బాధిత మహిళను విచారిస్తున్న సీఐ, ఎస్సైలు
నెల్లూరు, నాయుడుపేటటౌన్: పట్టపగలు జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ మహిళ చేతి సంచిలోని ఆమెకు సైతం తెలియకుండా సినీ ఫక్కీలో చోరీ చేశారు. అందులో రూ.3.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘట న పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాజికండ్రిగకు చెందిన లొడారి అంకమ్మ పట్ట ణంలోని ఓ ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగా ఇచ్చేందుకు రూ.3.90 లక్షలు తీసుకుని ఆమె సమీప బంధువు పి.శారదమ్మతో కలిసి సర్వీస్ ఆటోలో నాయుడుపేటకు వచ్చింది. పాతబస్టాండ్ వద్ద దిగి పూలు, వస్తువులు కొనుగోలు చేసి పట్టణంలోని ఆ మె కుమార్తె ఇంటికి వెళ్లానుకుంది. అయితే అంకమ్మ పాతబస్టాండ్ వద్ద పూలమొక్కలు విక్రయించే దుకాణం వద్ద కు వెళ్లింది.
అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించి ఆమెకు చెప్పాడు. అప్పుడు అంకమ్మ ఆమె చేతిలో నగదు భద్రపరచి ఉన్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెట్టింది. ఆమెకు కూడా తెలియకుండా పదునైన బ్లేడుతో సంచిని కోసి నగదు సంచిని దోచుకెళ్లినట్లుగా గుర్తించింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ. 3.90 లక్షలు చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జీ వేణు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పాతబస్టాండ్ వద్ద బాధితురాలు వెళ్లిన పలు ప్రదేశాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆధారాలు దొరకలేదు. పట్టణంలోని దర్గావీధి ప్రాంతాల్లో ఆటోకు సంబంధించి సీసీ ఫుటేజీలను పోలీసులు రికార్డు చేసుకొని పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment