
సోమార్ మడకామి(ఫైల్)
భువనేశ్వర్ : క్షుద్ర పూజలు చేస్తున్నాడన్న అనుమానంతో సోమార్ మడకామి అనే యువకుడిని గ్రామస్తులు హత్య చేశారు. ఈ సంఘటన మల్కాన్‌గిరి జిల్లాలోని పద్మగిరి పంచాయతీ, కెందుగుడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల నుంచి కెందుగుడ గ్రామానికి చెందిన 20 మంది చిన్నారులు చనిపోతూ వస్తున్నారు. అదే గ్రామంలో ఉన్న కొంతమంది క్రైస్తవుల పూజల వల్లే పిల్లలు చనిపోతున్నారని గ్రామస్తులు భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తగా క్రైస్తవ మతంలోకి చేరిన సోమార్ మడకామి కూడా చిన్నారుల మరణాలకు కారణమని గ్రామస్తులు అనుకున్నారు. ( దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)
అతడిని హత్య చేసేందుకు పథకం వేసి, హతమార్చారు. హత్య అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని గ్రామానికి దగ్గరలోని తోటల్లో గ్రామస్తులు పూడ్చి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అక్కడి తోటలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి, బయటకు తీశారు. ప్రస్తుతం ఇదే ఘటనకు సంబంధించి, గ్రామస్తుల్లో మొత్తం ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (చిట్టిమాము బర్త్‌డే సెలబ్రేషన్స్.. అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment