తాంత్రికుడు చెప్పాడని.. సంపద కలిసివస్తుందని.. | Relatives Want To Kill A Boy With 12 fingers And 12 toes In Barabanki | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 8:30 AM | Last Updated on Mon, Sep 3 2018 8:47 AM

Relatives Want To Kill A Boy With 12 fingers And 12 toes In Barabanki - Sakshi

లక్నో: మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కలకలం రేపింది. 12 చేతులకు వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుడిని చంపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు. అంతేకాకుండా దీనిపై వారు పోలీసులను కూడా ఆశ్రయించారు.

దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఆ బాలుడు చదుకోవడానికి తాము సహాకారం అందిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అతను చదువుకు దూరం కాకుండా చూస్తామన్నారు. ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని.. నిష్పాక్షికమైన విచారణ చేపడతామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement