ఎండిన పంట చూసి.. ఓ అన్నదాత ప్రాణాలు విడిచాడు..
ఎండిన పంట చూసి.. ఓ అన్నదాత ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా మఠం పల్లి లో జరిగింది. వివరాలు.. మఠంపల్లి మండలం కాలువపల్లితండాలో బానోత్ రాంలాల్(26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో వేసిన పంట ఎండిపోవడం, అప్పులు తీర్చే మార్గం కనపడక తీవ్ర మనస్తాపం చెందాడు. ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంలాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.