కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి బాలుడు మృతిచెందాడు.
పురుగు మందు తాగి బాలుడి మృతి
కట్టంగూర్: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి బాలుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ముశం నరేశ్ కూరగాయల చెట్లకు మందును పిచికారీ చేసి మిగిలిన మందును కూల్‌డ్రింక్ బాటిల్లో పోసి ఇంట్లో పెట్టాడు. నరేశ్ కుమారుడు భాను ప్రసాద్ (5) బుధ వారం ఇంట్లో ఉన్న ఆ బాటిల్‌ను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగాడు.
కొద్దిసేపటికే బాలుడు కడుపులో అదో మాదిరిగా ఉంద ని తండ్రితో చెప్పాడు. దీంతో తండ్రి వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించటంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.