ఎల్లయ్య మృతదేహం
చింతపల్లి (దేవరకొండ) : పురుగుల మందు తాగి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మండల పరిధిలోని నసర్లపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నసర్లపల్లి గ్రామానికి చెందిన నల్ల ఎల్లయ్య(35) తమకున్న 5ఎకరాల పొలంలో సంవత్సరం పత్తి పంటను సాగు చేశాడు. సాగు పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ.3లక్షల అప్పుతెచ్చాడు. దిగుబడి రాక పెట్టుబడులు కూడా వెళ్లలేదు.
అప్పు తీర్చే మార్గం కనబడక మనస్తాపం చెంది శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స దేవరకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment