కర్నూలు: మానవుడు సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా.. సమాజంలో అట్టడుగున ఉన్న మూఢనమ్మకాలు ఏమాత్రం మారడం లేదు. తాజాగా ఈ అంధవిశ్వాసాలకు అభంశుభం తెలియని తొమ్మిది నెలల పసికందు బలైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో క్షద్రపూజల పేరిట తొమ్మిది నెలల శిశువును నరబలి ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. హంద్రీనీవ కాల్వ వద్ద చిన్నారి తల, మొండెం లభ్యమయ్యాయి. అంధవిశ్వాసాలకు చిన్నారిని బలి ఇవ్వడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నది.