insecticide
-
నన్ను పెళ్లి చేసుకో.. లేదా పురుగు మందు తాగు..
బోయినపల్లి (చొప్పదండి): నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో.. లేదంటే పురుగు మందు తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో క్రిమిసంహారకమందు తాగిన ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంట తెచ్చిన పురుగు మందు డబ్బా చూపిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించా డు. సతీశ్ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు. -
చదువులో రాణించలేకపోతున్నానని విద్యార్థిని ఆత్మహత్య
డోర్నకల్: చదువులో రాణించలేకపోతున్నానని మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. బొడ్రాయితండాకు చెందిన తేజావత్ శ్వేత(19) ఖమ్మంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలవడం, ఇటీవల జరిగిన ఎస్ఐ అర్హత పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆవేదన చెందింది. చివరకు 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. దీంతో శ్వేతను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన ఆన్లైన్ బెట్టింగ్
ధర్మసాగర్: ఆన్లైన్ గేమ్‌లో బెట్టింగ్ పెట్టి మోసపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్ శివారులో సోమవారం జరగగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన పెసరు రామకృష్ణారెడ్డి (26) రెండేళ్లుగా హనుమకొండలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ కమ్రంలో ఆన్లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్ కట్టి దాదాపు రూ.లక్ష వరకు నష్టపోయాడు. అతడికి మళ్లీ ఓ గేమ్ లింక్ రావడంతో ఆ గేమ్‌లో దాదాపు రూ.6లక్షలకుపైగా క్యాష్ ,క్రెడిట్‌కార్డుల ద్వారా పెట్టాడు. ఆన్లైన్ గేమ్‌ల మూలంగా సంపాదించిన డబ్బుతోపాటు అప్పులు కూడా చేసి నష్టపోయాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరుడు రాజేందర్‌రెడ్డి గ్రామంలో వెతుకుతూ ఉండగా రాంపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ధర్మసాగర్ పోలీసులు తెలిపారు. -
పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని
తలమడుగు (ఆదిలాబాద్): పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు, ఇక తనకు పెళ్లి కాదేమోనని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చెన్నల సాయి కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. విషయం తెలిసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడగా, వాటిని చెడగొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనీల ఫిబ్రవరి 28న ఇంట్లోని యాసిడ్, సూపర్‌వాస్మాల్ తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. శ్రీనీల తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు) -
బీఏఎస్ఎఫ్ కొత్త ఉత్పాదన!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న బీఏఎస్ఎఫ్ ఎక్స్‌పోనస్ పేరుతో కొత్త ఉత్పాదనను ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఫార్ములేషన్ బ్రోఫ్లానిలైడ్తో తయారైన ఈ పురుగు మందు గొంగళి పురుగులు, మిరపలో వచ్చే కఠినమైన చీడపీడలను నియంత్రిస్తుందని కంపెనీ తెలిపింది. సోయాబీన్, కంది, మిరప, టమాట, వంగ, క్యాబేజి లాంటి పంటలకు సమర్థవంతంగా, సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని వివరించింది. -
ప్రకృతి వ్యవసాయం వైపు పయనం
వేపాడ: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆ ధారపడాల్సి వస్తోంది.అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అలాగే మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరు గుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2016లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 2016– 17లో 10 క్లస్టర్లలో 50 గ్రామాల్లో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. 2021–22 సంవత్సరంలో 61 క్లస్టర్లలో 34 మండలాల్లో 309 గ్రామాల్లో 41,761 మంది రైతులతో 18,382 హెక్టార్లల్లో ప్రకృతి వ్యవసాయం చేయించారు. 2022–23 సవత్సరంలో 64, 945 మంది రైతులతో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఖరీఫ్‌లో 49వేల మంది రైతులతో 57,700 ఎ కరాల్లో నవధాన్యాల సాగుకు సిద్ధమయ్యారు. విస్తృతంగా అవగాహన సుస్థిర వ్యవసాయకేంద్రం, ప్రకృతి వ్యవసాయకేంద్రం, ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణకు రసాయన పురుగుమందులకు బదులు పొలొల్లానే ఖర్చు లే కుండా ఘన, ద్రవ జీవామృతాలు, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, జిల్లేడు ద్రావణం, మీనామృతం, తదితరాలను తయారీ చేయిస్తున్నారు. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నివారణకు పసుపు, తెలుపు పళ్లాలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయిస్తున్నా రు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు పెట్టుబడి కూడా ఆదా అవుతుండడంతో రైతులు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. రాయితీపై విత్తనాలు భూమిలో సేంద్రియ కర్బనశాతం పెంచేందుకు ఖరీఫ్ ప్రధాన పంట సాగుకు ముందు నవధాన్యాలను పచ్చిరొట్ట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మినుములు, పెసర, బొబ్లర్లు, చిక్కుడు, ను వ్వులు, ఆముదం, వేరుశనగ, ధనియాలు, మెంతులు, ఆవాలు, రాగులు, మొక్కజొన్న, కొర్రలు, సామాలు, ఆనస, దోస, టమాటా, ముల్లంగి, బంతి తదితర విత్తనాలను, పచ్చిరొట్ట జాతులైన కట్టె జనుము, పిల్లిపెసర, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. 65వేల ఎకరాల్లో సాగు లక్ష్యం జిల్లాలో ఏటా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలను రూపొందించి క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయాధికారి, విజయనగరం. అవగాహన కల్పిస్తున్నాం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట వేసేముందు రైతులే విత్తనశుద్ధి చేసుకునేలా చైతన్యం కలిగించాం.ఈఏదాది ఉన్నతాధికారులు నిర్ధేశించిన మేరకు లక్ష్యాలను చేరుకునేలా క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాం. – కె.వెంకటరావు, సీఎస్ఏ, బొద్దాం క్లస్టర్. -
డబుల్ బెడ్రూం లాక్కుంటాం అన్నారని..
మర్కూక్ (గజ్వేల్): తనకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు తీసు కుంటామని కొంత మంది గ్రామ నాయకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఎర్రవల్లిలో చోటు చేసు కుంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ (45) గతంలో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లో కుటుంబంతో కలి సి ఉంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకు నేందుకు సిద్ధపడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రహరీ నిర్మించు కుంటే ఇల్లు తిరిగి తీసుకుంటా మని బెదిరింపులకు పాల్పడటంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. మ నస్తాపం చెందిన నర్సమ్మ శనివా రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఈ రైతు ఎవరో కాదు.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు!
సాక్షి, చిత్తూరు: పొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు ఎవరో కాదు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట(5 వెంకటాపురం) లో తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేయడం విశేషం. -
ఎక్స్‌గ్రేషియా కోసం మూడేళ్ల వేదన
వ్యవసాయ జూదంలో ఓడి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న యువ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం విస్మరించడంతో ఆ కుటుంబం మూడేళ్లుగా దుర్భర జీవితం గడుపుతోంది. ప్రభుత్వ సాయం అందక, పూట గడవని స్థితిలో ఆ కుటుంబం సమస్యలతో సహజీవనం చేస్తోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వరకుటి సుబ్రమణ్యం అప్పుల బాధ తాళలేక 2015 ఫిబ్రవరి 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరాకు రూ. 10 వేలు కౌలు చెల్లించి ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని జొన్న పంట సాగు చేశాడు. రసాయనిక ఎరువులు, విత్తనాలు, కౌలు, తదితర పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. వర్షాభావంతోపాటు వాతావరణం అనుకూలించక పంట ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. పైరు బొందుపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్రమణ్యంకు రెండేళ్ల కుమార్తె సుస్మితతోపాటు భార్య వరలక్ష్మి ఉన్నారు. భర్త చనిపోయే నాటికి గర్భవతిగా ఉన్న ఆమె ఆరు నెలలకు ఆమె మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అభం, శుభం తెలియని వయస్సులో ముక్కుపచ్చలారని చిన్నారులకు తండ్రి దూరం కాగా భర్త మరణంతో కుటుంబ పోషణ ఆ ఇల్లాలిపైనే పడింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకుంటుందని భావించింది. అధికారులు రెండు, మూడుసార్లు ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థికసాయం చేయకపోవడంతో మూడేళ్లుగా ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. తలదాచుకునేందుకు ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలి పనులకు వెళుతూ వరలక్ష్మి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చిన్న కుమార్తె రేవతి పుట్టిన ఏడాదికే∙అనారోగ్యం బారిన పడి చనిపోయింది. పెద్ద కుమార్తెను, వృద్ధుడైన మామ వెంకటసుబ్బయ్యను కాయకష్టంతో పోషించుకుంటూ రేవతి కాలం వెళ్లదీస్తోంది. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. - కె. మౌలాలి, సాక్షి, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా -
మూడేళ్లయినా ఎక్స్‌గ్రేషియాకు దిక్కులేదు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు. రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. రుణ మాఫీ కాలేదు.. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు? – కిరణ్, మృతుని సోదరుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. – మృతుడి తండ్రి నర్శింగరావు -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
చింతపల్లి (దేవరకొండ) : పురుగుల మందు తాగి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మండల పరిధిలోని నసర్లపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నసర్లపల్లి గ్రామానికి చెందిన నల్ల ఎల్లయ్య(35) తమకున్న 5ఎకరాల పొలంలో సంవత్సరం పత్తి పంటను సాగు చేశాడు. సాగు పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ.3లక్షల అప్పుతెచ్చాడు. దిగుబడి రాక పెట్టుబడులు కూడా వెళ్లలేదు. అప్పు తీర్చే మార్గం కనబడక మనస్తాపం చెంది శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స దేవరకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాయపోలు (దుబ్బాక): అప్పులబాధతో ఇద్దరు రైతులు బుధవారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం మంతూరులో మన్నె కిష్టయ్య, సుగుణ దంప తులకు నలుగురు కుమారులు. వీరి కుటుంబం తమకున్న ఎకరం 10 గుంటల సాగు భూమితో పాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకున్నా రు. ఇటీవల పంట పెట్టుబడులు, ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశా రు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణంకోసం భూసేకరణలో వీరి భూమి పూర్తిగా పోయింది. దీంతో పెద్ద కొడుకు నాగరాజు (28) అప్పుల విషయమై కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపం తో పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపా లెంలో పాగాల మల్లారెడ్డి (58) ఇరవై ఎక రా లు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా డు. రెండేళ్లుగా వచ్చిన కరువుతో పంటలు సరి గా పండలేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా లాభం లేకపోయింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరాయి. పం టలు పండకపోయినా రైతుకు ఏడాదికి రూ.1.50 లక్షల కౌలు చెల్లించాల్సి వస్తుండటం, అప్పులు తీర్చే మార్గం కానరాక పురుగు ల మందు తాగి బలవన్మరణం చెందాడు. -
మూడేళ్లయినా అందని సాయం..
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత గానసర గ్రామానికి చెందిన వలరోతు భాస్కర్‌రావు 2 ఎకరాల సొంత భూమికి తోడు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలు సాగు చేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం వచ్చింది. కూతురు ఝాన్సీ పెళ్లికి రూ. లక్ష అప్పు అయ్యింది. పంటలకు చేసిన అప్పు రూ. 2 లక్షలు కలసి.. మొత్తం ప్రైవేటు అప్పు రూ. 3 లక్షలు. వడ్డీ నెలకు నూటికి 3 రూపాయలు. ఇక అప్పుల బాధ తీరదని భావించిన భాస్కర్‌రావు 2014 డిసెంబర్ 24న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లు దాటిపోయింది. కానీ, భాస్కర్‌రావు భార్య లక్ష్మికి ఇంతవరకూ వితంతు పింఛను కూడా రావటం లేదు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. -
తల్లిపాలు విషమయ్యాయి..
నిర్మల్/కడెం: ఆ చిన్నారి వయస్సు 11 నెలలు... ఆకలికి తట్టుకోలేకపోయింది. అప్పుల బాధతో తండ్రితో పాటు తల్లి కూడా పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ఉందన్న జ్ఞానం ఆమెకు లేదు. ఆకలికి తాళలేక తల్లిపాలు తాగగా.. అవికాస్తా విషపూరితమై చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనలో రైతు కుటుంబంలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేటలో శనివారం జరిగింది. ధర్మాజీపేటకు చెందిన కసునూరి భీమేశ్(36) తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. అతడికి నలుగురు అక్కాచెల్లెళ్లు. ఎకరం సాగు భూమి ఉండగా, సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఓ కుమారుడు కాల్వలో పడి చనిపోయాడు. భార్యకు విడాకులిచ్చిన భీమేశ్ రెండేళ్ల క్రితమే శైలజ(31)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల కూతురు మహేశ్వరి ఉంది. అయితే, కుటుంబ అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పు తీరకపోగా.. వడ్డీ పెరుగుతుండటంతో రుణభారం రోజురోజుకూ పెరుగుతోంది. మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మంది తాగారు. స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ భీమేశ్ చనిపోయాడు. ఆస్పత్రిలో ఉన్న శైలజ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇవేవీ తెలియని చిన్నారి మహేశ్వరి తల్లిపాలను తాగింది. అప్పటికే తల్లిపాలు విషపూరితం కాగా, చిన్నారి అస్వస్థతకు గురైంది. నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. చిన్నారి చనిపోయింది. -
అమ్మా నాన్నా..క్షమించండి
♦ సత్తెనపల్లిలో పురుగుల మందు తాగి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య ♦ ఘటనా స్థలంలో పురుగుల మందుల డబ్బాలు లభ్యం ♦ డిప్రెషన్, స్ట్రెస్‌తో బాధపడుతున్నానంటూ రెండు పేజీల లేఖ ♦ ఇష్టం లేకపోయినా చదువుతున్నానంటూ వివరణ మనసు పొరల్లో వణుకు.. అంతుపట్టని భయం.. మరపురాని ఆందోళన.. ఏదో తెలియని దిగులు.. వేధించే కలత.. అంతా ఒక మహా ఉత్పాతమై ఓ ఉసురు తీసింది. నవయౌవనంలో ఉరకలు వేయాల్సిన ఓ యువకుడు మృత్యువు ఒడికి చేరాడు. బతుకు పోరాటంలో ముందుకు సాగాల్సిన యువకుడు ఓటమిని అంగీకరించి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. సత్తెనపల్లి : పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జునగర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన చలువాది వెంకటేశ్వర్లు, భద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్రబాబుకు వివాహం అయ్యింది. రెండో కుమారుడైన చలువాది దుర్గా సతీష్‌నాయుడు(21) సత్తెనపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పట్టణంలోని నాగార్జుననగర్‌లోని ఓ బాలుర వసతిగృహంలో ఉంటూ రోజూ కళాశాలకు వెళుతున్నాడు. గత శనివారం జ్వరం కారణంగా ఇంటికి వెళ్లిన యువకుడు మంగళవారం ఉదయం సత్తెనపల్లి చేరుకున్నాడు. కళాశాలకు వెళ్లకుండా వసతి గృహంలోనే ఉండిపోయాడు. తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. సాయంత్రం తోటి విద్యార్థులు వచ్చి తలుపులు తీయడంతో విగతజీవిగా కనిపించాడు. హుటాహుటిన 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలు, రెండు పేజీల లేఖ ఉంది. పట్టణ పోలీసులు సమాచారం అందుకుని లేఖలోని ఫోన్‌నెంబర్ల ఆధారంగా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ శంకర బాబు, ఆర్.ఐ పొత్తూరి నాగేశ్వరరావు, గ్రామ రెవెన్యూ అధికారి నరసింహస్వామి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలంలో పురుగుల మందు, శీతలపానియం దుర్గా సతీష్‌నాయుడి మృతదేహం సతీష్‌నాయుడి లేఖలో విషయాలు.. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, నేను మూడు సంవత్సరాల నుంచి బాగా డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్‌తో బాధపడుతున్నా. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. నా చావుకు నేనే కారణం. అమ్మా, నాన్న, అన్న దయచేసి నన్ను క్షమించండి. మీ రుణం తీర్చుకోకుండా మధ్యలో వెళ్లి పోతున్నందుకు బాధ పడుతున్నా. రోజూ అందరితో సరదాగా, హ్యపీగా నవ్వుతూనే ఉండేవాడిని. కానీ లోపల మాత్రం ఎందుకో నరకం అనుభవించా. నాకు తెలియకుండానే నిద్రలో ఉలికిపడేవాడిని. మీరు నా భవిష్యత్తు బాగుండాలని చదివిస్తున్నారు. కానీ నాకు ఇష్టం లేక పోయినా చదువుతున్నా. ప్రతి రోజు కాలేజీకి వెళుతున్నా. ప్రెజర్ మాత్రం నన్ను వదలలేదు. అన్నా..! అమ్మానాన్న, నాయనమ్మ, వదినను బాగా చూసుకో. ఇక నా గురించి మర్చిపోండి. దయచేసి నేను మళ్లీ పుట్టాలని కోరుకోవద్దు సైదులన్నా! నువ్వు కూడా పిల్లలను, వదిన భారతిని, అమ్మను బాగా చూసుకో. అమ్మానాన్న! మీకు కోడలైనా, కూతురైనా వదినే. ఇప్పటి వరకు ఎలా చూసుకున్నారో ఇక మీదట కూడా అలానే చూసుకోండి. వదినా! నువ్వు కూడా అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకో. అసలు నా గురించి ఇక మరిచిపోండి. దేవుడు నాకు మీతో కలిసి ఉండాలని రాసిపెట్టలేదు అనుకుంటా. నాన్న నువ్వు ఇక తాగమాకు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఉంటా. నాకు పోస్టుమార్టం చేయించవద్దు. అనారోగ్యంతో చనిపోయాడని చెప్పి వెంటనే మా ఊరికి తీసుకెళ్లండి. ఎందుకంటే మా అమ్మ పోస్టుమార్టం చేస్తే తట్టుకోలేదు. ఇంత చిన్న విషయానికే చనిపోవాలా? అని ఎగతాళి చేసి మాట్లాడే వారికి నేను సమాధానం చెప్పలేను. ఒత్తిడి అనేది భయంకరమైంది. తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఊరి స్నేహితులకి, ఇక సెలవు. హాస్టల్ అంకుల్– ఆంటీ ఇక్కడ చనిపోతున్నందుకు క్షమించండి. తప్పడం లేదు. మా ఇంట్లో అయితే నాకు ధైర్యం చాలదు. – ప్రేమతో మీ సతీష్ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జైనథ్(ఆదిలాబాద్): అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రి గ్రామానికి చెందిన కల్లెం లచ్చన్న (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం లచ్చన్న భార్య సురేఖ పేరుమీద 2015లో మూడెకరాల భూమి ఇచ్చింది. గతేడాది తన మూడెకరాల్లో పత్తి, కౌలుకు తీసు కున్న మరో మూడెకరాల్లో సోయా సాగు చేశాడు. దిగుబడి రాక పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. వాతా వరణం అనుకూలించక పోవడంతో దిగు బడి రాదేమోననే బెంగ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సహనటులే విషం పెట్టి చంపారా?
తిరువనంతపురం: దక్షిణాధి భాషల్లో నటించి మంచి పేరు గడించిన కళాభవన్ మృతి వెనుక పలు రహస్యాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఆయన దేహంలో ఎంతో ప్రమాదకరమైన విషపదార్థాలను వైద్యులు గుర్తించడంతో పోలీసులు ఈ కేసును ప్రత్యేకంగా భావిస్తున్నారు. కళాభవన్ అత్యంత సన్నిహితంగా ఉండే నటులు జాఫర్ ఇడుక్కి, థరికిదా సాభులను ఇంకొందరని శనివారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించారు. అయితే, వీరే ఏదైనా దురాగతానికి పాల్పడి ఉంటారా లేక ఆ ఘటనకు సంబంధించిన సమాచారం ఏదైనా దొరుకుతుందనే ఉద్దేశంతో వారిని విచారిస్తున్నారా అనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చెప్పడం లేదు. ఏదేమైనా రెండు మూడురోజుల్లో ఆయన డెత్ మిస్టరీ మాత్రం వీడిపోతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కళాభవన్ మణి దేహంలో విషపదార్ధాలు
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ వీడలేదు. కళాభవన్ మణి మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది ఇంకా తేలలేదు. ఆయన దేహంలో విషపదార్ధాలు ఉన్నట్టు టాక్సీకాలజీ రిపోర్ట్ లో వెల్లడైంది. ఆయన మృతదేహం నుంచి సేకరించిన నమూనాకు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రంలో టాక్సికాలజీ టెస్టులు చేశారు. ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో పాటు మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్టు తేలిందని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె. మురళీధరన్ నాయర్ చెప్పారు. ఎవరైనా ఆయనకు విషపదార్దాలు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 45 ఏళ్ల కళాభవన్ మణి ఈ నెల 6న కొచ్చిలోని తన నివాసంలో మృతి చెందారు. కాలేయ సంబంధ వ్యాధితో ఆయన మరణించినట్టు భావించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కళాభవన్ మణి సహాయకులు ముగ్గురిని ప్రశ్నించారు. ఆయన మరణంపై అనుమానాలున్నాయని మణి భార్య నిమ్మె చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి కలతలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు స్నేహతులు మద్యం తాగడం అలవాటు చేశారని వెల్లడించారు. అటాప్సి రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మణి సోదరుడు ఆర్ ఎల్వీ రామకృష్ణన్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పులివెందుల : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన గంగాధర్(39) అనే రైతు ఏడు ఎకరాలలో పంటను సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పులు పెరిగాయి. దీంతో మనస్తాపం చెందిన రైతు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని కేసు నమోదు చేశారు. కాగా, మృతుడు గంగాధర్ కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.