superstitions
-
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
హాయిగా నవ్వుకుంటారు
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్ శ్రీధర్ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ తీశాం. మా బ్యానర్లో నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి -
ఇదేం విడ్డూరం..మంగళవారం పెళ్లిళ్లు చేసుకుంటే పెటాకులవుతాయా?
5జీ టెక్నాలజీతో దూసుకుపోతున్నా ఇప్పటికీ మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తున్నా ఇప్పటికీ పిల్లి ఎదురుపడితే అపశకునం అని, రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే అరిష్టం అని, పగిలిన అద్దం వాడిదే దరిద్రమని నమ్మేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించేవాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్లు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందన్న గుడ్డి నమ్మకంతో కొన్నింటిని ఫాలో అవుతుంటాం. ఇది ఒక్క మనదేశంలోనే కాదండోయ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి వింతైన మూఢనమ్మకాలు మనల్ని కశ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ♦ నైజీరియాలో పిల్లల పెదవులపై ముద్దు పెట్టరు. అలా చేస్తే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ల జీవితం నాశనం అవుతుందని నమ్ముతారట. ♦ మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం చాలామందికి అలవాటు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ అలవాటును అస్సలు ఒప్పుకోరట. ఖాళీగా కూర్చొని కాళ్లు కదిపితే ఆ వ్యక్తి సంపద మొత్తం పోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట. ♦ ఐస్‌ల్యాండ్‌లో ఆరుబయట అల్లికలు,కుట్లు చేయరట. అలాచేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని భావిస్తారు. అలసే అక్కడ మైనస్ డిగ్రీల వాతావరణం కాబట్టి ఈ పని అస్సలు చేయరు. ♦ లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఒకవేళ అలా చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. నిత్యం తిట్లు, గొడవలతో చివరకు విడాకులు తీసుకొని విడిపోతారట. అందుకే అక్కడి ప్రజలు మంగళవారం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్లు చేసుకున్నా ఏదో ఒక సాకుతో జనం వెళ్లడానికి కూడా ఇష్టపడరట. ♦ జపాన్‌లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరట. ♦ జర్మనీలో కొవ్విత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులను చెడు చేస్తుందట. ♦ ఆఫ్రికా దేశం రువాండలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయనేది మూఢనమ్మకం. ♦ జపాన్‌లో సూర్యాస్తమయం తర్వాత చేతి గోళ్లను కత్తిరించరు. అలా కత్తిరిస్తే త్వరగా చనిపోతారని నమ్ముతారట. మన దగ్గర కూడా అరిష్టం అని రాత్రిళ్లు గోళ్లు కత్తిరించరు. ♦ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలంటే ఏం చేస్తాం? గొడుగు తీసుకొని బయటకు వెళ్తాం. అయితే ఆ గొడుగు బయటకు వెళ్లాకే తెరవాలట. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు గొడుగు తెరవొద్దట. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట. అందుకే ఎంత వర్షం పడుతున్నా పూర్తిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన తర్వాతే గొడుగు తెరుస్తారు. ♦ స్వీడన్లో మాన్హోల్పై పొరపాటున కూడా కాలు పెట్టరట. అలా చేస్తే ప్రేమ విఫలం అవుతుందని, దురవృష్టం వెంటాడుతుందని బలం నమ్ముతారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. -
యాలకులు, బిర్యానీ ఆకులతో కోరుకున్నది నెరవేరుతుందా? బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకుంటే..
సుమ రెండేళ్ల కిందట బ్యూటీ పార్లర్ మొదలు పెట్టింది. కానీ తాను ఊహించినంత గొప్పగా సాగడంలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యింది. అదే సమయంలో పర్స్‌లో ప్రతి శుక్రవారం ఆరు యాలకులు పెట్టుకుంటే కోరుకున్నది జరుగుతుందని యూట్యూబ్‌లో ఒక వీడియో చూసింది. రెండు మూడు నెలల పాటు దాన్ని ఫాలో అయ్యింది. కానీ తన బిజినెస్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆ సమయంలోనే యూట్యూబ్‌లో మరో వీడియో కనిపించింది.. మీకేం కావాలనుకున్నారో అది బిర్యానీ ఆకుపై రాసి, కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను ఆకాశంలోకి ఊదుతూ మీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది అని! చాలా ఆశగా ఆ పని చేసింది. ఒకసారి కాదు, పలుసార్లు. ఫలితం శూన్యం. పది వేల రూపాయలు ఖర్చుపెట్టి ఒక వర్క్‌షాప్‌కి హాజరయ్యింది. విజన్ బోర్డ్ తయారు చేసుకుంది. తనకేం కావాలో అఫర్మేషన్స్ రూపంలో రోజూ క్రమం తప్పకుండా రాసింది. కానీ తన బ్యూటీ పార్లర్ బిజినెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉంది. ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. ఆ ఒత్తిడిని భర్తపై, పిల్లలపై చూపించింది. వీటన్నింటినీ గమనించిన భర్త.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు. అశాస్త్రీయం.. అభూత కల్పనలు.. సుమలానే చాలామంది సక్సెస్ కోసం, సంతోషం కోసం, కోరుకున్నది జరగడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. అలాంటివారికి సులువైన చిట్కాలిస్తూ యూట్యూబ్‌లో వందలు, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆ మార్గాలు సులువుగా ఉండటం వల్ల వాటిని పాటిస్తూ, ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీటన్నింటికీ మూలం ‘లా ఆఫ్ అట్రాక్షన్’ అనే సిద్ధాంతం. ‘ప్రతికూల ఆలోచనల వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనల వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తుంటే అవి నెరవేరేలా విశ్వం మీకు సహాయపడుతుంది. విశ్వంలోని శక్తులన్నింటినీ మీవైపు ఆకర్షించి మీ ఆలోచనలు సాకారమయ్యేలా చేస్తుంది’ అనేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఆలోచనలకు విశ్వం ప్రతిస్పందిస్తుందని దీన్ని నమ్మేవారు చెప్తారు. ఎనర్జీ, ఎలక్ట్రాన్స్, ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్స్‌కి సంబంధించిన పదాలను వాడుతుంటారు. కానీ నిజానికి సైన్స్‌కి ‘లా ఆఫ్ అట్రాక్షన్’కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది అశాస్త్రీయమైన అభూత కల్పనలతో నిండిన ఒక మెటాఫిజికల్ సూడోసైన్స్ మాత్రమే. మీకు ఎప్పుడేది ఇవ్వాలో విశ్వానికి తెలుసునని, దాన్ని నమ్ముకుని లక్ష్యాన్ని సాధించినట్లు విశ్వసిస్తే చాలని ప్రబోధిస్తారు. కన్ఫర్మేషన్ బయాస్ వల్ల చాలామంది ఈ మాటలను, సిద్ధాంతాన్ని నమ్ముతారు. అఫర్మేషన్స్ రాసుకుంటూ, జపిస్తూ సుమలానే కాలాన్ని వృథా చేస్తుంటారు. తాము కోరుకున్నది ఎప్పటికీ జరక్క ఫ్రస్ట్రేషన్‌కి, ఒత్తిడికి లోనవుతారు. యూనివర్సిటీల అధ్యయనం లా ఆఫ్ అట్రాక్షన్, విజన్ బోర్డ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక ప్రయోగం జరిగింది. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించారు. టాప్ గ్రేడ్స్ సాధిస్తే ఎలా ఉంటుందో మొదటి గ్రూప్‌ని ఊహించమన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదువుకోవాలో ఊహించమని రెండో గ్రూప్‌కి చెప్పారు. మూడో గ్రూప్‌కి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు. మొదటి గ్రూప్ విద్యార్థులు ఎక్కువ విజువలైజ్ చేసి, తక్కువ చదివి, తక్కువ గ్రేడ్లు సాధించారు. చదువుతున్నట్లు ఊహించుకుని చదివిన రెండో గ్రూప్ విద్యార్థులు తక్కువ వత్తిడితో ఎక్కువ మార్కులు సాధించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో జరిగిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి. పని చేయాల్సిందే.. ►గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదని కోరుకున్నట్లుగా.. లవంగాలు, యాలకులను బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకోవడం వల్ల, బిర్యానీ ఆకులను కాల్చి గాలిలో ఊదడం లాంటి చిట్కాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ►అఫర్మేషన్స్, విజన్ బోర్డ్ లాంటివి లక్ష్యం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడటానికి ఉపయోగపడతాయి. వాటి ప్రయోజనం అంతవరకేనని గుర్తించాలి. ►విశ్వం ఒక వ్యక్తి కాదని, అది మన ఆలోచనలు, మాటలు వినదని అర్థం చేసుకోవాలి. ►‘‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పారు. అంటే కలలు కనడంతోనే సంతృప్తిపడితే సరిపోదు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శ్రమించాలి. ►లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని, అంచెలంచెలుగా దాన్ని పూర్తి చేసుకుంటూ కలలను సాకారం చేసుకోవాలి. -సైకాలజిస్ట్ విశేష్ -
చాతక పక్షి స్వాతి చినుకులు మాత్రమే తాగుతుందా? సంతానోత్పత్తి కోసం..
బహుశా చాతక పక్షి, మూఢనమ్మకం అవిభాజ్య కవలలు అయుండొచ్చు, అందుకే ఈ పక్షికి చాలా మూఢనమ్మకాలు అంటగట్టారు. చాతక పక్షిని చిట్టి కోకిల, Pied cuckoo, Jacobin Cuckoo (Clamator jacobinus) అని కూడా పిలుస్తారు. వివిధ పేర్లతో పిలువబడే ఈ పక్షి అనేకమంది ప్రేమ జంటల, రైతుల, శాస్త్రవేత్తల దృష్టిని ఎంతో కాలంగా ఆకర్షిస్తూ ఉంది . కవిత్వంలో ఈ పక్షిని ప్రేమద్వేషాల అతిశయోక్తిని వ్యక్తీకరించడానికి కవిసమయంలో వాడితే, రైతులకు, శాస్త్రవేత్తలకు రుతుపవనాలరాకను తెలిపే శుభ సంకేతంగా ఈ పక్షిని సూచిస్తుంటారు. మేఘదూత కవిత్వంలో ఈ చాతక పక్షి గురించి ఎన్నో పురాణాలు, జానపద కథలు మరియు కవిత్వం రచించ బడ్డాయి. కాళిదాసు రూపొందించిన మేఘదూత కవిత్వంలో, ప్రేమ కోసం తపనకు ప్రతీకగా ఈ పక్షిని వర్ణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ పక్షి కవిని ఆకట్టుకోవడం అనేది చాల ఆసుక్తికరమైన విషయమే. ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతిలో భాగమైన పక్షి కాబట్టి, దాని చుట్టూ ఉన్న కథను మహిమపరిచే అవకాశం ఉంది. ఇప్పటికీ సామాన్యుల మదిలో ఈ పక్షిపై రకరకాల అపనమ్మకాలు ఉన్నాయనడంలో తప్పులేదు. వార్తా పత్రికలు, వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఆ మూఢనమ్మకానినే సత్యంగా చిత్రీకరిస్తున్నాయి. వర్షపు నీరే తాగుతుందా? మన సంప్రదాయం ప్రకారం ఈ చాతక పక్షి నేల మీద ఉండే నీరు త్రాగదని, ఇది కేవలం తొలకరి వర్షపు చినుకులు (స్వాతి వర్షం) ఆకాశం నుంచి పడుతున్నప్పుడే నేరుగా నోరు తెరచి పట్టుకుని తాగుతుంటుందని, లేకుంటే నీరు తాగకుండా రోజుల తరబడి బతుకుతుందని చెబుతుంటారు. ఇవన్నీ అసత్యాలు ఇంకొక మూఢనమ్మకం ఏమిటంటే, చాతక పక్షి తలపై ఉన్న శిఖరంలో వర్షపు నీటిని సేకరించి త్రాగుతుందని, ఒక వేల చాతకం నిలిచిన నీటిని త్రాగడానికి ప్రయత్నించినప్పుడు, ఈ శిఖరం అడ్డుపడడం వల్ల నిలిచిన నీటిని త్రాగదని చెబుతారు. ఈ పక్షి యొక్క మెడ ఎముకలు నిటారుగా ఉండటం వలన దాని మెడను వంచి నీటిని త్రాగదని చెబుతుంటారు. ఇవన్నీ అసత్యాలు ! నిజానికి, ఇది వర్షం పడుతున్నప్పుడే నేరుగా ఆ నీరుని త్రాగదు, నిలిచిన నీళ్లే త్రాగతుంది. ఇప్పటికీ, ఎడారులలో నివసించే కొన్ని జీవులు మాత్రమే, ఆ వాతావరణానికి తట్టుకునే ప్రత్యేకమైన శారీరిక నిర్మాణం కారణంగా నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. వాటికి అడ్డురాదా? అయితే అన్ని జీవులకు నీరు చాలా అవసరం. ఇంకా, పక్షులు శిఖరం కలిగివుండానికి కారణం, వాటి ప్రత్యర్థులకు తమ దూకుడును వ్యక్తపరిచేందుకు. ఇంకా నీళ్ళు తాగడానికి శిఖరం అడ్డు వచ్చే అవకాశం లేదు, ఐదు వందలకు పైగా పక్షులకు ఈ శిఖరం ఉంది, అంటే అవి నీరు త్రాగడానికి ఈ శిఖరం అడ్డు రాదా?. అన్ని పక్షుల మాదిరిగానే, ఈ పక్షి మెడ ఎముకలు నిటారుగా ఉండవు, అన్నిటికి ఉండే లాగానే దీనికి ఉంటాయి. భారతదేశంలో రెండు సమూహాల చాతక పక్షులు ఉన్నాయి, దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఒక చిన్న దేశీయ సమూహం మరియు రుతుపవనాల ముందు భారీ సంఖ్యలో ఆఫ్రికా నుండి వలస వచ్చే మరో సమూహం. ఈ చిన్న పక్షుల సమూహం చాలా అరుదు, ఎవరూ పెద్దగా గమనించి ఉండరు, కానీ ఈ వలస సమూహం భారీ సంఖ్యలో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల, వేసవి తాపానికి బంజరు భూములు, ఎండిన చెట్లు, జంతువులు, పక్షులు నీటి కొరతతో అల్లాడిపోతుంటాయి. ఈ కాలంలో మనిషి వ్యవసాయ పనులు లేకుండా ఖాళీగా ఉండడం, వ్యాపార లావాదేవీలన్నీ నిలిచిఉండడం చేత, ఇలాంటి సమయంలో మానవుని ఉత్సుకత పకృతిలో చిన్న చిన్న మార్పుల పైనే ఉంటుంది. వర్షపు రాక సూచనగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ పక్షులు ‘ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ...’ అంటూ గంభీర స్వరాలతో అరుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అదనంగా ఈ పక్షుల రాకతో రుతు పవనాలతో పెద్ద వర్షాలే వస్తాయి, దీనిని గమనించిన మన పెద్దలు చాతక పక్షి రాకను వర్షం వచ్చేందుకు సూచనగా భావిస్తారు. అంటే చాతక పక్షి వచ్చిందంటే వర్షం వస్తుందని ఒక గట్టి నమ్మకం. సంతతి విస్తరించుకోడానికి ఆఫ్రికా ఖండం నుంచి సముద్రం మీదుగా భారతదేశానికి ఒకేసారి వెళ్లడం చాలా కష్టమైన ప్రయాణం కాబట్టి, మే నెలలో వీచే రుతుపవనాల సహాయం పొందే మార్గాన్ని కనుగొన్నాయి. రుతుపవనాల గాలి సహాయంతో అవి వర్షాలు ప్రారంభానికి ముందే భారత ఉపఖండానికి చేరుకుంటాయి, అందుకే చాతకాకి ’వాన దూత’ అని పిలిచేది. ఈ సమయానికే రావడానికి గల మరొక ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో దాని యొక్క సంతతి విస్తరించుకోడానికి అది అనువైన వాతావరణం. రుతుపవనాలు విచేస్తునప్పుడు పుష్టిగా ఆహారం అందుబాటులో ఉండడం వలన స్థానిక పక్షులు తమ సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. చాతక ఒక బ్రూడ్ పరాన్నజీవి. అనగా అవి తమ గుడ్డులను పెట్టడానికి, పిల్లలను పెంచడానికి ఇతరులపై ఆధారపడే పక్షులు. ఇవి తమ గూడు నిర్మించకుండా మరొక అతిధేయ పక్షి గూడులో వాటి గుడ్లను పెడతాయి. ఇవి ముఖ్యంగా భారతదేశంలో గుడ్లు పెట్టడానికి బాబ్లర్స్ అనే జాతి పక్షి గూళ్ళపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇవి వచ్చిన పనిని పూర్తిచేసి, కొత్తతరం పక్షులతో, ఉత్తర భారతదేశం మీదుగా చలికాలం సమయానికి ఆఫ్రికా ఖండానికి తిరిగివెళ్తాయి. ప్రేమానుభూతిలో కవి అతిశయోక్తితో సృష్టించిన ఊహాగానకవిత్వాన్ని సత్యంగా భావించి ఇన్నాళ్లూ అదే సత్యమని నమ్మి పురాణాన్ని సంపద్రాయంగా భావించడం ఎంతవరకు సమంజసం? ఆ కవిసమయం నుంచి బయటపడి ఒక్కసారైనా శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించుకోలేమా?. - హరీష ఏఎస్(Hareesha AS) ఫొటోగ్రాఫర్- సుభద్రా దేవి -
ఏపీలో దారుణం.. భర్తల సాయంతో తోడికోడళ్లను..
కాసింత ప్రేమను చూపిస్తే పులకించిపోయేవారు.. ఆత్మీయంగా పలకరిస్తే ఆనందించేవారు..ఒక తోడు దొరికిందని..మంచి నీడన హాయిగా బతకొచ్చని ఆశించారు. పుట్టినిల్లు వదిలి మెట్టినింట అడుగుపెట్టిన ఆ ఇద్దరు ఆడపడుచులకు మామ రూపంలో మూఢ నమ్మకం ఎదురైంది. తండ్రిలా చూసుకోవాల్సిన మామ, తన అనారోగ్యానికి కోడళ్లే కారణమని, చేతబడి చేశారని అనుమానించాడు. నాటు వైద్యుని మాటలు నమ్మి కుమారులనూ పక్కదోవ పట్టించి..అతి కిరాతకంగా కోడళ్లను హతమార్చారు. ఈ దారుణం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఓర్వకల్లు: చేతబడి చేశారనే మూఢనమ్మకంతో ఇద్దరు కోడళ్లను మామ అతికిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు కుమారుల సహాయం తీసుకున్నాడు. ఓర్వకల్లు పోలీసులు తెలిపిన వివరాల మేరకు నన్నూరు గ్రామానికి చెందిన కురువ మంగమ్మ, పెద్ద గోవర్ధన్(అలియాస్ గోవన్న)దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు పెద్ద రామ గోవిందుకు గూడూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ(26)తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. చిన్న కొడుకు చిన్న రామగోవిందు, కల్లూరు మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేణుక(25)ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కురువ గోవన్న 40 ఎకరాల భూస్వామి కావడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గోవన్నకు చిన్న కోడలిపై మొదటి నుంచి ఇష్టం లేదు. కోడళ్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. గొవన్న అనారోగ్య సమస్యతో సతమతం చెందేవాడు. ఇతరుల సలహా మేరకు రెండు మూడు సార్లు జొహరాపురంలో ఉన్న నాటు వైధ్యుని వద్దకు వెళ్లి చూపించుకోగా సదరు వైద్యుడు పసురు మందు తాపించాడు. ఆ సమయంలో మందు పడినట్లు తెలిసింది. మందును మీ కోడళ్లే పెట్టించారని, చేతబడి చేశారని గోవన్నకు చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కోడళ్లపై మామ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని కుమారులకు చెప్పి వారిని పక్కదోవ పట్టించాడు. ఇద్దరు కోడళ్లకు సంతానం కలుగకపోవడంతో వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. హత్య చేశారు ఇలా.. బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామంలోని తడకనపల్లె రస్తాలో ఉన్న సొంత పొలంలో పనులు చేసేందుకు మామ గోవన్న కలిసి ఇద్దరు కోడళ్లు పొలానికి వెళ్లారు. వీరికి తోడుగా పెద్ద రామగోవిందు కూడా వచ్చాడు. పనులు ముగిశాక, పశువులకు మేతకోసుకరమ్మని గోవన్న ఇద్దరు కోడళ్లను పొరుగు పొలాల్లోకి పంపాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వ్యూహం ప్రకారం ఇద్దరు కొడుకులతో కలిసి గోవన్న గడ్డికోస్తున్న కోడళ్ల వద్దకు వెళ్లాడు. వేపకర్రతో పెద్ద కోడలు రామేశ్వరమ్మ తలపై బలంగా మోదగా అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇది గమనించిన చిన్న కోడలు రేణుక అడ్డుపడగా అదే కర్రతో ఛాతిపై బలంగా మోదడంతో ఆమె కూడా కుప్పకూలింది. కోడళ్లు ఇద్దరూ కోలుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రాణాలు విడిచారని గమనించిన తండ్రీ కొడుకులు ఇంటికి వెళ్లి స్నానాలు చేసి, దుస్తులు మార్చుకొని సాయంత్రం 6 గంటల సమయంలో పొలానికి వెళ్లి డ్రామా ఆడారు. దారుణం జరిగిపోయిందని విలపిస్తూ భార్యల తరఫున బంధువులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసు జాగిలాలను పిలిపించి ఘటన స్థలంలో పరిశీలించినా, ఎలాంటి ఆధారాలు లభించలేదు. గోవన్న ఆసుపత్రిలో చేరడంతో పోలీసులు అనుమానించారు. గోవన్నతోపాటు పెద్దరామగోవిందు, రామగోవిందును అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో వారు నేరం అంగీకరించారు. వీరితో పాటు, మూఢ నమ్మకాలతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ, కాపురాల్లో చిచ్చులు పెడుతున్న నాటు వైద్యునిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
తండ్రిని బతికించుకునేందుకు... చిన్నారిని బలివ్వబోయింది!
న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల మాయలో ఓ పాతికేళ్ల మహిళ ఒక పసికందునే బలివ్వబోయిన దారుణం ఢిల్లీలో వెలుగుచూసింది. ఇటీవల కన్నుమూసిన తండ్రి నవజాత మగ శిశువును బలిస్తే బతికొస్తాడని ఎవరో చెప్పడంతో ఇంతటి ఘోరానికి పాల్పడబోయింది. మామ్‌రాజ్ మొహల్లా దగ్గర నివసించే దంపతులకు రెండు నెలల బాబున్నాడు. శ్వేత అనే పాతికేళ్ల మహిళ వారితో పరిచయం పెంచుకుంది. ఎన్జీవోలో పనిచేస్తానని, పిల్లాడికి ఉచితంగా మందులిస్తానని నమ్మబలికి ఇంటికి రోజూ వచ్చిపోతూ దగ్గరైంది. బుధవారం పిల్లాడిని సరదాగా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లింది. వెంట వచ్చిన పసికందు బంధువుకు క్రూల్డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి వదిలించుకుని బాబుతో పరారైంది. బంధువు బాబు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా శ్వేత జాడ కనిపెట్టారు. ఆమెను అరెస్ట్‌చేసి పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలున్ని కాపాడుతూ కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. -
ఆ మందును భర్తకు తినిపిస్తే కొంగు పట్టుకు తిరుగుతాడని చెప్తే! ఏంటి ఇదంతా?.. ఇకనైనా
Kerala Human Sacrifice Incident : ‘వొదినా... ఇది విన్నావా... దిండు కింద కరక్కాయ పెట్టుకుంటే మంచిరోజులొస్తాయట’.. ‘అక్కా.. ఈ సంగతి తెలుసా? నల్లకోడితో దిష్టి తీస్తే జ్వరం తగ్గుతుందట’.. ‘వ్రతం చేసి నెల రోజులు ఉపవాసం పాటిస్తే.. ఇక సంపదే సంపద’.. ‘బాబాగారి దగ్గరికెళ్లి తాయెత్తు కట్టుకొస్తే.. కష్టాలన్నీ పోతాయి’... ఇరుగమ్మలు పొరుగమ్మలు ఏమేమో చెబుతుంటారు. వాటిని గడప దాటి లోపలికి రానిస్తే ఇంటికే ప్రమాదం. కష్టాలు అందరికీ ఉంటాయి. సరైన దిశ లేనప్పుడు మూఢవిశ్వాసాలు పాటించైనా బయటపడాలనుకుని ప్రమాదాలు తెచ్చుకుంటారు. స్త్రీ చదువు, స్త్రీ చైతన్యం మూఢ విశ్వాసాల నుంచి కుటుంబాన్ని కాపాడగలదు. అప్పుడే కేరళలో జరిగిన ఉదంతాల వంటివి పునరావృత్తం కాకుండా ఉంటాయి. మేలుకో మహిళా.. మేలుకో. ఆ మధ్య యూ ట్యూబ్‌లో ఒక ఇరుగమ్మ పర్సులో లవంగాలు పెట్టుకుంటే డబ్బు నిలుస్తుంది అని చెప్పింది. యూ ట్యూబ్‌లో కాబట్టి అందరూ వేళాకోళం చేశారు. జోకులేశారు. కాని అదేమాట ఆ ఇరుగమ్మ కేవలం తన పక్కింటామెతో చెప్పి ఉంటే? ఆ పక్కింటామె అమాయకంగా దానిని నమ్మి ఉంటే? భర్త పర్సులో లవంగాలు పెట్టి డబ్బు కోసం ఎదురు చూసి ఉంటే? ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు దేవుణ్ణి పూజించడం, మొక్కులు మొక్కుకోవడం, కష్టాల నుంచి బయట పడేయమని గుడిలో అర్చనలు చేయడం ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కాని సంప్రదాయానికి ఆవల అంగీకరం లేని పుకార్లుగా మూఢవిశ్వాసాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఫలానా లాకెట్ ధరిస్తే మేలు, ఉంగరం ధరిస్తే వశీకరణం, ఫలానా వ్యక్తిని సంప్రదిస్తే చేతబడి, ఫలానా మందును భర్తకు అన్నంలో పెట్టి తినిపిస్తే అతడిక కొంగు పట్టుకు తిరుగుతాడని... ఇలాంటివి లక్ష. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు వస్తే మనిషి మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. ఎలాగైనా వాటి నుంచి గట్టెక్కాలని చూస్తాడు. ఆ సమయంలోకి ఇరుగువారు, పొరుగువారు తోచిన మూఢ సలహాలు ఇస్తారు. వాటిని పాటించడం వల్ల ఇంకా ప్రమాదంలోకి వెళ్లడం తప్ప మరో ఉపయోగం లేదు. అనారోగ్యం వస్తే తగిన వైద్యం చేయించుకుని ఆత్మస్థయిర్యంతో ఆ జబ్బు మీద పోరాడాలి. మంత్రాలకు కాసులు రాలవు దేవుని మీద విశ్వాసం ఉంటే ప్రార్థన మేలు చేస్తుంది. అంతే తప్ప మంత్రగాళ్లు మేలు చేయరు. ఆర్థిక కష్టాలు వస్తే విజ్ఞుల సలహా తీసుకుని అయినవారి మద్దతుతో వాటి నుంచి బయటపడాలి తప్ప మంత్రాలకు కాసులు రాలవు. అయినా సరే మూఢవిశ్వాసాలు గట్టిగా లాగుతాయి. వాటిని స్త్రీలు నమ్మడం మొదలెడితే చాలా ప్రమాదం. మగవాడికి కనీసం బజారులో అలాంటి పనులు ఖండించేవారు తారసపడతారు. ఇరుగమ్మలు, పొరుగమ్మలు కలిసి తమ లోకంలో తాము ఉంటూ ఇలాంటివి నమ్ముతూ పోతే ఇంటి మీదకే ప్రమాదం వస్తుంది. ఒకప్పుడు సమాజంలో నాస్తికవాదం, హేతువాదం, అభ్యుదయ వాదం మూఢవిశ్వాసాలకు జవాబు చెప్పేవి. బాబాల, స్వామిజీల ట్రిక్కులను తిప్పి కొట్టేవి. అతీంద్రియ శక్తుల మీద కంటే మనిషికి తన మీద తనకు విశ్వాసం కల్పించేవి. కాని ఇవాళ ఎటు చూసిన చిట్కాలు, కిటుకులు చెప్పేవారు తయారయ్యారు. మంగళవారం ఫలానా రంగు బట్ట కట్టమని, బుధవారం ఫలానా పని చేయొద్దని, శుక్రవారం ఫలానా ప్రయాణం చేయొద్దని... ఇలా ఉంటే సమాజం ఎలా ముందుకు వెళుతుంది? వెంటనే పోలీసులకు పట్టించాలి ఎవరికీ హాని చేయని మూఢ విశ్వాసాలనైనా క్షమించవచ్చు. కాని ఎవరికైనా హాని చేస్తే తప్ప తాము బాగు పడము అనే మూఢవిశ్వాసం వ్యాపింప చేసేవారిని వెంటనే పోలీసులకు పట్టించాలి. అలాంటి ఆలోచనలో ఉన్నవారు ఆ మత్తు నుంచి తక్షణమే బయటపడి స్పృహలోకి రావాలి. హైదరాబాద్‌లో ఆ మధ్య ఒక రియల్టర్ ముక్కుముఖం తెలియని స్వామిని పూజకు పిలిస్తే అతడు ప్రసాదంలో మత్తు మందు కలిపి ప్రాణం మీదకు తెచ్చాడు. ఇవాళ కేరళలో నరబలి ఇస్తే తప్ప ఆర్థిక కష్టాలు పోవు అని ఎవరో నూరిపోస్తే ఒక దంపతులు అంతకూ తెగించారు. అదీ అక్షరాస్యతలో మొదటిగా ఉండే కేరళలో జరిగిందంటే ఇరుగు పొరుగువారు నూరిపోసే మూఢ విశ్వాసాల శక్తిని అంచనా వేయొచ్చు. చీకటిలో దారి ఎప్పటికీ తెలియదు. అంధ విశ్వాసం అనేది కారు నలుపు చీకటి. వెలుతురు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. లేనిపోని ఆశలు రేకెత్తిస్తుంది. హేతువును నాశనం చేస్తుంది. ఆలోచనకు ముసుగేస్తుంది. ఏదైనా చేసి సులభంగా గట్టెక్కడానికి తెగించమంటుంది. జ్వరం వచ్చిన పిల్లవాడికి దిష్టి తీయడం సంప్రదాయమే కావచ్చు. డాక్టరుకు చూపించి మందులు వాడుతూ సంప్రదాయం ప్రకారం దిష్టి తీసి తృప్తి పడితే దానికో అర్థం ఉంటుంది. ఆ మాత్రపు ఇంగితంతో లేకపోతే ఎంతో ప్రమాదం. ఎంతెంతో ప్రమాదం. చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు. అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్ చదువుతోన్న సమయంలో ‘మిస్ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది. అందరూ తనలా చదవాలని... అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది. ఖబాలే దుబా ఫౌండేషన్.. మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది. ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. బెస్ట్ నర్స్‌గా.. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ సంస్థ గ్లోబల్ బెస్ట్ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్ నర్సింగ్ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది. -
మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం
దోమ (వికారాబాద్): పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి హైటెక్ సమాజంలోనూ మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కొన్ని దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తరచూ జరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేకెత్తించింది. దీంతో పూజలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుప్త నిధుల అన్వేషణలో.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల అన్వేషణలో పడి పూజలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామల మధ్యలో ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలను జరిపారు. బడేంపల్లిలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో క్షుద్రపూజలు చేస్తూ తవ్వాకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ విగ్రహంతో పాటు ఓ మనిషి పుర్రె లభ్యమైనట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు తెలిపారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఓ కారు గుర్తించి తనిఖీ చేశారు. కారులో గుప్త నిధుల్లో వెలికి తీసిన ఓ విగ్రహం బయటపడింది. బయటపడ్డ విగ్రహం పోలీసులకు అప్పగించారు. మంత్రతంత్రాలను నమ్ముతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా మంత్రాలు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లి క్షుద్రపూజలతో పాటు తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. వీటిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని క్షుద్రపూజలు, మూఢనమ్మాకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుండాల సమీపంలో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం, ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుప్తనిధుల కోసం తవ్వకాలు భయాందోళనకు గురవుతున్నాం... గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఇలాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. – యాదయ్య, ఖమ్మంనాచారం గ్రామం అవగాహన లేకపోవడం వల్లే.. మూఢనమ్మకాలపై పల్లెవాసులకు అవగాహన లేకపోవడం వల్లే మంత్రాలను నమ్ముతున్నారు. ఆయా గ్రామాలలో మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులంటూ ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వాటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – నిమ్మలి వెంకటమ్మ, కొండయపల్లి -
కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు
నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా -
యువతి ఆత్మహత్య..మంత్రాల నేపంతో దారుణం
సాక్షి, ములుగు: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మనిషి ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు , మంత్రాల నేపంతో మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. మంత్రాలు నేపంతో ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. చదవండి:బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
'ఎడమకాలుతో దాటుతా.. బ్యాట్‌ను నాలుగుసార్లు తిప్పుతా'
ముంబై: ప్రతి మనిషికి మూడ నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన దేవుడిని తలుచుకోవడమో లేక ఇంకా ఏదైనా పని చేస్తుంటారు. అలా చూసుకుంటే ఒక క్రికెటర్‌కు కూడా మూడ నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెడుతాడు. సచిన్ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసిన తర్వాత బరిలోకి దిగుతారు. అలాంటి మూడ నమ్మకాలు నాకు ఉన్నాయని కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ పేర్కొన్నాడు. కేకేఆర్ యాజమాన్యం నైట్‌క్లబ్ సిరీస్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి రసెల్‌తో పాటు శివమ్ మావి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్య్వూలో రసెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.''ప్రతీ ఆటగాడికి కొన్ని మూడ నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని ఎక్కువ నమ్మితే.. మరికొందరు ఆచరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాడిని. మైదానంలో అడుగుపెట్టే ముందు ప్రతీసారి నా ఎడమకాలుతో బౌండరీ రోప్‌ను దాటడం చేస్తుంటాను. ఆ తర్వాత బౌలర్ వేసే మొదటి బంతిని ఎదుర్కోవడానికి ముందు బ్యాట్‌ను నాలుగు.. అంతకంటే ఎక్కువసార్లు తిప్పుతాను. అలా చేయకపోతే.. నాకు ఆరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయలేనని నమ్మకం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం అంత తొందరగా మరిచిపోలేం. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన కేకేఆర్‌ను కార్తిక్ సాయంతో రసెల్ ఇన్నింగ్స్ నడిపిన తీరు అద్బుతం. 22 బంతుల్లో 54 పరుగులు చేసిన రసెల్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రసెల్ ఔటైన తర్వాత కమిన్స్ (34 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో గెలుపుకు దగ్గరైనా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 18 పరుగుల తేడాతో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 24న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు.. రసెల్ ఔట్ ప్లాన్‌లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది Tap, tap, tap, tap, 𝗕𝗢𝗢𝗠 💥 Even #MuscleRussell himself has his superstitions, and they happen to be totally opposite to those of @ShivamMavi23 😅@Russell12A #KKRHaiTaiyaar #IPL2021 pic.twitter.com/9xrlDz2mc8 — KolkataKnightRiders (@KKRiders) April 23, 2021 -
‘పాటగూడ మాకొద్దు, అక్కడకు వెళ్లం.. ఇక్కడే ఉంటాం’
ఇంద్రవెల్లి: మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని కొంతమంది గిరిజనులు గ్రామాన్ని వదిలి మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ(కే) గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాటగూడ(కే) గ్రామంలో కోలం గిరిజన తెగకు చెందిన 85 కుటుంబాలు ఉన్నాయి. పాటగూడలో తమకు ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని, ఏదో రకంగా కీడు జరుగుతోందని, తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని కుమ్ర వంశానికి చెందిన 10 కుటుంబాలు, కోడప, ఆత్రం వంశానికి చెందిన మరో రెండు కుటుంబాలు.. ఆ గ్రామాన్ని వదిలి కొద్ది దూరంలో మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12, 13న పాటగూడ గ్రామస్తులు ఒక పెళ్లి నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఆ 12 కుటుంబాలు పక్కనే ఉన్న కుమ్ర జంగు వ్యవసాయ చేనులో గుడిసెలు నిర్మించుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ సీఐ నరేష్కుమార్, స్థానిక ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ మంగళవారం పాటగూడ గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో మాట్లాడారు. మూఢ నమ్మకాలకు దూరంగా కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి గొడవలూ చేయొద్దని సూచించగా, గ్రామాన్ని వదిలివెళ్లిన ఆ కుటుంబాలు వినిపించుకోలేదు. తమ కుటుంబసభ్యులు ఆ గ్రామంలో ఉంటే తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, అందుకే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పాటగూడ గ్రామస్తులతో తమకు ఎలాంటి గొడవలూ లేవని వారు తేల్చి చెప్పడంతో పోలీసు అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! -
మూఢ నమ్మకాలతో గొంతుపై వాతలు
భువనేశ్వర్ : మూఢ నమ్మకాలు విడనాడాలని ఆదివాసీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ దిశారీలు, నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒరిస్సా, నవరంగపూర్ జిల్లా చంధాహండి సమితి జునాపాణి గ్రామానికి చెందిన కస్తూరి రొడి(55) కొద్ది రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. నొప్పి ఎక్కువకావడంతో నాటు వైద్యుడిని ఆశ్రయించి వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో కలహండి జిల్లా ధర్మఘడ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి పంపించేశారు. ఆ మందులు వాడినా గొంతు నొప్పి తగ్గకపోవడంతో మరోసారి నాటు వైద్యుడిని ఆశ్రయించింది. ( జీతం కావాలంటే.. లంచం తప్పదు ) అతడు ఆమె గొంతుపై వాతలు పెట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో చందాహండి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. మూఢ నమ్మకాలతో మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుందని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు అంటున్నారు. ఆదివాసీలు ఇప్పటికైనా మూఢ నమ్మకాలు విడనాడాలని, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రిలో సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. -
పాముల కాలం.. జర భద్రం
సాక్షి, జగదేవ్‌పూర్(గజ్వేల్): అసలే వానాకాలం ఆపై పాముల భయం.. వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామాల్లో, తండాల్లో మంత్రాలు చేసేవారిని, చెట్ల మందును నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు గాదెలు, గడ్డివాములు మొదలైనవి ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి మధ్యలో పాములు తేళ్లు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాల్లో పిడకలు దొంతరలుగా పేర్చి పెడతారు. వాటి మధ్య కూడా విష జంతువులు ఉండే ప్రమాదముంది. చేల గట్ల మీద నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కర్ర చప్పుల్లతో పాముకాటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. పాములన్నీ విషసర్పాలు కావు.. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాము కాట్లు ప్రమాద కరమైనవికావు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదం లేని మామూలు గాయాలే డ్రైబైట్స్ సాధారణ చికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తోనే ప్రాణం మీది తెచ్చుకుంటారు. పాములు.. విష ప్రభావం కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుప్రతిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన కేవలం 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర: ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇది కాటేసినా విషం ఉండదు. అయితే కాటు వేసిన చోట చికిత్స చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం. పరిసరాల పరిశుభ్రత మేలు.. ఇళ్ల మధ్య ఎలాంటి చెత్త ముళ్ల పొదలు ఉంచరాదు. ఎందుకంటే పాములు ఎక్కువ శాతం పొదల మధ్యనే ఉంటాయి. అలాగే ఇళ్ల గోడల పక్కన కట్టెలు, ఏ వస్తువులు పెట్టుకోవద్దు. గోడల పక్కన ఏ వస్తువులైన పెడితే వాటి ద్వారా పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం వెలుగులు ఉండే విధంగా చూసుకోవాలి. చీకట్లో బయటకు వెళ్లడం మంచిది కాదు. ఎక్కడికి వెళ్లిన పాదాలకు చెప్పులు తప్పనిసరిగా వేసుకోవాలి. మూఢ నమ్మకాల జోలికి వెళ్దొద్దు.. పాముకాటు గురైన వారు ఎట్టి పరిస్థితుల్లో అందోళన చెందవద్దు. అందోళన చెందితే గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక చర్యగా కాటు వేసిన భాగంలో కట్టు కట్టాలి. వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఏ పాము కాటు వేసిందో బాధితులు స్పష్టంగా చెప్పితే దానికి తగ్గ చికిత్స వైద్యులు అందిస్తారు. నాగుపాము కాటుకు గురైతే 15–20 నిమిషాల్లో ఆస్పత్రికి చేరాలి. లేనిచో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. పాముకాటుకు గురైన వారు మూఢ నమ్మకాల జోలికి వెళ్లవద్దు. కొందరు పాము కరువగానే కొన్ని రకాల ఆకు రసాలను పిండిపోస్తారు. అది మంచిది కాదు. మరికొందరు మంత్రాలను నమ్ముతారు. అవి ఏ మాత్రం పనిచేయవు. ఇలా చేస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుంది. అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో మందులు.. పాముకాటుకు గురైన వారికి జిల్లాలోని అన్ని పీహెచ్సీ కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంటాయి. మండలంలోని రెండు పీహెచ్సీ కేంద్రాల్లో విరుగుడు యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఏ పాము కాటు వేసిందో చెబితే దానికి తగిన విరుగుడు ఇంజక్షన్ ఇస్తారు. 24 గంటల తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు. అప్రమత్తంగా ఉండాలి పాము కాటుకు గురైన వారు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మండలంలోని జగదేవ్‌పూర్, తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన వారు వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రులను సంప్రదించి ఇంజక్షన్ వేయించుకోవాలి. పాముకాటుకు గురైన వారు ఎలాంటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకే ముప్పు ఉంటుంది. పొలాల వద్దకు పోయేటప్పుడు గట్ల మధ్య చూసుకుంటూ ముందుకు వెళ్లాలి. – మహేష్, తిగుల్ పీహెచ్సీ వైద్యుడు -
క్షుద్రపూజల నెపం: తోటలో శవం
భువనేశ్వర్ : క్షుద్ర పూజలు చేస్తున్నాడన్న అనుమానంతో సోమార్ మడకామి అనే యువకుడిని గ్రామస్తులు హత్య చేశారు. ఈ సంఘటన మల్కాన్‌గిరి జిల్లాలోని పద్మగిరి పంచాయతీ, కెందుగుడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల నుంచి కెందుగుడ గ్రామానికి చెందిన 20 మంది చిన్నారులు చనిపోతూ వస్తున్నారు. అదే గ్రామంలో ఉన్న కొంతమంది క్రైస్తవుల పూజల వల్లే పిల్లలు చనిపోతున్నారని గ్రామస్తులు భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తగా క్రైస్తవ మతంలోకి చేరిన సోమార్ మడకామి కూడా చిన్నారుల మరణాలకు కారణమని గ్రామస్తులు అనుకున్నారు. ( దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) అతడిని హత్య చేసేందుకు పథకం వేసి, హతమార్చారు. హత్య అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని గ్రామానికి దగ్గరలోని తోటల్లో గ్రామస్తులు పూడ్చి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అక్కడి తోటలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి, బయటకు తీశారు. ప్రస్తుతం ఇదే ఘటనకు సంబంధించి, గ్రామస్తుల్లో మొత్తం ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (చిట్టిమాము బర్త్‌డే సెలబ్రేషన్స్.. అరెస్ట్) -
యూట్యూబ్‌లో చూసి ప్రాణాల మీదకు..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని బైరెడ్డిపల్లి మండల కేంద్రం గడ్డురు పంచాయితి ఆలపల్లి గ్రామంలో రెండు కుటుంబాలు యూట్యూబ్‌లో చూసి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నల్ల ఉమ్మసి చెట్టులో ఉన్న కాయలను నీళ్లలో వేసి తాగితే కరోనా పోతున్నది అని గుడ్డిగా నమ్మి 8 మంది దాన్ని సేవించారు. దీంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఎనిమిది మందిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. వారి పేర్లు: లక్షమ్మ(40), సుధాకర్ (20), గీత(20), భవాని(20), వెంకటేష్(9), హేమంత్(6), వీరమ్మ(70), నాగరాజు (70).. కరోనాపై పోరాటం: సూపర్ స్టార్ల షార్ట్‌ఫిల్మ్ -
ఇంకా వీడని మూఢనమ్మకం..
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలో మూఢనమ్మకాలు పెచ్చుమీరుతున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ఈ ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతూ ప్రాణాలు పోగొట్టుకుంటుండడం గమనార్హం. ముఖ్యంగా ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఏ జ్వరం వచ్చినా, జబ్బు చేసినా, కడుపునొప్పి వచ్చినా ఆఖరికి చిన్నారులకు సైతం బాగోలేకపోయినా ఆస్పత్రికి తీసుకువెళ్లరు. తమకు తెలిసిన వైద్యం లేదా మూఢనమ్మకాలపై ఆధారపడి భూతవైద్యులను సంప్రదిస్తారు. ఈ క్రమంలో వారు వైద్యం కింద అప్పుడే పుట్టిన బిడ్డలపై ఇనుపరాడ్లను ఎర్రగా కాల్చి, దాంతో వాతలు పెట్టడం వంటివి చేస్తారు. దీంతో చాలా సందర్భాల్లో చాలామంది శిశువులు చనిపోయినా మళ్లీ పాతకాలం నాటి సంప్రదాయాలనే అవలంభిస్తుండడం జరుగుతోంది. గతంలో ఇటువంటి సంఘటనలు అవిభక్త కొరాపుట్ జిల్లాలో ముఖ్యంగా నవరంగపూర్ జిల్లాలో చాలా జరిగాయి. ఇదే విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయినా ఎటువంటి సత్ఫలితాలు కనిపించకపోవడం విచారకరం. నాటువైద్యం కారణంగా 28 రోజుల శిశువు చనిపోయిన ఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మంగళవారం జరిగింది. ముండిబుడ గ్రామానికి చెందిన మాలతీ భాయి, డొంబురుదొర యాదవ్ దంపతులకు కొన్నిరోజుల క్రితం ఓ మగబిడ్డ పుట్టారు. బిడ్డపుట్టాడని ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి పుట్టిన శిశువు ఏదో నొప్పితో బాధపడుతూ ఏడుస్తున్నాడు. దీంతో ఆదివాసీ వైద్యుడు దిశారి వద్దకు తీసుకువెళ్లారు. బాలుని కడుపుపై వాతలు పెడితే నయమవుతుందని, చెప్పడంతో శిశువు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలుని కడుపుపై వాతలు పెట్టించారు. అయితే వాతలు పెట్టిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన ఆ బాలుడు మృతిచెందాడు. అప్పుడు అప్రమత్తమైన శిశువు తల్లిదండ్రులు ఉమ్మరకోట్ ప్రభుత్వ ఆస్పత్రికికు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే తమ బాలుని బలిగొన్నాయని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. -
సొంత పిల్లల్ని మట్టిలో పాతిపెట్టి..
బెంగళూరు : ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధిస్తూ, విశ్వ రహస్యాలను సైతం ఛేదిస్తున్నా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. తాజాగా సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఘటననే దీనికి నిదర్శనం. సూర్యగ్రహణం రోజున అంగవైకల్యం కలిగిన పిల్లల శిరస్సు వరకు మట్టిలో పాతితే.. అంగవైకల్యం పోతుందన్న భూత వైద్యుడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు.. చెప్పిందే చేశారు. మెడ వరకు గొయ్యి తీసి.. పిల్లలను పాతిపెట్టారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో చేశారు. కలబురాగి జిల్లా తాజ్‌సుల్తానాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ప్రజలు అంగవైకల్యంతో బాధపడుతున్న తమ చిన్నారులను మట్టిలో కప్పిపెట్టారు. వారు చేసిన వింత పని అందరిని విస్తుపోయేలా చేసింది. చిన్నారులు ఏడుస్తున్నా పట్టించుకోకుండా చాలా సేపు అలాగే ఉంచారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. కాగా గురువారం దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనం ఇచ్చింది. ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం11.11 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. -
సూర్యగ్రహణం: సొంత పిల్లల్ని మట్టిలో పాతిపెట్టి..
-
అంతా దెయ్యం పనే!!
సాక్షి, విజయవాడ: ఆమెకు అంతుచిక్కని రోగం. తీవ్రమైన మనోవేదన. అయితే వ్యాధికి తగ్గ చికిత్స అందడం లేదు. పైగా ఇదంతా దెయ్యం పనే అని నమ్ముతోంది. మంత్రగాళ్ళ చుట్టు తిరుగుతోంది. ఇంటర్ నెట్ కాలంలోనూ మూఢనమ్మకాలను గట్టిగా నమ్మతోంది విజయవాడలోని ఓ కుటుంబం. ఈ దంపతుల పేర్లు దాడి లక్ష్మీ, దాడి రమణ. విజయవాడ కృష్ణ లంక రాణిగారి తోటలో నివాసం. కూరగాయల వ్యాపారం చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ మధ్య లక్ష్మి మనో వేదనతో బాధ పడుతున్నారు. అదేమిటంటే దెయ్యంగాలి వెంటాడుతోందని ఆమె చెబుతున్నారు. ఎవరిని చూసినా ఓ రకంగా భయపడుతున్నారు. దెయ్యాలు భూతాలు లేవని ఆమెకు భర్తాపిల్లలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్మిలో మార్పు రాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఆమెకు నయం కావాలంటే దేవతార్చన ఒక్కటే మార్గమని చుట్టుపక్కల వారు చెప్పడంతో అందుబాటులో వున్న ఆలయాలన్నింటికీ తిరిగారు. ఈ క్రమంలో కృష్ణా ఘాట్‌లో కాలుజారి పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసు రక్షించారు. తాను ప్రమాదానికి గురికావడం కూడా దెయ్యంపనే అంటున్నారు లక్ష్మి. లక్ష్మి కొన్నాళ్ళుగా భయపడుతున్నారని భర్త రమణ చెప్తున్నాడు. గాలిసోకిందన్న అనుమానం ఆమెను వెంటాడుతోందని వాపోయాడు. ఆ కారణంగా తన భార్య చాలా ఇబ్బందులు పడుతోందని చెప్పాడు. వైద్యంతో పాటు మంత్రగాళ్ళను ఆశ్రయించామని తెలిపాడు. దెయ్యాలంటే భయం లేదంటున్న ఇరుగుపోరుగు వారు, లక్ష్మి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్ధంలో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న ఈ కుటుంబాల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుంది. -
ఏటా ప్రసవం.. అమ్మకు శాపం
వాళ్లకి ఆడ పిల్లలంటే చిన్నచూపు. మగబిడ్డ కోసం ఎంతమంది ఆడపిల్లల్ని అయినా కనేలా ఒత్తిడి చేస్తుంటారు. తొమ్మిది కాన్పుల వరకు మగబిడ్డ కోసం చూడటం.. అప్పటికీ పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమవడం మగవారికి సర్వసాధారణం. ప్రసవం కోసం గర్భిణుల్ని ఆస్పత్రి గడప తొక్కనివ్వవు వారి కట్టుబాట్లు. గత్యంతరం లేక ఇంట్లోనే ప్రసవాలతో మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా వెనుకబాటు తనం.. నిరక్షరాస్యత.. అధిక సంతానం.. అవగాహనా రాహిత్యం.. మూఢ నమ్మకాలు వెరసి ఆ పల్లెల బతుకు చిత్రాన్ని దయనీయంగా మార్చింది. దీనివల్ల ఎన్నెన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడున్నాయి. బుక్కెడు బువ్వ కోసం వలస బాట పడుతున్నాయి. ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల తీర్చే జల వనరుల రాజధాని.. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి పుణ్య క్షేత్రాలు గల ఆధ్యాత్మిక భూమి కర్నూలు పల్లెల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కౌతాళం మండలం హల్వి గ్రామానికి చెందిన ఈమె పేరు లలితమ్మ (వృత్తంలో). ముత్తన్న అనే వ్యక్తిని వివాహమాడింది. ఈమెకు 8 మంది ఆడపిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదని ప్రశ్నించగా.. ‘మగబిడ్డ కోసమయ్యా!’ అని బదులిచ్చింది. మద్యానికి బానిసైన ముత్తన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భారం లలితమ్మపైనే పడింది. అంతమంది పిల్లల్ని కంటే కుటుంబాన్ని పోషించడం కష్టం కాదా అని అడిగితే.. ‘ఏమో అయ్యా! సెప్పేవారెవరూ లేకపోతిరి. మాకు సదువు రాదు. అంతే!’ అంది. ఇదే మండలంలోని మరిలి గ్రామానికి చెందిన మరియమ్మకు ఏడుగురు ఆడ పిల్లలు. జమ్మాలదిన్నెకు చెందిన హైమవతికి నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అదే గ్రామంలోని శ్రీదేవికి ఐదుగురు ఆడబిడ్డలు, ముచ్చుగిరికి చెందిన మంగమ్మకు ఏకంగా 10 మంది సంతానం. వారిలో 9 మంది ఆడబిడ్డలే. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి కుటుంబాలు భారీగానే ఉన్నాయి. సాక్షి ప్రతినిధి/కర్నూలు : తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం సార్వసాధారణం. కానీ.. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు మండలాలతో పాటు సమీపంలోని చాలా గ్రామాల్లో మహిళలు తొలి కాన్పు, బిడ్డ జననం పుట్టింట్లోనే జరగాలి. ఆస్పత్రికి వెళ్లకూడదనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉండవు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. లేదా, గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేవి పట్టించుకోరు. దీంతో బలహీనంగా, అనారోగ్య సమస్యలతో పుట్టే పిల్లలు కూడా ఎక్కువే. కాన్పు సమయంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఇబ్బందిపడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇదేంటని ఆరా తీస్తే ‘ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ చేస్తారు. ఒకసారి ఆపరేషన్ అయితే సాధారణ కాన్పు జరగదు. పైగా ఒక బిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది. తొలి ఇద్దరు ఆడపిల్లలైతే మళ్లీ కాన్పునకు అవకాశం ఉండదు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేసుకుంటాం’ అని చెబుతున్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకంగా, అనాగరికంగా అవగతం చేసుకోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడి ప్రజలను కలిసి.. వారికి ఆస్పత్రి, చికిత్స, ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. ఆస్పత్రులకు రప్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. నిరక్షరాస్యతలో మొదటి స్థానం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం నిరక్షరాస్యతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యతలో మొదటి 10 స్థానాల్లో ఉన్న మండలాలివీ.. సుగ్గికెళితే కొంచెం ఎక్కువ బిడ్డల చదువు విషయమై కొందరి తల్లులను అడగ్గా.. ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా. కూలికి పోతే నూట యాభై వస్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బెంగళూరు వలస (సుగ్గి) పోతున్నారు. అక్కడ ఇళ్లు, వీధుల్లో స్వీపర్లుగా.. భవన నిర్మాణ కూలీలుగా.. వృద్ధులైతే ఇళ్లు, దుకాణాల వద్ద వాచ్మన్లుగా పని చేస్తున్నారు. కొందరు మహిళలు వేరుశనగ, శనగ గుగ్గిళ్లను రైళ్లలో విక్రయిస్తున్నారు. కొందరు పిల్లలు భిక్షాటన కూడా చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్లో ఇలాంటి వారు కనీసం 600 మంది రైలు దిగుతుంటారు. ఆస్పత్రికి పోదామంటే డబ్బుల్లేవు నాకు నలుగురు బిడ్డలు. 3, 4వ సంతానమైన షర్మిల (7), దివ్య (5)మూగవారు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే డబ్బుల్లేవు. ఏం సేస్తాం. మా బతుకులు ఇంతే. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. అందుకే ఇలా ఉండిపోయినాం. – ప్రమీల, జమ్మాలదిన్నె, కోసిగి మండలం చెల్లి కోసం బడికెళ్ల లేదు ఊయల ఊపుతున్న ఈ చిన్నారి పేరు దీపిక. తలారి రామంజనేయులు, లక్ష్మీదేవి ఈమె తల్లిదండ్రులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. దీపిక పెద్దమ్మాయి. మధ్యాహ్యం 12.50 గంటలకు ఇంటివద్ద ఇలా కన్పించింది. ‘బడికి వెళ్లలేదా తల్లీ’ అని అడిగితే.. ‘సెల్లిని సూసుండేందుకు ఇంటికాడే ఉంటన్నా’ అని సమాధానమిచ్చింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్ద పిల్లలు బడి వదిలేసి ఇంటి వద్దే ఉంటారు. ఇలా దీపిక మాత్రమే కాదు.. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా చెల్లెళ్ల ఆలనా పాలన కోసం అక్షరాలకు దూరంగా భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. రైళ్లలోనూ ఇబ్బందులే నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడ బిడ్డలు. రెండెకరాల సేనుంది. వానల్లేక, పంటలు పండక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలికి పోదామన్నా పని ఉండదు. రైళ్లలో పండ్లు అమ్ముకుంటాం. రైలులో శానా ఇబ్బంది. పరిమిషన్ లేదని టీసీలు దించేస్తారు. కిందమీద పడతా బతుకుతాండాం. – రాగమ్మ, కోసిగి తిండిలేక.. ఎదుగదల లేక పెండ్లయిన ఏడాదికే భర్త శీను ఇడిసిపెట్టి పోయినాడు. ఇల్లు లేదు. పొలం లేదు. బెంగళూరుకు సుగ్గి పోతాం. బిడ్డను చూసుకునేటోళ్లు లేక నాతోపాటు తీసుకుపోతా. దీంతో పాపకు సదువు పోయినాది. 11 ఏళ్ల బిడ్డయినా తిండిలేక ఎదుగుదల ఆగిపోయినాది. – భీమక్క, కర్నూలు పశ్చిమ ప్రాంతం చదువుకోవాలని ఉంది..కానీ నేను ఒకటో తరగతి సదివినా. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అమ్మవాళ్లు సుగ్గికి పోతే బువ్వ ఒండేటోళ్లుండరు. అందుకే నేనూ వాళ్లతో సుగ్గికి పోతా. బడికి పోవాలి, మందితో సదువుకోవాలని ఉంటాది కానీ.. ఆ అవకాశం లేదు. – లక్ష్మి, దేవకోసిగి, కోసిగి మండలం నేనూ షాకయ్యాను నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టాక వైఎస్సార్ బడిబాట కోసం రిపోర్ట్ రప్పించుకుని చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, వలసలు, మూఢ నమ్మకాలు, మగబిడ్డ కోసం వరుస కాన్పులు చూసి షాక్ అయ్యాను. మంత్రాలయం నియోజకవర్గమే కాదు హాలహర్వి, హోళగంద, చిప్పగిరితో పాటు చాలా మండలాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం. అందుకే ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణాలిచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. – వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు -
అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య
సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో చనిపోతే అరిష్టమని మూఢత్వం పెనవేసుకున్న కార్మికక్షేత్రం సిరిసిల్లలో మరో అమానుషం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తాళి బంధం కాదనుకుంది. పేగు బంధంతో కొడుకు అక్కున చేర్చుకున్నా.. చచ్చిపోయే వృద్ధున్ని ఇంట్లోకి తీసుకురావద్దని అద్దింటి యజమాని కర్కశత్వం అడ్డుకట్ట వేసింది. ఓ నేతన్న బతికుండగానే శవంలా మారిన ఈ అమానుష సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కోడం భూమయ్య(65) నేతకార్మికుడు. భార్య బాలలక్ష్మి కొడుకు దేవదాస్, కూతరు జ్యోతిలను పోషించేవాడు. అతడి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కొడుకు, కూతురుకు పెళ్లిల్లు చేశాడు. బాలలక్ష్మి ఐదేళ్ల క్రితం కొడుకు, కొడలు, వారి పిల్లలతో గొడవపడి వారిని ఇంట్లోంచి వెళ్లగొట్టగా వేరే కాపురం ఉంటున్నారు. ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవదాస్ భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు భూమయ్య ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే బాలలక్ష్మి గొడవపడి ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తాము ఉంటున్న ఇల్లు తన పుట్టింటి వారు ఇచ్చిందని దీనిపై భర్తకు, పిల్లలకు ఏలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పి ఒక్కతే ఇంట్లో పిండిగిర్నీ నడిపిస్తూ బతుకుతుంది. భూమయ్య కూడా చేతనైనన్ని రోజులు అక్కడ ఇక్కడా పనిచేస్తూ..కాలం వెళ్లదీసిండు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదు. ఈక్రమంలో స్థానిక గాంధీనగర్ హనుమాన్ ఆలయం వద్ద వారం రోజులుగా ఎండకు ఎండుతూ..వానకు నానుతూ..పడి ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కొడుకు నాలుగురోజుల క్రితం తానుంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లి సపరిచర్యలు చేస్తుండగా..భూమయ్య చనిపోతే అరిష్టంగా పేర్కొంటూ..ఇంట్లో ఉండొద్దని యజమాని హుకుం జారీచేశాడు. దీంతో దేవదాస్ తన తండ్రి బాగోగులు చూడలేకుండా అయ్యాడు. ఈక్రమంలోనే భూమయ్య గుడివద్ద అచేతన స్థితిలో వారం రోజులుగా పడి ఉంటున్నాడు.. పరిమళించిన మానవత్వం.. సిరిసిల్ల ధర్మాసుపత్రిలో వైద్యం అందిస్తున్న దృశ్యం.. హనుమాన్ ఆలయం వద్ద చేతకాకుండా పడిఉన్న భూమయ్యను స్థానిక సామాజిక కార్యకర్త దీకొండ అశోక్ మంగళవారం ఆలయ దర్శనానికి వచ్చి గమనించాడు. వెంటనే వివరాలు తెలుసుకున్నాడు. భూమయ్య పరిస్థితిని చూసి జాలేసి స్థానిక జిల్లాసుపత్రిలో చేర్పించగా..సిబ్బంది చికిత్స చేస్తున్నారు. బతికుండగానే భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య, మూఢాచారాలతో అమానవీయంగా ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని నిర్వాకంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి. -
‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’
బెగుసరాయి : కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి సైతం సై అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బీహార్‌కు చెందిన ఓ తాంత్రికుడు. తన కొడుకు బలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించాడు. వివరాలు.. బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్, ఇంజినీర్ అయిన తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖ, సురేంద్ర ప్రసాద్ ఓ విలేకరితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో సురేంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘ నరబలి నేరం కాదు. ఇంజనీర్ అయిన నా కొడుకును మా ఆరాధ్య దేవత అయిన కామాఖ్యదేవికి బలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా మొదటి నరబలి. నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు రావణాసూరుడు లాంటి వాడు. నరబలికి అనుమతి ఇవ్వండి’ అంటూ అధికారులకు విన్నవించాడు. అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా సురేంద్రప్రసాద్ సింగ్ ఓ పిచ్చోడని, ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. -
తాంత్రికుడు చెప్పాడని.. సంపద కలిసివస్తుందని..
లక్నో: మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కలకలం రేపింది. 12 చేతులకు వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుడిని చంపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు. అంతేకాకుండా దీనిపై వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్ సింగ్ స్పందిస్తూ.. ఆ బాలుడు చదుకోవడానికి తాము సహాకారం అందిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అతను చదువుకు దూరం కాకుండా చూస్తామన్నారు. ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని.. నిష్పాక్షికమైన విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
బాలిక శిలగా మారుతుందని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూఢ నమ్మకాలు మనిషిని ప్రభావితం చేస్తాయనడానికి తమిళనాడులో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది. పుట్టినరోజు నాడు చిన్నారి శిలగా మారుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు వందలాదిమంది పూజలు చేస్తూ ఆ సంఘటన కోసం ఎదురు చూశారు. చివరకు అలా జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా మనమేల్‌కుడికి చెందిన పళని కుమార్తె మాసిల (12) ఆరోతరగతి చదువుతోంది. ఈ చిన్నారికి దైవభక్తి ఎక్కువ. త్వరలో తాను సన్యాసిని, స్వామిని కాబోతున్నానని తరచూ చెప్పుకునేది. అయితే ఆమె తల్లిదండ్రులు కుమార్తె మాటలను పెద్దగా పట్టించుకోకున్నా ఒక కంట కనిపెట్టసాగారు. వయసుకు మించిన మాటలాడుతున్న మాసిలను ఓ జ్యోతిష్యుని వద్దకు తీసుకెళ్లి జాతకం చూపించగా ‘12వ జన్మదినం రోజున చిన్నారి మాసిల ఒక శిలావిగ్రహంగా మారిపోతుంది’ అని చెప్పాడు. ఈ నెల 2న మాసిల 12వ జన్మదినం కావడంతో ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికకు పట్టుచీర కట్టి నిండుగా పూలతో అలంకరించారు. వడకూర్ అమ్మన్ ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. రాత్రి పోద్దుపోతున్నా ఎంతసేపటికీ చిన్నారి మాసిల శిలగా మారలేదు. దీంతో ఆలయ పూజారి మాసిలకు, ఆమె తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టి పంపివేశాడు. -
తండాల్లో తంగేడి దెయ్యం
బొంరాస్‌పేట : మనిషి అంతరిక్షంలో వ్యోమాగామిగా దూసుకెళ్తున్నాడు. మరో పక్క సంద్రం లోతును చూస్తున్నాడు. కానీ గ్రామీణ నిరక్షరాస్యులు మాత్రం నూరేళ్ల కిందటి మూఢ విశ్వాసాల్ని వీడడంలేదు. ముఖ్యంగా తండాల్లో గిరిజనులు భయంకర మూఢ విశ్వాసాల నుంచి బయటికి రావడం లేదు. జిల్లాలోనే అత్యధిక గిరిజన ప్రాంతాలు (తండాలు) కలిగిన మండలాల్లో బొంరాస్‌పేట ఒకటి. సుమారు ఎనభైకి పైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేస్తూ ప్రభుత్వాలు అభివృద్ధి పర్చేందుకు విధానలు అమలు చేస్తున్న తరుణంలోనూ వీరిని మూఢనమ్మకాలు వదిలి వెళ్లడం లేదు. వీరి జీవన విధానాలు కొన్ని తండాల్లోని కుటుంబాలు ఆధునిక వర్తమాన కాలానికి సరితూగేలా ఉన్నప్పటికీ మరికొన్ని కుటుంబాలు పాత విశ్వాసాలు పట్టుకొని ఊగిసలాడుతున్నాయి. బొట్లోని తండాలాంటి వాటిలో కోట్లు ఖర్చుపెట్టి దేవాలయాలు కట్టినా కూడా మరికొన్ని తండాల్లో దెయ్యం, భూతం అంటూ నమ్ముతున్నారు. భాషా, వేషంలో కొంత వూర్పు వీరిలో వచ్చినప్పటికీ మూఢ విశ్వాసాలను ఏమాత్రం విడిచి పెట్టడంలేదు. ఏళ్లు గడుస్తున్నా తండాలవారు ‘దెయ్యం తంతు’ను మరవడంలేదు. అనారోగ్యమే దెయ్యమట! అనారోగ్యం పాలైన వ్యక్తి రోగనిరోధక శక్తి క్షీణించినంత వరకు తండాను విడిచిరారు. నడవ లేని పరిస్థితి దాపురించినప్పుడుకానీ దావాఖాన ముఖం చూడరు. మతిస్థిమితం కోల్పోయి విచిత్ర మాటలు పలుకగానే ఆవ్యక్తి కేదో భూత పిశాచం, గాలి(దెయ్యం) సోకిందంటారు. ఇంతలో తండాలో ఉండే మరో వ్యక్తి వచ్చి తంగెడి దెయ్యం అంటాడు. తంగెడిదెయ్యం, అడవిదెయ్యం, అడవి భవాని లాంటి పేర్లతో పిలువబడే ఈ భూత పిశాచాన్ని వదిలించుకోవడానికి ఓ పద్ధతుందండోయ్.. తంగేడి దెయ్యం తంతు! అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొని తండాకు దూరంలో ఉన్న ఒక తంగెడి చెట్టు వద్ద రెండు రాళ్లకు సున్నం, జాజు పూతలు పూసి ఒక మేక, గొర్రె లేదా కోడి పుంజులు ఆ చెట్టు దగ్గర బలి ఇవ్వాలి. అక్కడే వండాలి. అక్కడే తినాలి. మెుదట అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తన శక్తికి మించినంతవరకు మద్యం, కల్లు, సారా తాగాలి. వ్యక్తికి మాంసం, అన్నాన్ని పొట్టపగిలేటట్లు కడుపార శక్తి కొలది తినిపించాలి. ఆ తర్వాతే అందరు తింటారు. అనారోగ్యానికి గురైన వ్యక్తి మిగిలిన వంటలను వెంట తీసుకురాకూడదు సుమా! అక్కడి నుంచి ఏ చిన్న వస్తువును తీసుకెళ్లరాదట. అలా తీసుకెళ్తే దెయ్యం మళ్లీ వెంటవచ్చినట్లేనట. ఇదంతా చేయడానికి సుమారు రూ.2వేలకుపైగా ఖర్చవుతుంది. ఇక మరుసటి రోజు తిన్నగా ఆస్పత్రికి పయనమై వైద్యం చేయించుకుంటారు. ఇలా ఏడాదిలో రూ.10 వేలవరకు కుటుంబంపై భారం పడుతుంది. ఈ పూజలు చేయడానికి 4, 5 రోజులు పడుతుంది. ఇంతలో వ్యక్తికి ఏ ప్రాణాపాయం జరిగినా తంగెడి దేవర పట్టి పీడించిందని నమ్ముతారు. జరిగిన విషాదానికి చేతులు ముడుచుకొని దీనంగా కూర్చొంటారు. ఇలా నిరక్షరాస్యతతో గిరిజనులు బలికావడం కొత్తేమి కాదు. అయినా అధికారులు, సేవా సంస్థలు వీరి పట్ల ఎలాంటి చైతన్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. బంధువులకు.. భయంభయం.. తంగెడి దేవర పూజలకు నిలయమైన మండలంలోని మూడువూమిళ్లతండాకు వెళ్లాలంటే వారి బంధువులు భయపడుతున్నారు. ఆ తండావారు మాత్రం ఎప్పుడూ, ఎవరికి, దేవర పడుతుందో తెలియని ఆయోమయస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తండా చుట్టూరా ఉన్న ప్రాంతంలో పూజ చసిన తంగేడి చెట్లు కనిపిస్తాయి. మందులతో నయమైనా నాటువైద్యమే అంటారు నేను గిరిజన తండాలోనే పుట్టిన. ఎంతచెప్పినా వారి మూఢ విశ్వాసాన్ని మానుకోరు. చివరి సమయంలో ఆస్పత్రి కెళ్లి మందులు వాడి నయం అయినప్పటికీ తంగెడి దేవర పారిపోవండవల్లే నయమైందంటారు. ఇప్పటికీ తండాల్లో తంగెడిదెయ్యం భయంకర విశ్వాసం మారడంలేదు. మా గిరిజనుల్లో అందరూ బాగా చదువుకుంటేనే మార్పు. – మోతిలాల్, విద్యావంతుడు, మూడుమామిళ్లతండా -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
గుర్రంపోడు (నాగార్జునసాగర్) : హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గుర్రంపోడు మండల పరిధిలోని తెరాటిగూడెంలో ఈ నెల 27న జరిగిన హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల నెపంతోనే ఘాతుకానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో వెల్లడైంది. దేవరకొండ డీఎస్పీ రవికుమార్ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పిల్లి సాయన్న తన భార్య యాదమ్మ, కుమారుడు శివ మృతికి కన్నెబోయిన రాములు మంత్రాలు చేయడమే కారణమని అతడిపై కక్ష పెంచుకున్నాడు. గ్రామంలో దారి గుం డా వెళ్తున్న రాములు కుమారుడు రామలింగయ్యను అడ్డగిం చి మీ తండ్రి మం త్రాలు చేస్తున్నాడని, ఎక్కడ దాచా వం టూ ఘర్షణ పడ్డాడు. కత్తితో రామలింగయ్యను పొడవడంతో తప్పించుకుని ఇంటికి బయలు దేరి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. ప్రశ్నించేందుకు వస్తే.. దీంతో తన కుమారున్ని ఎందుకు పొడిచావంటూ ప్రశ్నించేందుకు భార్య పెద్దమ్మ, కుమారుడిని తీసుకుని రాములు ఇంటినుంచి బయలు దేరాడు. దారి లోనే ఎదురైన పిల్లి సాయిలు తమ్ముడు పిల్లి వెంకటయ్య, సాయిలు అల్లుడు కన్నెబోయిన సత్తయ్య, బావమరుదులు కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యలు కలిసి మంత్రాలు చేస్తున్నావంటూ రాములుపై దాడికి పాల్పడ్డారు. గొడ్డళ్లు,రాళ్లు, బండి గడగొయ్యిలు తీసుకుని మూకుమ్మడిగా దాడి చేసి తలపై బండరాళ్లు వేసి హత్య చేశారు. దాడి సమయంలో కొడుకు రామలింగయ్య తప్పించుకుని పారిపోగా భార్య పెద్దమ్మపై కూడా దాడి చేయడంతో గాయాలయ్యాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నేరస్తులను అరెస్టు చేయడానికి కృషిచేసిన మల్లేపల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్‌లను, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందించారు. గ్రా మంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్ కొనసాగిస్తామని తెలిపారు. మంత్రాలు, మూఢవిశ్వాసాలు నమ్మవద్దు ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రం గంలో దేశం దూసుకువెళ్తున్న ఈ కాలంలో మంత్రాలు, మూఢనమ్మకాలు ఎవరూ నమ్మవద్దని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మూఢనమ్మకాల గురించి గ్రామాల్లో ప్రచార చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలు చేశావంటూ ఎవరిని దూషించినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
పెచ్చరిల్లిన మూఢజాడ్యం..!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా పచ్చని పల్లెల్లో మూఢజాడ్యం పెచ్చరిల్లుతూనే ఉంది. పోలీసులు కళాజాతా బృందాలతో అవగాహన కల్పిస్తున్నా.. పల్లెవాసుల్లో మార్పుకానరావడం లేదు. అందుకు నిదర్శనమే గుర్రంపోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం పట్టపగలే గ్రామ నడిబొడ్డున వృద్ధుడి దారుణ హత్య. మంత్రాల చేస్తున్నాడనే నెపంతోనే గ్రామానికి చెందిన కొందరు కర్రలతో కొట్టి.. బండరాళ్లతో మోది ఈ ఘాతుకానికి ఒడిగట్టడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు (నాగార్జునసాగర్) : మండలంలోని చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారందరికీ వివాహాలు జరిపించాడు. పెద్దకుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా చిన్నకుమారుడు రామలింగయ్య తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ గ్రామంలోనే ఉంటున్నాడు. ఏడాది క్రితం.. గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యుల్లో అనుమానం నాటుకుంది. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా కూడా వారి అనుమానాలు రెట్టింపయ్యాయే కానీ తగ్గలేదు. కట్టెలతో కొట్టి.. బండరాళ్లతో మోది.. కుమారుడిపై జరిగిన దాడితో తల్లిదండ్రి రాములు, పెద్దమ్మ లబోదిబోమన్నారు. తమకు ఏ సంబంధం లేదని పంచాయితీలో చెప్పినా దాడిచేస్తారా అంటూ కుమారుడిని వెంటబెట్టుకుని దాడిచేసిన ఘటనాస్థలికి బయలుదేరారు. అప్పటికే అక్కడ ఉన్న పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యతో పాటు పిల్లి వెంకటయ్య, కన్నెబోయిన సత్తయ్య, మండలి వెంకటయ్యలు కలిసి రాములుపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన కుమారుడిని భార్యను పక్కకు తోసేసి గొడ్డలి, కట్టెలతో కొట్టి బండరాళ్లతో మోది రాములును అంతమొందించారు. గ్రామంలో పోలీస్ పహారా హత్య సమాచారం అందుకున్న మల్లేపల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్, పరిసర ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్ట నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ నుంచి పోలీసు బలగాలను రప్పించి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల్లో ఎనిమిది హత్యలు మండలంలోని మూరుమూల గ్రామమైన తెరాటిగూడెంలో గత రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది హత్యలు జరిగాయి. తెరాటిగూడెం మండలంలో సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డుల్లో నమోదైంది. రెండు హత్యలు చేతబడి నెపంతో చోటుచేసుకోగా మూడు హత్యలు రాజకీయ పరమైనవి. మరో రెండు కుటుంబ తగాదాల నేపథ్యంలో చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య ఏడాది కాలంగా మిస్టరీగా ఉండి ఇటీవలే వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చేతబడి నెపంతో మండలంలో గతంలో తానేదార్పల్లి, తేనపల్లి గ్రామాల్లో సజీవదహనాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. మంత్రాల నెపంతో జరిగిన హత్యలు అన్నీ పట్టపగలే జరుగుతున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. తొలుత కుమారుడిపై దాడి రాములు కుమారుడు రామలింగయ్య ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా గ్రామానికి చెందిన పిల్లి సాయన్న,కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యలు అడ్డుకున్నారు. నీ తండ్రి మంత్రాలు చేయడం కారణంగానే తమ ఇంట్లో మరణాలు సంభవించాయని సాయన్న గొడవకు దిగాడు. అంతడితో ఆగకుండా ముగ్గురు కలిసి రామలింగయ్యపై దాడిచేసి కత్తితో పొడవడంతో చేతికి గాయమైంది. రామలింగయ్య వారినుంచి తప్పించుకుని ఇంటికి పరుగెత్తుకొచ్చి తల్లిదండ్రికి జరిగిన విషయం వివరించాడు. -
మూఢనమ్మకాలు విడనాడాలి
ధరూరు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూఢ నమ్మకాలను విడనాడి ముందుకు సాగాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రుక్మిణి అన్నారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు మండలంలోని బురెడ్డిపల్లిలో ఆమె విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాలికా చదువులపై ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. బాలికలను బడికి పంపించి అక్షరాస్యతను పెంపొందించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 250 కుటుంబాల్లో సర్వే నిర్వహించి అన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. సర్పంచ్ బెనకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి గద్వాల రూరల్: గ్రామంలో ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రాం అధికారి సుందరమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని రేకులపల్లిలో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రధాన వీధుల్లో ముళ్లపొదలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించారు. సర్పంచ్ సుజాత, అధ్యాపకులు కృష్ణయ్య, భాస్కర్, వలంటీర్లు పాల్గొన్నారు. -
మంటగలుస్తున్న మానవత్వం
పనిచేయడం లేదని భర్తను ప్రశ్నించిన భార్యతో సహా ఇద్దరు పిల్లలను హత్య చేసిన హరీందర్... సహజీవనం చేస్తున్న అమ్మాయి తన భార్యకు ఫోన్ చేసి వేధిస్తోందని ఆమెను, ఆమె కూతురు, తల్లిని అమానుషంగా చంపేసిన మధు... అనుమానంతో వివాహం చేసుకోబోయే అమ్మాయిని బండరాయితో మోది హతమార్చిన మోతీలాల్... చదువు ఒత్తిడిలో పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి... తల్లి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మరో విద్యార్థి... గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటనలు సిటీజనులను కలచి వేస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, ఒత్తిడి, మానసిక క్షోభ, మూఢనమ్మకాలు... ఇలా కారణాలేవైనా ఇటీవల చోటుచేసుకున్న ఈ హత్యలు, ఆత్మహత్యలు మంటగలసిపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : క్షణికావేశంలో మృగమవుతున్న మనిషి... బంధాలను మరిచి యముడవుతున్నాడు. ‘నా అన్న వాళ్లనే..’ నరికి చంపేస్తున్నాడు. ఓచోట భార్యాపిల్లలను, మరోచోట నిండు గర్భిణిని, ఇంకోచోట అమ్మాయిని, మూఢనమ్మకాలతో పసికందును... హతమార్చిన ఘటనలు భాగ్యనగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. స్వార్థంతో, క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు.. వందల ఏళ్ల నాటి మానవీయ విలువల నిర్మాణాన్ని కూల్చేస్తున్నాయి. గత 10రోజుల్లో ఈ ఘటనల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు హతమయ్యారు. ఎందుకిలా..? మనుషులు, విలువలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రేమానుబంధాలు, మమతానురాగాలు శిథిలమవుతున్నాయి. కలహాలే కలిసి జీవిస్తున్నాయి. మనస్పర్థలు, ఘర్షణలే గాలివానలవుతున్నాయి. ‘నేను మాత్రమే’ బాగుండాలనే స్వార్థపూరితమైన దృక్పథం, తన సుఖ సంతోషాలకు ఎవరడ్డొచ్చినా భరించలేని అసహనం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంస్కృతి, ఆశలు, ఆశయాలను, అహాలను సంతృప్తి పర్చలేని దాంపత్య జీవితం... మొదలు నరికిన చెట్టులా కూలిపోతోంది. ఇలాంటి సంఘటనల్లో ఒకప్పుడు ఒకరి నుంచి ఒకరు విడిపోవాలని కోరుకునేవారు. ఇప్పుడలా కాదు. తనకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నారు. మగవాళ్లలో బలంగా ఉండే ఈ లక్షణం అక్కడక్కడా మహిళల్లోనూ కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల్లో మనుషులు ఎంతటి తెగింపునకైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతాల్లో పిల్లలు సైతం వాళ్ల క్రూరత్వానికి బలవుతున్నారు. అసహనం.. అనుమానం.. క్షణికావేశం అపర్ణ అనే మహిళను రెండో వివాహం చేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న మధు... ఆ వ్యవహారం బయటకుపొక్కి గొడవలకు దారితీయడంతో గత నెల 30న అపర్ణను, ఆమె తల్లి విజయమ్మను, కూతురు కార్తికేయను హతమార్చి తలుపులు వేసి తాపీగా వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల నేపథ్యంలో హరీందర్ జిల్లెలగూడలో భార్యాపిల్లలను హతమార్చాడు. వారం కింద హయత్‌నగర్‌లో మోతీలాల్ అనే వ్యక్తి తనకు కాబోయే భార్యపై అనుమానంతో ఆమెను చంపేశాడు. ఈ సంఘటనల అన్నింటిలోనూ విపరీతమైన అసహనం, తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే కట్టుకున్న భార్య, పిల్లలను సైతం తొలగించుకొనే మానసిక ఉన్మాద ప్రవృత్తి కారణమని మనస్తత్వ, సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉన్మాద ప్రవృత్తితో అనుబంధాలు, సామాజిక విలువలు హతమవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడం, వ్యక్తులపై ఎలాంటి సామాజిక నియంత్రణ కూడా లేకపోవడం.. ఈ రకమైన నేరాలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తరచూ విసిగిస్తే... భాగస్వామిని తరచూ విసిగిస్తూ మాట్లాడుతుంటే ఆ స్థితిని మానసిక పరిభాషలో ‘డెల్యూషన్’ అంటారు. ఇలాంటి ప్రవర్తన కలవారే హత్యలకు పాల్పడుతుంటారు. భార్య ప్రవర్తన ఎంత బాగున్నా.. ఏదో ఒక విషయంలో వేధింపులకు గురిచేస్తుంటారు. ఇవే చివరకు హత్యలకు దారితీస్తాయని మానసిక వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లలో చూపే వివాహేతర సంబంధాలు తమ ఇంట్లోనూ జరుగుతున్నాయని అపోహ పడడం, మద్యానికి బానిసవడం... ఆ దృక్పథంలో నేరాలకు పాల్పడడం జరుగుతోందని పేర్కొంటున్నారు. నిందితులు విచారణలో కొంచమైనా పశ్చాత్తాపం లేకుండా తాము చేసిన నేరాలను విపులంగా వివరించడం గమనార్హం. సామాజిక నియంత్రణ అవసరం ఈ అమానవీయమైన సంక్షోభాన్ని తొలగించి, ఉన్నత విలువలను స్థాపించేందుకు ఒక సామాజిక నియంత్రణ వ్యవస్థ అవసరం. మెగా సిటీలు, మహానగరాలు ఉనికిలోకి వచ్చిన తరువాత ఈ సామాజిక నియంత్రణ లేకుండా పోయింది. సోషల్ మీడియా అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మనిషి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, విలువల స్థాపనతో మాత్రమే ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడుతాయి. – ప్రొఫెసర్ నాగేశ్వర్ సమష్టి జీవన విధానం అలవడాలి మనుషుల కంటే వస్తువులు, సుఖం, వ్యక్తిగత ఆనందాలే ముఖ్యమయ్యాయి. నూతన ఆర్థిక విధానాలు, వస్తు వినిమయవాద సంస్కృతి ఇందుకు కారణం. దీంతో సహజమైన మనిషి లక్షణాలు చనిపోయి, మృగాల్లా మారుతున్నారు. మరోవైపు డబ్బుకున్న గుర్తింపు మనుషులకు లేకపోవడంతో ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపరీత ధోరణులు తొలగిపోవాలంటే సమాజంలో సమష్టి జీవన విధానం అలవడాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విలువలతోనే అది సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ వాస్తవాన్ని గుర్తించలేని అజ్ఞానం శక్తికి మించిన భారీ అంచనాలు, ఆర్థికంగా బాగా సంపాదించాలనే కోరికల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేని అజ్ఞానం ఇది. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సిగరెట్, ఆల్కహాల్, వివాహేతర సంబంధాల లాంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. మనస్తత్వ పరిభాషలో దీనిని ‘కోపింగ్ మెకానిజం’ అంటారు. ఒక దుస్థితి నుంచి బయటపడేందుకు మరో దుస్థితిని ఎంపిక చేసుకోవడం. ఈ క్రమంలో జరిగే కలహాల కారణంగా అహం దెబ్బతిని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది సైకోపథాలజీ మనస్తత్వం. కుటుంబ సంబంధాలు బలోపేతం కావాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్ అవసరం. – డాక్టర్ సి.వీరేందర్, మనస్తత్వ నిపుణులు ఒత్తిడి.. ఒంటరితనం ఒత్తిడి, ఒంటరితనమే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో డిప్రెషన్ బాధితులే అధికంగా ఉంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవడం, సమస్యలను ఎదుర్కోలేకపోవడం, పిల్లలను అతి గారాభం చేయడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్ బాధితులు, సున్నిత మనస్కులు, హార్మోన్ల అసమతుల్యంతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇప్పించాలి. – డాక్టర్ అనితా రాయిరాల, సైక్రియాట్రిస్ట్, రిమ్స్ జీవితం విలువ తెలియాలి ఇలాంటి దారుణాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరికీ జీవితం విలువ తెలియాలి. ఆ విలువలను నేర్పే విధంగా విద్యావిధానంలో, సామాజికంగా మార్పు రావాలి. నైతిక విలువలను చిన్నప్పటి నుంచి అలవర్చాలి. తల్లిదండ్రుల పెంపకంలో, మీడియాలోనూ మార్పులు అవసరం. నేరాలను నియంత్రించే విధంగా మీడియా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించాలి. – లలితాదాస్, సైకాలజిస్ట్ -
హయత్‌నగర్ ప్రేమ పెళ్లి వ్యవహారం కొత్త ట్విస్ట్
-
ఆ సిటీలో ఇంకా అంధ విశ్వాసాలు..
సాక్షి, బెంగళూరు: ఇది డిజిటల్ యుగం. అంతరిక్షంలో సుదూర తీరాలకు రాకెట్లను పంపి రహస్యాలను ఛేదించే దిశగా నేటి మానవుడు సాగుతున్నాడు. వైద్య రంగంలో అద్భుతాలనుసృష్టిస్తున్నాడు. ఇక ఐటీ సిటీ బెంగళూరు కూడా అంతర్జాతీయ స్థాయి ఐటీ–బీటీ హబ్‌గా, టెక్నాలజీ రాజధానిగా వెలుగొందుతోంది. ఇలాంటి నగరంలో కూడా క్షుద్ర ప్రయోగాలు, చేతబడులను నమ్మేవారున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎంతో విద్యావంతులు కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారన్న విషయం నగరంలోని పీపుల్స్ ట్రీ మార్గ్ అనే మానసికవైద్యాలయం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మంగళవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటీలో ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో ఏం చెప్పారు? సర్వే కోసం నగరంలో దాదాపు 500 మంది నుంచి సమాచారం రాబట్టారు. క్షుద్రపూజలు, చేతబడుల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నను అడిగారు. దాదాపు 40 శాతం మంది తాము నమ్ముతున్నామని సమాధానమిచ్చారు. క్షుద్రపూజలు, చేతబడుల వంటి కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతామని నమ్ముతున్నట్లు చెప్పారు. అందుకే తాము తరచుగా ఆలయాలకు వెళ్లడం ద్వారా ఇలాంటి వాటి ప్రభావం తమపై పడకుండా చూసుకుంటూ ఉంటామని సమాధానమిచ్చారు. మరో 30 శాతం మంది ఈ విషయంపై తమకు ఏమాత్రం అవగాహన లేదని, అందువల్ల సమాధానం చెప్పలేమని అన్నారు. మరో 30 శాతం మంది మానసిక సమస్యలనేవి ఒత్తిడి కారణంగా మనిషిలో తలెత్తే సమస్యలు మాత్రమేనని పేర్కొన్నారు. వంశపారంపర్యంగా కూడా కొన్ని మానసిక సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా ఆలోచించడం దురదృష్టకరం - డాక్టర్ సతీష్ రామయ్య కాగా, ఈ సర్వేపై సీనియర్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ సతీష్ రామయ్య మాట్లాడుతూ.....‘ఈ సర్వే ద్వారా ఇప్పటికీ విద్యావంతులైన వారు కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్నారని తెలిసింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలున్నాయంటే నిరక్షరాస్యత, పేదరికం కారణంగా అని అనుకోవచ్చు. కానీ, బెంగళూరు లాంటి మెట్రో నగరంలోని ప్రజల ఆలోచనా తీరు కూడా అలానే ఉందంటే దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. ప్రజల్లో పాతుకుపోయిన ఇలాంటి భావాలను తొలగించేందుకు స్వచ్ఛంద సంస్థలే కాదు ప్రభుత్వం కూడా శ్రమించాలి’ అని తెలిపారు. -
మూఢనమ్మకమా? గాఢవిశ్వాసమా?
సెల్ఫ్‌చెక్ సృృష్టి రహస్యాన్ని ఛేదించటానికి అనేక సంవత్సరాల శాస్త్రవేత్తల కృషికి ప్రయోగరూపం బిగ్‌బ్యాంగ్. ఒకవైపు మానవుని ఆయుష్షు పెంచటానికి రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు, గ్రహాలపై నివాసానికి ప్రయత్నాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు, విజయాలు చోటు చేసుకుంటుంటే ఇంకోవైపు మూఢ నమ్మకాలతో జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకొనే వారు ఎందరో ఉన్నారు. వీరు అపోహలతో, అనుమానాలతో విలువైన కాలాన్ని వృథా చేసుకుంటుంటారు. మీలో కూడ మూఢ నమ్మకాలకు స్థానం ఉందా? ఇది తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ని టిక్ చేయండి. 1. మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా పిలవటం మీకిష్టం లేదు. ఎ. అవును బి. కాదు 2. ప్రయాణ సమయాల్లో పిల్లి, కుక్క లాంటి జంతువులో మరేదో ఎదురొస్తే మీ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఆచారాలవల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందన్న సత్యాన్ని గ్రహించలేరు. ఎ. అవును బి. కాదు 4. అదృష్టం, దురదృష్టాలను బలంగా నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 5. అమావాస్య రోజుల్లో ప్రయాణాలను వాయిదా వేయటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 6. ‘పెళ్లికి ముందే జీవితభాగస్వామిని చూడటం, మాట్లాడటం చాలా తప్పు.’ ఈ భావనతో మీరు ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. నక్కలు, కుక్కలు అరిస్తే అరిష్టాలు జరుగుతాయని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 8. మంచి జరుగుతుందన్న నమ్మకంతో బలులను సమర్థిస్తారు. ఎ. అవును బి. కాదు 9. చేతబడి, బాణామతి లాంటి ఆచారాల వల్ల అనుకున్నది సాధించగలమని వాదిస్తారు. ఎ. అవును బి. కాదు 10. హేతువాదులంటే మీకు గిట్టదు. మీ ఆచారాలకు ఎవరైనా అడ్డువస్తే అసలు సహించలేరు. ఎ. అవును బి. కాదు మీరు టిక్ పెట్టిన సమాధానాలలో ‘ఎ’లు 7 దాటితే మీలో మూఢనమ్మకాలకు స్థానం ఉందని అర్థం. లేనిపోని భయాలు, అపోహలకు పెద్దపీట వేస్తూ వాస్తవాలను గ్రహించలేరు. ఇందులో చదువుకున్న వారూ ఉండొచ్చు. ఇలాంటి ఆచారాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. కాబట్టి ఇటువంటి నమ్మకాలను వెంటనే వదిలివేయాలి. వీలైనంత ఎక్కువగా శాస్త్రీయదృక్పథాన్ని పెంచుకోవాలి. ‘బి’ లు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మూఢాచారాలకు దూరంగా ఉంటారు. నిర్థారణలేని విషయాలను పక్కకు తోస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. -
గొత్తికోయలు మూఢనమ్మకాలు వీడాలి
ఏటూరునాగారం : గొత్తికోయలు మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య సూచించారు. గోగుపల్లి లింగాపురం గ్రామ గొత్తికోయ మహిళ పోచమ్మ ప్రసవం కోసం వెళ్తుండగా మంగళవారం దారి మధ్యలో కవలలకు జన్మనిచ్చిన విషయం విదితమే. ఇందులో ఓ శిశువు మృతి చెందగా మరో శిశువు, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండగా.. పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ మేరకు సామాజిక ఆస్పత్రిలో ఉన్న పోచమ్మ ఆరోగ్య పరిస్థితిని అప్పయ్య పరీక్షించి మాట్లాడారు. వైద్యాధికారులు శిరీష, క్రాంతికుమార్, మంకిడి వెంకటేశ్వర్లు, ఏఎ¯ŒSఎం ధనలక్ష్మి ఉన్నారు. -
మూఢనమ్మకాలను పారదోలాలి
చౌటుప్పల్ : శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా నేటికీ మూఢ నమ్మకాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.రమేష్ అన్నారు. మండలంలోని లక్కారం మోడల్ స్కూల్లో శనివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. నేటి యువత శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించకుండా, మూఢనమ్మకాలను విశ్వస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నించడం, పరిశోధించడం, విశ్లేషించడం ద్వారా ప్రతి విషయాన్ని సైన్స్ ద్వారా ఋజువు చేయవచ్చన్నారు. నిరక్ష్యరాస్యుల్లోని మూఢనమ్మకాలను పారదోలాల్సిన బాధ్యత అక్ష్యరాస్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దీపాజోషి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ అవ్వారు గోవర్థన్, జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటరమణారెడ్డి, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూఢాచారాలకు చెల్లుచీటీ
► పటిష్టమైన ‘మూఢాచారాల నిషేధ చట్టం’ రూపకల్పన ► త్వరలో రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు ► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: సమాజాభివృద్ధికి ఆటంకంగా పరిణమించిన మూఢాచారాలను నిర్మూలించేందుకు మహారాష్ట కంటే పటిష్టమైన మూఢాచారాల నిషేధ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ‘మూఢాచారాలు శాస్త్రీయపరమైన ఆలోచనలకు గొడ్డలిపెట్టు’ అనే అంశంపై బెంగళూరులోని జ్ఞానజ్యోతి సభాంగణలో కర్ణాటక న్యాయవాదుల పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కకు నీరు పోసి మాట్లాడారు. సమాజంలో నమ్మకాలు ఉండవచ్చని, అయితే అవి మూఢనమ్మకాలుగా మారకూడదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం మూఢాచారాల నిషేధ చట్టం అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ అంశంపై చర్చ సైతం జరిగిందని తెలిపారు. మరోవైపు ఇలాంటి చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదనే డిమాండ్ కూడా చాలామంది నుంచి వినిపిస్తోందని అన్నారు. అయినా మూఢాచారాల నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూఢాచారాల నిషేధ చట్టం ఇప్పటికే మహారాష్ట్రలో అమల్లో ఉందని, ఈ నేపథ్యంలో కర్ణాటకలో మరింత పటిష్టమైన చట్టాన్ని రూపొందించాల్సిందిగా న్యాయనిపుణులను ఆదేశించినట్లు తెలిపారు. ‘నేను మూఢాచారాలను నమ్మను. నా పెళ్లి జరిగింది రాహుకాలంలో, పురోహితుల మాట విని మా మామగారు నా వివాహాన్ని ఉదయం 9.30-10.30గంటల మధ్యన నిర్ణయించారు. అయితే ఆ సమయానికి అతిథులు హాజరుకావడం ఆలస్యం కావడంతో పాటు అది భోజన సమయం కూడా కాకపోవడంతో నేను మధ్యాహ్నం 12.30గంటలకు రాహుకాలంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టానంటూ చర్చ జరిగింది. అయినా ఆ సమయంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొని అలాగే చేశాను’ అని సీఎం చెప్పారు. మూఢనమ్మకాలు కేవలం ప్రజలను, వారి మనోస్థైర్యాన్ని బలహీనపరుస్తాయని, అందువల్ల విద్యావంతులు ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలకు నిరసనగా తమ గళాన్ని వినిపించాలని సూచించారు. మరో రెండేళ్లు నేనే సీఎం...... రానున్న మరో రెండేళ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందనేది కేవలం గాలి వార్తలు మాత్రమేనని కొట్టిపారేశారు. -
మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారం
జోగిని వ్యవస్థను ప్రోత్సహించినా శిక్షార్హులే! లీగల్ కౌన్సెలింగ్ నేనొక సోషల్ వర్కర్ని. మాదొక మారుమూల గ్రామం. అక్షరాస్యత చాలా తక్కువ. మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువ. మహిళల పరిస్థితి ఘోరం. మీరు చెబితే నమ్మరేమో. ఒక అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఒక దేవస్థానానికి అంకితమిచ్చి, వివాహంలాంటిది జరిపించారు. ఆ అమ్మాయి మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారానికి గురౌతూనే ఉంది. అదేమంటే ఆమె జోగిని కనుక అది సహజమంటున్నారు. నేనేమైనా సహాయం చేయగలనా? - కల్పన, ఆదిలాబాద్. ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఉన్నందుకు సభ్యసమాజం సిగ్గుపడాలి. ఒక స్త్రీని ఊరుమ్మడి సరుకుగా మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో ఈ జోగిని వ్యవస్థ ఉంది. వీరినే దేవదాసీలు, బసివినులు, మాతమ్మలు, తమ్మమ్మలు అని అంటుంటారు. పండుగలు, జాతరలు, ఊరేగింపులు వంటి సందర్భాలలో వీరిని చూస్తుంటాము. విచిత్ర వేషధారణలో, అనేక విన్యాసాలు చేస్తూ వీరు కనిపిస్తారు. వీరు లేకుండా కొలుపులు, జాతరలు ప్రారంభం కావు. కేవలం అప్పుడే వారికి ప్రాధాన్యత ఇస్తారు. మిగతా సమయాల్లో ఊర్లోని మగాళ్ల కోర్కెలు తీర్చే యంత్రాల్లాగే చేస్తారు. వీరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేవదాసి (అకింతం) నిషేధ చట్టం 1988 ఉంది. ఈ చట్టప్రకారం ఏదైనా హిందూ దేవత, విగ్రహం లేదా దేవస్థానానికి సేవ చేసే నిమిత్తం అంకితమివ్వబడే స్త్రీని దేవదాసి అంటారు. ఒక స్త్రీని దేవదాసిగా/బసివిని/జోగినిగా అంకితం చేయడం నేరం. అలా అంకితం చేసే కలాపం నిర్వహించినా, పాల్గొన్నా, ప్రోత్సహించినా రెండు నుంచి మూడు సంవత్సరాల శిక్ష, మూడువేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. మీరు చెప్పిన కేసులో ఆ అమ్మాయి అమ్మానాన్నలే ఆమెను దేవదాసిగా అంకితమిచ్చారు. తల్లిదండ్రులే స్వయంగా అలా దేవుడికి అంకితమిస్తే రెండు నుండి ఐదు సంవత్సరాల శిక్ష పడుతుంది. పోలీసు కంప్లైంట్ ఇవ్వవచ్చు. లేకుంటే మీ స్వచ్ఛంద సంస్థ తరపున మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టవచ్చు. తల్లిదండ్రులను, నిర్వహించినవారిని, హాజరైన వారినీ, ప్రోత్సహించిన వారినీ పార్టీలుగా చేయవచ్చు. నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తనుండి కోర్టుద్వారా విడాకులు తీసుకున్నాను. మాకు 5, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు. నా భర్త పిల్లల కస్టడీ కోరుతూ ఆశ్రయించారు. జడ్జిగారు మమ్ములను లోపలికి పిలిపించి, పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి తల్లికే కస్టడీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అని, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికి మా వారు బాబును తనకి ఇమ్మని, పాపను నన్నే ఉంచుకోమని ప్రపోజల్ పెట్టారు. కేస్ ఇంకా మొదలు కాలేదు. నా సందేహం ఏమిటంటే, పిల్లలను ఇలా విడదీసి పంచుకోవడం న్యాయమా? నాకు విషయం తలచుకుంటేనే దుఃఖం వస్తోంది. మరో ముఖ్యవిషయం. మావారు ఒక క్రిమినల్ కేసులో నిందితుడు. రిమాండ్‌కి కూడా వెళ్లి వచ్చారు. ఒకవేళ అతనికి శిక్ష పడితే పిల్లలపై తీవ్రప్రభావం చూపిస్తుంది కదా! ఈ విషయంలో పిల్లలిద్దరి కస్టడీ నాకు వచ్చే అవకాశం ఉందా? - పి.సత్యవతి, విశాఖపట్నం మీకు తప్పకుండా పిల్లలిద్దరి కస్టడీ వస్తుంది. ఎందుకంటే కస్టడీ కేసులో పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు టీచర్ కనుక పిల్లల చదువు విషయంలో, పెంపకం విషయంలో తగిన జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందని కోర్టువారు అనేక కేసుల్లో తీర్మానించారు. పిల్లలిద్దరూ ఒకేచోట పెరిగితే వారి మధ్య బంధాలు బలంగా ఉంటాయని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు వృద్ధిపొంది, ఒకరికొకరు తోడుగా ఉంటారని అనేక తీర్పులు ఉన్నాయి. మీకు ఇంకొక ప్లస్‌పాయింట్ ఉంది. మీ భర్త రిమాండ్‌కు వెళ్లివచ్చారు. శిక్ష కూడా పడే అవకాశం ఉంది. తండ్రి క్రిమినల్ కేసులో ఇరుక్కొని, జుడీషియల్ కస్టడీకి వెళ్లి వచ్చి, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, అవన్నీ పిల్లల మానసిక పరిస్థితిపై ఎంతో ప్రభావం చూపి, వారి ఎదుగుదలపై దుష్ర్పభావం పడుతుందని న్యాయమూర్తులు అనేక కేసుల్లో తీర్పునిచ్చి, అలాంటప్పుడు కస్టడీ తల్లికే ఇవ్వాలని తీర్మానించారు. మీ కే సు విచారణకు వస్తే మీరు మీ భర్తకు సంబంధించిన క్రిమినల్ కేసు ఆధారాలను కోర్టు ముందు ఫైల్ చేయాలి. మీ ఆవేదన తీరుతుంది. తండ్రికి ఎటూ విజిటింగ్ హక్కులు ఉండనే ఉన్నాయి. మేము ఒక గ్రౌండ్ ఫ్లోర్లో వుంటున్నాము. నా భర్త ఉద్యోగి. నేను గృహిణిని. ఇటీవలే మాకు వివాహమైంది. మా ఇంటి గుమ్మం ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే మెట్ల ఎదురుగా వుంటుంది. పైకి వెళ్లేవాళ్లు, కిందికి వచ్చేవాళ్లు కనిపిస్తుంటారు. సమస్యేమిటంటే ఒక పోకిరీ వ్యక్తి అస్తమానం పైకీ కిందికీ వెళుతూ నావైపే తదేకంగా చూస్తున్నాడు. అతను పైపోర్షన్లో ఉంటున్నాడు. మొదట్లో పట్టించుకోలేదు. నేనే తలుపులు బిగించుకుని ఉంటున్నాను. అస్తమానం అలా వుండలేను కదా. ఇటీవలకాలంలో అతను చాలా అసభ్యమైన సైగలు చేస్తున్నాడు. వివిధ హావభావాలు (శృంగారపరమైన) ప్రదర్శిస్తున్నాడు. నేను గమనించకుండా వుంటే ఏదో ఒక శబ్దం చేసి అటు చూసేలా చేస్తున్నాడు. నేనెంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఎవరికీ చెప్పుకోలేను. గట్టిగా మందలించలేను. పైగా నా భర్త చాలా అనుమానం మనిషి. సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హైదరాబాద్ నిజంగా మీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. కొందరు దుర్మార్గులు ఇలా ఆడవారిని మానసికంగా హింసించడం ఎక్కువైంది. దీనివల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ముందుగా ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా వుందేమో కనుక్కోండి. ఉంటే తప్పుకుండా రికార్డ్ అవుతుంది. యాక్షన్ తీసుకోవచ్చు. లేకుండా షీ టీమ్స్ వారికిగానీ, లేకుంటే మహిళా ప్రొటెక్షన్ సెల్‌కి గానీ ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు వారు మహిళా హెల్ప్‌లైన్స్ నిర్విస్తున్నారు. మీ పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదు ఆన్లైన్లో ఇవ్వవచ్చు. కొన్ని ఆధారాలు కావాలి కదా. మీరు మీ సెల్ఫోన్లో అతని చేష్టలు చిత్రీకరించే ప్రయత్నం చేయండి. లేకుంటే మీకు నమ్మకస్తులైనవారు అవి చూసేలా చేయండి. మహిళలకు అసభ్యమైన సైగలు చేసినా ఏ పదజాలం వాడినా అసభ్యమైన పాటలు పాడినా, బూతు బొమ్మలు చూపినా, చూసేలా చేసినా, భావ ప్రకటనలు చేసినా, అసభ్యమైన హావభావాలు ప్రదర్శించినా అది నిర్భయ చట్టం కిందకు అంటే సె.354ఏ కిందకు వస్తాయి. ఒక సంవత్సరం శిక్ష, జరిమానా పడే అవకాశం వుంది. -
భయం.. భయం..!
ఆ గ్రామ ప్రజలకు కక్షలు.. కార్పణ్యాలంటే తెలియదు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఏమైందో తెలియదుకానీ చేతబడి అనుమానం ఊరిలో చిచ్చు రేపింది. క్షణికావేశంతో ఓ వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపేలా చేసింది. ఇంతలో మృతుడి ఆత్మ తిరుగుతోందనే పుకార్లు జనాన్ని మరింత వణికిస్తున్నాయి. దీంతో కొందరు గ్రామంలోని ఆలయాల్లోనే నిద్ర చేస్తున్నారు. మరికొందరు గ్రామం నుంచి వలస వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల వ్యవధిలో తీవ్ర అశాంతి.. అలజడి రేగిన ఊరే గురజాల మండలంలోని గోగులపాడు. ఈ ఊర్లో ఈ దుస్థితికి కారణం మూఢ నమ్మకాలే అని తెలుస్తోంది. గుంటూరు :గురజాల మండలంలోని గోగులపాడు గ్రామంలో భయం రాజ్యమేలుతోంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు చేతబడులు చేసి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. దీనికి తోడు 20 రోజులుగా పది మంది మహిళల ఒంట్లోకి గ్రామ దేవతలు వచ్చి చేతబడి చేస్తున్న వారి అంతు చూడాలంటూ గ్రామస్తులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో 15 రోజులుగా 200 మంది గ్రామస్తులు పది బృందాలుగా ఏర్పడి రాత్రి సమయంలో గ్రామ పొలిమేరల్లో తిరుగుతూ చేతబడులు చేయకుండా కాపలా కాశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ వెళ్లిన తరువాత శాంతి కోసం పూజలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇదిఇలా ఉండగా ఆదివారం గ్రామస్తులు ఊరి పొలిమేరల్లో తిరుగుతుండగా, క్షుద్ర పూజలు చేస్తూ ఇద్దరు కనిపించడంతో వారిని చితకబాదారు. దీంతో తమతో పూజలు చేయిస్తోంది గురవారెడ్డి అంటూ వారు చెప్పడంతో గ్రామస్తులంతా గురువారెడ్డి ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి రాళ్ళతో పళ్లు ఊడగొట్టి తీవ్రంగా కొట్టారు. ఇదే సమయంలో పూనకం వచ్చిన మహిళ అతన్ని హతమారిస్తేగాని ఊరికి మంచి జరగదని చెప్పడంతో విచక్షణ కోల్పోయిన గ్రామస్తులు గురువారెడ్డిని రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. దీంతో ఈ ఘటనకు కారణమైన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారెడ్డి మృతి చెందినప్పటికీ గ్రామ ప్రజల్లో మాత్రం భయం వీడలేదు. గురువారెడ్డి ఆత్మ గ్రామంలో తిరుగుతోందనే పుకార్లతో ప్రజలు చీకటి పడితే ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. కొందరైతే దేవాలయాల్లో నిద్ర చేస్తూ పూజలు చేస్తున్నారు. మరికొందరు ఊరి నుంచి వలస వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. -
పసికందు నరబలి!
కర్నూలు: మానవుడు సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా.. సమాజంలో అట్టడుగున ఉన్న మూఢనమ్మకాలు ఏమాత్రం మారడం లేదు. తాజాగా ఈ అంధవిశ్వాసాలకు అభంశుభం తెలియని తొమ్మిది నెలల పసికందు బలైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో క్షద్రపూజల పేరిట తొమ్మిది నెలల శిశువును నరబలి ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. హంద్రీనీవ కాల్వ వద్ద చిన్నారి తల, మొండెం లభ్యమయ్యాయి. అంధవిశ్వాసాలకు చిన్నారిని బలి ఇవ్వడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. -
'నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు'
కొల్చారం (మెదక్ జిల్లా) : గ్రామాల్లో నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు ప్రబలి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. కొల్చారం మండలం వరిగుంతంలో గత ఆదివారం గ్రామస్థులు బాణామతి నెపంతో గ్రామానికి చెందిన దంపతులను పంచాయతీ పెట్టి బెదిరించి జరిమానా విధించారు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. పంచాయతీ నిర్వహించిన గ్రామపెద్దలపై సోమవారం కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో నెల క్రితం పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై కళాజాత నిర్వహించారు. అయినా గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతుండడంతో మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంగళవారం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుకు మెదక్ డీఎస్పీ రాజారత్నం హాజరయ్యారు. డీఎస్పీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు. సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ నిర్మల మాట్లాడుతూ.. మూడనమ్మకాలను దరిచేరనివ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, ఎస్సై రమేష్‌నాయక్, గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడివప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు. -
హైటెక్యుగంలోనూ మూఢనమ్మకాలు
-
మూఢనమ్మకాలకు బలి అయిన మహిళ
-
దెయ్యాల టూరిజం!
సర్వే దెయ్యాలు ఉన్నాయి సుమా... అని భయపడేవారు కొందరు. దెయ్యాలు లేనే లేవు... అంటూనే భయపడేవారు కొందరు. రాత్రయినా సరే, పగలయినా సరే ‘దెయ్యాలున్నాయి’ అని భయపడే వారు మరికొందరు. పగలంతా ‘దెయ్యాలు లేవు’ అని గట్టిగా వాదించి రాత్రయితే చాలు ప్లేటు ఫిరాయించి కిటికీల వంక భయంగా చూసేవాళ్లు కొందరు... మొత్తానికైతే దెయ్యాల గురించి మాట్లాడకుండా ఉండలేం. దెయ్యాలను నమ్మడం మూఢ నమ్మకమని, వెనుకబడిన దేశాలలో, వెనకబడిన ప్రాంతాలలో, నిరక్షరాస్యత ఉండేచోట ‘దెయ్యాల మీద నమ్మకం’ ఎక్కువగా ఉంటుందనేది సాధారణ అభిప్రాయం. ప్రసిద్ధ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘హారిస్ పోల్స్’తో సహా ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలలో మాత్రం పాశ్చాత్యదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తక్కువేమీ లేదనే విషయం బయటపడింది. దెయ్యాలను నమ్మేవారు అమెరికాలో 42 శాతం మంది ఉన్నారు. బ్రిటన్‌లో 52 శాతం మంది ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘దెయ్యాలు ఉన్నాయి’ అని బల్లగుద్ది వాదించే వాళ్లలో విద్యావేత్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కొందరైతే ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తం చేసుకున్న కొన్ని వింత ఫోటోలను చూపిస్తూ ‘‘ఇంతకంటే రుజువు అవసరమా?’’ అని కూడా అంటున్నారు. సర్వేలో భాగంగా దెయ్యాలు తిరుగాడే ప్రాంతాల గురించి అడిగినప్పుడు రకరకాల దేశాల్లో రకరకాల పేర్లు వినిపించాయి. ఈ దెబ్బతో ‘పారానార్మల్ టూరిజం’ పెరిగిపోయింది. ఒకానొక ప్రాంతంలో ఎలాంటి చూడదగిన ప్రదేశమూ లేకపోయినా ‘అక్కడ దెయ్యం ఉంది’ అనే నమ్మకంతో వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది. అలా పర్యటించిన వారికి దెయ్యాలు కనిపించాయో లేదోగానీ- ‘నేను మరియు ఆ దెయ్యం’లాంటి హాట్ హాట్ యాత్రాకథనాలు రాయడం మొదలు పెట్టారు కొందరు. హతవిధీ! -
రగతం తాగేస్తాది!
-
మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
మంచాల: మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని మంచాల సీఐ జగదీశ్వర్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చాంద్‌ఖాన్‌గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఓ మహిళ ఇటీవల చనిపోయి దెయ్యమై గ్రామస్తులపై దాడి చేస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటి ఎదుట కాముని బూడిద, చెప్పులు ఉంచుతున్న విషయం విధితమే. సోమవారం మంచాల సీఐ జగదీశ్వర్ సిబ్బందితో కలిసి చాంద్ఖాన్గూడను సందర్శించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. దెయ్యాలు, భూతాలు లేవని చెప్పారు. మూఢ విశ్వాసాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జగదీశ్వర్ గ్రామ యువకులతో మాట్లాడారు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయని విశ్వసించడం మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా పుకార్లను నమ్మొద్దని సీఐ చెప్పారు. చదువుకున్న యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దెయ్యాలు ఉన్నాయని విశ్వసించి భూత వైద్యులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు. త్వరలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మంచాల ఎస్సై రవికుమార్, సిబ్బంది ఉన్నారు. -
నమ్మకం: కాకి వాలిందా!
నల్లగా ఉంటే కాకిలా ఉన్నావంటారు. గట్టిగా గోలచేస్తే కాకిలా అరుస్తావెందుకు అంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నెగటివ్‌గా (కొన్నిసార్లు పాజిటివ్‌గా కూడా) ఏం చెప్పాలన్నా కాకిని పోలుస్తూ చెప్పడం అలవాటైపోయింది అందరికీ. కాకికి అంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? కాకి చుట్టూ ఏవైనా నమ్మకాలు ఉన్నాయా? అవి నమ్మకాలేనా లేక నిజాలా? ఇంటి గోడ మీద నిలబడి ఠీవిగా అరుస్తూ ఉంటారు కాకిగారు. అది వినగానే... ‘కాకి అరుస్తోంది, ఎవరైనా చుట్టాలొస్తారో ఏమో’ అంటూ దీర్ఘాలు తీస్తారు బామ్మగారు. కాకి అరిస్తే బంధువులు రావడం ఏమిటి? కాకికి జరగబోయేది తెలుస్తుందా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కానీ సమాధానం కొందరికే తెలుసు. కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకం ఏర్పడింది రామాయణం వల్ల. ఆంజనేయుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అంటే అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందన్నమాట. అలా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. పైగా... ఆంజనేయుడు వచ్చాడన్నది సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే ఏదో శుభవార్త వస్తుందని కూడా నమ్ముతుంటారు. ఇది మాత్రమే కాక... భారతదేశంలో కాకికి చాలా ప్రాధాన్యం ఉంది. కాకిని పితృదేవతలకు ప్రతినిధి అంటారు. శ్రాద్ధ కార్యక్రమాలు జరిపించాక, పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకి వచ్చి ఆరగిస్తేనే ఆ మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. అలాగే కాకి చాలా తెలివైన పక్షి అని కూడా అంటారు. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడితే, అవి పిల్లలు కాగానే కనిపెట్టేస్తుంది కాకి. అన్నీ ఒకలాగే ఉన్నా, కోకిల పిల్లల్ని గుర్తించి వాటిని వెళ్లగొడుతుంది. అందుకే దాన్ని తెలివైన పక్షిగా పేర్కొంటారు. ఇలా మనదేశంలో చాలా ప్రశంసల్ని పొందుతోంది కాకి. చాలా ప్రాధాన్యతను కూడా మూటగట్టుకుంటోంది. అయితే ఇదే కాకి... విదేశాల్లో విలన్ అయిపోయింది. కాకిని అపశకునంగా భావించే దేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లేప్పుడు కాకి అరిస్తే అశుభమని నమ్మేవాళ్లు ఉన్నారు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు కనుక కాకి అరిస్తే, ఆ పని ఎప్పటికీ పూర్తి కాదని, పూర్తి అయినా కూడా అపజయమే కలుగుతుందని భావించి భయపడేవాళ్లు కూడా ఉన్నారు. ఇంటి మీద ఒక కాకి ఉంటే ఏదో దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు మీద గానీ, తాటాకు మీద గానీ ఉన్న కాకిని చూస్తే... త్వరలోనే మృత్యుదేవత ఇంటి తలుపు తడుతుందట. కాకి కనుక కిటికీ తలుపును గుద్దుకుంటే, ఆ ఇంట్లోని వారో, వారికి సంబంధించినవారో చనిపోతారట. అదే తెల్ల కాకి విషయంలో మాత్రం ఈ నమ్మకాలన్నీ రివర్స్ అవుతాయి. కొన్ని దేశాల్లో నలుపును సృజనాత్మకతకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి చోట్ల నల్ల కాకిని అదృష్టంగా భావిస్తున్నారు. కానీ మిగతా అన్ని చోట్లా... నలుపు పాపానికి, వేదనకు గుర్తు కాబట్టి కాకి కూడా వేదనకారకమేనని నమ్ముతున్నారు. ఒక మామూలు పక్షి, ఓ చిన్ని అల్పప్రాణి మనిషికి అంత దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతుంది? ప్రాణాలు పోయేంత అశుభాన్ని ఎందుకు తీసుకొస్తుంది? ఈ ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు. అందుకే ఇవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఎన్నో అపోహలు నమ్మకాలుగా చెలామణీ అయిపోతున్నాయి. ఇంటి మీద ఒక కాకి ఉంటే దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే... మరణం సంభవిస్తుందట. -
ఉప్పు ఒలికిపోతే..?
మరికొన్ని వింత నమ్మకాలు మనకు ఇష్టం లేని వ్యక్తి పదే పదే మనింటికి వచ్చి విసిగిస్తుంటే... అతడు వచ్చినప్పుడు చిటికెడు ఉప్పును అతని మీద వెయ్యాలట. అంతే... అతడు మళ్లీ రాడట! సముద్ర జలాల మీద ఉన్నప్పుడు ఉప్పు అన్న మాట నోట రాకూడదని, వస్తే క్షేమంగా తిరిగి వెళ్లలేరని కొన్ని దేశాల్లోని జాలర్లు నమ్ముతారు! కొత్త పెళ్లికూతురు తన పెళ్లి వస్త్రాల మీద కాసింత ఉప్పు చల్లుకుంటే... కాపురం పదికాలాలు పచ్చగా ఉంటుందట! బయటి నుంచి ఉప్పును అరువుగా తెచ్చుకుంటే, దానితో పాటే దురదృష్టం ఇంటికొచ్చి తిష్ట వేస్తుందట! కొత్తగా పుట్టిన శిశువుని ఉప్పు నీటిలో ముంచి తీస్తే, దుష్టశక్తులు దగ్గరకు రావట! ఓ అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద ఉప్పు పెట్టడం మర్చిపోయిందంటే, ఆ అమ్మాయి జీవితంలో ఏ అబ్బాయీ లేడని అర్థమట! మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు ఒకరు. మా కంపెనీ ఉప్పు తినండి, జీవితంలో పెకైదగండి అంటూ ప్రచారం చేస్తారు ఇంకొకరు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందంటారు పెద్దలు. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. కానీ ఉప్పుతో మనకు ముప్పు ఏర్పడుతుందని ఎవరైనా చెప్పారా? ఉప్పు రూపంలో అదృష్ట దురదృష్టాలు మనతో ఆటలాడుకుంటాయని ఎవరైనా చెప్పడం విన్నారా? వంటకి ఉప్పు కావాలి. ఆరోగ్యానికి ఉప్పు కావాలి. అలాంటి ఉప్పుతో ముప్పు వస్తుందని ఎవరు అనుకుంటారు! కానీ వస్తుందనే నమ్మకం ఎన్నో చోట్ల, ఎన్నో యేళ్లుగా ప్రచారంలో ఉంది. ఉప్పును పారబోయడం అశుభ సూచకం అన్న నమ్మకం చాలా దేశాల్లో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు... ఒలికిన ఉప్పుని ఎత్తి, ఎడమ భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పరిహారం కూడా చెబుతుంటారు. ఎందుకంటే దెయ్యాలు, దుష్టశక్తులు ఎప్పుడూ మనిషికి ఎడమవైపునే ఉంటాయట. అందుకని ఎడమవైపుకు పారబోయాలట. అంతేకాదు. ఎంత ఉప్పు ఒలికిందో, అదంతా కరిగిపోయేటన్ని కన్నీళ్లు కార్చాలనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది మరీ అతిగా ఉందని కొందరు ఆధునికులు కొట్టి పారేస్తున్నా... ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవాళ్లు తక్కువేమీ లేరు. ఈ నమ్మకానికి నాంది పలికినవాడు లియొనార్డో డావిన్సీ అని చెప్పవచ్చు. అతడు వేసిన ‘లాస్ట్ సప్పర్’ చిత్రంలో యూదా ఇస్కరియోతు (ఏసుక్రీస్తును పట్టించినవాడు) చేతి దగ్గర ఓ చిన్న సీసాలాంటిది వేశాడు. అది పడిపోయినట్టు, అందులోంచి ఉప్పు ఒలికిపోయినట్టు చిత్రించాడు. లాస్ట్ సప్పర్ (యేసుక్రీస్తు శిష్యులతో కలసి చేసిన ఆఖరు భోజనం) తరువాత యేసుక్రీస్తును సైనికులు బంధించడం, సిలువ వేయడం వంటివి జరిగాయి. దాన్నిబట్టి... ఉప్పు ఒలికిపోవడం అన్న సంఘటన జరగబోయే అనర్థానికి సూచికలా ఉందనీ, అందుకే ఉప్పును ఒలకబోయకూడదనే నమ్మకం మొదలయ్యిందని చెబుతుంటారు చరిత్రకారులు. ఇది ఎంతవరకూ నిజం అనేదానికి ఆధారాలయితే లభించడం లేదు. పైగా బైబిల్ ప్రకారం, లాస్ట్ సప్పర్‌లో వాళ్లు కేవలం రొట్టె తిని, ద్రాక్షరసం తాగారు. మరి అక్కడ ఉప్పు ఎందుకుంది అనే ప్రశ్న కూడా కొందరిలో తలెత్తింది. అలాగే బైబిల్లో ఉప్పు గురించి గొప్పగా రాశారు. మనిషి ఎలా ఉండాలి అనేదానికి ఉప్పును ఉదాహరణగా చూపించి చెప్పారు. మీరు లోకానికై ఉప్పై ఉండండి అన్నారు క్రీస్తు. ఉప్పు నేలమీద పడితే నిస్సారమైపోతుంది, మనిషి జీవితం కూడా వెళ్లకూడని దారిలో వెళ్తే ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ గొప్పగా చెప్పారు. అలాంటి ఉప్పు వల్ల చెడు జరగడమేమిటి అనేవాళ్లు కూడా ఉన్నారు. పూర్వం చాలా ఖరీదు కనుక... ఏ రకంగా చూసినా ఉప్పు చుట్టూ ఉన్నవి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయే తప్ప, నిజమైన నమ్మకాలుగా అనిపించడం లేదంటారు కొందరు విజ్ఞులు. పూర్వం ఉప్పు చాలా ఖరీదు. అందుకే జాగ్రత్తగా వాడుకొమ్మని చెప్పేందుకు, ఇష్టమొచ్చినట్టు వృథా చేయకుండా అడ్డుకునేందుకు ఇలాంటి కథలన్నీ పుట్టించారని చెబుతారు వారు. ప్రాచీన రోమన్లు ఉప్పును ఎంతో విలువైన వస్తువుగా భావించేవారు. ఇప్పటికీ రోమ్‌లోని క్రైస్తవ దేవాలయాల్లో పవిత్ర జలాన్ని తయారు చేసేందుకు ఉప్పును వాడతారట. -
మూఢాచారాలకు చెల్లు చీటీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మూఢాచారాలను నిషేధిస్తూ బెల్గాంలో జరుగనున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ న్యాయ కళాశాలకు చెందిన సామాజిక అధ్యయన కేంద్రం సిద్ధం చేసిన ‘మూఢ నమ్మకాల ఆచరణ-ప్రతిబంధక బిల్లు-2013’ ముసాయిదాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయులు మంగళవారం ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో సాహితీవేత్తలు, మేధావుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలోని మూఢ నమ్మకాలు, మూఢాచారాలను నిర్మూలించడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందన్నారు. దీనిపై సిద్ధమైన ముసాయిదా బిల్లును వచ్చే శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. అంతకంటే ముందు దీనిపై సాధక బాధకాలపై గురించి చర్చిస్తామన్నారు. ముసాయిదా బిల్లును రూపొందించిన జాతీయ న్యాయ కళాశాల అధ్యాపకులు, సాహితీవేత్తలు, మేధావులకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోందని అన్నారు. మహారాష్ట్రలో ఇదివరకే మూఢాచారాల నిషేధ చట్టం ఉందని తెలిపారు. దీంతో పాటు దేశ, విదేశాల్లోని ఇలాంటి చట్టాలపై ముసాయిదా బిల్లు కమిటీ అధ్యయనం చేసిందని ఆయన వెల్లడించారు. ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలు.. నరబలి ఇవ్వడం. జబ్బు నయం చేయడానికి హింసాత్మక పద్ధతులను అవలంబించడం. దైవ శక్తి స్వాధీనమైందని ప్రకటించుకోవడం. డబ్బు తీసుకుని మంచి జరిగేలా చూస్తామని హామీలు ఇవ్వడం. పిల్లల జబ్బులను బాగు చేసే నెపంతో వారిని పైనుంచి కిందకు పడేయం, ముళ్లపై పడుకోబెట్టడం. రుతు స్రావం, గర్భం దాల్చిన సమయాల్లో మహిళలను బలవంతంగా ఒంటరిని చేయడం లాంటి 13 మూఢాచారాలను నిషేధించాలని ముసాయిదాలో సూచించారు. దీనికి విధించే శిక్ష ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా. నరబలి ఇచ్చిన వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష. -
నమ్మకం: అద్దం చుట్టూ ఉన్నవి అబద్ధాలా? నిజాలా?
మనం ఎలా ఉంటామో మనకి తెలియాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం... అద్దం. అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన అందాన్ని పట్టి చూపిస్తుంది. మన అవకరాలను మనకు తెలియజేస్తుంది. అందుకే మనకు అద్దం కావాలి. కానీ మీకు తెలుసా? మన ఇంటి గోడకు హుందాగా వేళ్లాడే అద్దం వెనుక ఎన్ని కథలున్నాయో... ఎన్ని భయాలు ఉన్నాయో... ఎన్ని నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో! హిందూ మతం ప్రకారం... అద్దం లక్ష్మీస్థానం. అందుకే అద్దం పగిలితే సంపద చెల్లాచెదురైపోతుందని అంటారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని కూడా అంటారు. ఇంతవరకూ సరే. కానీ అద్దం పగిలితే ఎవరో ఒకరి ప్రాణాలకు ముప్పు అని కొందరు ఎందుకంటారు? ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రిక న్లు, కొన్ని వర్గాల భారతీయులు దీన్ని గట్టిగా నమ్ముతున్నారు. దానికి వారు చెప్పే సమాధానం... అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలితే మన రూపం ఛిద్రమైనట్టేనని, అంటే మరణం సంప్రాప్తించే సమయం ఆసన్నమైనదని అర్థం చేసుకోవాలని! పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే. అయితే ఇది ఎంతవరకూ నిజం అంటే... నిరూపించడానికి ఆధారాలు శూన్యం. అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డను కప్పేస్తారు వాళ్లు. అలా ఎందుకు అంటే... ఖననం చేసిన వ్యక్తి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పివేస్తారు. సినిమాల్లో సైతం దెయ్యాలు అద్దంలోనే కనిపించినట్టు చూపిస్తుంటారు. అంటే, అద్దం దురాత్మకు ఆశ్రయమిస్తుందన్న నమ్మకం బలంగా ఏర్పడిపోయింది. అయితే ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే మాత్రం వాళ్లెవరూ సమాధానం చెప్పలేరు. అందుకే దీనిని మూఢనమ్మకంగానే పరిగణిస్తున్నారు చాలామంది ఆధునికులు. నమ్మకాలకేం... ఎన్నయినా పెట్టుకోవచ్చు. కానీ అలా నమ్మడం ఎంత వరకూ కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. అద్దంలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అనుకుంటే, ఎవరి ఇంట్లోనైనా చనిపోతే వారి ఆత్మ వారి అద్దంలో ఉండిపోవాలి కదా! వారికి కనిపించాలి కదా! అద్దం పగిలితే మనం మరణిస్తాం అనేదే నిజమైతే, ఎక్కడా అద్దమే పగలడం లేదా? అలా పగిలిన ప్రతిసారీ, అందులో ముఖం చూసుకున్న ప్రతిసారీ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారా? ఇలా ఆలోచిస్తే మన నమ్మకాల వెనుక ఉన్న నిజానిజాల్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అద్దం గురించిన కొన్ని నమ్మకాలు ఏడాదిలోపు బిడ్డకు అద్దం చూపిస్తే... బిడ్డ ప్రాణానికి ప్రమాదం! కొవ్వొత్తి వెలుగులో అద్దంలో చూసుకుంటే... మనకు బదులు మనకిష్టమైన వాళ్ల ఆత్మ కనిపిస్తుంది! పెళ్లాడబోయే వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే... అద్దం ముందు కూర్చుని యాపిల్ తినాలి. ఆపైన జుత్తు దువ్వుకుంటూ అద్దంలోకి చూస్తే మన భుజం వెనుక నిలబడి మనల్ని చేసుకోబోయే వ్యక్తి కనిపిస్తారు! వ్యాంపైర్లకు చావు ఉండదు. వాటికి ఆత్మలు ఉండవు. అందుకే అవి అద్దంలో కనిపించవు! -
చేతబడులు, మూఢనమ్మకాలపై మహారాష్ట్ర నిషేధం
చేతబడులు, ఇతర మూఢనమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు చేసింది. ఈ ఆర్డినెన్సుపై గవర్నర్ కె.శంకర నారాయణన్ శనివారం సాయంత్రం సంతకం చేశారు. దీంతో ఇది వెంటనే అమలులోకి వచ్చినట్లయింది. ఇకపై చేతబడులు చేయడం లాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తారు. దేశంలోనే ఇలాంటి ఆర్డినెన్సు తెచ్చిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. త్వరలోనే దీనికి చట్టరూపం కూడా తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని ప్రకారం మూఢనమ్మకాలతో చేతబడి, బాణామతి లాంటివి చేస్తే వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ప్రముఖ హేతువాది, ఉద్యకర్త నరేంద్ర దభోల్కర్ ఈ తరహా చట్టం కోసం జీవితాంతం పోరాడారు. గత వారం ఆయనను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మహారాష్ట్ర సర్కారు నష్టనివారణ చర్యగా ఈ చట్టం చేసినట్లు చెబుతున్నారు. బుధవారం నాడు రాష్ట్ర మంత్రి వర్గం ఈ ఆర్డినెన్సును రూపొందించి పంపగా, శనివారం సాయంత్రం గవర్నర్ దానిపై సంతకం చేశారు.