![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/7/parsu%20poyindi%20222.jpg.webp?itok=lHeCsgTR)
కరీంనగర్: కరీంనగర్ బస్టాండ్‌లో నా పర్సు పోయింది.. దొరకకుంటే చచ్చిపోతానంటూ ఓ యువకుడు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం పైకి ఎక్కి, హంగామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని జంగపల్లికి చెందిన చింటు అలియాస్ రాజు పర్సును శనివారం రాత్రి కరీంనగర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి దొగిలించాడు.
రాత్రి నుంచి పోలీసులకు చెబుతుంటే పట్టించుకోవడం లేదంటూ ఆదివారం ఠాణా భవనం పైకి ఎక్కి కూర్చున్నాడు. పర్సు దొరకకుంటే దూకి చనిపోతానని బెదిరించాడు. పోలీసు సిబ్బంది అతన్ని కిందకు దింపే ప్రయత్నం చేసినా వినకుండా అరగంటపాటు హంగామా చేశాడు. చివరికి రాజును మాటల్లో పెట్టి, పైకి వెళ్లి తీసుకువచ్చారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment