డులో డబ్బులేవీ దొరకలేదని డంపింగ్ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నవీన్ కుమార్ అన్నారు. డబ్బు దొరికిందంటూ వచ్చినవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది అందరినీ విచారించామని, అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. దీంతో అసలు నిజంగా డబ్బు ఉందా.. లేదా అన్న విషయమై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.