![Man assassinated Wife Then Ends Life By Hanging Himself In Odisha - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/6/Crime_0126.jpg.webp?itok=SbmiThfb)
బెర్హంపూర్(భువనేశ్వర్): కలకలాం కలిసుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలెట్టారు. అంతలో ఏమైందో.. భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ విషాద ఘటన ఒరిస్సా చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో.. బిపిన్, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కొంత కాలం నుంచి వారు తరచూ గొడవపడేవారు.
ఈ క్రమంలో ఏం జరిగిందో తెలీదు గానీ.. బిపిన్ తన భార్యను గొడ్డలితో నరికేసి, అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి రాగానే వీరిద్దరూ విగతజీవులుగా ఉండడం చూసి పోలీసులకు, లిలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ హత్య, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment