child killed
-
నేనేం పాపం చేశాను నాన్నా?
మహబూబ్‌నగర్ క్రైం: భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న ఆక్రోశంతో తన ఆరేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పాలకొండ తండాకు చెందిన నేనావత్ శివ, శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. కొంతకాలానికి శివ మద్యానికి అలవాటుపడి తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట భార్యను కొట్టడంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో శివ భార్య పుట్టింటికి వెళ్లి పెద్ద కూతురు కీర్తన (6) ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 4న కీర్తనను శివ కొట్టాడు. దీంతో బాలిక అమ్మ కావాలని మారాం చేసింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఏమాత్రం కనికరం లేకుండా కూతురు ముక్కు మూసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పాప పలకడం లేదని ఆటోలో జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే కీర్తన మృతి చెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై పోలీసులు హత్య కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కుమార్తెను వేధిస్తున్నాడని.. 9 ఏళ్ల బాలుడి దారుణ హత్య
ప్రొద్దుటూరు క్రైం/రాజుపాళెం : పిల్లలు ఆడుకుంటున్న సమయంలో నెలకొన్న చిన్నపాటి గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పసిపిల్లలే తగవే కదా అని పెద్దలూ సంయమనం పాటించలేదు.. చిలికి చిలికి గాలివానగా మారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఫలితంగా బాలిక తండ్రి దస్తగిరి పసి బాలుడు తనీష్‌రెడ్డి(9)ని గొంతు నులిమి దారుణంగా హత మార్చాడు. నిందితుడు సాయదుగాల పెద్ద దస్తగిరిని రాజుపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు అరెస్ట్ వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. రాజుపాళెం మండలం, వెంగళాయపల్లెకు చెందిన గుద్దేటి సంజీవరెడ్డి కుమారురుడు తనీష్‌రెడ్డి ఈ నెల 7న మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. స్థానికంగా, బంధువుల ఊళ్లలో గాలించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు అదే రోజు రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి వెంగళాయపల్లెలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న కంప చెట్లలో పాడుబడిన రాళ్ల తొట్టిలో బాలుడు శవమై కనిపించాడు. ఐదు బృందాలతో దర్యాప్తు.. తనీష్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలతో ఐదు బృందాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాటు చేశారు. అమావాస్య ముందు రోజే బాలుడు కనిపించకుండా పోవడంతో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని, నరబలి జరిగి ఉంటుందని మండలంలో ప్రచారం జరిగింది. రెండు డాగ్‌స్క్వాడ్ బృందాలతో సంఘటనా స్థలంలో దర్యాప్తు చేశారు. గ్రామంలోని అనుమానితులందరినీ విచారించారు. దర్యాప్తులో భాగంగా రెండు కుటుంబాల మధ్య నెలకొన్న మనస్పర్థలతో బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. 7వ తేదిన సాయంత్రం తనీష్‌రెడ్డిని దస్తగిరి తన పశువుల పాకలో గొంతు నులిమి చంపాడు. అదే రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత బాలుడి మృతదేహాన్ని అంకాలమ్మ ఆలయం సమీపంలో పడేశాడు. తనీష్‌రెడ్డి, దస్తగిరి కుమార్తె ఇద్దరూ రోజూ ఆడుకునే వారు. ఆడుకునే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు వచ్చేవి. ఈ విషయమై ఇరువురి పెద్దలు పలుమార్లు గొడవ కూడా పడ్డారు. ఇలా రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు కొంత కాలంగా ఉండేవి. ఎన్నిసార్లు చెప్పినా తనీష్‌రెడ్డిలో మార్పు రాలేదని, తన కుమార్తెను వేధిస్తున్నాడని భావించిన దస్తగిరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం నిందితుడ్ని వెంగళాయపల్లెలో రూరల్ సీఐ మధుసూదన్‌గౌడ్, రాజుపాళెం ఎస్ఐ కృష్ణంరాజునాయక్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. దస్తగిరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వివరించారు. నరబలి కాదు: డీఎస్పీ తన కుమార్తెను వేధించడం వల్లనే తనీష్‌రెడ్డిని దస్తగిరి హత్య చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. అంతేగానీ మూఢ నమ్మకాల కారణంగా క్షుద్రపూజలు, నరబలి లాంటివి జరగలేదని డీఎస్పీ అన్నారు. సమావేశంలో సీఐ రూరల్ సీఐతో పాటు రాజుపాళెం ఎస్ఐ కృష్ణంరాజునాయక్, చాపాడు ఎస్ఐ సుబ్బారావు, రూరల్ ఎస్ఐలు శివశంకర్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
గొంతులో మేకు ఇరుక్కుని బాలుడి మృతి
గాంధారి: గొంతులో ఇనుప మేకు ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన రాధాబాయి, భాస్కర్‌రావుల కుమారుడు రిత్విక్(3) బుధవారం రాత్రి ఆడుకుంటూ నోట్లో ఇనుపమేకు పెట్టుకున్నాడు. అది గొంతులోకి జారిపోవడంతో శ్వాస ఆడక తీవ్రంగా ఏడవడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గాంధారి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి సిఫారసు చేయడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. -
కన్నకొడుకు ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ
నాగర్‌కర్నూల్ క్రైం: కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు గొడవ పడడమే కాకుండా నవమాసాలు కనిపెంచుతున్న పసి బిడ్డకు విషగుళికలు కలిపిన నీరు తాగించి చంపేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లికి చెందిన రాములు– రాములమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు చింటూ(4) ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ సోమవారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారగా విష గుళికలు కలిపిన నీటిని చింటూతో తాగించారు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆయన తాత చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చింటూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. చింటూ పుట్టుకతోనే వికలాంగుడు. ఆ కారణంతోనే బాలుడికి విషగుళికల నీరు తాగించి చంపారా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
మరో ప్రాణం పోయింది!
ఈ గ్రామ దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ⇒ కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాలపై కథనాలు ⇒ అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ⇒ ఇప్పుడు బాలుడి మృతితో కదలిక ⇒ బుధవారం గువ్వలగుట్టను సందర్శించనున్న అధికారులు ⇒ కిడ్నీ బాధితులపై ఆరా.. నీటి శాంపిళ్లను పరీక్షించాలని నిర్ణయం చందంపేట (దేవరకొండ): కన్న తల్లి దండ్రుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.. వారి కళ్ల ముందే కొడుకు ప్రాణం గాలిలో కలసిపోయింది.. ఎంత మొరపెట్టుకున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా.. స్పందించని ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చిన్నారి ప్రాణం బలైపోయింది.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన మేరావత్ లక్ష్మణ్ (12) మంగళవారం కన్నుమూశాడు. గువ్వలగుట్టలో జనం కిడ్నీ వ్యాధుల కారణంగా వరుసగా మృతి చెందుతున్న వైనంపై, చావు బతుకుల్లో ఉన్న లక్ష్మణ్ పరిస్థితిపై ‘జనం పరిస్థితి అధ్వానం.. ఇది మన ఉద్ధానం’పేరిట పక్షం రోజుల కింద ‘సాక్షి’మాన వీయ కథనాన్ని ప్రచురించింది. అక్కడి జనం పడుతున్న బాధలను వివ రించింది. కానీ అధికార యంత్రాంగంలో స్పందన కనిపించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మణ్ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టను సందర్శించాలని నిర్ణయించింది. ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా..గువ్వలగుట్ట రోగాల పుట్టగా మారి పోతోంది. కిడ్నీ వ్యాధులు మెల్లమెల్లగా ఆ గ్రామాన్నే కబళించేస్తున్నాయి. ఇక్కడి నీటిలోని రసాయనాల కారణంగా ఈ దుస్థితి తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ గ్రామం దుస్థితిపై ‘సాక్షి’ఎన్నో కథనాలను ప్రచు రించింది. ఆరు నెలల క్రితం ‘గువ్వలగుట్ట.. రోగాల పుట్ట’అన్న శీర్షికన గువ్వలగుట్టలో కిడ్నీ వ్యాధి మరణాలు, బాధితుల దీన స్థితిపై కథనాన్ని ప్రచురించింది. కిడ్నీ వ్యాధుల బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని వివరించింది. వ్యాధులతో బాధపడుతూ, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేనివారి ఆందోళనను తెలిపింది. వారితోపాటు లక్ష్మణ్ పరిస్థితిని, తల్లి దండ్రుల ఆవేదనను కూడా వివరించింది. అయినా అధికార యంత్రాంగంలో స్పందన కానరాలేదు. సురక్షిత నీరు అందేదెన్నడు? గువ్వలగుట్టకు అతి సమీపంలోనే ఉన్న కృష్ణా బ్యాక్‌వాటర్ నుంచి మంచినీటిని ఈ గ్రామానికి అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ట్యాంకులు నిర్మించి, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పను లను మొదలుపెట్టి.. అర్ధంతరంగా వదిలే శారు. దాదాపు ఏడాదిగా కదలిక లేదు. నేడు గువ్వలగుట్టకు వైద్యారోగ్య శాఖ బృందం నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్టను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం సందర్శించనుంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి జనం అవస్థలపై కథనాలు, మంగళవారం లక్ష్మణ్ అనే బాలుడి మృతి నేపథ్యంలో.. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టకు చేరుకుని కిడ్నీ వ్యాధుల బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుని.. ఇక్కడి బోరుబావులు, నీటి పంపులను పరిశీలిస్తారు. నీటి శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపుతారు. చీఫ్ వాటర్ అనలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు, సీనియర్ అనాలసిస్ట్ డాక్టర్ కిరణ్మయి ఈ బృందంలో ఉంటారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
కెరమెరి(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కుమ్రం భీం జిల్లాలోని కెరమెరి మండలం గోండ్ కరం జివాడ గ్రామానికి చెందిన సిడాం బ్రహ్మ (11)ను బుధవారం వేకువజామున పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు సిడాం యాదోరావు, దుర్పాబాయిలు వెం టనే కెరమెరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుడు సుంకన్న వైద్యం చేయ కుండానే ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. 108 వాహనం లేకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్తుండగా బ్రహ్మ మృతి చెందాడు. దీంతో కుటుం బీకులు, గ్రామస్తులు పీహెచ్సీ తిరిగి వెళ్లి గేటు ఎదుట మృత దేహంతో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందిని బయటికి వెళ్ల కుండా అడ్డుకు న్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం వచ్చి కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వ డంతో కుటుంబీకులు శాంతించారు. బ్రహ్మ సిర్పూర్(యూ) పంగిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. -
కూల్ డ్రింక్ అనుకుని..
పురుగు మందు తాగి బాలుడి మృతి కట్టంగూర్: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి బాలుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ముశం నరేశ్ కూరగాయల చెట్లకు మందును పిచికారీ చేసి మిగిలిన మందును కూల్‌డ్రింక్ బాటిల్లో పోసి ఇంట్లో పెట్టాడు. నరేశ్ కుమారుడు భాను ప్రసాద్ (5) బుధ వారం ఇంట్లో ఉన్న ఆ బాటిల్‌ను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగాడు. కొద్దిసేపటికే బాలుడు కడుపులో అదో మాదిరిగా ఉంద ని తండ్రితో చెప్పాడు. దీంతో తండ్రి వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించటంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్
యాడికి (తాడిపత్రిరూరల్) : యాడికి మండలం బొయిరెడ్డిపల్లిలో సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ప్రసాద్, కుళ్లాయమ్మ దంపతుల కుమారుడు నాగచైతన్య(2) ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. వెనుకవైపు నుంచి ట్రాక్టర్ చిన్నారిపైకి దూసుకెళ్లింది. దీంతో నాగచైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ కత్తిశ్రీనివాసులు సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ నారాయణస్వామి, యజమాని ఆదినారాయణలపై కేసు నమోదు చేసుకున్నారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన వాహనదారులను హెచ్చరించారు. -
పాము కాటుతో చిన్నారి మృతి
పుట్లూరు: కడవకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి పాము కాటుతో శృతి (5) అనే చిన్నారి మృతి చెందింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అడివన్న, లక్ష్మదేవిలు గమనించిన కన్నీటిపర్యంతమైయ్యారు. శృతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎంఈఓ నాగరాజు, ఉపాద్యాయులు విద్యార్థిని మృతికి సంతాపం తెలిపారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
గూడూరు : అడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గూడూరు రెండో పట్టణంలోని అరవ దళితవాడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నాగరాజు, పువ్వాయి దంపతుల రెండో కుమార్తె వైష్ణవి (9) మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు వీధులో ఆడుకుంటుంది. అక్కడే ఓ ఆటోకు పెయింట్ వేస్తున్న వారు విద్యుత్ పెయింట్ మిషన్‌ను ఆటో ఉంచారు. ప్రమాదశావత్తు పెయింట్ మిషన్‌కు ఉన్న విద్యుత్ వైర్లు స్లీవ్‌లు తెగి ఆటోకు అతుక్కోవడంతో ఆటోకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ ఆటోను పట్టుకోవడంతో అక్కడక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలపాలైన చిన్నారి తనూశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తనూశ్రీ తండ్రి పేరు అచ్యుతరావు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా. స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో చిన్నారి మృతి
సూర్యాపేట(నల్లగొండ): డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్రావణి(7) వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. -
వైద్యం అందక చిన్నారి మృతి
సీతారామపురం : మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన గొల్లపల్లి దావీదు, నిర్మల దంపతుల ఏడాది చిన్నారికి సకాలంలో వైద్యం అందక శనివారం మృతి చెందింది. చిన్నారి న్యూమోనియా కారణంగా శనివారం అస్వస్థకు గురైంది. ఊపిరి ఆడకపోవడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కyì ఆక్సిజన్ లేకపోవడంతో సంబంధిత వైద్యులు వింజమూరు వెళ్లాల్సిదింగా తల్లిదండ్రులకు తెలిపారు. ఉదయగిరి నుంచి 108 వాహనానికి సమాచారం అందించినా వారు ఎంత సేపటికీ స్పందించపోవడంతో ప్రైవేట్ వాహనంలో వింజమూరుకు తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది సేపటికే పాప మృతి చెందింది. ఆక్సిజన్ అందటం ఆలస్యం జరగడం వల్లనే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మారుమూల తమ ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వలనే తమ పాప మృతి చెందిందని వాపోయారు. వైద్యం కోసం 50 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితుల్లోనే పాప మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి మృతి
తోటపల్లిగూడూరు : స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం కృష్ణారెడ్డిపాళెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాళెంకు చెందిన కటకం రాజా, పావని దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరి ఏడాది వయసున్న ఆఖరి కుమారుడు ఈశ్వర్ ఇంట్లో నుంచి దోగాడుతూ రోడ్డుపైకి వచ్చాడు. శుక్రవారం తోటపల్లిగూడూరు ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన వ్యాన్ గ్రామంలోకి వచ్చింది. పిల్లలను దింపి వెనుదిరుగుతున్న సమయంలో రోడ్డుమీదకు వచ్చిన చిన్నారిని గమనించకపోవడంతో వ్యాన్ చిన్నారిపై ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందంతో రాజా, పావని దుఃఖసాగరంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
-
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
జగిత్యాల రూరల్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గామ్ గ్రామంలో విషాదం అలముకుంది. ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. జలేందర్, సుమంత దంపతుల కుమార్తె సుష్మిత(3) బుధవారం ఉదయం ఆడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటితొట్టిపైకి ఎక్కి ఆడుకుంటూ అందులో పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అరగంట సేపు తల్లిదండ్రులు తమ కూతురు కోసం వెతకగా చివరికి ఆలయం వద్ద నీటితొట్టిలో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. -
అయ్యో..! అవంతిక..!
► చిరు నిర్లక్ష్యంతో చిన్నారి దుర్మరణం ► రివర్స్ తీస్తుండగా బాలికను తొక్కిన ట్రాక్టర్ ► తల పగిలి మృతి చెందిన మూడేళ్ల బాలిక తిమ్మాపూర్ : తండ్రి ఏమరుపాటుతో తన మూడేళ్ల కూతురుకి అప్పుడే నూరేళ్లు నిండారుయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె దూరం కావడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటారుు. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన వేల్పుల రమేష్ అదే గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే రమేష్ మంగళవారం ట్రాక్టర్ని తన ఇంటి ముందు పెట్టుకున్నాడు. బుధవారం ఉదయం చెడిపోయిన బ్యాటరీని తొలగించి వేరే బ్యాటరీ బిగించి వెనక్కి తీస్తున్నాడు. ఆయన కూతురు అవంతిక(3) ట్రాక్టర్ వెనుక బహిర్భూమికి కూర్చుతుంది. ఇది గమనించని రమేష్ ట్రాక్టర్‌ను వెనక్కు తీయడంతో అవంతికపై నుంచి వెళ్లగా ఆమె తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వేల్పుల రమేష్, స్వప్న దంపతులకు అవంతిక ఒక్కతే కూతురు. -
పసికందు నరబలి!
కర్నూలు: మానవుడు సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా.. సమాజంలో అట్టడుగున ఉన్న మూఢనమ్మకాలు ఏమాత్రం మారడం లేదు. తాజాగా ఈ అంధవిశ్వాసాలకు అభంశుభం తెలియని తొమ్మిది నెలల పసికందు బలైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో క్షద్రపూజల పేరిట తొమ్మిది నెలల శిశువును నరబలి ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. హంద్రీనీవ కాల్వ వద్ద చిన్నారి తల, మొండెం లభ్యమయ్యాయి. అంధవిశ్వాసాలకు చిన్నారిని బలి ఇవ్వడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. -
వాగులో పడి చిన్నారులు మృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండల కేంద్రంలో బుధవారం ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు వాగు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మండల కేంద్రానికి చెందిన వంతాల సత్తిబాబు, సీతమ్మ దంపతులకు నానిబాబు(4), మేఘన(2)అనే పిల్లలున్నారు. దంపతులు బుధవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లారు. దాంతో ఇద్దరు పిల్లలు సత్తి బాబు తల్లి నీలమ్మ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికేందుకు నీలమ్మ సమీపంలోని కొండవాగు వద్దకు వెళ్తూ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఆమె దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమై ఉండగా... చిన్నారులిద్దరూ ఆడుకుంటూ నీటిలో పడి మునిగిపోయారు. నీలమ్మ కొద్దిసేపటి తర్వాత చూసే సరికే పిల్లలిద్దరు కనిపించకపోవడంతో కంగారు పడి పరిసర ప్రాంతాలలో గాలించింది. కానీ ప్రయోజనం లేకపోయే సరికి వాగులో వెతికింది. ఆ క్రమంలో నీటిలో పడి ఉన్న చిన్నారుల మృతదేహలను గుర్తించి కేకలు వేసింది. దాంతో స్థానికులు వచ్చి వాగులో పడి ఉన్న మృతదేహలను వెలికి తీశారు. -
పుష్కరయాత్రలో అపశ్రుతి
కారును ఢీకొన్న లారీ లారీ డ్రైవరు,చిన్నారి దుర్మరణం మరో ముగ్గురికి గాయాలు అనకాపల్లిరూరల్ : పుష్కరయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాఫీగా యాత్రకు కారులో వెళ్తున్న ఆ యాత్రికులను విధి విషాదంలో ముంచింది. లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. ఓ డ్రైవరుని, ఓ చిన్నారినీ బలితీసుకుంది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. వివరాలివి. సింహాచలం అడవివరానికి చెందిన కామినేని కిషోర్ కుటుంబం గోదావరి పుష్కరాలకు బుధవారం వేకువ జామున కారులో బయలుదేరింది. ఇక్కడికి సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ ఫ్లైవుడ్ కంపెనీకి సమీపంలో మహాసిమెంట్ లోడుతో ఎలమంచిలి నుంచి విజయనగరం వెళుతున్న లారీ దూసుకొచ్చింది. కారుని ఢీకొట్టి రోడ్డుపక్కనున్న చెట్టుపైకి దూసుకుపోయింది. లారీ కేబిన్ నుజ్జయింది. దీంతో లారీ డ్రైవరు అడ్డాల రామయ్య దొర(25) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన కామినేని కిషోర్, అతని భార్య కామినేని రజని, కుమార్తెలు శివప్రియ (12),మౌనిక(11)లను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యసేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చిన్నారి శివప్రియ అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. లారీ డ్రైవర్‌ది రాంబిల్లి మండలం కొత్తూరు పంచాయతీ మామిడివాడ గ్రామం. అతనికి భార్య శివశ్రీ, తండ్రి ఉన్నారు. కర్నాటకలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చి మహా సిమెంట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. సబ్బవరం ఎస్ఐ చక్రధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూటి కోసం వస్తే..కడుపుకోత
గోడ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. ఇంటిగోడ కూలి వారి ఇద్దరు పిల్లలు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో తల్లిదండ్రులు బయటపడ్డారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి చెందిన చింతకుంట రాజు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీగా పని చేస్తున్నాడు. రాజు తన భార్య జ్యోతి, కుమారుడు సాయిచరణ్(ఏడాదిన్నర), కుమార్తె నవ్య(రెండున్నర)లను తీసుకొని గత ఆదివారం(29న) బోరబండ సైట్-3లోని వీకర్స్ సెక్షన్ దేవయ్యబస్తీలో వాంబే పథకంలో నిర్మించిన ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. సోమవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటి మధ్యలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గోడ పక్కనే పడుకుని ఉన్న చిన్నారులు సాయిచరణ్, నవ్య తలలకు తీవ్రగాయాలు కాగా... రాజు, జ్యోతిలకు స్వల్ప గాయాలయ్యాయి. గోడ కూలి పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉంటున్న వారు వచ్చి గాయాలకు గురైన చిన్నారులను బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. స్వల్పగాయాలకు గురైన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ రమణగౌడ్, ఎస్ఐ లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీరించారు. చిన్నారుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాజు,జ్యోతి దంపతుల మధ్య రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గోడ కూలినప్పుడు పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్లో ఉండే యువకులు వెళ్లి తలుపు తట్టగా చాలా సేపటి వరకూ తెరవకపోవడం, పిల్లలకు తీవ్రగాయాలై, తల్లిదండ్రులకు స్పల్పగాయాలు కావడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలిన గోడ అతి పురాతనమైందని.. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గుప్తనిధుల కోసం చిన్నారి హత్య
* తల్లిని బంధించి, పాప గొంతునులిమి * చంపిన దుండగులు * మృతదేహం వద్ద నిమ్మకాయలతో పూజలు యాలాల: గుప్త నిధుల కోసం ఓ చిన్నారిని బలిచ్చారు. తల్లిని తాళ్లతో బంధించి పాప గొంతు నులిమి ఈ దారుణానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పల లక్ష్మి, భీములు దంపతులకు పూజ(1) అనే కుమార్తె ఉంది. అదే గ్రామానికి చెందిననర్సింహులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టేవాడు. గ్రామంలో పశువులను కూడా అపహరించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో నర్సింహులు మరో వ్యక్తితో కలసి లక్షి్ష్మ ఇంట్లోకి చొరబడి ఆమెను తాళ్లతో బందించారు. ఆ తర్వాత లక్షి్ష్మ తలపై రాయితో గట్టిగా మోదారు. అనంతరం నిద్రిస్తున్న పూజను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి మెడలో ఉన్న దిష్టిదారంను గొంతుకు బిగించి చంపేశారు. పాప మృతదేహంపై నిమ్మకాయలు, పసుపు, బియ్యాన్ని మంత్రించి పూజలు చేశారు. లక్ష్మిని కూడా బయటకు తీసుకొచ్చి వాకిట్లో పడుకోబెట్టారు. ఇంటికి దాదాపు పది అడుగుల దూరంలో మంటపెట్టి కొన్ని నిమ్మకాయలను కాల్చేసి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి లక్షి్ష్మని లేపారు. రాత్రి జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్న ఆమె గ్రామస్తులకు వివరిం చింది. గుప్తనిధుల కోసమే చిన్నారిని బలిఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తల్లిని కట్టేసి... చిన్నారిని బలిగొన్నాడు
-
పుత్రశోకం
విద్యుత్‌షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతి మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు పామర్రులో విషాదం పామర్రు : చేపల కోసం వెళ్లకుండా ఉన్నా... తమ పిల్లలు దక్కేవారేమో అంటూ మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. హై ఓల్టేజీ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్న గాలిపటం తీయబోయిన నల్లబోతుల ఏసురాజు, నల్లబోతుల జాన్‌బాబు, భోగిన సురేష్‌లు మరణించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పామర్రు పట్టణం 8వ వార్డులోని రావి హరిగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు ఏసురాజు(14), రెండో కుమారుడు జాన్‌బాబును స్థానిక జెడ్పీ పాఠశాలలో చేర్పించారు. అయినా వారు స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే కాలక్షేపం చేస్తున్నారు. మూడో కుమారుడు జక్రయ్య స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భోగిన వీరయ్య, తిరుపతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కడే కుమారుడు(సురేష్) ఉన్నారు. సురేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాన్వెంట్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాలకు చేపలవేటే జీవనాధారం. పెద్దలు రోజూ ఉదయాన్నే చేపల వేటకు వెళ్తుంటారు. యథావిధిగా శుక్రవారం ఉదయం కూడా వెళ్లగా.. బిడ్డల మృతి విషయం తెలియడంతో వేటనుంచి తిరిగి వచ్చిన వారు మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిరునవ్వుతో పంపించారు.. నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు ఈ దుర్ఘటనలో మృతిచెందడంతో వారు పడుతున్న వేదన వర్ణనాతీతం. తాము ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు చిరునవ్వుతో పంపారని, ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఒక్కగానొక్కడు.. ముగ్గురు కుమార్తెల మధ్య ఒక్కడే కొడుకు కావడంతో సురేష్‌ను అతడి తల్లిదండ్రులు వీరయ్య, తిరుపతమ్మ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. విగతజీవిగా మారిన సురేష్‌ను చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తరువాత తేరుకుని గుండెలవిసేలా రోదిం చడం అక్కడివారి హృదయాలను కలచివేసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కల్పన విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలియగానే పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కల్పన మాట్లాడుతూ చిన్నారుల మృతికి చింతిస్తున్నామని, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేలా కృషి చేస్తామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డి.వై.దాసు, టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, సీఐ కోసూరు ధర్మేంద్ర, పామర్రు ఎస్ఐ మోర్ల వెంకటనారాయణ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పాపం.. పసివాళ్లు!
పాపం.. లోకం తెలియని పసివాళ్లు. చదువులమ్మ తోటలో ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగొలిపే సంగతులతో అలరించే పువ్వులు. అమ్మానాన్నల ఆవేశాగ్నికి ఆహుతయ్యారు. ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కాలినగాయాలతో ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా.. అమ్మ కోసం ఆరాటపడిన ఆ చిరునవ్వులు బోసిపోయాయి. కొడంగల్ రూరల్ / మహబూబ్‌నగర్ క్రైం / తిమ్మాజీపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొడంగల్‌కు చెందిన గొల్ల భీమమ్మ, బాల్‌రాజ్ దంపతులకు కుమార్తెలు నందిని (6), విజయలక్ష్మి (4), ఎనిమిది నెలల శ్రీలక్ష్మి ఉన్నారు. సుమారు నాలుగేళ్లక్రిత బతుకుదెరువు నిమిత్తం తిమ్మాజీపేట మండలం మరికల్‌కు వలస వెళ్లారు. నందిని జడ్చర్ల పట్టణంలోని న్యూ మెమోరియల్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతుండగా విజయలక్ష్మి తల్లివద్దే ఉండేది. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో తాగుడుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య సోమవారం ఉదయం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది. గ్రామస్తులు గమనించి వెంటనే నలుగురినీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చి కిత్స పొందుతూ అదే అర్ధరాత్రి విజయలక్ష్మి, నందిని మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళవా రం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులు అనుకోని సంఘటనతో విగతజీవులుగా మారడంతో కొడంగల్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ బలరాంనాయక్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
తాగిన మత్తులో చిన్నారిని కాలితో తన్నిన ఖాకీ
-
తాగిన మత్తులో చిన్నారిని కాలితో తన్నిన ఖాకీ
మెదక్ జిల్లా దుబ్బాక పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పాషా దౌర్జనానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న అతగాడి దౌర్జన్యానికి చిన్నారి నిఖిత ప్రాణాలు కోల్పోయింది. దాంతో నికిత బంధువులు దుబ్బాక పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. నిఖిత బంధువుల కథనం ప్రకారం...ఏఎస్ఐ పాషా భూవివాదం పరిష్కరించేందుకు నిఖిత తండ్రి కోసం ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో నిఖిత తండ్రి ఇంట్లో లేకపోవడంతో అదే విషయాన్ని నికిత తల్లి పాషా వెల్లడించింది. దాంతో అతడు ఆగ్రహంతో నికిత తల్లిపై చెయ్యి చేసుకున్నాడు. అంతే కాకుండా తాగిన మత్తులో కాలితో తన్నడంతో 6 నెలల చిన్నారి నిఖిత తీవ్ర గాయంతో మృతి చెందింది. పాషా వల్లే తమ నికిత మరణించిందని ఆ చిన్నారి తల్లితండ్రులు, బంధువులు దుబ్బాక పీఎస్ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పాషా పరారీలో ఉన్నాడు. -
దుబ్బాక ఏఎస్ఐ దౌర్జన్యం: చిన్నారి మృతి!
-
తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు పామర్రు, న్యూస్‌లైన్ : పశువుల కోసం ఏర్పాటుచేసిన కుడితి తొట్టి ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ పాప తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని పెదమద్దాలి అంబేద్కర్ కాలనీలో ఈ విషాదం ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కలపాల కిషోర్, స్వరూపలకు కుమారుడు శ్యామ్, కుమార్తె సౌమ్య (సంవత్సరం దాటి ఐదు నెలలు) ఉన్నారు. ఆదివారం ఉదయం కిషోర్ పొలం పనులకు వెళ్లాడు. చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా స్వరూప ఇంట్లో వంట పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆడుకుంటున్న సౌమ్య పక్కనే పశువుల కోసం ఏర్పాటు చేసిన కుడితి తొట్టి వద్దకు చేరుకుంది. ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి ఈ విషయాన్ని తల్లికి తెలుపగా, ఆమె వచ్చేసరికి సౌమ్య స్పృహ కోల్పోయింది. వెంటనే చిన్నారిని మోపెడ్‌పై వైద్యశాలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సౌమ్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె కళ్లముందే ఆడుకుంటూ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిన్నారిని బలిగొన్న కారు
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకూ కళ్ల ముందే కదలాడిన ఏడాదిన్నర బాలుడిని మృత్యువు కారు రూ పంలో కబళించింది. అప్పటికే ఓ వాహనాన్ని ఢీకొట్టి, తప్పిం చుకొనే యత్నంలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి.. ఇంటి ముందు కూర్చున్న ఆ బాలుడిని ఢీకొట్టాడు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి తానాజీనగర్‌కు చెందిన పి.అశోక్ కుమార్, దీపిక దంపతులు ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు పునీత్ ఇంటి ముందు కూర్చొన్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో.. సునీల్‌గౌడ్ అనే వ్యక్తి తన కారుతో వేగం గా వచ్చి ఢీకొట్టాడు. దాంతో బాలుడి ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు మలద్వారం నుంచి పేగులు బయటికి వచ్చాయి. కుటుంబసభ్యులు చిన్నారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, అశోక్‌కుమార్ ఇంటికి ఎదురింట్లోనే సునీల్ ఉంటాడని, సునీల్ అంతకుముందే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడని, ఆ ఆటోవాలా వెంబడించడంతో వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.